Search
  • Follow NativePlanet
Share
» »జైపూర్ కు వెలుతున్నా? చుట్టు పక్కల ఉన్న ఈ ప్రాంతాల పై కూడా ఒక లుక్..

జైపూర్ కు వెలుతున్నా? చుట్టు పక్కల ఉన్న ఈ ప్రాంతాల పై కూడా ఒక లుక్..

ఎడారి రాష్ట్రం రాజస్థాన్ అన్న తక్షణం మనకు గుర్తుకు వచ్చేది రంగు రంగుల నగరం జైపూర్. చాలా మంది రాజస్థాన్ రాష్ట్రంలో ఈ ఇక్కడ నగరమే పర్యాటకానికి అనుకూలమని, చాలా బాగుంటుందని అనుకుంటారు. అయితే రాజస్థాన్ లోని జైపూర్ కు కొద్ది దూర అంటే 200 కిలోమీటర్ల పరిధిలో కూడా చాలా ఉత్తమమైన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పర్యాటక కేంద్రాలు ఎన్నో ఉన్నాయి. అందులో టోన్, ఆల్వార్, పుష్కర్ తదితరాలు ముఖ్యమైనవి. ఈ నేపథ్యంలో జైపూర్ కు దగ్గరగా ఉన్న ఐదు పర్యాటక ప్రాంతాలు అక్కడ చూడదగిన విశేషాలతో కూడిన కథనం మీ కోసం...

టోంక్

టోంక్

P.C: You Tube

రాజస్థాన్ లోని జైపూర్ కు దగ్గరగా ఉన్న పర్యాటక ప్రాంతల్లో టోంక్ అనే చిన్నపట్టణం ముందు వరుసలో ఉంటుంది. దీనిని రాజస్థాన్ లక్నో అని పిలుస్తారు. ఇక్కడ పాత భవనాలతో పాటు ఇండో అరబ్బియన్ శైలితో నిర్మించిన ధార్మిక కట్టడాలు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. అదే విధంగా ఈ పట్టణంలోని సరస్సులో బోట్ లో విహరించడం కూడా మనలను మైమరిపింపజేస్తుంది. జైపూర్ నుంచి 90 కిలోమీటర్ల దూరంలో టోంక్ ఉంటుంది.

ఇక్కడ దర్శించడానికి అందమైన ప్రాంతాలు....ఓల్డ్ బోరిస్, బిసల్పూర్ డ్యామ్, శివాజీ గార్డెన్, రసియా కే టేక్రి, హిస్టారికల్ ఘంటా ఘర్, రాజమహల్

సరిస్కా

సరిస్కా

P.C: You Tube

జైపూర్ కు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న సరిస్కా పర్యావరణ ప్రేమికులకు ఖచ్చితంగా నచ్చే పర్యాటక కేంద్రం. రాయల్ బెంగల్ టైగర్స్ నివాస కేంద్రంగా సరిస్కాకు పేరు ఉంది. ఇక్కడ జీప్ సఫారీ అందుబాటులో ఉంటుంది. ఈ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో పులులు, పక్షి జాతులు, చారల హైనాలు, చిరుత పులులు, నక్కలు, కోతులుతో పాటు అంతరించే స్థితికి చేరుకొన్న ఎన్నో రకాల పక్షులను కూడా మనం చూడవచ్చు.

సందర్శించడానికి ఉత్తమమైన సమయం...అక్టోబర్ నుంచి జులై చివరి వరకూ ఈ సమయంలో పులులు ఎక్కువగా కనిపిస్తాయి.

ప్రధాన ఆకర్షణీయ స్థలాలు....సరిస్కా టైగర్ రిజర్వ్, సిలిసెర్ సరస్సు, సరిస్కా ప్యాలెస్, కంక్వారీ కోట

ఆల్వార్

ఆల్వార్

P.C: You Tube

మొఘల్ వాస్తు రీతిలో నిర్మించిన కోటలకు నిలయం ఆల్వార్. చరిత్రను తెలుసుకోవాలనుకొనే వారికి నిస్సందేహంగా జైపూర్ సమీపంలోని ఆల్వర్ ఖచ్చితంగా నచ్చుతుంది. ఇక్కడి సరస్సులో బోటు షికారు చేస్తూ శిథిలమై పోయిన కోట గోడలను చూస్తూ ఆ కాలంలోకి వెళ్లిపోవచ్చు. ఆల్వార్ లో ఎప్పుడూ ఏదో ఒక ఉత్సవం జరుగుతూనే ఉంటుంది. ముఖ్య్ంగా ఫిబ్రవరిలో జరిగే అల్వార్ ఫెస్టివల్స్ ను చూడటానికే వివిధ దేశాల నుంచి ఎక్కవు మంది పర్యాటకులు ఇక్కడకు వస్తారు.

ప్రధాన ఆకర్షణ...బాలా ఖిల్లా, భాన్ ఘర్ ఫోర్ట్, చాంద్ బారీ సిటీ ప్యాలెస్, జై పోల్, విజయ్ మందిర్ ప్యాలెస్ తదితరాలు

ఆజ్మీర్

ఆజ్మీర్

P.C: You Tube

ఆజ్మీర్ అన్న తక్షణం అక్కడి ధార్మిక ప్రాంతమే మనకు గుర్తుకు వస్తుంది. అయితే అంతకు మించిన పర్యాటక కేంద్రం ఆజ్మీర్. జైపూర్ నుంచి 153 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆజ్మీర్ అనాసాగర్ లేక్, తారఘర్ కోట వంటివి ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా వీకెండ్ ను ఇక్కడ చాలా మంది గడపడానికి వస్తుంటారు.

ప్రధాన ఆకర్షణ...మ్యాగజీన్ మ్యూజియం, తారాఘర్ ఫోర్ట్ తదితరాలు

పుష్కర్

పుష్కర్

P.C: You Tube

జైపూర్ నుంచి 161 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుష్కర్ ఫొటోగ్రఫీ ఉన్నవారికి చాలా బాగా నచ్చుతుంది. ముఖ్యంగా వీకెండ్ లో ఇక్కడ ఇసుక తిన్నల పై ఒంటెలతో రైడ్ సరదాగా అనిపిస్తుంది. అందుకే ఢిల్లీనుంచి కూడా వీకెండ్ లో ఇక్కడకు ఎక్కువ మంది వస్తూ ఉంటాయి. వేసవి కాలంలో జరిగే ఒంటె సంత చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. విదేశీయులు కూడా ఎక్కవ సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు.

ప్రధాన ఆకర్షణలు....గావ్ రోడ్, రోజ్ గార్డెన్, నాగ పహార్, సరఫా బజార్ తదితరాలు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X