• Follow NativePlanet
Share
» »మిమ్మల్ని మైమరపించే టాప్ 15 జలపాతాలు !!

మిమ్మల్ని మైమరపించే టాప్ 15 జలపాతాలు !!

ప్రకృతి మనకందించిన అరుదైన అద్భుతాల్లో జలపాతాలు అత్యంత కీలకమైనవి. ఆ జలపాతాల సోయగాలను ఒక్కసారి వీక్షించి వస్తే జన్మజన్మల అలసట కూడా మాయమైపోతుంది. జలపాతాలు ఎప్పుడూ నిండుగానే కనిపిస్తాయి. దక్షిణ భారతదేశంలో టూర్ వేస్తే ఈ జలపాతాలను తప్పక చూసిరండి ... సిటీ లైఫ్ లో పడి నవ్వడం కూడా మర్చిపోయిన మనం ఒక్కసారి జలపాతాల్లోకి ఉరుకుదాం ... పదండి..!

భారతదేశం అంటే తాజ్ మహల్ ఒక్కటే కాదు. భారతదేశ పుడమి మీద నివసించడానికి ఎన్నో నగరాలు, సేదతీరాటానికి బీచ్ లు, ఆద్యాత్మికం కోరుకునే వారికి ఆలయాలు ... ఇంకా మరెన్నో ప్రకృతితో మమేకమయ్యే అందాలు తారసపడతాయి. కానీ వీటిలో ఒకటి మనం మరిచిపోయాం ... అవే జలపాతాలు !!

బేర్ షోల జలపాతాలు

బేర్ షోల జలపాతాలు

బేర్ షోల జలపాతం అభయారణ్య అడవిలో ఉంది. బస్ స్టాండ్ కి షుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతం చాలా పొడవైనది. పూర్వం ఈ ప్రాంతానికి నీళ్ళు తాగడానికి తరచుగా అనేక ఎలుగుబంట్లు వచ్చేవి అందువల్ల ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది.ఈ స్థలం ప్రత్యేకంగా ప్రకృతి ప్రేమికులను నిలబడేటట్లు చేస్తుంది. వర్షాకాల సమయంలో ఈ ప్రదేశం అద్భుతంగా కనిపిస్తుంది, ఈ జలపాతాల సందర్శనకు ఇది సరైన సమయం.

Photo Courtesy: Nandha Kumar AC

అడ్యన్ పర జలపాతం

అడ్యన్ పర జలపాతం

అడ్యన్ పర జలపాతం, పెద్ద సంఖ్యలో సందర్శకులను, ప్రకృతి ప్రేమికులను ఆకర్షించే కుర్మబాల౦గోడ్ గ్రామంలోని ఒక అద్భుతమైన జలపాతం. ఇది నిలంబూర్ - ఊటీ జాతీయ రహదారి నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. అడ్యన్ పర జలపాతం సుందర పరిసరాలు, పచ్చదనం, ఇది కిందకు ప్రవహించే బ్రహ్మాండమైన రాళ్ళకు ఎంతో ప్రసిద్ది. ఈ రాళ్ల మధ్య నుండి కిందకు పారిన తర్వాత ఈ జలపాతం సందర్శకులను ఆకర్షించే ఒక చిన్న సెలయేరుగా మారుతుంది. పరిసరాలలో సతత హరితారణ్యాలు ఉన్న ఈ జలపాతం అందమైన దృశ్యాలతో పర్యటనకు, కుటుంబ విహార యాత్రకు సరైన ప్రదేశం.

Photo Courtesy: jksigns

అతిరాప్పిల్లి జలపాతం

అతిరాప్పిల్లి జలపాతం

అతిరాప్పిల్లి జలపాతం పశ్చిమ కనుమల్లో చలకుడి నది నించి ఆవిర్భవిస్తుంది. ఈ బ్రహ్మాండమైన జలపాతానికి భారతదేశపు నయాగరా గా పేరు. 24 మీటర్ల ఎత్తు నించి జల జల మంటూ పారుతూ కిందన ఉన్న నదిలో కలుస్తుంది. చాలా చోట్లనించి ఈ జలపాతాన్ని చూడవచ్చు. రహదారి నించి చూస్తే నీళ్ళు పరవళ్ళు తొక్కుతూ లోతైన నదిలో కి దూకుతూ కనువిందు చేస్తాయి. పై నించి కుడా జలపాతాన్ని చూడవచ్చు. జలపాతం యొక్క కింద నించి పైకి చూస్తే కిందికి దూకుతున్న నీళ్ళు అత్యంత మనోహరంగా కనిపిస్తాయి.

Photo Courtesy: Ranjith shenoy R

భార చుక్కి

భార చుక్కి

భార చుక్కి మరియు గగన్ చుక్కి అనేవి రెండు జలపాతాలుగా ప్రవహిస్తాయి. కావేరి నది ప్రవాహం దక్కన్ పీఠభూమిలో ప్రవహిస్తూ ఈ శివసముద్ర ప్రదేశంలో రెండు పాయలుగా చీలుతుంది. ఈ రెండు ప్రవాహాలు వేగం సంతరించుకొని ఒక పెద్ద కొండనుండి 98 మీటర్ల ఎత్తునుండి కిందపడతాయి. గగన్ చుక్కిని శివసముద్ర వాచ్ టవర్ నుండి లేదా అక్కడి దర్గా నుండి చూడవచ్చు. భార చుక్కిని 1 కి.మీ. దూరంనుండి చూడవచ్చు.

Photo Courtesy: Deepak Tiwari

కుర్తాళ్ళం జలపాతాలు

కుర్తాళ్ళం జలపాతాలు

కుర్తాళ్ళం తొమ్మిది జలపాతాలకు ప్రసిద్ధి. వీటిలో పెరారువి జలపాతం ప్రధానమైనది. ఇది 60 మీటర్ల ఎత్తు నుండి కింద పడుతుంది. చిత్రారువి లేదా చిన్న జలపాతాలు, శేన్బగాదేవి జలపాతాలు మరియు తేనరువి, శేన్బగాదేవి ఫాల్స్ శేన్బగా చెట్ల నుండి ప్రవహిస్తాయి. తేనరువి లేదా తేనె జలపాతాలు 40 మీటర్ల ఎత్తు నుండి పడతాయి. ఈ జలపాతాలు ఎండి నపుడు ఇక్కడ తేనె తుట్టలు చూడవచ్చు.పులులు తరచుగా వచ్చి నీటిని తాగుతూన్డటం తో ఇక్కడే కల మరో జలపాతాన్ని పులి జలపాతాలు లేదా టైగర్ జలపాతం అన్నారు.

Photo Courtesy: fragolablu

దూద్ సాగర్ జలపాతాలు

దూద్ సాగర్ జలపాతాలు

దూద్ సాగర్ జలపాతాలు పానాజీ నుండి షుమారు 60 కిలోమీటర్ల దూరంలో కర్ణాటక-గోవా సరిహద్దు మధ్య ఉన్న అందమైన ప్రదేశం. ఇది ప్రపంచంలోనే అత్యంత అందమైన జలపాతాలలో ఒకటిగా పేర్కొనబడింది, ఇది భారతదేశంలోని ఐదవ అతిపొడవైన జలపాతం, దీని మొత్తం ఎత్తు 310 మీటర్లు. ఇది ప్రత్యేకంగా వర్షాకాల సమయంలో చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఈ రహదారి అడవి మార్గం కావడం వల్ల, దుడ్ సాగర్ కి కార్లో ప్రయాణించడం సూచనప్రాయం కాదు.

Photo Courtesy: zehawk

ఎత్తిపోతల జలపాతాలు

ఎత్తిపోతల జలపాతాలు

ఎత్తిపోతల జలపాతాలు నాగార్జునసాగర్ పట్టణానికి సమీపంలో ఉన్నాయి మరియు నాగార్జునసాగర్ డాంకు 11 కి.మీ. దూరంలో ఉన్నాయి. కృష్ణ నదికి ఉపనది అయిన చంద్రవంక 70 అడుగుల ఎత్తు నుండి ఉధృతంగా ప్రవహించటం వలన ఈ జలపాతాలు ఏర్పడ్డాయి. ఈ జలపాతాలు పర్యాటకులకు ఒక గొప్ప ఆకర్షణగా ఉన్నాయి మరియు సంవత్సరం అంతా చాలామంది పర్యాటకులు సందర్శిస్తూ ఉంటారు. ఈ జలపాతాల స్థలం నిజంగా ఉత్కంఠ భరితమై ఉంటుంది.

Photo Courtesy:Oswin Jella

హనుమాన్ గుండి ఫాల్స్

హనుమాన్ గుండి ఫాల్స్

కుద్రేముఖ్ సందర్శించే పర్యాటకులు హనుమాన్ గుండి జలపాతాలను తప్పక సందర్శించాలి. ఈ జలపాతాలు 100 అడుగుల ఎత్తునుండి ప్రవహిస్తాయి. ఇవి కుద్రేముఖ్ నేషనల్ పార్క్ కొండ ప్రాంతాలలో ఉన్నాయి. ఈ ప్రదేశం ట్రెక్కింగ్ చేయాలనుకునే పర్యాటకులకు బాగుంటుంది. ప్రశాంత వాతావరణం అనుభవించాలనుకునేవారు ఇక్కడకు తప్పక చేరి ఆనందించవచ్చు. సురక్షితంగా ఈ జలపాతాలలో విహరించాలనుకునేవారు ఒకరికి 30 రూపాయల చొప్పున రుసుము చెల్లించాలి.

Photo Courtesy: Kunal Dikshit

హోగేనక్కల్ జలపాతాలు

హోగేనక్కల్ జలపాతాలు

హోగేనక్కల్ జలపాతాలు బెంగళూరు నుండి 180 కి.మీ ల దూరంలో తమిళనాడు ధర్మపురి జిల్లాలో కావేరి నది మీద ఉంది. దీనిని 'నయాగరా ఫాల్స్ ఆఫ్ ఇండియా' అని కూడా పిలుస్తారు. ఈ జలపాతాల నీటిలో ఔషధ గుణాలు ఉన్నాయి మరియు ప్రత్యెక బోటు రైడ్స్ కి ప్రాచుర్యం సంతరించుకున్నది. ఈ ప్రాంతంలో కనిపించే కార్బోనేట్ శిలలు ఆసియా లోనే కాదు, ప్రపచంలోకల్లా అతిపురాతనమైనవని భావిస్తారు. ఇక్కడ అప్పుడే పట్టుకున్న తాజా చేపలను కొనుక్కొని వంటకం తయారు చేసుకుంటారు.

Photo Courtesy: Daniel Patrick

ఇరుప్పు ఫాల్స్

ఇరుప్పు ఫాల్స్

బ్రహ్మగిరి పర్వత శ్రేణిలో దక్షిణ కూర్గ్ లో ఇరప్పు జలపాతాలు కలవు. వీటినే లక్ష్మణ తీర్ధ జలపాతాలంటారు. ఇవి కావేరి ఉపనదినుండి ఆవిర్భవిస్తాయి. నది 60 అడుగుల ఎత్తునుండి పడి జలపాతాలను సృష్టిస్తోంది. శ్రీరాముడి దాహం తీర్చటానికి ఈ నీటిని లక్ష్మణుడు సృష్టించాడని హిందువులకు ఎంతో పవిత్రమైనదని చెపుతారు. ఈ జలపాతాలు వర్షాకాలంలో పూర్తి స్ధాయిలో ప్రవహించి యాత్రికులను ఆనందపరుస్తాయి. జలపాతాల హోరు పర్యాటకుడికి మరచిపోలేని అనుభూతి కలిగిస్తుంది.

Photo Courtesy: Dhruvaraj S

జోగ్ ఫాల్స్

జోగ్ ఫాల్స్

ప్రకృతి మానవుడికి ప్రసాదించిన బహుమతులలో జోగ్ జలపాతాలు ఒకటి. ఈ జలపాతం షరావతి నదినుండి ఏర్పడుతుంది. షుమారుగా 830 అడుగుల ఎత్తునుండి ఒంపు సొంపులతో క్రిందకు పడే ఈ జలపాతాలు వేలాది సందర్శకులను ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. జోగ్ ఫాల్స్ అందాలను ఆనందించాలంటే అనేక ప్రదేశాల నుండి దానిని చూడవచ్చు. జలపాతం కిందకు చేరుకోవడం మరల వెనక్కు ఎక్కడం వంటివి ఎంతో కష్టంగా ఉంటాయి. ఈ రకమైన చర్యలు యాత్రికులు తమ కండరాలు బలం చేసుకోవాలంటే చేయాలి.

Photo Courtesy: Amar Raavi

కటారి జలపాతం

కటారి జలపాతం

కటారి జలపాతం నీలగిరిలో అతిపెద్ద మూడవ జలపాతంగా కీర్తి గడించింది. ఇక్కడ భారతదేశం యొక్క మొదటి జలవిధ్యుత్ ప్రాజెక్టు ప్రదేశంగా చెప్పవచ్చు. కటారి జలపాతం ఎత్తు 180 మీటర్లు ఉంటుంది. కూనూర్ కేంద్రం నుండి 10 కిలోమీటర్ల దూరంలో కుంద రహదారి వద్ద ఉన్నది. అంతేకాక వందల సంఖ్యలో సందర్శకులను ఆకర్షిస్తుంది. ఈ జలపాతం వర్షాకాలంలో చూడటానికి ఒక దృష్టి ఉంది. కటారి జలపాతం ఆకాశం నుండి భూమి కోనకు ముగిసినట్లు కనిపిస్తుంది.

Photo Courtesy: Museum of Photographic

ఒనకి అబ్బి ఫాల్స్

ఒనకి అబ్బి ఫాల్స్

అగుంబే లో ఒనకి అబ్బి జలపాతాలు ప్రసిద్ధి చెందినవి. కన్నడ భాషలో ఒనకి అంటే దంపుడు కర్ర అని అర్ధం చెపుతారు. ఇది అగుంబే నుండి 8 కి.మీ.ల దూరంలో ఉంది. ఈ జలపాతం పైకి అక్కడే నిర్మించిన మెట్ల ద్వారా చేరవచ్చు. పర్యాటకులు జలపాతాన్ని, ప్రవాహాన్ని చూసి ఆనందిస్తారు.

Photo Courtesy: Girish

సిరిమనె జలపాతాలు

సిరిమనె జలపాతాలు

శ్రింగేరి పర్యాటకులు పట్టణానికి 20 కి.మీ.ల దూరంలో కల సిరిమనె జలపాతాలు తప్పక సందర్శించాలి. కర్నాటకలోని పడమటి కనుమలలో అనేక జలపాతాలు కలవు. అయితే, సిరిమనె జలపాతాలు, అతి చిన్నవి మరియు అందమైనవిగా చెపుతారు. ఈ ప్రదేశాన్ని సందర్శించాలంటే, వర్షాకాలం తర్వాత మాత్రమే బాగుంటుంది. అప్పటికి జలపాతాలు పూర్తి స్ధాయిలో ప్రవహిస్తూంటాయి.

Photo Courtesy: Vinay Chalageri

తోమ్మంకుతూ ఫాల్స్

తోమ్మంకుతూ ఫాల్స్

ఇడుక్కి జిల్లాలో ఉన్న తోడుపుజ్హ నగరం నుండి 17 కి మీ ల దూరంలో ఉన్న తోమ్మంకుతు ఫాల్స్ 1500 మీ ల ఎత్తు నుండి పడతాయి. ఈ జలపాతం చిన్నదయినా అత్యంత ఆకర్షణ కలిగినది.జలపాతం నుండి నీళ్ళు కిందకి పడుతున్నప్పుడు ఏడు మెట్లగా ఏర్పడింది. ప్రతి మెట్టులో కొలను ఏర్పడింది. ఫాల్స్ అందం ఈ మెట్ల లోనే ఉంది. హృదయాన్ని ఉత్తేజ పరిచే రాక్ క్లైంబింగ్, హైకింగ్, ట్రెక్కింగ్ , ఫిషింగ్, బోటింగ్, గుర్రపు స్వారీ వంటి కార్యక్రమాలు కూడా పర్యాటకులని అమితంగా ఆకర్షిస్తున్నాయి.

Photo Courtesy: Bimal K C

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి