Search
  • Follow NativePlanet
Share
» »ఒళ్లింత తుల్లింత కోసం హైదరాబాద్ లో ఈ ప్రాంతాలకు వెళ్లారా?

ఒళ్లింత తుల్లింత కోసం హైదరాబాద్ లో ఈ ప్రాంతాలకు వెళ్లారా?

హైదరాబాద్ దగ్గరగా ఉన్న పర్యాటక ప్రాంతాలకు సంబంధించిన కథనం.

చిటపట చినుకులు పడే సమయంలో మనసుకు దగ్గరైనవారితో కొత్త ప్రదేశాలకు వెళ్లాలనుకోవడం సహజం. మరికొన్ని సార్లు చూసిన ప్రాంతాలే అయినా వర్షాకాలంలో వారిని వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆయా ప్రాంతాల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. దీంతో ఆ ప్రదేశాల్లో ఏదో తెలియని కొత్త అందాలు వికసిస్తాయి. అటు వంటి ప్రాంతాలు మన తెలంగాణలో అందులోనూ హైదరాబాద్ కు దగ్గర్లో ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి. అటువంటి ప్రాంతాలకు సంబంధిచిన క్లుప్త సమాచారం మీ కోసం.

శ్రీశైలం

శ్రీశైలం

P.C: You Tube

హైదరాబాద్ నుంచి 230 కిలోమీటర్ల దూరంలో శ్రీశైలం ఉంటుంది. నల్లమల అడవుల పరిధిలో ఉన్న ఈ పుణ్యక్షేత్రం పంచభూత లింగాల్లో ఒకటి. మల్లికార్జునుడి పేరుతో కొలువైన పరమేశ్వరుడు ఇక్కడ భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్నాడు. ఇక్కడ చూడదగిన ప్రాంతాల్లో భ్రమరాంబ దేవి దేవాలయం, అక్కమహాదేవి గుహలు, పాతాళగంగ, సాక్షి గణపతి తదిర ప్రాంతాలను చూడవచ్చు. ముఖ్యంగా జులై, ఆగస్టు నెలల్లో వర్షాల వల్ల శ్రీ శైలం చుట్టు పక్కల ప్రాంతాలన్నీ పచ్చదనం పరుచుకొని మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంటాయి.

నాగార్జున సాగర్

నాగార్జున సాగర్

P.C: You Tube

హైదరాబాద్ నుంచి 154 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగార్జున సాగర్ ను క`ష్ణానది పై నిర్మించారు. భారతదేశంలోని పెద్ద డ్యాంలలో ఇది కూడా ఒకటి. జులై, ఆగస్టు నెలల్లో కురిసే వర్షాల వల్ల ఈ నాగార్జున సాగర్ నిండు కుండలా ఉంటుంది. దీంతో డ్యాం గేట్లను ఎత్తివేసినప్పుడు అక్కడి నీరు దుముకుతమూ ముందుకు సాగిపోతున్న తీరు కళ్లకే కాకుండా మనసుకు కూడా విందును చేస్తుందని చెప్పడం అతిశయోక్తి కాదు.

కుంతల జలపాలం

కుంతల జలపాలం

P.C: You Tube

హైదరాబాద్ నుంచి దాదాపు 260 కిలోమీటర్ల దూరంలో కుంతల జలపాతం కదం నదీ 200 మీటర్ల ఎత్తు నుంచి కిందికి దూకడం వల్ల ఏర్పడింది. జులై, ఆగస్టు నెలల్లో కురిసే వర్షాల వల్ల ఈ జల పాతాల జలసవ్వడులను చూడటానికి వీలవుతుంది. ఆదిలాబాద్ జిల్లా నేరేడి కుంట గ్రామం వద్ద ఉన్న ఈ జలపాతం తెలంగాణాలోనే అత్యంత ఎత్తైన జలపాతంగా పేరు గడించింది. ఇక్కడకు దగ్గరగా అనేక చిన్న, చిన్న జలపాతాలు కూడా మనం చూడవచ్చు.

బీదర్

బీదర్

P.C: You Tube

హైదరాబాద్ నుంచి బీదర్ కేవలం 140 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. సాధారణంగా యువత ఎక్కువగా రోడ్ ట్రిప్ ద్వారా ఈ వీకెండ్ ప్రాంతంలో బీదర్ కు వెలుతుంటారు. ఇక్కడి కోట, రాగిని మహల్, రాయల్ పెవిలియన్ షాహీ టోంబ్స్ తో పాటు అనేక ప్రాంతాలు చూడదగినవి. సింగూర్ డ్యాం ను హైదరాబాద్ నుంచి బీదర్ వెళ్లే మార్గంలో చూడవచ్చు. మంజీర రివర్ వ్యాలీ ప్రాంతంలోని బీదర్ కు ఈ మాన్ సూన్ సమయంలో వెళ్లడం మంచి థ్రిల్లింగ్ ను కలిగిస్తుంది.

