» »నాలుగు ముఖద్వారాలున్న ఆలయం ఏదో తెలుసా?

నాలుగు ముఖద్వారాలున్న ఆలయం ఏదో తెలుసా?

Posted By: Venkata Karunasri Nalluru

మధుర మీనాక్షి అమ్మవారి ఆలయం చెన్నై నుండి సుమారు 400 కి.మీ ల దూరంలో వుంది. తమిళనాడులోని మదురై పట్టణం పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది మీనాక్షి దేవాలయం. మీనాక్షి దేవాలయం మదురై లో కల వేగాయి నది ఒడ్డున కలదు. మదురై పట్టణం తమిళనాడులో రెండవ పెద్ద పట్టణం. తమిళనాడు రాష్ట్ర సంస్కృతి, కళలు, సాంప్రదాయ వారసత్వాలు మొదలైనవాటికి నిలయంగా వుంటుంది. ప్రపంచంలోని అతి పురాతన నగరాలలో ఒకటైన మదురై అనేక రాజ వంశాల పాలనలు చూసింది. చోళులు, పాండ్యులు, విజయనగర రాజులు, బ్రిటిష్ పాలకులు ఎంతో మంది ఈ నగరాన్ని అభివృద్ధి పరచారు. అనేక స్మారకాలు, దేవాలయాలు తమ తమ కళాభిరుచులకు తగినట్లు నిర్మించారు. ఈ పట్టణం అనేక చారిత్రక కధలు కలిగి ఎంతో ప్రాధాన్యత సంతరించుకొన్నది. భారత దేశ సంస్కృతి, కళలు, ఆధ్యాత్మికతలలో ప్రధాన పాత్ర వహించే నగరాలలో మదురై పట్టణం ఒకటి. ఇంతటి గొప్పదైన మదురై పట్టణం లోని కొన్నిపర్యాటక ఆకర్షణలు పరిశీలించండి.

అలగిర్ కోవిల్ అలగిర్ కోవిల్ అనే ఈ దేవాలయం నగరానికి సుమారు 20 కి. మీ. ల దూరంలో కలదు. మదురై లో తప్పక చూడవలసిన ప్రదేశాలలో ఇది ఒకటి. ఎత్తైన గోపురాలు అనేక ప్రేమ మరియు మానవతల దృశ్యాల శిల్పాలు కలిగి ఆకర్షణీయంగా వుంటాయి. కళలకు సంస్కృతికి ఇవి నిదర్శనంగా నిలుస్తాయి. ఈ టెంపుల్ యొక్క ప్రధాన గోపురం ఎల్లపుడూ మూసి వుంచి, సంవత్సరానికి ఒక సారి తెరుస్తారు. ప్రవేశ ద్వారాన్ని మాత్రమే భక్తులు పూజిస్తారు.

మమతానురాగాల మధుర మీనాక్షి !

1. మధుర మీనాక్షి దర్శనం

1. మధుర మీనాక్షి దర్శనం

ఎపుడైనా సరే మధుర మీనాక్షి భక్తులకు సంవత్సరంలో ఎపుడైనా సరే కొదవ లేదు. సంవత్సరం పొడవునా దర్శనానికి వస్తూనే వుంటారు.

PC: Wiki Commons

2. ఇక్కడ చూడవలసినవి

2. ఇక్కడ చూడవలసినవి

మీనాక్షి టెంపుల్ మాత్రమే కాక, మధురైలో మీకు ఇతర ఆకర్షణలు కూడా కలవు. తిరుమల నాయకర్ పాలస్ చూడటం , బోటు షికారు, వంటివి చేయవచ్చు. టెంపుల్ బయట కల షాపులలో కొయ్య బొమ్మలు, వెదురు బుట్టలు వంటివి పసుపు కుంకుమలు మొదలైనవి కొనుగోలు చేయవచ్చు. మదురై పట్టు చీరలకు ప్రసిద్ధి. తప్పక కొనుగోలు చేయండి.

PC: J'ram DJ

3. మధురై ప్రదేశం

3. మధురై ప్రదేశం

మధురై ప్రదేశం ...ప్రసిద్ధ ఇడ్లీల ప్రదేశం. కనుక ఎక్కడ పడితే అక్కడ చివరకు టెంపుల్ చుట్టూ కూడా మీకు మంచి మెత్తటి, తెల్లటి ఇడ్లీలు రుచికరమైనవే దొరుకుతాయి.

