Search
  • Follow NativePlanet
Share
» »ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం, తిరుపతితో పాటు చూడదగ్గ మరో 3 అద్భుత ప్రదేశాలు!

ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం, తిరుపతితో పాటు చూడదగ్గ మరో 3 అద్భుత ప్రదేశాలు!

మన భారత దేశానికి కోహినూర్ వంటిది ‘ఆంధ్రప్రదేశ్’. ఎందుకంటే విశాఖజిల్లాలో ఆహ్లాదపరిచే బీచ్ లు, నెల్లూరు జిల్లాలో ఆకుపచ్చని వరి పొలాలు మరియు రాజమండ్రిలో ప్రత్యేకమైన పులస చేపల నుండి పుట్టపర్తి వంటి..

మన భారత దేశానికి కోహినూర్ వంటిది 'ఆంధ్రప్రదేశ్'. ఎందుకంటే విశాఖజిల్లాలో ఆహ్లాదపరిచే బీచ్ లు, నెల్లూరు జిల్లాలో ఆకుపచ్చని వరి పొలాలు మరియు రాజమండ్రిలో ప్రత్యేకమైన పులస చేపల నుండి పుట్టపర్తి వంటి ఆధ్యాత్మికత కేంద్రం వరకూ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతిదీ వైవిధ్యంగా మరియు ఆకర్షణీయంగా ఉన్నాయి. పర్యాటక ప్రియులుగా గొప్ప చరిత్ర కలిగిన ఈ సుందరమైన ప్రదేశాలను చూడాలని ఎవరైనా కోరుకోవచ్చు. అత్యధిక ఆధ్యాత్మిక చింతన కలిగిన, సహజ వాతావరణం మరియు సంస్కృతికి గొప్ప నిలయం ఆంధ్రప్రదేశ్.! అంతే కాదు, నిజాములను పరిపాలించిన ప్రదేశం, పెర్ల్స్ కలంకారీ, కొండపల్లి బొమ్మలు, అద్భుతమైన ఆహార రుచులతో పర్యాటకులను ఊరడించడం వల్ల దక్షిణ భారత దేశంలో కొన్ని ప్రదేశాలను తప్పని సరిగా చూడవల్సినవి కొన్ని ఉన్నాయి. పర్యాటక ప్రియుల్లో మీరు కూడా ఒకరైతే ఆంధ్రప్రదేశ్ లో మీరు తప్పకుండా సందర్శించవల్సిన అందమైన పర్యాటక ప్రదేశాలు కొన్ని మీకోసం ..

1. విశాఖపట్నం:

1. విశాఖపట్నం:

P.C: wikimedia.org

బహుశా ఆంధ్రప్రదేశ్లోని అత్యంత సుందరమైన తీర ప్రాంతాలలో ఒకటి విశాఖపట్నం. ప్రతి ప్రకృతి ప్రేమికుడు సందర్శించవలసిన ప్రదేశం ఇది. వైజాగ్ గా పిలవబడే ఈ నగరం ఆంధ్రప్రదేశ్ లోని బీచ్ డెస్టినేషన్ మాత్రమే కాదు, ఆహ్లాదకరమైన ప్రకృతి దృశ్యంతో ఉన్న భూమి. ఇక్కడ సరస్సులు, బీచ్ లు, గుహలు, లోయలు, పర్వత శ్రేణులు అన్నింటి సంమిళతం వల్ల ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నంను తప్పనిసరిగా సందర్శించవల్సిన ప్రదేశం అయినది. ప్రకృతి సౌందర్యంతో పాటుగా, వైజాగ్ నిర్మాణ శిల్పాలతో సుసంపన్నమై ఉంది, ఆధ్యాత్మిక కేంద్రాలు లేదా దేవాలయాలు నగరంలోని వాస్తుశిల్పకళలకు ఉత్తమ నమూనాలు. ఇంకా వైజాగ్ చుట్టు ప్రక్కల చూడదగినటువంటి ప్రదేశాలు ఆర్కే బీచ్, ఉదా పార్క్, విశాఖ మ్యూజియం, సబ్ మెరైన్ మ్యూజియం, భీముని పట్నం బీచ్, అరకు వ్యాలీ, బోరా గుహలు, ఇందిరాగాంథీ జువాలాజికల్ పార్క్, హిమ్మాచలం టెంపుల్, సూర్యదేవుని అరసవళ్లి టెంపుల్, బౌద్ద పుణ్యక్షేత్రాలు ప్రసిద్ది.

2. తిరుపతి :

2. తిరుపతి :

P.C: commons.wikimedia.org

ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి ఒక సుప్రసిద్ద ఆధ్యాత్మిక క్షేత్రంగా ఉంది. చిత్తూరు జిల్లాలో ప్రసిద్ది చెందిన హింధూ ఆధ్యాత్మిక దేవాలయానికి ప్రసిద్ది తిరుపతి. ఈ ప్రసిద్ద హిందూ దేవాలయంను ప్రతి సంవత్సరం కొన్ని మిలియన్ల మంది భక్తులు శ్రీ వెంకటేశ్వరుని దర్శనార్థం సందర్శిస్తుంటారు. దేవాలయంతో పాటు, తిరుపతి ఎర్రచందనపు బొమ్మలకు ప్రసిద్ది. అంతే కాదు, రాష్ట్రంలోనే ప్రధాన విద్యా కేంద్రంగా ఉంది. తిరుపతిలో మరికొన్నిచూడదగ్గ పర్యాటక ప్రదేశాలు అలమేలు మంగాపురం టెంపుల్, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్, కాణిపాకం, శ్రీ కాళహస్తి టెంపుల్, చంద్రగిరి కోట, హర్సిలీహిల్స్, శిలాతోరణం,టిటిడిసి వారి ఉద్యానవనాలు.

3. విజయవాడ:

3. విజయవాడ:

P.C: Etukuri Nagarjuna Babu

కృష్ణనది ఒడ్డున ఉన్న ఒక సుందరమైన ప్రదేశం విజయవాడ. విజయవాడ తియ్యటి మామిడి పండ్లు, రుచికరమైన స్వీట్స్ మరియు అందమైన వసంతకాలం పర్యాటకులను కట్టిపడేస్తుంది. దక్షణ భారత దేశంలోని అతి పెద్ద రైల్వే జంక్షన్ కలిగిన ఒక ముఖ్య పట్టణం, వారసత్వ భవనాలు, గుహలు, కొండలు వంటి సహజ సౌందర్యంతో అలరించే ప్రదేశం. తప్పక చూడవల్సిన ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి. విజయవాడలో చూడదగ్గ టూరిస్ట్ ప్రదేశాలు కొండపల్లి కోట, మొగలరాజాపురం గుహలు, కనకదుర్గ టెంపుల్, భవాని ద్వీపం, ప్రకాశం బారేజ్, ఉండవల్లి గుహలు, కూచిపూడి, మేరీస్ చర్చి, రాజీవ్ గాంధీ పార్క్, గాంధీ హిల్, హజరత్బల్ మసీదు, మంగళగిరి, మంగినాపూడి బీచ్.

4. నెల్లూరు:

4. నెల్లూరు:

P.C: commons.wikimedia.org

ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరు ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక మరియు మత వారసత్వం కలిగిన ప్రదేశం. చారిత్రాత్మక కేంద్రంగా ప్రాముఖ్యత ఉండటంతో నెల్లూరు ప్రసిద్ది చెందినది. అందుకు నిదర్శనాలు నెల్లూరులోని కళలు మరియు సాహిత్యానికి సంబంధించిన చరిత్రపూర్వకాలానికి సంబంధించిన సాక్ష్యాలు లభ్యం కావడమే. నెల్లూరులో లభ్యమయ్యే మైకా మరియు సున్నం , వ్యవసాయ పరంగా వరి పంటల ఉత్పత్తికి ఈనగరం ప్రసిద్ది చెందింది. ఇంకా ఈ నగరం ఆక్వాకల్చర్ కు ప్రసిద్ది. మలైకాజా, బొబ్బట్లు వంటి అద్భుతమైన స్వీట్స్ కు కూడా నెల్లూరు ప్రసిద్ది. అంతే కాదు నెల్లూరులో కొన్ని చూడదగ్గ ప్రదేశాలు కూడా ఉన్నాయి. అవి క్రిష్ణ మందిరం, పెంచల కోన, రంగత ఆలయం, పులికాట్ సరస్సు, జొన్నవాడ, ఉదయగిరి కోట, వెంకటి గిరి కోట, నల్ల పట్టు పంక్షుల సంరక్షణ కేంద్రం, శ్రీరంగనాథ స్వామి ఆలయం, మైపాడ్ బీచ్, బరా షహీద్ దర్గా, నరసింహస్వామి ఆలయం, రామలింగేశ్వర ఆలయం, రంగనాయక ఆలయం, సోమశిల.

5. అనంతపురం:

5. అనంతపురం:

P.C: Mefodiyz

ఆంధ్రప్రదేశ్ లో మరో , సాంస్కృతిక మరియు చారిత్రక కేంద్రంగా ఉన్నది. శ్రీ సత్య సాయి బాబా యొక్క జన్మస్థలంగా ప్రసిద్ది చెందిన ఈ అనంతపురం జిల్లాలో అనేక దేవాలయాలు కలవు. పుట్టపర్తి ఒక ఆధ్యాత్మిక అభ్యాసన కేంద్రంగా పేరుగాంచినది. ప్రముఖ సన్యాసి సత్యసాయి బాబా యొక్క నివాసం ఈ జిల్లాలో ఉండటం వల్ల ఈ స్థలం అత్యంత ప్రాచుర్యం పొందినది. ఈ ప్రదేశం చిత్రావతి నది ఒడ్డున కలదు. ఈ పర్యాటక ప్రదేశం చూట్టూ ప్రసిద్ద దేవాలయాలున్నాయి. పుట్టపర్తి శ్రీసత్యసాయిబాబా ఆధ్యాత్మిక ఆలయంతోపాటు, చూట్టూ ఉన్న ఇతర ప్రముఖ పర్యాటక ప్రదేశాలు కూడా పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. జిల్లా మొత్తం చేనేత పట్టుకు ప్రసిద్ది. విజయనగర రాజ్యం మరో ముఖ్యమైన భాగంగా ఉంది. ఈ విజయనగర రాజ్యం మతపరమైనదిగా నిర్మించడంతో దీని నిర్మాణశైలికి ఉదహారణలుగా చెప్పవచ్చు. ఈ జిల్లాలో చూడదగ్గ పర్యాటక ప్రదేశాలు పుట్టపర్తి, శ్రీ సత్యసాయి ప్రశాంత మందిరం, చైతన్య జ్యోతి మ్యూజియం, ప్రశాంత నిలయం, హిందుపురం, దర్మవరం, కదిరి, గుత్తి, తాడిపత్రి, లేపాక్షి, పెన్నా అహోబిళం, తిమ్మమ్మ మర్రిమాను, యోగివేమన సమాది, గుగుడు, యదికి గుహలు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X