హంపి

హంపి

P.C: You Tube

హైదరాబాద్ కు హంపి 377 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హంపి తుంగభద్ర నదీ తీరంలో ఉన్న ప్రముఖ చారిత్రాత్మిక, ఆధ్యాత్మిక కేంద్రం. ఇక్కడ ఉన్నటు వంటి పర్యాటక కేంద్రాలు ఈ జులై, ఆగస్టు నెలల్లో కురిసే వర్షాలతో కొత్త అందాలను సంతరించుకొని పర్యాటకులకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.

బాదామి, పట్టదాకల్, ఐహోల్

బాదామి, పట్టదాకల్, ఐహోల్

P.C: You Tube

యునెస్కో చేత గుర్తించబడి పరిరక్షించబడిన జాబితాలో చేరిన ఈ గుహాలయాలను చూడటానికి ఈ సమయంలో విదేశాల నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు. కర్నాటకలోని బాగల్ కోటలో ఉన్న ఈ పర్యాటక ప్రాంతాలను చేరుకోవాలంటే మాత్రం హైదరాబాద్ నుంచి 400 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాలి. ఇక్కడ గుహాలయాలే కాకుండా బాదామి కోట, అగస్త్య సరస్సు తదితర పర్యాటక స్థలాలు వాటి చుట్టూ ఉన్న పచ్చటి ప్రాంతాలు మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.

అనంతగిరి హిల్స్

అనంతగిరి హిల్స్

P.C: You Tube

హైదరాబాద్ నుంచి అనంతగిరి హిల్స్ కేవలం 79 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. మూసి నది జన్మస్థానం ఇక్కడే. ప్రముఖ హిల్ స్టేషన్ అయిన అనంతగిరి ప్రస్తుతం పడుతున్న వర్షాల వల్ల కొత్త అందాలను సంతరించుకొంటూ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక్కడే అనంత పద్మనాభ స్వామి దేవాలయం కూడా ఉంది.

ఏటూరు నాగారాం.

ఏటూరు నాగారాం.

P.C: You Tube

దక్షిణ భారత దేశంలో అత్యంత పురాతన అభయారణ్యాల్లో ఏటురు నాగారాం కూడా ఒకటి. హైదరాబాద్ నుంచి 253 కిలోమీటర్ల దూరంలో ఈ ఏటురు నాగారాం. ఉంటుంది. మొత్తం 806 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ అభయారణ్యంలో అంతరించే స్థితికి చేరుకున్న ఎన్నో పక్షులు జంతువులను చూడవచ్చు. ఏటురు నాగారాంలో గోదావరి నదీ జలాల హోయలను కూడా వీక్షించడానికి వీలవుతుంది.

భద్రాచలం

భద్రాచలం

P.C: You Tube

గోదావరి నది ఒడ్డున ఉన్న ఈ పుణ్యక్షేత్రాన్ని చూడటానికి హైదరాబాద్ నుంచి 312 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాలి. ఖమ్మం జిల్లాలో ఉన్న క్షేత్ర సందర్శన వర్షాలు పడే ఈ కాలంలో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ముఖ్యంగా పర్ణశాల, కిన్నెరసాని డ్యాం ఇక్కడ చూడదగిన ప్రాంతాలు. ఇక్కడి నుంచి పాపికొండలకు గోదావరిలో బోటు ద్వారా ప్రయాణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.

పోచారం డ్యాం, అభయారణ్యం.

పోచారం డ్యాం, అభయారణ్యం.

P.C: You Tube

ఈ వర్షాకాలంలో పోచారం అభయారణ్యం కొత్త అందాలతో పర్యాటకులను రారమ్మని ఆహ్వానిస్తూ ఉంటుంది. తెలంగాణలోని మెదక్ జిల్లాలలో ఉన్న పోచారం డ్యాం కూడా ఈ వర్షాల కాలంలో నిండుగా ఉండి కంటికి ఇంపుగా కనిపిస్తుంది. హైదరాబాద్ నుంచి ఈ పర్యాటక కేంద్రం కేవలం 109 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X