» »సింహాలు తమ తోకలతో శుభ్రపరిచే దర్గా మన రాష్ట్రంలో ఎక్కడుందో తెలుసా?

సింహాలు తమ తోకలతో శుభ్రపరిచే దర్గా మన రాష్ట్రంలో ఎక్కడుందో తెలుసా?

Written By: Venkatakarunasri

దర్గా అంటే సూఫీ క్షేత్రము లేదా సూఫీ సమాధి. ఇక్కడ ఎక్కడలేని ప్రశాంతత దొరుకుతుంది. అందుకే సూఫీ లు ఇక్కడ జీవసమాధి చెంది ఉంటారు. సమాధులలో నిదురించే సూఫీ ఆశీస్సులు పొందటం కోసం, భక్తులు వారి సమాధులను దర్శించటం ఆనవాయితీ. దర్గా లు ఇస్లాం మతానికి చెందినవి అయినప్పటికీ హిందువులు, ఇతర మతాల వారు కూడా దర్శిస్తుంటారు. మన తెలుగు రాష్ట్రాలలో కూడా దర్గా లకు ఆదరణ ఎప్పటి నుంచో ఉంది. అందులో ఒకటి కడప దర్గా. ఇక్కడికి రాజకీయనాయకులు, సినిమా యాక్టర్లు ఇలా ఎందరో వీ ఐ పీలు వస్తుంటారు. నెల్లూరు బారాషహీద్ దర్గా, కర్నూలు ఎల్లార్తి దర్గా ... చెప్పుకుంటూ పోతే ఇలా ఎన్నో. హజ్రత్ జహంగీర్ పీర్ దర్గా అన్ని దర్గాలలో కెల్లా ప్రత్యేకమైంది. విశిష్టత కలది. ఈ దర్గా గురించి కొన్ని మాటల్లో ..

హజ్రత్ జహంగీర్ పీర్ దర్గా

హజ్రత్ జహంగీర్ పీర్ దర్గా

హజ్రత్ జహంగీర్ పీర్ దర్గా మహబూబ్ నగర్ జిల్లా, కొత్తూర్ మండలం, ఇన్ముల్‌నర్వ గ్రామ సమీపంలో ఉంది. ఈ దర్గా జిల్లాలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో, చుట్టుపక్కల జిల్లాలో ప్రసిద్ధిచెందింది.

pc: Naidugari Jayanna

ఇద్దరి సమాధులు

ఇద్దరి సమాధులు

సుమారు 700 సం.ల క్రితం బాగ్దాద్ నుండి గౌస్ మొహినొద్దీన్, బురానొద్దిన్ అనే ఇరువురు మత గురువులు దేశ సంచారము చేస్తూ ఇక్కడికి వచ్చి కొంత కాలం తరువాత మరణించినారని, వారి ఇద్దరి సమాధులే జహంగీర్ పీర్ దర్గా గా వాడుకలోకి వచ్చాయని నమ్ముతారు. 400 సం.ల క్రితం గోల్కొండ కోటపై విజయం సాధించిన రాజులు తరువాత ఈ దర్గాకు వచ్చి పూజలు చేసారని ప్రతీతి.

pc: Imam Hussain

సంరక్షణ భాద్యత

సంరక్షణ భాద్యత

దర్గాకు నిర్వాహకులు లేనందున తమ సిపాయిలలో ఒకరైన సయ్యద్ ఇబ్రాహిం అలీని దర్గా సంరక్షకుడుగా నియమించి, 4 పరగణాలకు ఖాజీగా కూడా నియుక్తులను చేసారు. 1948 సం. వరకు ఇబ్రాహిం అలీ వారసులు సంరక్షించే వారు. ఆ తరువాత రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ ఆదీనంలోకి ఈ దర్గా వెళ్ళింది.

pc: Imam Hussain

జానపదుల కథనాలు

జానపదుల కథనాలు

ఈ దర్గా ప్రాంతం పూర్వం అడవిలా ఉండేదని, రాత్రివేళల్లో దర్గా దరిదాపుల్లో ఎవరు సంచరించేవారు కాదని చెబుతారు. దర్గాలో రాత్రివేళల్లో సింహాలు సంచరించేవని, తెల్లవారు జామున తమ తోకలతో దర్గాను శుభ్రపరిచి వెళ్ళేవని ఇక్కడి జానపదుల కథనాలు.

pc: Lauren Elyse Lynskey

ఉరుసు

ఉరుసు

ప్రతి సంవత్సరము మకర సంక్రాంతి పర్వదినాలలో 3 రోజుల పాటు దర్గాలో ఉర్సు ఉత్సవాలను భక్తులు ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ ఉత్సవాలకు రాష్ట్రంలోని ముస్లిమ్‌లే కాకుండా విదేశాలలో ఉండేవారు సైతం వస్తుంటారు. ముఖ్యంగా అరబ్బుదేశాలకు ఉద్యోగాల నిమిత్తం వెళ్ళే ముస్లిమ్‌లు ఇక్కడ తప్పకుండా ప్రార్థనలు చేసి వెళ్తుంటారు.

pc: Telangna in Kuwait

హిందువుల నమ్మకం

హిందువుల నమ్మకం

దర్గా స్థానంలో పూర్వ కాలంలో నరసింహ స్వామి దేవాలయం ఉండేదని ఇక్కడి హిందువులు భావిస్తారు. అందుకే ఆ విశ్వాసంతోనే హిందువులు కూడా అధిక సంఖ్యలో ఈ దర్గాను సందర్శిస్తుంటారు.

pc: Dargah Awlia

ఐకమత్యం

ఐకమత్యం

ఈ దర్గా మతసామరస్యానికి ఓ గొప్ప ప్రతీక. ఇక్కడికి ముస్లిమ్‌లు, హిందువులతో పాటు సిక్కులు కూడా వచ్చి కొలుస్తుంటారు. సమీప ప్రాంతాలలోని లంబాడ కుటుంబాలు కూడా ఎడ్లబండ్లపై ప్రత్యేకంగా వచ్చి కందురులు చేస్తుంటారు. ఈ ప్రాంతంలో సంపన్న కుటుంబాలకు చెందినవారు ఏ మతానికి చెందినవారైనా తమ ఇంటి దేవుడిగా కొలుస్తుంటారు.

pc: Shahnoor Habib

హైదరాబాద్ నుండి

హైదరాబాద్ నుండి

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు కేవలం 45 కి.మీ. దూరంలో ఈ దర్గా ఉంది. ఇక్కడి ప్రభుత్వ బస్సు సౌకర్యం ఉంది. ముఖ్యంగా ప్రతి ఆది, గురువారాలలో ప్రత్యేక బస్సులు నడుస్తుంటాయి. ఆటోలు, జీపులు కూడా అందుబాటులో ఉంటాయి.

Please Wait while comments are loading...