Search
 • Follow NativePlanet
Share
» »వాహ‌నాల‌ విడిభాగాల‌పై కూర్చొని.. గుఫూ రెస్టారెంట్ ఫుడ్ టేస్ట్ చేద్దాం!

వాహ‌నాల‌ విడిభాగాల‌పై కూర్చొని.. గుఫూ రెస్టారెంట్ ఫుడ్ టేస్ట్ చేద్దాం!

వాహ‌నాల‌ విడిభాగాల‌పై కూర్చొని.. గుఫూ రెస్టారెంట్ ఫుడ్ టేస్ట్ చేద్దాం!

పండ‌గ స‌మ‌యంలో కుటుంబంతో క‌లిసి స‌ర‌దాగా ఎక్క‌డికైనా వెళ్లి, స‌రికొత్త రుచుల‌ను ఆస్వాదించాల‌ని ఎవ్వ‌రైనా అనుకుంటారు. అయితే, ఎప్పుడూ వెళ్లే రెస్టారెంట్ల‌కు ఏం వెళ్తాం అనుకునేవారి కోసమే ఈ స‌మాచారం. అచ్చం మోటార్ వాహ‌నాల విడిభాగాలను పోలి ఉంటే ఆకృతుల‌తో ఓ రెస్టారెంట్ ఆహ్వానం ప‌లుకుతోంది. లోప‌ల‌కు వెళితే, లారీ క్యాబిన్‌లో కూర్చొన్న ఫీలింగ్ క‌లుగుతుంది. స్టీరింగ్‌పై ప్లేటు పెట్ట‌కుని ఫుడ్ లాగించేలా స‌రికొత్త అనుభ‌వం చేరువ చేస్తోంది ఈ ట్రెండీ రెస్టారెంట్‌. ఆ వెరైటీ రెస్టారెంట్‌ విశేషాల‌ను మ‌న‌మూ తెలుసుకుందాం ప‌దండి.

గుఫూ రెస్టారెంట్‌. ఇప్పుడు ఈ పేరు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బాగా పాపుల‌ర్ అయింది. గుంటూరు జిల్లా మంగళగిరిలో జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన ఈ కొత్త తరహా రెస్టారెంట్ ఆహార‌ప్రియుల‌ను విప‌రీతంగా ఆకట్టుకుంటోంది. అందుకు ప్ర‌ధాన కార‌ణం రెస్టారెంట్ ఏర్పాటులో ఉప‌యోగించిన థీమ్‌.

Goofoo Restaurant

లోప‌ల సీటింగ్, వాష్ బేసిన్, టేబుల్స్ అన్నీ మోటారు వాహనాల రూపు రేఖల్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు నిర్వాహ‌కులు. పెట్రోల్ పంప్ తరహాలో బీరువా, సైకిల్ మీద హ్యాండ్ వాష్ ఇలా వేటికవే ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. ఓల్డ్ మోడ‌ల్ బుల్లెట్ బండిపై కూర్చొని టేస్టీ ఫుడ్ రుచి చూస్తుంటే ఆ ఫీలింగ్ వేరు అంటున్నారు ఇక్క‌డికి వ‌చ్చే క‌స్ట‌మ‌ర్లు.

కొత్త‌ద‌నం ఉండాల‌నే అభిప్రాయంతో..

ఈ త‌ర‌హాలో రెస్టారెంట్ ప్రారంభించడం వెనుక ఓ మంది కథ ఉంది. విజయవాడకు చెందిన కృష్ణ ప్రసాద్ కుటుంబానికి దశాబ్దాల నుంచే లారీలు ఉండేవి. అయితే, ప్రస్తుతం మోటారు వాహనాల రంగం తీవ్ర సంక్షోభంలో ఉండ‌డంతో ఆయ‌న‌ కుమారుడు విజయ్ కుమార్‌ను మోటారు ఫీల్డ్‌లోకి తీసుకురావటం తండ్రికి ఇష్టంలేదు. దీంతో హోటల్ వ్యాపారంలోకి అడుగుపెట్టాల‌నుకున్నారు. అయితే, ఏ రంగంలోనైనా రాణించాల‌నంటే కొత్త‌ద‌నం ఉండాల‌ని ఓ అభిప్రాయానికి వ‌చ్చారు.

అప్పుడే, మామూలు రెస్టారెంట్ కాకుండా మోటారు వాహనాల థీమ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆలోచనకు వచ్చారు. ఆ మేరకు రెస్టారెంట్ ముందు భాగాన్ని లారీ క్యాబిన్‌తో తీర్చిదిద్దారు. లోప‌ల డైనింగ్ టేబుల్స్‌ను ట్రాక్ట‌ర్ ముందుభాగంతో స‌రికొత్త‌గా ఏర్పాటు చేశారు. సైకిల్‌పై థింగ్స్ పెట్టుకునే ప్లాన్ చేశారు. ఇలా చెప్పుకుంటూపోతే రెస్టారెంట్‌లో ఎక్క‌డ చూసినా మోటారు వాహ‌నాల విడిభాగాల ఆకృతులే ద‌ర్శ‌న‌మిస్తాయి.

Goofoo Restaurant

గుఫూ ఓ ఫిక్షనల్ క్యారెక్టర్..

అంతేకాదండోయ్‌. ఈ రెస్టారెంట్ పేరు వెనుక కూడా ఓ కథ ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. గుఫూ అనేది ఓ ఫిక్షనల్ క్యారెక్టర్ అని అంటున్నారు. గుఫూ తండ్రి పంజాబీ, తల్లి ఆంధ్రా కావటంతో ఈ రెండు రకాల వంటకాలను రెస్టారెంట్‌లో అందుబాటులో ఉంచారు. ప్రత్యేక లంచ్ బాక్స్‌లో వంటకాలను తెచ్చి క‌స్ట‌మ‌ర్‌ల‌కు వడ్డిస్తున్నారు.

ఇక్కడ‌కు వస్తున్న వినియోగదారులు కూడా రెస్టారెంట్ పరిసరాల్ని చూసి తెగ మురిసిపోతున్నారంటే న‌మ్మండి. ఈ త‌ర‌హా రెస్టారెంట్ గతంలో ఎప్పుడూ చూడలేదని.. కుటుంబ‌స‌మేతంగా విందు చేసేందుకు గుఫూ ఓ మంచి రెస్టారెంట్ అని కితాబిస్తున్నారు. మ‌రెందుకు ఆల‌స్యం, మంగ‌ళ‌గిరిలో ఆహ్వానం ప‌లుకుతోన్న గుఫూ రెస్టారెంట్‌కు ఇప్పుడే బ‌య‌లుదేరండి మ‌రి.

  Read more about: goofoo restaurant
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X