• Follow NativePlanet
Share
» »హంపి పట్టణం గురించి తెలుసుకోవాల్సిన 6 విషయాలు !

హంపి పట్టణం గురించి తెలుసుకోవాల్సిన 6 విషయాలు !

Posted By: Vamsiram Chavali

హంపి, విజయనగర మహారాజ సామ్రాజ్యం లో కేంద్రబిందువైన ప్రాచీన నగరం.ఇది నగరమంతా విస్తరించి ఉన్న అధ్భుతమైన స్మారక కట్టడాల సముహానికి, ప్రపంచవంతంగా ప్రసిద్ధి చెందింది.ఈ స్మారక కట్టడాల యొక్క నిర్మాణ లాఘవం ఎంత గొప్పదంటే, యునెస్కో ప్రపంచ చారిత్రాత్మక స్థలంగా దీన్ని ప్రకటించారు. అందుకే హంపి, ఆధ్యాత్మికంగా మరియు చారిత్రకంగా కూడా కర్ణాటక యొక్క ప్రముఖ యాత్రా స్థలం. అనేక గుళ్ళ సముదాయాలు, స్తంభాల మందిరాలు,మండపాలతో నిండిన హంపి,చరిత్ర అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి కన్నుల విందే.హంపి లో కేవలం సందర్శక ప్రదేశాలే కాకుండా ఇంకా చాలనే ఉన్నాయి చెయ్యడానికి. వాటిల్లో కొన్ని ఇక్కడ కింద చదవండి.

గుళ్ళు తిరగడం

గుళ్ళు తిరగడం

హంపిలో బహుశ అందరూ చేసే మొదటి పని, అధ్భుతమైన గుళ్ళు అన్నిటిని చూడటం. పురాతన పుణ్యక్షేత్రం కావడం వల్లన విరూపాక్ష గుడి ఒక అందమైన కళాఖండం.అందువలన దీనిని ఏడాది అంతా పర్యాటకులు మరియు యాత్రికులు సందర్శిసూ ఉంటారు. మీరు చూడల్సిన మిగతా గుళ్ళలో కృష్ణ గుడి, అచ్యుతరాయ గుడి మరియు దాని సంత స్థలం, విఠ్ఠల గుడి ఇంకా కొండ మీద ఉన్న హేమకుట కట్టడం ముఖ్యమైనవి.

PC: Hawinprinto

గుట్టలు ఎక్కడం

గుట్టలు ఎక్కడం

హంపి ఎన్నోలెక్కలేనన్ని కొండలకి, గుట్టలకి నిలయం కాబట్టి, కొండలు , గుట్టలు ఎక్కడానికి ఇది అధ్భుతమైన ప్రదేశం.కొన్ని స్థానిక సేవా సిబ్బంధులు, భద్రతా కొలమానాలతో గుట్టలు మరియు కొండలు ఎక్కడానికి సౌకర్యాలు కలిగిస్తారు. ఇంకెందుకు ఆలస్యం, మీలో అణచిపెట్టి ఉన్న అడ్రినాలిన్ బయటకు తీసి ఇలాంటి ఒక సాహసాన్ని ప్రయత్నించండి.

PC: Unknown

విరుపాపూర్ గడ్డి దగ్గర హిప్పీ జీవన శైలి గడపండి

విరుపాపూర్ గడ్డి దగ్గర హిప్పీ జీవన శైలి గడపండి

హిప్పీ ద్వీపం అని ప్రేమగా పిలవబడే విరుపాపూర్ గడ్డి ,హంపీ కి కొన్ని కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. విదేశీ యాత్రికుల రాకపోకలతో మరియు దాని నిర్మలమైన అందంతో ఈ ప్రదేశం అందరి ద్రుష్టిని ఆకట్టుకొంది. హంపీ నుంచి ఈ హిప్పీ ప్రదేశం చేరుకొవడానికి పట్టణం మధ్య నుంచి తెప్పలో నదిని దాటాలి.

PC: Joseph Jayanth

అందమైన సనపుర్ సరస్సు దగ్గర సేద తీరండి

అందమైన సనపుర్ సరస్సు దగ్గర సేద తీరండి

హంపి కి 7 కిమీ ల దూరం లో ఉండే ఇది సాధారణంగా ఎక్కువ మందికి తెలియని ప్రదేశం.ఈ మెరిసే సరస్సు పెద్ద గుట్టల పక్కన నెలకొని ఉంది.అక్కడ నుంచి కొండ మీద నుంచి దూకే సదుపాయం కూడా కలదు.తెప్ప లో ఈ ప్రశాంతం గా విహరిస్తూ సనపుర్ సరస్సు అందాన్ని ఆస్వాదించండి లేదా సరస్సు తీరాన సేద తీరండి.

PC: Pranet

హంపీ బజార్ లో షాపింగ్ చేయండి

హంపీ బజార్ లో షాపింగ్ చేయండి

విజయనగర సామ్రాజ్య సమయం లో హంపీ బజార్ ఒక ముఖ్యమైన మార్కెట్ స్థలం గా ఉండేది.ఇప్పుడు ఆ మార్కెట్ కి పూర్వపు వైభవం లేనప్పటికీ, ఇంకా కొన్ని పురాతన వస్తువులు అమ్మే మార్కెట్ గా కొనసాగుతుంది. వివిధ దేశాల నుంచి హిప్పీ జనలా ఆకర్షణ పెరగడం వలన వివిధ ఉల్లసకరమైన, ప్రాచీనమైన ఆభరణాలు మరియు కళాఖండాలు ఇక్కడ మీకు దొరుకుతాయి.నాణాలు, అరుదైన నగలు, మట్టి వస్తువులు తదితరమైనవి కొనుగోలు చేయండి.

PC: Bkmanoj

హేమకుట కొండ వద్ద సూర్యాస్తమయాన్ని చూడండి

హేమకుట కొండ వద్ద సూర్యాస్తమయాన్ని చూడండి

హేమకుట కొండ ఒక ఎత్తైన ప్రదేశంలో ఉన్న విగ్రహాల నిధి.ఈ విగ్రహాలన్ని విజయనగర నిర్మాణ శైలి లో కాకుండా వేరే విధంగా కట్టబడటంచే జైన్ మందిరలు అనుకొని పొరపడతారు.
ఈ కొండ మీద షుమారు 50 విగ్రహాలు,గుళ్ళు, గ్యాలరీలు ఉన్నాయి.ఇవి విజయనగర పరిపాలన కంటే ముందే కట్టబడ్డాయి. కొండ మీదకు నడిచి వెళ్ళి అధ్భుతమైన సూర్యాస్తమయం మరియు హంపీ యొక్క విస్త్రుత దృశ్యాన్ని వీక్షించండి.

PC: Ashwin Kumar

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి