• Follow NativePlanet
Share
» »త్రిభుజాకార లింగ దర్శనానికి మరో ఆరునెలలు మాత్రమే అవకాశం

త్రిభుజాకార లింగ దర్శనానికి మరో ఆరునెలలు మాత్రమే అవకాశం

Written By: Kishore

చార్ ధామ్ క్షేత్రాల్లో ఒకటైన కేదర్నాథ్ హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాల్లో కేదర్నాథ్ కూడా ఒకటి. మిగిలిన పుణ్యక్షేత్రాల్లో మాదిరిగా ఈ దేవాలయం ఏడాది మొత్తం భక్తులకు అందుబాటులో ఉండదు. ఇందుకు అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులే కారణం. కేవలం వేసవి కాలంలో మాత్రమే ఈ పుణ్యక్షేత్రంలోని శివుడిని దర్శనం చేసుకోవడానికి భక్తులకు అనుమతిస్తారు. ఈ నేపథ్యంలో గత నెల అంటే ఏప్రిల్ 29 నుంచి ఈ దేవాలయంలోనికి భక్తులకు అనుమతిస్తున్నారు. మరో అరు నెలలు అంటే అక్టోబర్ చివరి వరకూ మాత్రమే ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి అనుమతి లభిస్తుంది. అయితే ఈ సమయం అన్నది స్థానిక వాతావరణ పరిస్థితుల పై ఆధారపడి ఉంటుంది. మొత్తంగా  ఇప్పుడు దర్శనం చేసుకోకపోతే  మరో ఆరునెలలు వేచి ఉండక తప్పదు. ఈ నేపథ్యంలో ఈ కేదర్నాథ్ పుణ్యక్షేత్రం విశేషాలతో పాటు మొదటిసారి అందుబాటులోకి వచ్చిన లేజర్ షో వివరాలు మీ కోసం...

రూ.10వేలుకే ఈ 'మే' పర్యాటకం మీ సొంతం

1. ఎక్కడ ఉంది

1. ఎక్కడ ఉంది

Image Source:

కేదర్నాథ్ ఉత్తరఖండ్ లోని మందాకిని నదికి దగ్గరగా సముద్రమట్టానికి దాదాపు 11,775 అడుగుల ఎత్తులో కేదర్నథ్ దేవాలయం ఉంది. ఇక్కడ రోడ్డు మార్గం సరిగా లేదు. అందువల్ల ఈ పుణ్యక్షేత్రానికి దగ్గర్లోని గౌరికుండ్ వరకూ వాహనాల్లో వెళ్లి అక్కడి నుంచి దాదాపు 18 కిలోమీటర్లు కాలినడకన వెలితే ఈ క్షేత్రానికి చేరుకొంటాం. నడవలేని వారికి డోలి సౌకర్యం ఉంది.

2. ఆరు నెలలు గుప్త కాశీలో

2. ఆరు నెలలు గుప్త కాశీలో

Image Source:

ఇక్కడ తీవ్రమైన చలి గాలులు వీస్తాయి. ఒక్కొక్కసారి ఉష్ణోగ్రతలు మైనస్ 20 డిగ్రీలకు చేరుకుంటుంది. అందువల్ల చలికాలంలో అంటే నవంబర్ నుంచి ఏప్రిల్ మధ్య కాలంలో కేదర్నాథ్ దేవాలయాన్ని మూసివేస్తారు. ఉత్సవ విగ్రహాలను దగ్గర్లోని గుప్తకాశికి మార్చి అక్కడే పూజాది కార్యక్రమాలను నిర్వహిస్తారు.

3. ప్రస్తుతం దర్శన సమయం

3. ప్రస్తుతం దర్శన సమయం

Image Source:

ఈ ఏడాది వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ భక్తులను దైవ దర్శనానికి అనుమతిస్తారు. అటు పై ఐదు గంటల వరకూ విశేష పూజ ఉంటుంది. ఇందుకు అతి కొద్ది మందికి మాత్రమే అనుమతి. అటు పై ఐదు గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకూ దర్శనానికి అనుమతి.

4. మొదటి సారిగా లేజర్ షో

4. మొదటి సారిగా లేజర్ షో

Image Source:

ఈ దేవాలయంలో మొదటిసారిగా లేజర్ షో నిర్వహిస్తున్నారు. రాత్రి స్వామి వారికి మహా ఆరతి కార్యక్రమం ముగిసిన తర్వాత ప్రతి రోజూ ఈ లేజర్ షో ఉంటుంది. ఈ షో ద్వారా ఈ పుణ్యక్షేత్రానికి సంబంధించిన పురాణ కథనంతో పాటు ఆ పరమశివుడి కథలను భక్తులను లేజర్ షో ద్వారా వివరిస్తారు.

5. ఆ కథ ఇలా సాగుతుంది...

5. ఆ కథ ఇలా సాగుతుంది...

Image Source:

కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు విజయం సాధిస్తారు. అయితే సోదర, పిత`సమానులు, గురువుల ను యుద్ధంలో సంహరించడం వల్ల వారు పాపాన్ని మూటగట్టు కొంటారు. పాప పరిహారం కోసం పరమశివుడిని ప్రార్థించాలని భావిస్తారు.

6. నంది రూపంలో

6. నంది రూపంలో

Image Source:

అయితే పరమశివుడు వారికి దొరక కుండా ఈ కేదర్నాథ్ లో నంది రూపంలో ఉండిపోతాడు. పట్టు వదలని పాండవులు కేదర్నాథ్ కు చేరుకొని అక్కడ శివుడిని పూజించి ఆయన్ను మెప్పిస్తారు. దీంతో శివుడు వారి పాపం పోగొట్టడమే కాకుండా స్వర్గారోహణ సమయంలో సాయం చేస్తానని మాట కూడా ఇస్తాడు.

7. త్రిభుజాకారంలో ఉన్న ఏకైక లింగం...

7. త్రిభుజాకారంలో ఉన్న ఏకైక లింగం...

Image Source:

సాధారణంగా శివలింగం గుడ్డు ఆకారంలో ఉంటుంది. అయితే కేదర్నాథ్ దేవాలయం లోని శివలింగం త్రిభుజాకారంలో ఉంటుంది. ఇలా త్రిభుజాకారంలో ఉన్న శివలింగం కేదర్నాథ్ లో తప్ప మరెక్కడా కనిపించదు.

8. భీముడు ప్రతిష్టించిన లింగం

8. భీముడు ప్రతిష్టించిన లింగం

Image Source:

శివారాధన కోసం లింగం దొరక్కపోతే భీముడు అక్కడ ఉన్న బండరాళ్లనే లింగంగా మార్చి పూజించారని అందుల్లే ఇక్కడ శివలింగం త్రిభుజాకారంలో ఉన్నట్లు చెబుతారు.

9. ఆదిశంకరాచార్యుడు

9. ఆదిశంకరాచార్యుడు

Image Source:

మరో కథనం ప్రకారం ఆదిశంకరాచార్యులు దేశ పర్యాటనలో భాగంగా ఇక్కడకు వచ్చి ఈ విభిన్నమైన శివ లింగాన్ని ప్రతిష్టించారని చెబుతారు. ఏది ఏమైనా ప్రపంచంలో త్రిభుజాకారంలో ఉన్న శివలింగం ఇది ఒక్కటే.

10. భైరవమూర్తికి కూడా పూజలు

10. భైరవమూర్తికి కూడా పూజలు

Image Source:

కేదర్నాథ్ ప్రధాన ఆలయానికి క్షేత్రపాలకుడిగా భూరవమూర్తిని పేర్కొంటారు. శీతాకాలంలో ఆలయం మూసివేసిన సమయంలో ఆ భైరవుడే ఆలయానికి కాపలాగా ఉంటారని ఆలయ పూజారులు చెబుతారు.

11.చోలా భాయ్ సరస్సు

11.చోలా భాయ్ సరస్సు

Image Source:

అందువల్లే శివుడితో పాటు ఈ భైరవ మూర్తికి కూడా ఆలయ పూజారులు పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక్కడికి దగ్గర్లోని చోలా భాయ్ సరస్సును కూడా చాలా మంది భక్తులు సందర్శించుకొంటూ ఉంటారు.

12. ఎలా చేరుకోవాలి?

12. ఎలా చేరుకోవాలి?

Image Source:

కేదర్నాథ్ కు దగ్గర్లో జోలి గ్రాంట్ విమానాశ్రయం ఉంది. ఢిల్లీ నుంచి ఇక్కడకు విమానయాన సర్వీసులు ఉన్నాయి. జోలి గ్రాంట్ విమానాశ్రయం నుంచి గౌరి కుండ్ కు ట్యాక్సీలో వెళ్లవచ్చు. అక్కడి నుంచి మాత్రం కాలినడక లేదా డోలీల్లో 18 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది.

13. రైలు మార్గంలో ఇలా.

13. రైలు మార్గంలో ఇలా.

Image Source:

దేశం లోని వివిధ ప్రాంతాల నుంచి కేదర్నాథ్ కు దగ్గర్లోని రిషికేష్ కు రైలు మార్గాలు ఉన్నాయి. రుషికేష్ కు రైలులో చేరుకొని అక్కడి నుంచి గౌరి కుండ్ కు ట్యాక్సీల్లో వెళ్లవచ్చు.

14. రోడ్డు మార్గం ద్వారా

14. రోడ్డు మార్గం ద్వారా

Image Source:

అదే విధంగా రోడ్డు మార్గంలో రిషికేష్, శ్రీనగర్ నుంచి కూడా గౌరి కుండ్ చేరుకోవడానికి రోడ్డు మార్గం అందుబాటులో ఉంటుంది.

15. మరింత సమాచారం కోసం

15. మరింత సమాచారం కోసం

Image Source:

కేదర్నాథ్ యుథాన్ చారిటబుల్ ట్రస్ట్, ఉత్తరాఖండ్ టూరిజం డెవెలప్ మెంట్ బోర్డ్, ఓ ఎన్ జీ సీ హెలీపాడ్ దగ్గర, డెహరడూన్ 248001, ఫోన్ నంబర్లు 91 135 2559898, 2559987

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి