» »కన్నూర్ లో తప్పక చూడవలసిన ప్రదేశం సెయింట్ ఏంజెలో కోట

కన్నూర్ లో తప్పక చూడవలసిన ప్రదేశం సెయింట్ ఏంజెలో కోట

By: Venkata Karunasri Nalluru

కేరళ నిజంగా ప్రయాణికులకు ఆనందం కల్గించే ప్రదేశం. కేరళలోని సాంకేతిక అద్భుతాలు, దేవాలయాలు, చారిత్రాత్మకమైన కొన్ని ముఖ్యమైన స్మారక కట్టడాలు, దాని సహజ అందం మిమ్మల్ని మైమరపించేలా చేస్తాయి. ఇక్కడ గల కోటలు కేరళలోని ప్రాంతాలలో గల గొప్ప చరిత్రను తెలియచేస్తుంది. అనేక కోటలు గతంలో రాజభవనాలుగా ఉండేవి. కొన్ని సైనిక ప్రయోజనాల కోసం నిర్మించేవారు మరికొన్ని కారాగారాలుగా వుండేవి. ఆ కాలంలో పాలకులు కేరళలోని భూభాగాలను రక్షించడానికి పోరాడారు. కేరళలో చరిత్ర ద్వారా ఈ కోటల గూర్చి మరింత సమాచారం తెలుసుకోవచ్చును.

ఇది కూడా చదవండి :

6 కేరళలో గల ప్రముఖ కోటలు

మనం ఇప్పుడు కన్నూర్ సెయింట్ ఏంజెలో ఫోర్ట్ పర్యటన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.

Visit the tourist places in Kannur

PC: Rahul Sadagopan

చరిత్ర

సెయింట్ ఏంజెలో ఫోర్ట్ ను కన్నూర్ ఫోర్ట్ లేదా కన్నూర్ కొట్టగా పిలుస్తారు. ఇది కేరళ యొక్క ఉత్తమ చారిత్రక ప్రదేశాలలో ఒకటి. కోటను భారతదేశం మొట్టమొదటి పోర్చుగీస్ వైస్రాయ్ అయిన డోమ్ ఫ్రాన్సిస్కో డి అల్మీడ నిర్మించాడు. తరువాత దీనిని డచ్ వారు ఆక్రమించారు. అయితే ఈ కోట భారతదేశంలో బ్రిటిష్ వారి పాలనలో హస్తగతమైంది.

Visit the tourist places in Kannur

PC: Satish Sankar

కోట నిర్మాణం

కోటను కన్నూర్ కోస్తా ప్రాంతంలో కంకర మట్టితో నిర్మించబడింది. బ్రిటిష్ పాలనలో త్రికోణీయ నిర్మాణం కలిగిన గదులు మరియు చెరసాలలను నిర్మించారు. ఒకే రంధ్రం కలిగినటువంటి చెరసాలలలో ఇక్కడ ఖైదీలకు శిక్ష విధిస్తారు. ఖైదీలకు ఆహారం ఈ రంధ్రాల ద్వారా అందించేవారు. ప్రకృతి వైపరీత్యాల నుండి రక్షణ కొరకు భారీ కోటను నిర్మించారు. ఈ కోట ఒక విలువైన పర్యాటక ఆకర్షణ. ప్రస్తుతం ఈ కోటను భారతదేశం యొక్క ఒక రక్షిత స్మారకంగా పురావస్తు శాఖ సర్వే నిర్వహిస్తూ వుంది.

ఫోటోగ్రాఫర్ యొక్క డిలైట్

మీరు ఒక షట్టర్ బగ్ అయితే, మీ ఫోటోగ్రఫీ నైపుణ్యాల ప్రయోగాలు అన్వేషించడానికి ఇది ఒక గొప్ప ప్రదేశం. దక్షిణ భారత చిత్ర పరిశ్రమ యొక్క ప్రముఖ షూటింగ్ స్థానము ఈ కోట.

Visit the tourist places in Kannur

PC: Priya Sivaraman

కోట వుండే ప్రదేశం

కోట కన్నూర్ పట్టణానికి 2 కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్ర తీరంలో ఉన్నది. కన్నూరు చేరిన తర్వాత కోటను చూచుటకు మీరు ఆటోరిక్షాలో వెళ్ళవచ్చును.

కన్నూర్ లో గల ఇతర పర్యాటక ఆకర్షణలు

కన్నూర్ మరిన్ని ఆసక్తికరమైన పర్యాటక ప్రదేశాలను కలిగి ఉంది.

ఈ ఆకర్షణలలో ప్రధానమైనవి అరక్కల్ మ్యూజియం, కన్నూర్ బీచ్, తెల్లచెర్రి ఫోర్ట్, పయ్యమ్బలం బీచ్ మరియు తొట్ట బీచ్.

కన్నూర్ గురించి మరింత తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

కన్నూర్ వెళ్ళినప్పుడు ఈ ఆసక్తికరమైన పర్యాటక ప్రదేశాలను మిస్ చేయకుండా చూడండి. వీటిలో అరక్కల్ మ్యూజియం, కన్నూర్ బీచ్, తెల్లచెర్రి ఫోర్ట్, పయ్యమ్బలం బీచ్ మరియు తొట్ట బీచ్ ముఖ్యమైనవి.

ఇక్కడ క్లిక్ చేయండి

కన్నూర్ లో గల హోటల్స్

కన్నూర్ లో బస చేయటానికి బడ్జెట్ హోటల్స్ నుండి విలాసవంతమైన రిసార్ట్స్ వరకు కొన్ని అందమైన ఎంపికలు ఉన్నాయి. హోటల్స్ కన్నూర్ గురించి మరింత తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

కన్నూర్ లోని సెయింట్ ఏంజెలో ఫోర్ట్ ఎలా చేరాలి?

Please Wait while comments are loading...