Search
  • Follow NativePlanet
Share
» »పాండ‌వులు నడియాడిన ప్రాంతం.. ప‌చ్మ‌ర్హి!

పాండ‌వులు నడియాడిన ప్రాంతం.. ప‌చ్మ‌ర్హి!

పాండ‌వులు నడియాడిన ప్రాంతం.. ప‌చ్మ‌ర్హి!

ప‌చ్మ‌ర్హి మధ్యప్రదేశ్‌లోని న‌ర్మాదాపురం జిల్లాలో ఉన్న ఒక హిల్ స్టేష‌న్‌. 1,067 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ సుందరమైన పట్టణాన్ని సాత్పురా కి రాణి లేదా సాత్పూరా రాణి అని పిలుస్తారు. సాత్పురా శ్రేణి ఇక్క‌డ ఉంది. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఎత్త‌యిన ప్ర‌దేశం ఇది. UNESCO 2009లో దీనిని బయోస్పియర్ రిజర్వ్‌ల జాబితాలో చేర్చింది. ఇది చిరుతపులులు మరియు బైసన్‌లకు నిలయంగా గుర్తింపు పొందింది.

కొండపైన ఉన్న ఐదు ఇసుకరాతి గుహలు పాండవులు తమ అజ్ఞాతవాస సమయంలో బస చేసినవి చెప్ప‌బ‌డుతున్నాయి. ఈ ఐదు గుహలు కూడా ఒక‌ట‌వ శతాబ్దంలో కొంతమంది బౌద్ధ సన్యాసులకు ఆశ్రయంగా ఉండేవ‌ని పురావ‌స్తుశాఖ చెబుతోంది. ఆ తర్వాత బౌద్ధులు కూడా దీనిని మతపరమైనదిగా పరిగణించ‌డం మొద‌లుపెట్టారు. ఇది ఆధ్యాత్మిక చింత‌న క‌లిగిన‌ పర్యాటకులకు ప‌చ్మ‌ర్హి ప్రసిద్ధ ప్రదేశం. ఈ ప్రాంతం ఎత్తులో ఉండటం వ‌ల్ల ప్రవాహాలు, జలపాతాలతో సత్పురా శ్రేణులు చూప‌రుల‌ను మంత్రముగ్ధులను చేస్తాయి.

కలోనియల్ శైలిలో నిర్మించిన చ‌ర్చ్‌లు..

కలోనియల్ శైలిలో నిర్మించిన చ‌ర్చ్‌లు..

ఇక్క‌డి ప‌చ్చ‌ద‌నంతో నిండిన అడవులు ప‌చ్మ‌ర్హి ప్ర‌కృతి అందాల‌ను రెట్టింపు చేస్తాయి. న‌గ‌రం చుట్టుప‌క్క‌ల నుంచే కాకుండా సుదూర ప్రాంతాల‌ను వారాంతాల్లో కుటుంబ స‌మేంతంగా గ‌డిపేందుకు ప‌ర్యాట‌కులు ఇక్క‌డికి చేరుకుంటారు. ఈ పట్టణం ఆధునిక కాలంలో బ్రిటిష్ సైన్యానికి చెందిన కెప్టెన్ జేమ్స్ ఫోర్సిత్ ద్వారా కనుగొనబడింది. ఆత‌ని హ‌యాంలోనే ఇది మ‌రింత అభివృద్ధి చేయబడింది. అందువ‌ల్ల కలోనియల్ శైలిలో నిర్మించిన మనోహరమైన చర్చిలను ఇక్క‌డ సంద‌ర్శించ‌వ‌చ్చు.

జటా శంకర్ గుహలు..

జటా శంకర్ గుహలు..

పచ్మర్హిలోని జటా శంకర్ గుహలు పవిత్రమైనవిగా పరిగణించబడుతున్నాయి. ఈ గుహ‌లు భస్మాసురుని నుండి శివుడు తనను తాను కాపాడుకునేందుకు ఇక్క‌డే త‌ల‌ దాచుకున్న ప్రదేశంగా ప్రసిద్ధి చెందాయి.

ఈ గుహలు భారీ రాతిపైక‌ప్పుల‌తో సహజసిద్ధమైన శివలింగాన్ని కలిగి ఉన్నాయి. గుహలోని రాతి నిర్మాణం పురాణాల్లో చెప్పిన విధంగా వంద తలల పాము శేషనాగ్‌ను పోలి ఉంటుంది. దీంతోపాటు గుహలలోని రాతి నిర్మాణం శివుని వెంట్రుకలను పోలి ఉంటుంది. అందుకే దీనిని జటా శంక‌ర్ గుహ‌లుగా పిలుస్తార‌ని చెబుతారు. ఏటా శివ భ‌క్తులు ఇక్క‌డ‌కు వ‌స్తూ ఉంటారు.

ధూప్‌ఘఢ్‌..

ధూప్‌ఘఢ్‌..

సాత్పురా శ్రేణిలో ఎత్త‌యిన‌ ప్రదేశం ధూప్‌గఢ్. ఈ కొండ శిఖరాగ్రం అద్భుతమైన సూర్యోద‌య‌, సూర్యాస్తమయాలను క‌నులారా ఆస్వాదించేందుకు అనువైన ప్ర‌దేశంగా పేరుగాంచింది. అయితే, ఇక్క‌డికి చేరుకునేందుకు ట్రెక్ చేయాల్సిందే. ట్రెక్కింగ్‌ ద్వారా మాత్రమే ఈ పాయింట్ చేరుకోవచ్చు. కొన్ని జలపాతాలు, లోయల గుండా వెళుతున్నందున ఈ ట్రెక్కింగ్ మార్గం చాలా కఠినమైనదిగా ఉంటుంది. కానీ, సాహ‌స‌యాత్రికుల‌కు మాత్రం ఈ ప్ర‌యాణం జీవితంలో మ‌ర్చిపోలేని అనుభూతుల‌ను చేరువ‌చేస్తుంది.

ఎలా చేరుకోవాలి?

ఎలా చేరుకోవాలి?

ఇక్క‌డికి బ‌స్సులో చేరుకునేందుకు భోపాల్, నాగ్‌పూర్‌, న‌ర్మాదాపురం, పిపారియా, చింద్వారాల‌కు రోడ్డు మార్గం ఉంది. భోపాల్ నుంచి 210 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న ప‌చ్మ‌ర్హిని బ‌స్సులో నేరుగా చేరుకోవ‌చ్చు. అదే రైలు మార్గ్ంలో అయితే, ఇక్క‌డికి నేరుగా రైల్ క‌న‌క్టివిటీ లేదు. ఇక్క‌డికి యాభై కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న పిపారియా రైల్వేస్టేష‌న్ స‌మీప రైల్వే స్టేష‌న్‌. దీనికి అన్ని ప్రధాన రైల్వే స్టేష‌న్‌ల‌తో అనుసంధానం ఉంది.

Read more about: pachmarhi
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X