Search
  • Follow NativePlanet
Share
» »తమిళనాడులోని అందమైన బీచ్ లలో జలకాలటలే కాదు మరెన్నో

తమిళనాడులోని అందమైన బీచ్ లలో జలకాలటలే కాదు మరెన్నో

తమిళనాడులోని బీచ్ ల గురించి కథనం.

భారత దేశంలో సముద్ర తీర ప్రాంతం కలిగిన రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఒకటి. తీర ప్రాంతమన్న తక్షణం మనకు బీచ్ లే గుర్తుకు వస్తాయి. ఇక బీచ్ లు అంటే సముద్ర అలలతో పోటీ పడుతూ జలకాలడటం, ఇసుక తిన్నెలు ఇవే గుర్తుకు వస్తాయి. అయితే తమిళనాడులోని కొన్ని బీచ్ లు ఇందుకు కాస్త భిన్నంగా ఉంటాయి. ఈ జలకాలటలతో పాటు పురాణ ప్రాధాన్యత కలిగినవి కూడా ఉన్నాయి. అందుకు ఉదాహరణ రామేశ్వరం, ధనుష్కోటి బీచ్ లే. అదే విధంగా తమిళనాడులోని మహాబలిపురం బీచ్ భారతీయ చరిత్రకు సజీవ సాక్షి అని చెపవచ్చు. ఈ నేపథ్యంలో తమిళనాడులోని అతిముఖ్యమైన బీచ్ ల గురించి క్లుప్త సమాచారం మీ కోసం. ఇందులో కోవలం బీచ్, మెరీనా బీచ్, కన్యాకుమారీ బీచ్, ఎల్లోటీ బీచ్ తదితరాలు ఉన్నాయి.

మహాబలిపురం బీచ్

మహాబలిపురం బీచ్

P.C: YouTube

మహాబలిపురం చెన్నై నుండి 57 కిలోమీటర్ల దూరంలో ఉటుంది. అదే విధంగా కాంచీపురం నుండి 65 కిలోమీటర్లు, పాండిచేరి నుండి 96 కిలోమీటర్లు, మదురై నుండి 420 కిలోమీటర్లు మరియు త్రిచి నుండి 290 కిలోమీటర్లు ఉంటుంది. మహాబలిపురంలో చారిత్రాత్మక కట్టడాలకు చాలా ప్రఖ్యాతి గాంచింది. ఇక్కడ ఉన్న షోర్ టెంపుల్ లో పాటు మరెన్నో చూడదగిన ప్రాంతాలు ఉన్నాయి. అవన్నీ చూసిన తర్వాత ఇక్కడి సముద్రపు బీచ్ లో జలకాలడటానికి పిల్లలతో పాటు పెద్దలు కూడా ఉత్సాహం చూపుతారు.

కోవాలం బీచ్

కోవాలం బీచ్

P.C: YouTube

కోవలాంగ్ లేదా కోవలం బీచ్ మహాబలిపురం మార్గంలో తూర్పు తీర రోడ్ లో ఉంది. కోవాలం బీచ్ రాష్ట్రంలో అత్యంత ప్రశాంతమైన బీచ్ లలో ఒకటి. ఇక్కడ ఫిషింగ్ ప్రధాన ఆకర్షణ. ఇక్కడ సర్ఫింగ్ చేయడానికి కూడా అవకాశం ఉంది. అంతేకాకుండా బోటింగ్, డైవింగ్ వంటి ఎన్నో జలక్రీడలు ఆడవచ్చు. అయితే దగ్గర నిపుణులు ఉండటం మంచిది.

మెరీనా బీచ్

మెరీనా బీచ్

P.C: YouTube

ఇది పట్టణ బీచ్. అంటే పట్టణం నడిబొడ్డున ఉంటుంది. తమిళనాడు రాజధాని చెన్నైలో 13 కిలోమీటర్ల పొడవైన ఈ బీచ్ ప్రపంచంలోనే రెండవ పొడవైన పట్టణ బీచ్. తీర ప్రాంతం చుట్టూ ఉన్న ఈత చెట్ల సందుల్లో నుంచి సూర్యోదయం, సూర్యాస్తమయం చూడటానికి చాలా బాగుంటుంది. చెన్నైలోని ఈ బీచ్ లో స్ట్రీట్ ఫుడ్ కు కూడా చాలా ఫేమస్. జలక్రీడలకు అంతఅనువైన బీచ్ కాదు.

కన్యాకుమారి బీచ్

కన్యాకుమారి బీచ్

P.C: YouTube

కన్యాకుమారిలోని ఈ బీచ్ ఈత కొట్టడానికి అనువైనది కాదు. ఎందుకంటే ఈ బీచ్ లో రాళ్లు మొనతేలి ఉంటాయి. అందువల్లే ఇక్కడ జలక్రీడలు కూడా నిశిద్ధం. అయితే ఇక్కడ సూర్యోదయం, సూర్యాస్తమయం చూసి తీరాల్సిందే. ఈ ప్రకృతి రమణీయతను చూడటానికే ప్రంపంచంలోని వివిధ దేశాల నుంచి పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు.

రామేశ్వరం బీచ్

రామేశ్వరం బీచ్

P.C: YouTube

రామేశ్వరం హిందువుల అతి పవిత్రమైన పుణ్యక్షేత్రం. సముద్ర తీర ప్రాంతంలోని ఈ పుణ్యక్షేత్ర దర్శనం తర్వాత పెద్దవారు కూడా తమ వయస్సును మరిచిపోయి ఇక్కడ ఉన్న సముద్ర అలలతో పోటీ పడి ఈత కొట్టాలనుకొంటారు. ఇక్కడ నీరు చాలా స్వచ్ఛంగా ఉండటమే ఇందుకు కారణం. అక్కడ ఉన్న బ్రిడ్జ్ కూడా ప్రత్యేక ఆకర్షణ.

ఎల్లోటి బీచ్

ఎల్లోటి బీచ్

P.C: YouTube

చెన్నై కు దక్షిణాన ఈ బీచ్ అత్యంత స్వచ్ఛమైన బీచ్ గా పేరుగాంచింది. అందువల్ల ఇక్కడ ఈత సరదాను తీర్చుకోవచ్చు. ప్రకృతితో మమేకం కావాలనుకొనేవారికి ఈ బీచ్ మంచి ఎంపిక. ఇక్కడ సూర్యోదయాలు, సూర్యాస్తమయాల అందాలు చూడాల్సిందే కాని వర్ణించడానికి మాటలు చాలవు. అందువల్లే వారాంతాల్లో చాలా మంది ఇక్కడికి వస్తుంటారు.

ధనుష్కోటి బీచ్

ధనుష్కోటి బీచ్

P.C: YouTube

ధనుష్కోటి గురించిన ప్రస్తావన భారతదేశ పురాణాల్లో కూడా మనకు కనిపిస్తుంది. శ్రీరాముడు ఇక్కడి నుంచే రామసేతు నిర్మాణం మొదలుపెట్టాడని చెబుతారు. దీనినే ప్రస్తుతం అడమ్స్ బ్రిడ్జిగా పేర్కొంటున్నారు. పురాణ ప్రధాన్యతతో పాటు ప్రకృతి రమణీయతకు కూడా ఈ బీచ్ చాలా ప్రాముఖ్యం చెందినది. అందువల్లే ఈ బీచ్ ను ఎక్కువ మంది సందర్శిస్తూ ఉంటారు. ఇక్కడ నీరు చాలా స్వచ్ఛంగా ఉండటం వల్ల నీటి లోపల ఉన్న పగడపు దిబ్బలు కూడా కనిపిస్తాయి. ఇక్కడ అరేబియా సముద్రం, బంగాళాఖాతంతో కలిసే ప్రదేశాలను కూడా మనం చూడవచ్చు.

ధనుష్కోటి బీచ్

ధనుష్కోటి బీచ్

P.C: YouTube

ధనుష్కోటి గురించిన ప్రస్తావన భారతదేశ పురాణాల్లో కూడా మనకు కనిపిస్తుంది. శ్రీరాముడు ఇక్కడి నుంచే రామసేతు నిర్మాణం మొదలుపెట్టాడని చెబుతారు. దీనినే ప్రస్తుతం అడమ్స్ బ్రిడ్జిగా పేర్కొంటున్నారు. పురాణ ప్రధాన్యతతో పాటు ప్రకృతి రమణీయతకు కూడా ఈ బీచ్ చాలా ప్రాముఖ్యం చెందినది. అందువల్లే ఈ బీచ్ ను ఎక్కువ మంది సందర్శిస్తూ ఉంటారు. ఇక్కడ నీరు చాలా స్వచ్ఛంగా ఉండటం వల్ల నీటి లోపల ఉన్న పగడపు దిబ్బలు కూడా కనిపిస్తాయి. ఇక్కడ అరేబియా సముద్రం, బంగాళాఖాతంతో కలిసే ప్రదేశాలను కూడా మనం చూడవచ్చు.

ముట్టుకాడు బీచ్

ముట్టుకాడు బీచ్

P.C: YouTube

చెన్నైకు దగ్గరగా ఉన్న పట్టణమే ముట్టుకాడు బీచ్. ఇక్కడి సముద్రతీర ప్రాంతాన్నే ముట్టుకాడు బీచ్ అని అంటారు. ఇక్కడ నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. వారాంతాల్లో సేదతీరడానికి ఇది అత్యంత అనువైన ప్రాంతం. ఇక్కడికి ప్రేమికులు ఎక్కువగా వస్తుంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X