Search
  • Follow NativePlanet
Share
» »బ్యాచిలర్ పార్టీ: పబ్, డిస్కో, బార్, ..నైట్ పార్టీలకి అదరహో అనిపించే ప్రదేశాలు..

బ్యాచిలర్ పార్టీ: పబ్, డిస్కో, బార్, ..నైట్ పార్టీలకి అదరహో అనిపించే ప్రదేశాలు..

ఇద్దురు వ్యక్తులు ఒక్కటవుతున్నారంటే ఇక సందడే సందడి. ఈ సందడిలో మొదటగా గుర్తొచ్చేది బ్యాచిలర్ పార్టీ. అరె మామ పెళ్లి కుదిరిందిరా అనగానే ఫ్రెండ్స్ నోట్లో నుండి వచ్చేది బ్యాచిలర్ పార్టీ ఎప్పుడు? ఎక్కడ?. బ్రహ్మచర్యానికి ముగింపును ఒక వేడకగా సెలబ్రేట్ చేసుకోవడం ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్. ఇది ఇప్పుడు పెళ్ళి వేడుకలో ఒక భాగం అయిపోయింది. వరుడు వైపు నుండో, వధువు వైపు నుండో ఈ పార్టీని నిర్వహించడం ట్రెండింగ్ గా మారింది.

బ్రహ్మచర్యం వదిలేయాలంటే పెళ్ళికి కొద్ది రోజుల మందు సంతోషంగా తనివితీరా ఎంజాయ్ చేయడమే అంటున్న యువత. స్నేహితులతో గడపడం, పార్టీలివ్వడం సరిదాగా జరిగిపోతుంది. అయితే ఈ బ్యాచిలర్ పార్టీలకు అనువైన ప్రదేశాలు ఏవి, ఎక్కడి వెళితే బాగుటుంది, ఏఏ ప్రదేశాలను ఎంపిక చేసుకుంటుంది అన్న విషయంలో చాలా మంది కన్ఫ్యూజన్ అవుతుంటారు. అలాంటి వారికోసం మన ఇండియాలోనే ఉన్న టాప్ టెన్ బ్యాచిలర్ పార్టీ ప్రదేశాల లిస్ట్ ను మీకోసం అందిస్తున్నాం. అవి...

1. గోవా

1. గోవా

బ్యాచిలర్ పార్టీ అనగానే ముందుగా గుర్తొంచే అందమైన, ఆహ్లాదకరమైన ప్రదేశం గోవా. ఎందుకంటే ఇక్కడ నైట్ పార్టీలకు కావల్సిన అన్ని సౌకర్యాలు, కేసినోలు, బీచ్ పార్టీలు, విలాసవంతమైన రిసార్ట్స్ మరియు సన్ బాత్ అందుబాటులో ఉంటాయి. అద్భుతమైన నాన్ వెజ్ గోవా రుచులతో, అద్భుతమైన నేచర్ తో నైట్ లైఫ్ ,బీచ్ పారాడైజులు బ్యాచిలర్ గా చివరి రోజులు సంతోషంగా గడపడానికి అద్భుతంగా ఉన్నాయి.
Photo Courtesy: Vinoth Chandar

2. కేరళ

2. కేరళ

కేరళ, ప్రక్రుతి ఒడిలో పరవశించిపోవాలనిపించే ప్రదేశాల నిలయం కేరళ. కేరళ బ్యాక్ వాటర్స్, బీచులు మరియు ఐస్లాడ్ కు ప్రసిద్ది. కాబోయే వధువరులకు మరిచిపోలేని అనుభూతిని కలిగించే స్పా ట్రీట్మెంట్స్ కు , ఆయుర్వేద మసాజ్ లకు , థెరఫీలకు అద్భుతమైన ప్రదేశం కేరళ. పెళ్ళికి కొద్ది రోజుల ముందు ప్రశాంతంగా ఎంజాయ్ చేయాలంటే కేరళ బెస్ట్ ప్లేస్.

3. అండమాన్ దీవులు

3. అండమాన్ దీవులు

హనీమూన్ కు మాల్దీవులకు ప్రాన్ చేస్తున్నారా, గ్రేట్! అయితే మొదట బ్యాచిలర్ పార్టీ కథేంటి? బ్యాచిలర్ పార్టీకి అనువైన ప్రదేశం అండమాన్ అండ్ నికోబార్ దీవులు. సముద్రతీరాలు, నీలిరంగు బీచ్ లు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం మిమ్మల్ని మంత్రముగ్థులను చేస్తుంది. మనస్సును కట్టిపడేస్తుంది. సన్ బాత్,ఆటలు, విశ్రాంతి తీసుకోవడానికి , అద్భుతమైన ఆహార రుచులకు ఎన్నె రిసార్ట్ లు వెల్ కమ్ చెబుతుంటాయి. మిమ్మిల్ని మీరు డిటాక్సిఫై చేసుకోవడానికి ఒక అద్భుతమైన ప్రదేశం ఇది. గర్లఫ్రెండ్స్ తో స్యూబా డైవింగ్ కు అనువైన ప్రదేశం అద్భుతమైన అనుభూతులు గుర్తుండిపోతాయి.

4. మనాలి

4. మనాలి

హిల్ స్టేషన్ హిమాచల్ ప్రదేశ్ లోని మనాలీ. సాహసాలకు, పార్టీ ప్రదేశాల కలయిక. మనాలి ట్రెక్కింగ్, రాఫ్టింగ్ మరియు స్నోబోర్డింగ్ వంటి వాటికి అద్భుతమైన ప్రదేశం. నీలాకాశం, ఎత్తైన కొండలు వాటి మధ్యలో రోడ్లు, ఇళ్లను కప్పేసిన మంచు.. వీటన్నింటిని కప్పేస్తున్న నీడ చూసేందుకు ఆహ్లాదకరంగా కనిపిస్తుంది.అందాల ప్రకృతి ఒడిలో సేదతీరాలి, ఆకాశ మార్గంలో విహరించాలంటే రోప్‌వే ఎక్కి ఎంజాయ్ చేయాల్సిందే.ఎత్తయిన పర్వతాల పక్కనే లోతయిన లోయలు, వాటి మధ్యలో వడిగా ప్రవహించే ప్రవాహాలు ప్రకృతి పరిచిన కాన్వాస్‌లా రమణీయంగా మన స్మృతిలో ఉండిపోతుంది.
Photo Courtesy: Saurc zlunag

5. రిషికేశ్

5. రిషికేశ్

బ్రాచిలర్ పార్టీతో పాటు థ్రిల్లింగ్ ఉండాలను కునే వారికి రుషికేష్ ను మించిన పర్యాటక ప్రాంతం మరొకటి లేదు.రిషికేశ్ సాహసోపేతమైన ప్రదేశం. బ్యాచిలర్ పార్టీకి రిషికేశ్ ను ఎంపిక చేసుకోవడం మంచిది. మీరు , మీస్నేహితులతో కలిసి వైట్ వాటర్ రాఫ్టిగ్, గంగా, బంగీ జంపింగ్, హైకింగ్, ట్రెక్కింగ్, క్యాంపింగ్ వంటి ఆహ్లాదకరమైన ఫన్ యాక్టివిటీస్ కు అద్భుతమైన ప్రదేశం. బహుశా ఇది హనీమూన్ కు సరసమైన ప్రదేశమే. !

PC: wikimedia.org

6. ఉదయపూర్

6. ఉదయపూర్

రాచరిక శైలిలో గ్రాండ్ గా బ్యాచిలర్ పార్టీని జరుపుకోవచ్చు. చారిత్రక కట్టడాలకు మరియు వాస్తు శిల్పకళలకు పెట్టింది పేరు ఉదయ్ పూర్. ఉదయపూర్ వంటకాలు, మరియు రాజభవనాలు విషయానికి వస్తే బ్యాచిలర్ పార్టీకి ఒక రాజకుటుంబానికి ఒక టచ్ ఇవ్వబడుతుంది. అలాగే ఎడారి ప్రదేశాలు, సరస్సులు మరియు ప్యాలెస్ లు సందర్శించడాని విలాసంవంతమైన ప్రదేశం. స్నేహితులతో కలిసి రాజబోగాలు అనుభవించి మీరే యువరాజుగా ఫీలయ్యేంత అనుభూతిని కలిగిస్తుంది ఉదయ్ పూర్. పెళ్లికి ముందు ఇది ఒక మరచిపోలేని అనుభుతి అనుకోండి.

7. ముంబై

7. ముంబై

సిటీ ఆఫ్ డ్రీమ్ గా పిలుచుకునే ముంబాయ్ ఫర్ఫెక్ట్ పార్టీ ప్లేస్. ముంబాయ్ నైట్ పార్టీలకు పెట్టింది పేరు. భారత దేశంలో బ్యాచిలర్స్ ఎక్కువగా సందర్శించే నగరంలో ముంబైకు పేరుంది. ఇక్కడ ఉదయం నుంచి రాత్రి వరకూ పబ్స్ తెరిచే ఉంటాయి. ముఖ్యంగా రాత్రి సమయంలో లైవ్ బాండ్ మ్యూజిక్ కు ముంబై నగరం పెట్టింది పేరు. అద్భుతమైన రుచులతో మీ బ్యాచిలర్ పార్టీని స్నేహితులతో కలిసి పంచుకోవచ్చు. మెరైన్ డ్రైవ్ బీచ్ అద్భుతంగా ఉంటుంది. తక్కువ సమయంలో షాపింగ్ కు అనుకూలమైన ప్రదేశం. ఈ వండర్ ఫుల్ సిటీ బ్యాచిలర్ పార్టీ ఒక మంచి అనుభూతిగా గుర్తుండిపోతుంది.

బెంగళూరు

బెంగళూరు

బెంగళూరుకు ఎంగ్ సిటీగా పేరు. ఇక్కడ బ్యాచిలర్ పార్టీ ఇవ్వడానికి అనేక రెస్టోరెంట్లు ఆహ్వానం పలుకుతుంటాయి. ఇందులో స్ట్రీట్ ఫుడ్ నుంచి మొదలుకుని ప్రంపచ అగ్రస్థాయి ఛెఫ్ లు తయారు చేసే వివిధ రకాల ఆహార పదార్థాలు ఎన్నో లభిస్తాయి. ఇక వివిధ దేశాల్లో తయారయ్యే మద్యం ఇక్కడ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. అందుకే దేశం నలుమూలల నుంచి బ్యాచిలర్ పార్టీ ఇవ్వడానికి అనేక మంది ఇక్కడకు వస్తూ ఉంటారు. సంవత్సరంలో ఎప్పుడైనా ఇక్కడ బ్యాచిలర్ పార్టీ ఇవ్వడానికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది.

జైసల్మీర్

జైసల్మీర్

విభిన్న ప్రాంతాల్లో పార్టీ చేసుకోవాలనుకునే వారికి జైసల్మీర్ ఉత్తమమైన ప్రాంతం. ఇసుక తిన్నెల్లో ఏసీ టెంట్లలో పార్టీ చేసుకోవడం ఒక వినూత్న అనుభూతి. కొంత ఎక్కువ ఖర్చు పెట్టడానికి ముందుకు వచ్చే వారికి రాజస్థాన్ సంప్రదాయా నృత్యాలు కూడా ఎనలేని సంతోషాన్ని కలిగిస్తాయి. ఈ ప్రాంతంలో పర్యటించానికి నవంబర్ నుంచి మార్ఛ్ మధ్య కాలం సరైనది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X