Search
  • Follow NativePlanet
Share
» »మీనాక్షి టెంపుల్ - మమతానురాగాల నెలవు !!

మీనాక్షి టెంపుల్ - మమతానురాగాల నెలవు !!

మదురై మీనాక్షి టెంపుల్ ప్రపంచంలోని అత్యధిక భక్తులు సందర్శించే దేవాలయాలలో ఒకటి. అంతేకాదు ఈ టెంపుల్ 'కొత్త సెవెన్ వండర్స్ అఫ్ ది వరల్డ్ 'కోసం తయారు అయిన జాబితా లోని 30 ప్రదేశాలలో ఒకటి.

మహేంద్ర సింగ్ ధోని బాల్యం గడిచిన ప్రదేశం ఎక్కడో మీకు తెలుసా?మహేంద్ర సింగ్ ధోని బాల్యం గడిచిన ప్రదేశం ఎక్కడో మీకు తెలుసా?

తమిళనాడు లోని మదురై పట్టణం అంతా అత్యంత ప్రాచీనమైనదిగా చెప్పబడే మీనాక్షి టెంపుల్ చుట్టూ ఏర్పడినదే. మదురై మీనాక్షి టెంపుల్ ప్రపంచంలోని అత్యధిక భక్తులు సందర్శించే దేవాలయాలలో ఒకటి. అంతేకాదు ఈ టెంపుల్ 'కొత్త సెవెన్ వండర్స్ అఫ్ ది వరల్డ్ 'కోసం తయారు అయిన జాబితా లోని 30 ప్రదేశాలలో ఒకటిగా కూడా నియామకం చేయబడింది.

తమిళనాడు పర్యాటక రంగంలో ఈ టెంపుల్ ఇంత ప్రసిద్ధి గాంచినది అంటే, దానికి కారణం ప్రతి ఏటా ఇక్కడకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగి పోతూ ఉండటమే. శివుడి ఆధిపత్యం లేని శక్తి ప్రాశస్త్యం కల ఇండియా లోని కొద్ది దేవాలయాలలో ఇది ఒకటి. మరి ఈ టెంపుల్ సందర్శనకు నేటివ్ ప్లానెట్ అవసరమైన మార్గదర్శకతను, మరి కొన్ని ఇతర ఆకర్షనలను, అంటే ప్రసిద్ధి గాంచిన సిల్క్ చీరల వివరాలను మీ ముందు ఉంచుతోంది. పరిశీలించండి.

మమతానురాగాల మధుర మీనాక్షి !

మమతానురాగాల మధుర మీనాక్షి !

ఈ దేవాలయంలో ప్రధాన దేవత మీనాక్షి అమ్మవారు. ఈమెను పార్వతి అవతారంగాను ఈమె సహచరుడైన సుందరేస్వరుడిని శివుడి గాను కొలుస్తారు. సుమారు 2,500 సంవత్సరాల కిందటి దిగా చెప్పబడే మదురై పట్టణానికి ఈ దేవాలయం ప్రధానమైనది.
ఫోటో క్రెడిట్: : Wiki Commons

మమతానురాగాల మధుర మీనాక్షి !

మమతానురాగాల మధుర మీనాక్షి !

ఎత్తైన గోపురాలు
ఈ టెంపుల్ గురించి పురాతన తమిళ సాహిత్యంలో కూడా పేర్కొన్నారు. అయితే, ప్రస్తుత టెంపుల్ మాత్రం క్రీ. శ. 1623 - 1655 ల మధ్య నిర్మించబడి నట్లు చరిత్ర చెపుతోంది. ఈ దేవాలయానికి 14 గోపురాలు కలవు. ఇవి సుమారుగా 45 - 50 మీటర్ల ఎత్తులో వుంటాయి.

ఫోటో క్రెడిట్: Wiki Commons

మమతానురాగాల మధుర మీనాక్షి !

మమతానురాగాల మధుర మీనాక్షి !

మీనాక్షి దేవత అసలు ఎవరు ?
మీనాక్షి మాత, రాజు మలయద్వాజ పాండ్య కుమార్తె. ఆమె ఒక యజ్ఞం చేయగా అగ్ని నుండి ఆవిర్భవించినది. ఆమె పుట్టినప్పుడు మూడు స్థనాలు కలిగి వుందని, అందుకు రాజు చిన్తిన్చ గా ఆమెకు వివాహం అయిన వెంటనే, మూడవ స్థనము మాయం అవుతుందని ఆకాశ వాణి పేర్కొని, ఆమెను ఒక యువ రాణి వలే కాక, ఒక రాజ కుమారుడిగా పెంచవలసినది గా కోరింది. ఆ రకంగా మాత మీనాక్షి యుద్ధ విద్యలు నేర్ప బడి పట్టాభిషేకం చేయబడి రాజ్యం అప్పగించబడినది. ఆమె అనేక యద్ధాలు గెలిచింది. చివరకు శివుడితో యుద్ధానికి సనద్ధమై, యుద్ధ భూమిలో ఆయనే తన భర్తగా గుర్తించినది.

ఫోటో క్రెడిట్: Wiki Commons

మమతానురాగాల మధుర మీనాక్షి !

మమతానురాగాల మధుర మీనాక్షి !

మధుర కు ఆ పేరు ఎలా వచ్చింది ?
అమృతంగా చెప్పబడే తేనె శివుడి జటా జూటం వెంట్రుకల నుండి ప్రవహిస్తున్నపుడు, ఈ పట్టణానికి మదురై అనే పేరు వచ్చింది. ఒకప్పుడు ఈ నగరం స్థానంలో ఒక అడవి ఉండేదని, ఆ అడవిలో ఇంద్రుడు ఒక కదంబం చెట్టు కింద శివ లింగం పెట్టి అర్చిస్తుండగా, అది చూసిన ఆ ప్రాంత రాజు ఆ శివ లింగానికి ఒక గుడి కట్టించాడని, కాల క్రమేనా ఆ గుడి చుట్టూ మదురై పట్టణం ఏర్పడినదని చరిత్ర చెపుతుంది. నేటికీ ఆ నాటి కదంబం చెట్టు కాండం ఇక్కడ చూడవచ్చు.

ఫోటో క్రెడిట్: Wiki Commons

మమతానురాగాల మధుర మీనాక్షి !

మమతానురాగాల మధుర మీనాక్షి !

అధిష్టాన దైవం ఈ ప్రదేశంలో శివుడు కాదు. సాధారణంగా దక్షిణ ఇండియాలో కల దేవాలయాలలో శివుడు ప్రధాన దైవంగా ఉంటాడు. కాని ఈ గుడి లో మాత్రం ప్రధాన దేవతగా మాత మీనాక్షి పూజించబడుతుంది

ఫోటో క్రెడిట్: Wiki Commons

మమతానురాగాల మధుర మీనాక్షి !

మమతానురాగాల మధుర మీనాక్షి !

దేవాలయ భక్తులు
ప్రతి నిత్యం ఈ దేవాలయానికి సుమారు పదిహేను వేల మంది భక్తుల వరకూ వస్తారు. అమ్మవారికి ప్రీతీ కరమైన శుక్రవారాలు ఈ సంఖ్య ఇరవై అయిదు వేల వరకూ కూడా చేరుతుంది. ఈ దేవాలయాన్ని కొత్తగా గుర్తించబడే ప్రపంచ ఏడు వింతలలో ఒకటిగా నియామకం చేసారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ , మే నెలల లో జరిగే ఉత్సవాలకు భక్తుల సంఖ్య ఒక మిలియన్ అంటే పది లక్షల వరకు చేరుతుంది.
ఫోటో క్రెడిట్: Wiki Commons

మమతానురాగాల మధుర మీనాక్షి !

మమతానురాగాల మధుర మీనాక్షి !

బంగారు కొలను
ఒకప్పుడు ఈ బంగారు కొలను ప్రదేశం అంటే సుమారు 1500 సంవత్సరాల కిందట ,సంగం కవులు తరచుగా కలసి చర్చించే ప్రదేశం గా వుడేది. అయితే, నేడు ఈ ప్రదేశం అలసి సొలసిన భక్తులకు సేద దీరే ప్రాంతంగా మారింది.
ఫోటో క్రెడిట్: Wiki Commons

మమతానురాగాల మధుర మీనాక్షి !

మమతానురాగాల మధుర మీనాక్షి !

నాట్యం చేసే నటరాజ్
ఇక్కడి టెంపుల్ మ్యూజియం లో కల నాట్య నటరాజ విగ్రహం ఒక ప్రత్యేకత. ఇతర టెంపుల్స్ లోని ఎడమ కాలు పైకి ఎత్తి నాట్యం చేయకుండా కుడి కాలు పైకి ఎత్తి నాట్యం చేయటం కనపడుతుంది.
ఫోటో క్రెడిట్: Wiki Commons

మమతానురాగాల మధుర మీనాక్షి !

మమతానురాగాల మధుర మీనాక్షి !

మాత వివాహం
మీనాక్షి , సుందరేస్వరుల వివాహం ఈ గుడిలో వూరు అంతా వ్యాపించి వైభవోపేతంగా జరిగినట్లు చూపబడుతుంది.

ఫోటో క్రెడిట్: Wiki Commons

మమతానురాగాల మధుర మీనాక్షి !

మమతానురాగాల మధుర మీనాక్షి !

గనేషుడి ఆశీస్సులు
ఇక్కడ కల ఏనుగు కు పండ్లు సమర్పించి గనేషుడి ఆశీర్వాదం పొందటం మరువకండి.

ఫోటో క్రెడిట్: Pic Credit: Wiki Commons

మమతానురాగాల మధుర మీనాక్షి !

మమతానురాగాల మధుర మీనాక్షి !

