Search
 • Follow NativePlanet
Share
» »భారతదేశంలోని జంతువుల‌ను ప్ర‌త్యేకంగా పూజించే ఆల‌యాలు

భారతదేశంలోని జంతువుల‌ను ప్ర‌త్యేకంగా పూజించే ఆల‌యాలు

భారతదేశంలోని జంతువుల‌ను ప్ర‌త్యేకంగా పూజించే ఆల‌యాలు

భారతదేశం విభిన్న సంస్కృతుల‌ స‌మ్మేళ‌నం. ఇక్క‌డ ప్ర‌తిచోటా నిత్యం అనేక విభిన్న విశ్వాసాలు ప‌ల‌క‌రిస్తూ ఉంటాయి. వారి వారి విశ్వాసాల‌కు అనుగుణంగా దేవాలయాల్లో పూజ‌లు నిర్వ‌హిస్తారు. అలా మీరు అనేక రకాల దేవాలయాల గురించి విని ఉంటారు లేదా సంద‌ర్శించి ఉంటారు. అయితే జంతువులను పూజించే దేవాలయాల గురించి మీరు విన్నారా? అంతే కాదు, ఈ దేవాలయాలలోని ప్రజలు జంతువులను ఎంతో భక్తితో చూస్తారు.

అలాగే ఇక్క‌డికి వచ్చే భక్తులను ఆ జంతువులు కూడా ఎంతో గౌర‌వంతో చూస్తాయి. అలా భారతదేశంలో జంతువులను పూజించే దేవాలయాలు చాలానే ఉన్నాయి. సాధారణంగా, హిందూ మతంలో వివిధ దేవుళ్ల వాహనాలు చాలా ఉన్నాయి. అవి చాలావ‌ర‌కు జంతువులు. ఈ కార‌ణంగా కూడా దేవాలయాలలో జంతువులను పూజిస్తార‌ని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. అలా మ‌న దేశంలో జంతువులను పూజించే కొన్ని దేవాలయాల గురించి తెలుసుకుందాం.

కుక్క‌ల‌కూ ఓ ఆల‌యం ఉంది..

కుక్క‌ల‌కూ ఓ ఆల‌యం ఉంది..

ఈ కుక్కల ఆల‌యం కర్ణాటకలోని రామనగర జిల్లా చన్నపట్నలో ఉంది. ఈ ఆలయాన్ని ఒక వ్యాపారవేత్త నిర్మించారు. అదే వ్యాపారవేత్త గ్రామంలోని ప్రధాన దేవత కెంపమ్మకు అంకితం చేసిన కెంపమ్మ ఆలయాన్ని కూడా నిర్మించాడు. స్థానిక క‌థ‌నం ప్రకారం, తన ఆలయాన్ని చెడు నుండి రక్షించడానికి చాలా కాలం క్రితం గ్రామం నుండి అదృశ్యమైన రెండు కుక్కలను కనుగొనమని కెంపమ్మ దేవి గ్రామస్థులకు సూచించించార‌ట‌.

అయితే, గ్రామస్థులకు ఆ కుక్కలు దొరకకపోవడంతో గుడి కట్టి అందులో రెండు కుక్కల విగ్రహాలను ఉంచారు. నేడు గ్రామస్తులు ఈ కుక్కల విగ్రహాలను పూజిస్తారు. మరొక ప్ర‌చారం కూడా ఉంది. మ‌నుషుల పట్ల కుక్కల విధేయతను గౌరవించటానికి ఈ కుక్క‌ల ఆల‌యం నిర్మించబడింది అంటారు.

బేర్ టెంపుల్ - ఛత్తీస్‌గఢ్

బేర్ టెంపుల్ - ఛత్తీస్‌గఢ్

చండీ మాత ఆలయం ఛత్తీస్‌గఢ్‌లో ఉంది. ఈ దేవాలయం అనేక విధానాలుగా విశిష్టమైనదిగా చెబుతారు. ఛత్తీస్‌గఢ్‌లోని మహాసముంద్‌లో ఉన్న‌ ఈ ఆలయంలోకి కొన్ని ఎలుగుబంట్లు హారతి సమయంలో ప్ర‌వేశిస్తాయి. అలా వచ్చి, పూజారి నుండి ప్రసాదం తిని తొమ్మిది సార్లు ప్రదక్షిణలు చేసి వెళ్లిపోతాయి. అంతే కాదు భక్తులు ఇక్కడి ఎలుగుబంట్లకు ఆహారం, ప్రసాదం కూడా ఇస్తుంటారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఇవి ఎప్పుడూ ఆలయానికి వ‌చ్చే భ‌క్తుల‌ను భ‌య‌పెట్ట‌లేదు, హాని చేయ‌లేదట‌. ఎలుగుబంట్లు ఉండటం వల్ల చండీ మాత ఆలయం ఎలుగుబంటి ఆలయంగా ప్రసిద్ధి చెందింది.

మంకీ టెంపుల్ - జైపూర్

మంకీ టెంపుల్ - జైపూర్

గల్తా జీ అనేది రాజస్థాన్‌లోని జైపూర్ కొండలలో ఉన్న దేవాలయం. యాత్రికులు పవిత్ర జలంలో స్నానం చేయడానికి ఇక్క‌డ‌కి వస్తారు. ఈ సముదాయంలో రాంగోపాల్‌జీ అనే ఆలయం ఉంది. ఇక్కడ లంగూర్ కోతులు ఎక్కువ గుంపులుగా నివసిస్తాయి. పెద్ద సంఖ్యలో కోతులు ఉండటం వల్ల దీనికి కోతుల ఆలయం అని ముద్దుగా పేరు పెట్టారు. కోతులు హనుమంతుని ప్రతినిధి అని నమ్ముతారు, కాబట్టి ప్రజలు వాటిని ఆలయంలో చాలా భక్తితో చూస్తారు.

మన్నరసాల నాగరాజ ఆలయం - హరిపాడ్, కేరళ

మన్నరసాల నాగరాజ ఆలయం - హరిపాడ్, కేరళ

కేరళలోని హరిపాడ్‌లో మన్నార్సాల నాగరాజ ఆలయం ఉంది. ఇది చాలా పురాతనమైన దేవాలయం మరియు నాగరాజు దేవ్ కు అంకితం చేయబడింది. ఈ ఆలయం అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో అందమైన రాతి పాము శిల్పాలు అద్భుతమైన శైలిలో చెక్కారు. మన్నరసాల ఆలయంలో మార్గాలు మరియు చెట్ల మధ్య 100,000 కంటే ఎక్కువ పాముల చిత్రాలు ఉన్నాయి. ఈ ఆలయానికి సుదూర ప్రాంతాల నుండి భక్తులు వచ్చినప్పటికీ, సంతానం కోసం దంపతులు ఇక్కడ ప్రత్యేకంగా పూజలు చేస్తారు. వారు తమ బిడ్డ పుట్టినప్పుడు కృతజ్ఞతాపూర్వక వేడుకలను నిర్వహించడానికి కూడా ఇక్కడకు వస్తారు. అంతేకాదు, పాము చిత్రాలను ఇక్క‌డ ప్రసాదంగా అందిస్తారు.

  Read more about: dog temple bare temple
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X