Search
  • Follow NativePlanet
Share
» »ముంబై ఒక రోజులో చుట్టేదాం, మరిచిపోలేని అనుభూతులు మూట గట్టుకొందాం

ముంబై ఒక రోజులో చుట్టేదాం, మరిచిపోలేని అనుభూతులు మూట గట్టుకొందాం

ముంబైలో ఒక రోజు సమయంలో చూడదగిన పర్యాటక ప్రాంతాలకు సంబంధించిన కథనం.

భారత దేశంలో ఎన్నో పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. అందులో ముంబై మహానగరం కూడా ఒకటి. ఈ మహానగరంలో చూడదగిన పర్యాటక ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. ఈ పర్యాటక ప్రాంతాలన్నీ చూడాలంటే మనకు కనీసం నెల కూడా సరపోదు. అయితే వీకెండ్ కాని ఏదైనా వ్యాపరం, ఉద్యోగం పని పై కాని ముంబై వెళ్లి అక్కడ మీకు ఒక రోజు సమయం దొరికితే దగ్గర్లోని ప్రర్యాటక కేంద్రాలకు వెళ్లాలనుకోవడం సహజం. మీవంటి వారి కోసమే ఈ కథనం. ఒక రోజులో చూడదగిన ఐదు ముఖ్యమైన ప్రాంతాల్లో గేట్ వే ఆఫ్ ఇండియా, ఛత్రపతి శివాజీ టర్మినల్, హాజీ ఆలి దర్గా, ఎలిఫెంట్ ఐ ల్యాండ్, చోర్ బజార్ ముఖ్యమైనవి. ఈ ఐదు పర్యాటక ప్రాంతాలకు సంబంధించిన సమాచారం మీ కోసం...

గేట్ వే ఆఫ్ ఇండియా

గేట్ వే ఆఫ్ ఇండియా

P.C: You Tube

కింగ్ జార్జ్-5, క్వీన్ మేరి భారత దేశ సందర్శనానికి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని గేట్ వే ఆఫ్ ఇండియాను నిర్మించారు. అదే విధంగా భారత దేశాన్ని వందల ఏళ్లు పాలించిన తెల్లదొరల చివరి మిలటరీ ట్రూప్ ఇక్కడి నుంచి తమ దేశానికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ గేట్ వే ఆఫ్ ఇండియాను స్కాటిష్ ఆర్కిటెక్ జార్జ్ విటెట్ నిర్మించారు. ఈ గేట్ వే ఆఫ్ ఇండియాలో మనకు ఇండో ఇస్లామిక్, ఇండియన్, రోమన్ వాస్తు శైలి కన్పిస్తుంది. క్రీస్తుశకం 1911లో మొదలు పెట్టిన ఈ నిర్మాణం పూర్తి అయ్యింది మాత్రం క్రీస్తు శకం. 1914లో.

ఛత్రపతి శివాజీ టర్మినల్

ఛత్రపతి శివాజీ టర్మినల్

P.C: You Tube

భారత దేశంలో అత్యంత ప్రాచూర్యం పొందిన రైల్వే స్టేషన్ ఛత్రపతి శివాజీ టర్మినల్. ముంబైలో వన్ డే టూర్ ప్యాకేజీలో ఈ ఛత్రపతి శివాజీ టర్మినల్ తప్పక ఉంటుంది. ముఖ్యంగా ముంబై ఆ కాలంలో ఎలా ఉండేది, అప్పటి నుంచి ఇప్పటికి వచ్చిన మార్పులను మనం ఇక్కడ చూడవచ్చు. యునెస్కో వారి సంరక్షించబడుతున్న ప్రాంతాల జాబితాలో ఛత్రపతి శివాజీ టర్మినల్ చోటు సంపాదించుకుంది.

హాజీ ఆలి దర్గా

హాజీ ఆలి దర్గా

P.C: You Tube

ముంబైలో ఉన్న ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో హాజీ ఆలి దర్గా కూడా ఒకటి. ప్రస్తుత ఉబ్జెకిస్తాన్ నుంచి ప్రపంచ యాత్రకు బయలుదేరిన సయ్యద్ పీర్ జాజి ఆలి షా బుర్కీ ఇక్కడ చాలా కాలం పాటు ఉన్నట్లు చెబుతారు. ఆయన సంస్మరణార్థం చాలా మంది ఈ హాజీ ఆలి దర్గాను సందర్శిస్తూ ఉంటారు. సముద్రం అలల తాకిడి తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఈ దర్గాను సందర్శించడానికి వీలవుతుంది.

ఎలిఫెంట్ ఐల్యాండ్

ఎలిఫెంట్ ఐల్యాండ్

P.C: You Tube

ముంబై హార్బర్ కు చాలా దగ్గరగా ఉన్న ఎలిఫెంట్ ఐల్యాండ్ మరో ప్రముఖ పర్యాటక కేంద్రం గేట్ వే ఆఫ్ ఇండియా నుంచి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఎలిఫెంటా గుహలు ప్రపంచ ప్రఖ్యాతి చెందినవి. ఇవి గుహాలయాలు. కొండను తొలిచి వీటిని నిర్మించారు. ఇందులో రెండు బౌద్ధ మతానికి చెందినవి కాగా, మిగిలిన మూడు హిందూ మతానికి చెందిన దేవుళ్లు ఉంటారు. ఈ ఐల్యాండ్ లో రాత్రి పూట ఉండటానికి అవకాశం లేదు. ఈ గుహలో శిల్పకళ అద్భుతంగా ఉంటుంది.

చోర్ బజార్

చోర్ బజార్

P.C: You Tube

ఈ చోర్ బజార్ కు దాదాపు 150 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ ప్రాంతానికి చోర్ బజార్ అన్న పేరు రావడం వెనుక చిన్న కథను స్థానికులు చెబుతారు. క్వీన్ విక్టోరియా భారత దేశానికి వచ్చే ఓడలో ఆమెకు సంబంధిచిన కొన్ని వస్తువులు దొంగలించబడ్డాయి. తిరిగి అవి ఈ ప్రాంతంలో వేరొకరికి అమ్మే సమయంలో కనుగొన్నారు. ఈ మధ్యలో ఆ వస్తువులు చాలా చేతులు మారాయి. అందువల్లే ఈ ప్రాంతానికి చోర్ బజార్ అని పేరు వచ్చింది. ఇక్కడ పురాతన కళాఖండాల నుంచి మొదలుకొని చిన్ని చిన్న సూదుల వరకూ అన్న వస్తువులు చాలా తక్కువ రేటుకు దొరుకుతాయి. ఇందులో చాలా వరకూ ఇతరుల నుంచి దొంగలించిన వస్తువులే అని చెబుతారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X