వేయి స్తంభాల విశ్వసనీయత
మాత మీనాక్షి ఆశీస్సులుపొందేందుకు ప్రతి ఒక్కరూ ఈ వేయి స్తంభాల హాలు గుండా వెళ్ళాల్సిందే. (వాస్తవానికి 985 స్తంభాలు మాత్రమే కలవు) దోవలో మీకు పూవుల నుండి బంగారు ఆభరణాలు అమ్మే షాపుల వరకూ కనపడతాయి.

మమతానురాగాల మధుర మీనాక్షి !

మమతానురాగాల మధుర మీనాక్షి !

పూజలు ప్రసాదాలు
ఈ దేవాలయంలో రోజంతా వివిధ రకాల పూజలు నిర్వహిస్తారు. దేవుళ్ళ ను కొలుస్తూ ఆరుగురు పాటలు పాడతారు. ప్రతి శుక్రవారం సాయంకాలం, మాత విగ్రహాన్ని ఒక కొయ్య గుర్రంపై టెంపుల్ చుట్టూ కల వీధులలో ఊరేగిస్తారు.

మమతానురాగాల మధుర మీనాక్షి !

మమతానురాగాల మధుర మీనాక్షి !

గోడలపై డిజైన్ లు, నగిషీ చెక్కడాలు
ఆలయ గోడలపై పురాతన టెంపుల్స్ శైలి లో వివిధ రకాల అందమైన చెక్కడాలు మంచి పని తనంతో కనపడతాయి.

మమతానురాగాల మధుర మీనాక్షి !

మమతానురాగాల మధుర మీనాక్షి !

అందమైన చెక్కడాలు
ఈ అందమైన చెక్కడాలు ఈ ప్రదేశ అందాలను పవిత్రతతను మరింత అధికం చేస్తాయి.

మమతానురాగాల మధుర మీనాక్షి !

మమతానురాగాల మధుర మీనాక్షి !

రంగు ల పెయింటింగ్ లు
ఇక్కడ గోడలకు కల రంగుల చిత్రాలు 17 వ శతాబ్దం నాటివి. తప్పక విజిటర్ లను ఆకర్షిస్తాయి.

మమతానురాగాల మధుర మీనాక్షి !

మమతానురాగాల మధుర మీనాక్షి !

మదురై ఎలా చేరాలి ?
మదురై నగరం చేరేందుకు ప్రతి నిత్యం విమానాలు చెన్నై మరియు ముంబై ల నుండి నడుస్తాయి. చెన్నై నుండి అనేక బస్సు లు కలవు. పాండ్యన్ ఎక్స్ప్రెస్స్ రైలు చెన్నై లో రాత్రి 9.20 కి బయలు దేరి ఉదయం 6.20 గం. లకు చేరుతుంది.

ఫోటో క్రెడిట్: Wiki Commons

మమతానురాగాల మధుర మీనాక్షి !

మమతానురాగాల మధుర మీనాక్షి !

ఎక్కడ వసతి పొందాలి ?
మీరు వసతి పొందాలంటే, టెంపుల్ సమీపంలోని వసతులు పొందవచ్చు. ఒక మాదిరి నుండి చవకగా లభిస్తాయి. లేట్ నైట్ వాకింగ్ కూడా సురక్షితమే. లక్సరీ హోటళ్ళు కూడా కలవు. అయితే అవి టెంపుల్ సమీపంలో లేవు.

మమతానురాగాల మధుర మీనాక్షి !

మమతానురాగాల మధుర మీనాక్షి !

ఎక్కడ , ఏమి తినాలి ?
మదురై ప్రదేశం ...ప్రసిద్ధ ఇడ్లీ ల ప్రదేశం. కనుక ఎక్కడ పడితే అక్కడ చివరకు టెంపుల్ చుట్టూ కూడా మీకు మంచి మెత్తటి, తెల్లటి ఇడ్లీ లు రుచికరమైనవే దొరుకుతాయి.

ఫోటో క్రెడిట్: Wiki Commons

మమతానురాగాల మధుర మీనాక్షి !

మమతానురాగాల మధుర మీనాక్షి !

ఇంకా ఇక్కడ ఏమేమి చూడాలి ?
మీనాక్షి టెంపుల్ మాత్రమే కాక, మదురై లో మీకు ఇతర ఆకర్షణలు కూడా కలవు. తిరుమల నాయకర్ పాలస్ చూడటం , బోటు షికారు, వంటివి చేయవచ్చు. టెంపుల్ బయట కల షాపులలో కొయ్య బొమ్మలు, వెదురు బుట్టలు వంటివి పసుపు కుంకుమలు మొదలైనవి కొనుగోలు చేయవచ్చు. మదురై పట్టు చీరలకు ప్రసిద్ధి. తప్పక కొనుగోలు చేయండి.

ఫోటో క్రెడిట్: J'ram DJ

మమతానురాగాల మధుర మీనాక్షి !

మమతానురాగాల మధుర మీనాక్షి !

ఎపుడైనా సరే
మదుర మీనాక్షి భక్తులకు సంవత్సరంలో ఎపుడైనా సరే కొదవ లేదు. సంవత్సరం పొడవునా దర్శనానికి వస్తూనే వుంటారు.

ఫోటో క్రెడిట్: Wiki Commons

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X