PC: Wiki Commons

4. వసతి సౌకర్యాలు

4. వసతి సౌకర్యాలు

మీరు వసతి పొందాలంటే, టెంపుల్ సమీపంలోని వసతులు పొందవచ్చు. ఒక మాదిరి నుండి చవకగా లభిస్తాయి. లేట్ నైట్ వాకింగ్ కూడా సురక్షితమే. లక్సరీ హోటళ్ళు కూడా కలవు. అయితే అవి టెంపుల్ సమీపంలో లేవు.

5. మధురై ఎలా చేరాలి ?

5. మధురై ఎలా చేరాలి ?

మధురై నగరం చేరేందుకు ప్రతి నిత్యం విమానాలు చెన్నై మరియు ముంబై ల నుండి నడుస్తాయి. చెన్నై నుండి అనేక బస్సు లు కలవు. పాండ్యన్ ఎక్స్ప్రెస్స్ రైలు చెన్నై లో రాత్రి 9.20 కి బయలు దేరి ఉదయం 6.20 గం. లకు చేరుతుంది.

PC: Wiki Commons

6. రంగుల పెయింటింగ్ లు

6. రంగుల పెయింటింగ్ లు

ఇక్కడ గోడలకు కల రంగుల చిత్రాలు 17 వ శతాబ్దం నాటివి. తప్పక విజిటర్ లను ఆకర్షిస్తాయి.

7. అందమైన చెక్కడాలు

7. అందమైన చెక్కడాలు

ఈ అందమైన చెక్కడాలు ఈ ప్రదేశ అందాలను పవిత్రతను మరింత అధికం చేస్తాయి.

8. గోడలపై డిజైన్ లు, నగిషీ చెక్కడాలు

8. గోడలపై డిజైన్ లు, నగిషీ చెక్కడాలు

ఆలయ గోడలపై పురాతన టెంపుల్స్ శైలిలో వివిధ రకాల అందమైన చెక్కడాలు మంచి పని తనంతో కనపడతాయి.

9. పూజలు ప్రసాదాలు

9. పూజలు ప్రసాదాలు

ఈ దేవాలయంలో రోజంతా వివిధ రకాల పూజలు నిర్వహిస్తారు. దేవుళ్ళ ను కొలుస్తూ ఆరుగురు పాటలు పాడతారు. ప్రతి శుక్రవారం సాయంకాలం, మాత విగ్రహాన్ని ఒక కొయ్య గుర్రంపై టెంపుల్ చుట్టూ కల వీధులలో ఊరేగిస్తారు.

10. వేయి స్తంభాల విశ్వసనీయత

10. వేయి స్తంభాల విశ్వసనీయత

మాత మీనాక్షి ఆశీస్సులుపొందేందుకు ప్రతి ఒక్కరూ ఈ వేయి స్తంభాల హాలు గుండా వెళ్ళాల్సిందే. (వాస్తవానికి 985 స్తంభాలు మాత్రమే కలవు) దోవలో మీకు పూవుల నుండి బంగారు ఆభరణాలు అమ్మే షాపుల వరకూ కనపడతాయి.

11. గణేషుడి ఆశీస్సులు

11. గణేషుడి ఆశీస్సులు

ఇక్కడ కల ఏనుగుకు పండ్లు సమర్పించి గనేషుడి ఆశీర్వాదం పొందటం మరువకండి.

PC: Wiki Commons

12.మాత వివాహం

12.మాత వివాహం

మీనాక్షి , సుందరేస్వరుల వివాహం ఈ గుడిలో వూరు అంతా వ్యాపించి వైభవోపేతంగా జరిగినట్లు చూపబడుతుంది.

PC: Wiki Commons

13. నాట్యం చేసే నటరాజ్

13. నాట్యం చేసే నటరాజ్

ఇక్కడి టెంపుల్ మ్యూజియం లో కల నాట్య నటరాజ విగ్రహం ఒక ప్రత్యేకత. ఇతర టెంపుల్స్ లోని ఎడమ కాలు పైకి ఎత్తి నాట్యం చేయకుండా కుడి కాలు పైకి ఎత్తి నాట్యం చేయటం కనపడుతుంది.

PC: Wiki Commons

14. బంగారు కొలను

14. బంగారు కొలను

ఒకప్పుడు ఈ బంగారు కొలను ప్రదేశం అంటే సుమారు 1500 సంవత్సరాల కిందట ,సంగం కవులు తరచుగా కలసి చర్చించే ప్రదేశం గా వుడేది. అయితే, నేడు ఈ ప్రదేశం అలసి సొలసిన భక్తులకు సేద దీరే ప్రాంతంగా మారింది.

PC: Wiki Commons

15. దేవాలయ భక్తులు

15. దేవాలయ భక్తులు

ప్రతి నిత్యం ఈ దేవాలయానికి సుమారు పదిహేను వేల మంది భక్తుల వరకూ వస్తారు. అమ్మవారికి ప్రీతీ కరమైన శుక్రవారాలు ఈ సంఖ్య ఇరవై అయిదు వేల వరకూ కూడా చేరుతుంది. ఈ దేవాలయాన్ని కొత్తగా గుర్తించబడే ప్రపంచ ఏడు వింతలలో ఒకటిగా నియామకం చేసారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ , మే నెలల లో జరిగే ఉత్సవాలకు భక్తుల సంఖ్య ఒక మిలియన్ అంటే పది లక్షల వరకు చేరుతుంది.

PC: Wiki Commons

16. అధిష్టాన దైవం

16. అధిష్టాన దైవం

ఈ ప్రదేశంలో శివుడు కాదు. సాధారణంగా దక్షిణ ఇండియాలో కల దేవాలయాలలో శివుడు ప్రధాన దైవంగా ఉంటాడు. కాని ఈ గుడి లో మాత్రం ప్రధాన దేవతగా మాత మీనాక్షి పూజించబడుతుంది

PC: Wiki Commons

17. మధురకు ఆ పేరు ఎలా వచ్చింది ?

17. మధురకు ఆ పేరు ఎలా వచ్చింది ?

అమృతంగా చెప్పబడే తేనె శివుడి జటా జూటం వెంట్రుకల నుండి ప్రవహిస్తున్నపుడు, ఈ పట్టణానికి మదురై అనే పేరు వచ్చింది. ఒకప్పుడు ఈ నగరం స్థానంలో ఒక అడవి ఉండేదని, ఆ అడవిలో ఇంద్రుడు ఒక కదంబం చెట్టు కింద శివ లింగం పెట్టి అర్చిస్తుండగా, అది చూసిన ఆ ప్రాంత రాజు ఆ శివ లింగానికి ఒక గుడి కట్టించాడని, కాల క్రమేనా ఆ గుడి చుట్టూ మదురై పట్టణం ఏర్పడినదని చరిత్ర చెపుతుంది. నేటికీ ఆ నాటి కదంబం చెట్టు కాండం ఇక్కడ చూడవచ్చు.

PC: Wiki Commons

18. మీనాక్షి దేవత అసలు ఎవరు ?

18. మీనాక్షి దేవత అసలు ఎవరు ?

మీనాక్షి మాత, రాజు మలయద్వాజ పాండ్య కుమార్తె. ఆమె ఒక యజ్ఞం చేయగా అగ్ని నుండి ఆవిర్భవించినది. ఆమె పుట్టినప్పుడు మూడు స్థనాలు కలిగి వుందని, అందుకు రాజు చిన్తిన్చ గా ఆమెకు వివాహం అయిన వెంటనే, మూడవ స్థనము మాయం అవుతుందని ఆకాశవాణి పేర్కొని, ఆమెను ఒక యువ రాణి వలే కాక, ఒక రాజ కుమారుడిగా పెంచవలసినది గా కోరింది. ఆ రకంగా మాత మీనాక్షి యుద్ధ విద్యలు నేర్ప బడి పట్టాభిషేకం చేయబడి రాజ్యం అప్పగించబడినది. ఆమె అనేక యద్ధాలు గెలిచింది. చివరకు శివుడితో యుద్ధానికి సనద్ధమై, యుద్ధ భూమిలో ఆయనే తన భర్తగా గుర్తించినది.

PC: Wiki Commons

19.ఎత్తైన గోపురాలు

19.ఎత్తైన గోపురాలు

ఈ టెంపుల్ గురించి పురాతన తమిళ సాహిత్యంలో కూడా పేర్కొన్నారు. అయితే, ప్రస్తుత టెంపుల్ మాత్రం క్రీ. శ. 1623 - 1655 ల మధ్య నిర్మించబడి నట్లు చరిత్ర చెపుతోంది. ఈ దేవాలయానికి 14 గోపురాలు కలవు. ఇవి సుమారుగా 45 - 50 మీటర్ల ఎత్తులో వుంటాయి.

PC: Wiki Commons

20.ప్రధాన దేవత మీనాక్షి అమ్మవారు

20.ప్రధాన దేవత మీనాక్షి అమ్మవారు

ఈ దేవాలయంలో ప్రధాన దేవత మీనాక్షి అమ్మవారు. ఈమెను పార్వతి అవతారంగాను ఈమె సహచరుడైన సుందరేస్వరుడిని శివుడిగాను కొలుస్తారు. సుమారు 2,500 సంవత్సరాల కిందటిదిగా చెప్పబడే మదురై పట్టణానికి ఈ దేవాలయం ప్రధానమైనది.

PC: Wiki Commons