• Follow NativePlanet
Share
» »కర్నాటక కాశ్మీర్ ను చూశారా?

కర్నాటక కాశ్మీర్ ను చూశారా?

Written By: Kishore

కర్నాటక పేరుకు ఒక రాష్ట్రమే అయినా ఇక్కడ విభిన్న భౌగోళిక పరిస్థితులు మనకు కనిపిస్తాయి. ఒక వైపున చల్లటి సాయంత్రాల్లో సేదదీరడానికి అనువైన సముద్ర తీర ప్రాంతాలు, మరో వైపు ఎతైన పర్వత ప్రాంతాలు, మరో వైపు పచ్చటి అటవీ ప్రాంతాలు ఇలా ప్రకృతి అందాలన్నింటిని ఈ దక్షణ భారత దేశ రాష్ట్రమైన కర్నాటక తనలో దాచుకొంది. ఇక వేసవిలో అనేకమందికి అటు సముద్ర తీరప్రాంతాలైన బీచ్ లు లేదా ఎతైన పర్వత శిఖరాలు మంచి ఆటవిడుపు. ఈ వేసవిలో అనేకమంది ఇదే ప్రాంతాలకు పర్యాటకానికి వెలుతుంటారు. అక్కడి ప్రకృతి అందాలన్నింటిని తనివితీరా చూసి మైమరిచిపోతుంటారు. అటువంటి కోవకు చెందినదే కర్నాటకలోని కొడుగు. దీనిని కూర్గ్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఎతైన కొండలు, జలజలాపారే జలపాతాలు, పచ్చటి కొండకోనలు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. వారాంతాల్లో కూడా ఈ కూర్గ్ ను సందర్శించేవారు ఎక్కువే. ఇక్కడ దొరికే కాఫీ, తేనే, మిరియాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచూర్యం పొందాయి. ఇన్ని విశిష్టతలు ఉన్న కూర్గ్ గురించిన సమాచారం మీకోసం ఈ కథనంలో...

ఆర్థిక కష్టాలన్నీ తీర్చే శయనించిన స్థితిలోని హనుమ

1. అతి చిన్న జిల్లా

1. అతి చిన్న జిల్లా

Image Source:

మడికెరి, సోమవారపేట, విరాజపేట అనే మూడు తాలూకాలతో కూడిన జిల్లా కొడుగు. కర్నాటకలో విస్తీర్ణ పరంగా ఈ కొడుగునే అతి చిన్న జిల్లా. అయితే ప్రకృతి అందాలతో తులతూగే ఈ జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను చూడటానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో ప్రజలు నిత్యం ఇక్కడికి వస్తుంటారు.

2. చూడాల్సిన ప్రదేశాలు ఎన్నో

2. చూడాల్సిన ప్రదేశాలు ఎన్నో

Image Source:

కొడుగులో చూడదగిన ఎన్నో. ఇందులో ధార్మిక ప్రాంతాలతో పాటు ప్రకృతి అందాలకు నిలయమైన జలపాతాలు, పర్వత శిఖరాలు కూడా ఎన్నో ఉన్నాయి. కర్నాటక జీవనదిగా పర్కొనబడే కావేరి జన్మస్థలమైన భాగమండలం, టిబేటియన్ గోల్డన్ టెంపుల్, ఓంకారేశ్వర దేవస్థానం వంటి ఎన్నో ధార్మిక ప్రాంతాలు దేశ విదేశాల నుంచి హిందూ, బౌధ మతానికి సంబంధించిన భక్తులు ఎక్కువ మంది ఇక్కడికి వస్తుంటారు.

3. జలపాతాల నిలయం

3. జలపాతాల నిలయం

Image Source:

అంతే కాకుండా కొడగులో హారంగి డ్యాం, కావేరి నిసర్గధామ, దుబారే ఎలిఫెంట్ క్యాంప్, అబ్బి జలపాతం, ఇర్ఫు జలపాతం, మళ్లళ్లి జలపాతం తదితర ప్రాంతాలను ఇక్కడ మనం చూడవచ్చు. అదే విధంగా మడికేరి కోట, నాల్కోనాడ్ ప్యాలెస్ వంటివి కూడా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.

4. కాఫీ ఉత్పత్తులకు చాలా ఫేమస్

4. కాఫీ ఉత్పత్తులకు చాలా ఫేమస్

Image Source:

ఇక్కడి వాతావరణం కాఫీ తోటల పెంపకానికి చాలా చల్లగా ఉంటుంది. కొడుగు కాఫీ ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. ఇక్కడ మొట్టమొదట కాఫీని పరిచయం చేసినది బ్రిటీష్ వారు. ముఖ్యంగా కొడుగులో దొరికే అరేబియా, రొబస్టా రకాలు ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రాముఖ్యం చెందినవి. అదే విధంగా కొడుగు తేనే, మిరియాలు, యాలక్కులు చూడా చాలా ప్రాచూర్యం పొందాయి.

5. ఎప్పుడు వెళ్లాల్సి ఉంటుంది.

5. ఎప్పుడు వెళ్లాల్సి ఉంటుంది.

Image Source:

కొడుగు అందాలను చూడాలనుకొన్నవారు నవంబర్ నుంచి మే రెండో వారం వరకూ అక్కడికి వెళితే మంచిది. అందుకే ఈ సమయంలో ఎక్కువ మంది పర్యాటకులు ఇక్కడకి వస్తుంటారు. ముఖ్యంగా వేసవి సెలవులు గడపడానికి చాలా భాగుంటాయి.

6.ఎలా వెళ్లాలి?

6.ఎలా వెళ్లాలి?

Image Source:

బెంగళూరు నుంచి కొడుగుకు నేరుగా బస్సు సౌకర్యం ఉంది. అదే విధంగా మైసూరు, హాసన్ నుంచి కూడా నేరుగా వెళ్లవచ్చు. కొడుగుకు దగ్గరగా ఉన్న విమానాశ్రయం మంగళూరు. మంగళూరు నుంచి నేరుగా ట్యాక్సీ ద్వారా మనం కొడుగుకు వెళ్లవచ్చు.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి