Search
  • Follow NativePlanet
Share
» »చిల్కా స‌ర‌స్సుపై షికారు చేద్దాం ప‌దండి!

చిల్కా స‌ర‌స్సుపై షికారు చేద్దాం ప‌దండి!

కనుచూపు మేరంతా నీలిరంగు పరుచుకున్న నీళ్ల తివాచీ.. ఎక్కడికక్కడ కిలకిలారావాలతో సందడి చేసే దేశ, విదేశ పక్షులు, అరుదైన జీవజాతులు. ఊగిసలాడే సన్నని అలలపై ఆహ్లాదాన్ని అందించే బోటు షికార్లు. నోరూరించే తాజా చేపల ఘుమ‌ఘుమ‌లు.

అలాంటి మైమరపించే అనుభూతులను ఒకేచోట పొందాలంటే ఒడిసాలోని చిల్కా సరస్సును సందర్శించాల్సిందే. ప్రకృతి అందాలను నిండా కలబోసుకొని.. ఓ పారవశ్యగీతంలా ఆలపించే 'చిల్కా సరస్సు' విశేషాలు తెలుసుకుందాం పదండి!

చిల్కా స‌ర‌స్సుపై షికారు చేద్దాం ప‌దండి!

చిల్కా స‌ర‌స్సుపై షికారు చేద్దాం ప‌దండి!

కుటుంబ‌స‌మేతంగా ఎన్నిసార్లు ఒడిశా రాష్ట్రానికి వెళ్లినా సరే, అవకాశాన్ని బట్టీ చిల్కా సరస్సు సందర్శనకు వెళ్లడం పరిపాటిగా మారింది. ఎప్పటికప్పుడు సరికొత్తగా కన్పించే పర్యాటక ప్రాంతం అది. సుమారు ప‌ద‌కొండు వంద‌ల‌ కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ సరస్సు ప్రపంచంలోని అతి పెద్ద ఉప్పునీటి సరస్సుల్లో రెండోదిగా గుర్తింపు పొందింది. పూరీ, ఖుర్దా, గంజాం జిల్లాల తూర్పు తీరంలో దయా నది ప్రవేశ ద్వారం వద్ద బంగాళాఖాతంలో ప్రవహిస్తోంది. నిజానికి, ఇది శీతాకాలంలో సరికొత్త అందాలను సంతరించుకుంటుంది. అందుకు కారణం ఆ సమయంలో దూర తీరాల నుంచి ఇక్కడికి వచ్చే విదేశీ వలస పక్షులే. సుమారు పదివేల యేళ్ల కిందటే ఈ సరస్సు ప్రకృతి సిద్ధంగా రూపుదిద్దుకుంది. దయానదికి గల ఉపనదుల్లో ఒకటైన మలగుని నది పశ్చిమ తీరంలో ఈ సరస్సు విస్తరించింది. దీని ఉత్తర తీరం ఖుర్దా జిల్లాలో, పశ్చిమ తీరం గంజాం జిల్లాలో భాగంగా ఉన్నాయి.

సరస్సు, సముద్ర సంగమం..

సరస్సు, సముద్ర సంగమం..

చిన్న చిన్న దీవుల స‌ముదాయాలు చిల్కా సరస్సు లోపల చాలా ఉన్నాయి. ముఖ్యంగా పక్షుల దీవి, హనీమూన్ దీవి, పారికుడ్ దీవి, కాస్ట్ దీవి, మాలుడ్ దీవి, నువపరా దీవి, ఫుల్బరి దీవి, బెరహ్సుర దీవి, సల్బానా దీవుల‌ను త‌ప్ప‌కుండా సంద‌ర్శించాలి. కాళీజై దీవిలో ఒక ఆలయం ఉంది. నిత్యం ఇక్క‌డ భ‌క్తుల తాకిడి ఎక్కువ‌గా ఉంటుంది. సరస్సు, సముద్ర సంగమం అంచుల్లో రిఝాన్స్ దీవి అనే విశాలమైన తీర‌ప్రాంతంగా పేరుగాంచింది. ఈ సరస్సుని సత్సద, బలుగాస్, రంభ, బర్కుల్ తదితర ప్రాంతాల నుంచి బోటు ద్వారా చేరుకోవచ్చు. పెద్ద దీవులను జలమార్గాలు వేరు చేస్తున్నాయి. చిల్కా సరస్సు చుట్టుపక్కల ఉన్న గ్రామస్ధులు వార్షిక ఉత్సవమైన 'బాలీ యాత్ర" జరుపుకుంటారు.

ఒడిశా టూరిజం బోట్లు సుర‌క్షితం..

ఒడిశా టూరిజం బోట్లు సుర‌క్షితం..

చిల్కా సరస్సు పరిసరాల్లోని సుమారు నూటా ఏభై గ్రామాల మ‌త్స్య‌కార కుంటుంబాలు దీనిపై ఆధారపడుతున్నారు. వేల సంఖ్యలో బోటు షికారు చేసే సందర్శకులకు అందుబాటులో ఉంటాయి. వాటిలో కొన్ని రాష్ట్ర పర్యాటకు శాఖ ఏర్పాటు చేస్తే, మరి కొన్ని స్థానికులు ప్రైవేటుగా నిర్వహిస్తున్నారు. ఒడిశా టూరిజం బోట్ల ధర ప్రైవేట్ బోట్ల ప్రయాణ ధరలతో పోలిస్తే బాగా ఎక్కువనే చెప్పాలి. అందుకే ఎక్కువమంది ప్రైవేట్ బోట్లనే ఆశ్రయిస్తుంటారు. అయితే టూరిజం బోట్లలో సందర్శకుల భద్రతకు సంబంధించి, అన్ని ఏర్పాట్లుంటాయి. బోటులో ప్రయాణిస్తూ సరస్సు మధ్యలో ఉన్న దీవులను సందర్శించడం మర్చిపోలేని అనుభూతనే చెప్పాలి. సరస్సు నీటిలోతు 12 అడుగుల వరకూ ఉంటుంది.

వలస పక్షుల సందడితో స‌ర‌స్సు కాస్త గంభీరంగానే క‌నిపిస్తుంది. సుదూరంలో ఉన్న కాస్పియన్ సముద్రం, ఇరాన్, రష్యా, సైబీరియా, బైకాల్ సరస్సు, అరల్ సముద్రం, మంగోలియా, ఆగ్నేయాసియా, లడఖ్, హిమాలయాలు వంటి స్థలాల నుంచి వచ్చిన అనేక వలసపక్షులకు ఆవాసం చిల్కా.

ప‌క్షుల కిళ‌కిళారావాలు..

ప‌క్షుల కిళ‌కిళారావాలు..

సీజన్‌లో అయితే, రెండు వంద‌ల‌కుపైగా పక్షిజాతులను సందర్శించవచ్చు. కొన్ని జాతుల పక్షులు ఈ చిల్కా సరస్సును చేరటానికి దాదాపు పన్నెండు వేల కిలోమీట‌ర్లు ప్రయాణిస్తాయి. లెస్సర్ రాజహంసలు, తెల్లటి ఉదరభాగాలుండే సముద్ర గడ్డలు, బూడిదరంగు రెక్కలు కల పెద్దబాతు, ఊదారంగు అడవికోడి, ఉష్ణ మండల పక్షి, నారాయణ పక్ష్మి తెల్లకొంగలు, బూడిద, ఊదారంగుల ఉష్ణపక్షులు, పాలపిట్టలు, కొంగలు, తెల్లటి కంకణ పక్షి, తెడ్డుమూతి కొంగలు, బ్రాహ్మిణీ కొంగలు, పెద్దముక్కన్న కొంగలు, సూదివంటి తోకకల కొంగలు ఇలా అనేకరకాల దేశ, విదేశీ పక్షులను ఒకేచోట చూడాలంటే చిల్కా సరస్సుకు రావాల్సిందే. సల్బాన దీవిని పక్షి సంరక్షణ కేంద్రంగా నిర్వహిస్తున్నారు.

సరస్సులో అరుదుగా కనిపించే పక్షులలో ఏషియాటిక్ డోవిచర్లు, డాల్మేటియన్ పెలికాన్, పల్లాస్ ఫిష్ ఈగల్స్, చాలా అరుదుగా వలసవచ్చే తెడ్డుమూతి ఏటుగట్టు పిట్టలు, గూడకొంగలు, రీవరీ పక్షులు వంటి అరుదైన పక్షి జాతులతో పాటు పొట్టికాళ్ళు ఉన్న అనేక తీరపక్షులు సరస్సు, దీవుల తీరప్రాంతాలలో ఇరుకైన ప్రదేశాలలో కనిపిస్తాయి. ఇందులో ఉల్లంకి పిట్టలు, ఏటిగట్టు పిట్టలు, ఉల్లాము పిట్టలు, బురదనేలల మీద భరతపక్షులు, తోకలు ఆడించే నీటి జంతువులు, తీతువపిట్టలను మ‌న‌సారా ప‌ల‌క‌రించేందుకు చిల్కా అనువైన ప్ర‌దేశం.

అరుదైన జీవజాతులు

అరుదైన జీవజాతులు

నీటిలో, దీవుల్లో అరుదైన జీవజాతులు ఈ సరస్సులో చాలా ఉన్నాయి. ఆకుపచ్చ సముద్ర తాబేలు, డుగాంగ్, ఇరవాడి డాల్ఫిన్లు, నల్లమగజింక, తెడ్డుమూతి సాండ్ పైపర్, అవయవాలు లేని స్కింక్, వేటాడే పిల్లి తదితర రకాల జంతువులు, సరీసృహాలున్నాయి. వృక్షాలు, మొక్కల్లో 496 తెగలకు, 120 కుటుంబాలకు చెందిన 726 పుష్పజాతులను ఈ ప్రాంతంలో చూడొచ్చు. ఇక్కడ దాదాపు 2900 వృక్ష జాతులను గుర్తించి పరిరక్షిస్తున్నారు. ముఖ్యంగా ఇరవాడి డాల్ఫిన్‌లు చిల్కా సరస్సులో మాత్రమే కన్పించే ముఖ్య జాతి. ప్రపంచంలోని రెండు సరస్సులలో మాత్రమే ఇవి క‌నిపిస్తాయి. అందులో ఇది ఒకటి కావడం విశేషం. వీటిని వేటాడడాన్ని పూర్తిగా నిషేధించారు. ఈ డాల్ఫిన్ పర్యాటకం అనేకమంది స్థానికులకు ప్రత్యామ్నాయ ఉపాధిగా ఉంది. వీటిని చూడటానికి ఆసక్తి చూపే పర్యాటకులను సరస్సులోకి తీసుకువెళ్లటానికి చాలా పెద్దవైన మోటారు బోట్లున్నాయి.

సంద‌ర్శ‌న‌కు అనువైన స‌మ‌యం..

సంద‌ర్శ‌న‌కు అనువైన స‌మ‌యం..

చిల్కా సరస్సులో సందర్శనీయ ప్రాంతాలు చాలా ఉన్నాయి. వాటిలో సల్పన దీవి పక్షుల కేంద్రం గుర్తింపు పొందింది. అయితే వర్షాకాలంలో ఈ దీవి అదృశ్యమైపోతుంది. తిరిగి వానాకాలం తరువాత కనిపిస్తుంది. విహార శిబిరాన్ని వేసుకోవడానికి తగిన ప్రదేశం నిర్మలూర్ జలపాతం. ఇది చిల్కా సరస్సు నుంచి 12 కిలోమీట‌ర్ల‌ దూరంలో ఉంది. అక్టోబర్ నుంచి మార్చి నెల వరకూ చిల్కా సరస్సు సందర్శనకు అనుకూలమైన కాలం. పర్యాటకుల సౌకర్యార్ధం ఎక్కడికక్కడ రిసార్టులు, హోటళ్లు అందుబాటు ధరల్లోనే లభిస్తాయి. చేపలు, రొయ్యలతో తయారుచేసిన ప్రత్యేకమైన వంటకాలు ఆకర్షిస్తుంటాయి.

ఎలా చేరుకోవాలి?

ఎలా చేరుకోవాలి?

దేశంలో ఎక్కడి నుంచైనా చిల్కా సరస్సుకు చేరుకోవడం చాలా సులభం. విశాఖపట్నం నుండి రైలులో కేవలం ఆరు గంటలు వ్యవధిలోనే చిల్కా రైల్వేస్టేషన్‌కు చేరుకోవచ్చు. చెన్నై- హౌరా జాతీయ రహదారి, రైలు మార్గాలకు సమీపంలోనే ఇది ఉంది. అతి దగ్గరలోనే భువనేశ్వర్ విమానాశ్రయం ఉంది. కేవలం చిల్కా సరస్సు మాత్రమే కాకుండా పూరీ, కోణార్క్, నందన్ కానన్, లింగరాజు దేవాలయం వంటివాటిని కూడా ఈ పర్యటనలో చూసే అవకాశం ఉంటుంది.

Read more about: chilka lake khurda
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X