Search
  • Follow NativePlanet
Share
» »పిటపిటలాడే ప్రాయంలో చూడదగిన ప్రాంతాలు...

పిటపిటలాడే ప్రాయంలో చూడదగిన ప్రాంతాలు...

కళాశాల విద్యార్థుల పర్యాటకానికి అనువైన ప్రదేశాలకు సంబంధించిన కథనం.

ఊహలకు రెక్కలు తొడిగే వయస్సులో కొత్త ప్రదేశాలను చూడాలని అక్కడి అందాలను ఆస్వాధించాలని ఉండటం సహజం. ఇందుకు ప్రాంతం, లింగ బేధం లేదు. ఈ రెక్కలకు కొంత స్వేచ్ఛ దొరికేది కాళాశాలల్లోనే. కళాశాలల్లో ఫ్రెండ్స్ తో కలిసి టూర్లు ఇప్పుడు సర్వ సాధారణం.

ఇందుకు తల్లిదండ్రులు కూడా సరే అంటున్నారు. ఇక మీకు ఈ సమయంలో అడ్డు చెప్పే బాస్ కాని అడ్డొచ్చే బాధ్యతలు కాని ఉండవు. కాకపోతే బడ్జెట్ ను మాత్రం దృష్టిలో పెట్టుకోండి. ఇక కళాశాల వయస్సులో భారత దేశంలో చూడదగిన కొన్ని ప్రాంతాలకు సంబంధించిన వివరాలు మీ కోసం....

మనాలి

మనాలి

P.C: You Tube

ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్నకాలేజ్ ఫ్రెండ్స్ కు టూర్ అన్న తక్షణం మొదట గుర్తుకు వచ్చేది మనాలీనే. ఢిల్లీ నుంచి రవాణా సౌకర్యం బాగుండటమే కాకుండా మనాలిలో ఉన్న ప్రక`తి కూడా స్టూట్స్ ను ఆకర్షిస్తుంది. ఇక్కడ పారాగ్లైడింగ్ కు కూడా అవకాశం ఉంది.

బైక్ పై లేహ్

బైక్ పై లేహ్

P.C: You Tube

రాయల్ ఎన్ ఫీల్డ్ ను అద్దెకు తీసుకొని రోడ్డు మార్గంలో లేహ్ కు వెళ్లడం జీవితంలో మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుంది. ఈ రోడ్డు మార్గాన్ని మక్కా ఆఫ్ రోడ్ ట్రిప్ అని పిలుస్తారు. ఈ శారీరక, మానసిక ధ`డత్వానికి కూడా ఈ మార్గం పరీక్ష పెడుతుంది.

లడక్

లడక్

P.C: You Tube

తెల్లని దూదెపింజల్లాంటి మేఘాలతో ఊసులాడే సమయంలో గడ్డకట్టిన సరస్సు మన కాళ్లను తాకుతూ ఉన్న అనుభూతిని పొందాలంటే మాత్రం లడక్ కు మించిన మార్గం మారొకటి లేదు. ఇక్కడ యాక్ సఫారీ అందుబాటులో ఉంటుంది.

సాహసక్రీడల కోసం రిషికేష్

సాహసక్రీడల కోసం రిషికేష్

P.C: You Tube

సాహసక్రీడల పట్ల మీకు మక్కువ ఉంటే రిషికేష్ కు మించిన ప్రదేశం మరొకటి లేదని చెప్పవచ్చు. ప్రముఖ శైవ క్షేత్రమైన రిషికేష్ లో అందుబాటులో లేని సాహస జల సాహస క్రీడ లేదంటే అతిశయోక్తి కాదు. అందువల్లే యువరక్తం తమ పర్యాటక స్థలాల్లో దీనికి తప్పక స్థానం కల్పిస్తారు.

ముంబై

ముంబై

P.C: You Tube

యువత కలల నగరం ముంబై. ఇక్కడి సముద్రపు ఒడ్డు నుంచి నైట్ క్లబ్బుల వరకూ యువతకు ప్రతి ఒక్కటి తెగ నచ్చుతుంది. ముంబైకు నిద్రపోని నగరంగా కూడా పేరుంది. వీకెండ్ లో లోకల్ ట్రిప్స్ ను అదుబాటులోకి తీసుకువచ్చే ఎన్నో సంస్థలు ఇక్కడ ఉన్నాయి.

ముంబై టు గోవా

ముంబై టు గోవా

P.C: You Tube

అద్దెకు బైక్ లేదా కార్ తీసుకుని ముంబై నుంచి గోవాకు ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లడం బాగా పెరిగింది. మార్గమధ్యలో ప్రక`తి సోయగం మిమ్ములను చూపు తిప్పుకోనివ్వదు. దిల్ ఛాహ్ థా హై సినిమా చూశారా? మరెందుకు ఆలస్యం ఈ వీకెండ్ కు ప్లాన్ చేసుకొని ముంబై టు గోవా చలో అనండి.

కళాశాల రోజుల్లో గోవా

కళాశాల రోజుల్లో గోవా

P.C: You Tube

యువతకు టూరిజం ప్లేస్ అన్న తక్షణం గుర్తుకు వచ్చేది గోవానే. ఇక్కడ సుందరమైన సముద్ర తీరాలతో పాటు నైట్ క్లబ్స్ నుంచి వినిపించే హోరు సంగీతం, ఇండియన్, చైనీస్, కాంటినెంటల్ తదితర ఆహార రుచులు అందుబాటులో ఉంటాయి. వెళ్లిన ప్రతిసారి గోవా మీకు సరికొత్త అందాలను పరిచయం చేస్తుంది.

జైపూర్ అందాలను చూడటానికి

జైపూర్ అందాలను చూడటానికి

P.C: You Tube

పింక్ సిటీగా పేరొందిన జైపూర్ కు వెలితే మీరే రాజు రాణి. ఎందుకంటే ఏనుగు ఎక్కి ఊరేగవచ్చుకదా? అందుకే ఇక్కడకు వెళ్లాలని స్టూడెంట్స్ ఎక్కువగా కోరుకొంటూ ఉంటారు. స్థానిక రాజస్థాని రుచులకు కూడా జైపూర్ పెట్టింది పేరు.

బండీపూర్ ఫారెస్ట్

బండీపూర్ ఫారెస్ట్

P.C: You Tube

కర్నాటకలోని ఈ బండీపూర్ లో అంతరించే స్థితికి చేరిన ఎన్నో జంతువులకు రక్షణ కల్పిస్తోంది. అందువల్లే యువతే కాకుండా జంతుప్రపంచం, పర్యావరణ పరిరక్షణ అంటే ఇష్టమున్నవారిలో చాలా మంది మొదటి ఛాయిస్ బండీపూర్ పారెస్టే.

అండమాన్

అండమాన్

P.C: You Tube

నీటి కింద స్కూబా డైవింగ్ చేయాలని ఉందా? మరెందుకు ఆలస్యం చలో అండమాన్. అక్కడ నిపుణుల సహకారంతో జలచరాలను పలకరిస్తూ ముందుకు సాగిపోతుండే సమయం ఇట్టే గడిచిపోతూ ఉంటుంది. అంతే కాకుండా సాహసయాత్ర పూర్తి చేసినట్టూ ఉంటుంది. అందువల్లే ఇక్కడకు వెళ్లడం ఎవరికైనా ఇష్టమే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X