Search
  • Follow NativePlanet
Share
» »వీకెండ్ లో చెన్నైకు టాటా చెప్పి ఇక్కడకు చెక్కేదాం

వీకెండ్ లో చెన్నైకు టాటా చెప్పి ఇక్కడకు చెక్కేదాం

గత కొన్ని సంవత్సరాలుగా ఐటీ రంగంలో ముందుకు వెలుతున్న చెన్నైలో ట్రాఫిక్ ను దాటుకొని ఆఫీసుకు చేరుకొంటే పద్మవ్యూహన్ని దాటిన అనిభూతి కలిగుతుందనడంలో సందేహం లేదు. వారంలో ఐదు రోజుల పాటు ఇదే తంతు. ఇక ఆఫీసులో బాస్ ఇచ్చే ట్రార్గెట్ లను తలుచుకుంటే ఇంటికి వెళ్లినా నిద్ర మనకు రాదు.

దీంతో ఆ ఐదు రోజులు ఇల్లు, ఆఫీసు తప్ప మరో లోకం లేకుండా గడిపేస్తాం. జీవితం మొత్తం ఇదే పరిస్థితి ఎదురైతే జీవితంలో చాలా కోల్పోవాల్సి వస్తుంది. అందుకే ఆ మూస ధోరణి నుంచి భయటపడటానికి వీలుగా మనం అప్పుడప్పుడు కొత్త ప్రదేశాలను సందర్శిస్తూ ఉండాలి.

దీంతో శారీరక పని నుంచి ఉల్లాసాన్ని పొందడానికి వీలువుతుంది. ఈ నేపథ్యంలో చెన్నైకు దగ్గరగా ఉన్న ఐదు పర్యాటక ప్రాంతాల గురించి కథనం మీ కోసం...

కాంచిపురం

కాంచిపురం

P.C: You Tube

చెన్నై నుంచి 72 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాంచిపురాన్ని సిల్క్ సిటీ అని కూడా అంటారు. ఇక్కడ దేవాలయాలను చూస్తూ రెండు రోజులు హాయిగా గడిపేయవచ్చు. అంతేకాకుండా దగ్గర్లోని వేదాంతగాల్ పక్షి సంరక్షణ కేంద్రం కూడా చూడదగినదే.

తిరుపతి

తిరుపతి

P.C: You Tube

హిందువుల పరమ పవిత్ర పుణ్యక్షేత్రాల్లో తిరుపతి కూడా ఒకటి. ఇక్కడ శ్రీవారి ఆలయంలో పాటు అనేక జలపాతాలు, పురాణ ప్రాధాన్యత కలిగిన ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. సహజ సిద్ధంగా ఏర్పడిన శిలాతోరణం కూడా చూడదగిన ప్రాంతాల్లో ఒకటి. చెన్నై నుంచి 135 కిలోమీటర్ల దూరంలో ఈ పుణ్యక్షేత్రం ఉంది.

పాండిచ్చేరి

పాండిచ్చేరి

P.C: You Tube

ప్రక`తిలో మమేకం కావాలనుకునేవారికి చెన్నై నుంచి 161 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ పాండిచ్చేరి ఖచ్చితంగా నచ్చుతుంది. ఇక్కడి అలలతో అడుకోవడం, స్కూబా డైవింగ్ తో సముద్ర గర్భంలో కి వెళ్లి రావడం మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుంది. అద్దెకు దొరికే సైకిళ్లతో నగర వీధుల్లో తిరగడంతో చిన్ననాటి విషయాలు జ్జాపకానికి వస్తాయి.

వేలూరు

వేలూరు

P.C: You Tube

తమిళనాడు కోటల నగరంగా పేరుగాంచిన వేలూరు అటు ఆధ్యాత్మికంగానే కాకుండా చారిత్రాత్మకంగా కూడా ఎంతో పేరెన్నికగన్నది. ఇక్కడ ఉన్న వేలూరు కోట, ఆ కోట లోపల ఉన్న జలకంఠేశ్వరుడి దేవాలయం కూడా చూడదగినది. ఇక ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన లక్ష్మీ దేవి గోల్డెన్ టెంపుల్ ను మాత్రం ఇక్కడికి వెళ్లిన వారు సందర్శించకుండా తిరిగిరారు. చెన్నై నుంచి వేలురుకు కేవలం 136 కిలోమీటర్లు మాత్రమే.

ఎలగిరి

ఎలగిరి

P.C: You Tube

చెన్నై నుంచి 227 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎలగిరి పర్యాటక కేంద్రం లో చూడదగిని ప్రాంతాలు కోకొల్లలు. సమయం ఉండాలేకాని రెండురోజుల వీకెండ్ మొత్తం సరిపోతు. ముఖ్యంగా ఇక్కడ పుంగనూర్ సర్సుస్సలో బోటింగ్ చేయడం మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుందనండంలో సందేహం లేదు. ఇక ఇక్కడికి దగ్గరగా ఎలగిరి అడ్వెంచర్ స్పోర్ట్స్ అసోషియేషన్ నిర్వహించే క్రీడల్లో పాల్గొనడం మరిచిపోకండి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X