Search
  • Follow NativePlanet
Share
» »దక్షిణ చిరపుంజి- అగుంబే

దక్షిణ చిరపుంజి- అగుంబే

దక్షిణ చిరపుంజి- అగుంబే

నింగిని తాకే కొండలను నీలిమబ్బులు చుంబించే దృశ్యాలు ఈశాన్యంలోని చిరపుంజిలో మాత్రమే కాదు, దక్షిణాదిలో అగుంబేలోనూ కనిపిస్తాయి. అందుకే, కర్ణాటకలోని అగుంబేను 'చిరపుంజి ఆఫ్ సౌత్' అంటారు. అరేబియన్ సముద్ర తీరానికి 55 కిలోమీటర్ల దూరంలో పడమటి కనుమల్లో ఉన్న ఈ చిన్న గ్రామం ప్రకృతి ప్రేమికులకు సాక్షాత్తు స్వర్గధామమే. నింగిని తాకే కొండలు, దట్టమైన అడవులతో నిండిన లోయలు, అడుగడుగునా తారసపడే జలపాతాలు... అద్భుతః అనిపిస్తాయి.

కర్ణాటకలోని షిమోగా జిల్లాలో మూడు చదరపు కిలోమీటర్ల చిన్న గ్రామం అగుంబే. జనాభా దాదాపు ఐదువందలు మాత్రమే. పక్షుల కిలకిలలు తప్ప పట్టణ ప్రాంతపు రణగొణలేవీ ఇక్కడ వినిపించవు. పడమటి కనుమల్లో పుష్కలంగా వర్షాలు కురిసే ప్రదేశం ఇది. అందుకే పచ్చదనానికి చిరునామాలా ఉంటుంది.

అగుంబె (పొగమంచుతో కూడిన అడవి అందాలు అగుంబెలో కనువిందు చేస్తాయి) ఈ ప్రదేశాన్ని దక్షిణ భారతదేశంలో చిరపుంజి అని పిలుస్తుంటారు. పశ్చిమ కనుమల్లో ఉన్న ఈ ప్రదేశంలో జూన్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్యకాలంలో అత్యధిక వర్షపాతం పడుతుంది. ఈ మాన్‌సూన్‌ సీజన్‌లో అడవి మొత్తం పొగమంచుతో ఉంటుంది. వాటర్‌ఫాల్స్‌ కనువిందు చేస్తాయి. కుంచికల్‌ ఫాల్స్‌, బర్‌కానా ఫాల్స్‌ అందాలు తనివితీరా చూడాల్సిందే. ఇక్కడున్న అగుంబె రెయిన్‌ఫారెస్ట్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ను ప్రతి ఒక్కరు సందర్శించి తీరాల్సిందే.

అగుంబే

అగుంబే

అగుంబే చుట్టుపక్కల ముఖ్యంగా చూడాల్సినవి ఇక్కడి జలపాతాలనే. కొండల మీదుగా నేల మీదకు ఉరికే జలపాతాలు ఇక్కడ అడుగడుగునా తారసపడతాయి. ముఖ్యంగా బర్కానా జలపాతం, కూడ్లుతీర్థ జలపాతం, జోగిగుండి జలపాతం వంటి జలపాతాలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. ఈ జలపాతాల వద్ద చాలామంది పిక్నిక్ పార్టీలు చేసుకుంటూ ఉంటారు. వారంతంలో రెండు రోజుల ట్రిప్ కు ఈ ప్రదేశం చాలా అనుకూలమైనది మరి బెంగళూరు నుండి అగుంబే రోడ్ ట్రిప్ ఎలా ఉంటుంది. చూడాల్సిన ఇత ప్రదేశాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..

wikimedia.org

కింగ్ కోబ్రా

కింగ్ కోబ్రా

కింగ్ కోబ్రా అంటే ఎవరి భయం ఉండదు చెప్పండి. అయితే వినండి, కింగ్ కోబ్రా పుట్టింది ఈ అగుంబేలోనే. పాముల రాజధానిగా పిలవభడే ఈ అగుంబేలో ప్రిసిద్ది చెందిన రోములన్ అనే అతను కింగ్ కోబ్రా 1970లో ఈ అగుంబే ప్రదేశంలో కనుగొన్నాడు. అందువల్ల అప్పటి కాలంలో ఉన్న బ్రిటీష్ ప్రభుత్వం అతనికి అవార్డ్ ఇచ్చి సత్కరించింది.

wikimedia.org

కుంచికాళ్‌‌ జలపాతం

కుంచికాళ్‌‌ జలపాతం

వర్షాలు ఎక్కువగా పడే ప్రాంతం కాబట్టి ఇక్కడ చాలా జలపాతాలు సహజంగా ఏర్పడ్డాయి. వాటిలో ఒకటి కుంచికాళ్‌‌ జలపాతం. ఇది ఇక్కడి టూరిస్టులకు మరో అట్రాక్షన్. ఇది దేశంలోనే ఎక్కువ ఎత్తు నుంచి పడుతున్న జలపాతాల్లో ఒకటి. ఇది 1493 అడుగుల ఎత్తు నుంచి పడుతూ చూసేవాళ్లకి చిన్నపాటి నయాగారాలా అనిపిస్తుంది. వారాహి నది.. ఈ జలపాతం నుంచే పుడుతుంది.

PC:Saurabhsawantphoto

బర్కానా జలపాతం

బర్కానా జలపాతం

మరో జలపాతం ‘బర్కానా’. ఇది 850 అడుగుల ఎత్తు నుంచి పడుతుంది. సీతానది కొండలపై నుంచి ప్రవహిస్తుంది కాబట్టి దీనికి ‘సీతా జలపాతం’ అనే మరో పేరు కూడా ఉంది. ఈ జలపాతాన్ని చేరాలంటే గుంబో ఘాట్ల ద్వారా ట్రెక్కింగ్ చేయాలి లేదా బైక్ రూట్‌‌లో వెళ్లాలి.

PC:Arun ghanta

ఒనకి అబ్బి జలపాతం

ఒనకి అబ్బి జలపాతం

ఆగుంబేకు దగ్గర్లో ఉండే మరో జలపాతం ‘ఒనకి’ జలపాతం. కన్నడలో ‘ఒనకి’ అంటే ‘దంపుడు కర్ర’ అని అర్థం. ఈ జలపాతం చూడ్డానికి అలాగే కనిపిస్తుందని దానికి ఆ పేరు పెట్టారు. మెట్ల ద్వారా అక్కడికి చేరుకోవచ్చు.

wikimedia.org

జోగి గుండి జలపాతం

జోగి గుండి జలపాతం

ఇక్కడికి మూడు కిలో మీటర్ల దూరంలో జోగి గుండి జలపాతాలు ఉంటాయి. ఇవి చాలా పురాతనమైనవి. సుమారు 829 అడుగుల ఎత్తునుంచి పడతాయి. ఇక్కడకు చేరుకోవాలంటే సగం దూరం బైక్ లేదా కార్‌‌‌‌లో వెళ్లి మిగిలిన దూరం ట్రెక్కింగ్ చేయాలి.

wikimedia.org

కూడ్లు తీర్థ జలపాతం

కూడ్లు తీర్థ జలపాతం

ఇక్కడుండే మరో జలపాతం తీర్థ జలపాతాలు. అగుంబే వచ్చిన ప్రతి ఒక్కళ్లూ వీటిని చూసి తీరాల్సిందే. ఈ జలపాతం 126 అడుగుల ఎత్తునుంచి ఒక సరస్సులోకి పడుతుంది. మూడు కిలోమీటర్లు అడవిలో ట్రెక్కింగ్ చేసి ఇక్కడికి చేరుకోవాలి.

wikimedia.org

అగుంబే-ఉడిపి రోడ్డుకు చేరువలోని ఎత్తయిన శిఖరంపై

అగుంబే-ఉడిపి రోడ్డుకు చేరువలోని ఎత్తయిన శిఖరంపై

అగుంబే-ఉడిపి రోడ్డుకు చేరువలోని ఎత్తయిన శిఖరంపై ఉన్న సన్‌సెట్ వ్యూపాయింట్ నుంచి సూర్యాస్తమయ దృశ్యాన్ని తిలకించడానికి కూడా పర్యాటకులు ఇష్టపడతారు. ఇక్కడి నుంచి చూస్తే సుదూరాన అరేబియన్ సముద్రంలోకి కుంగుతున్న సూర్యబింబం కనిపిస్తుంది.

wikimedia.org

అగుంబే రెయిన్ ఫారెస్ట్ రీసెర్చ్ స్టేషన్

అగుంబే రెయిన్ ఫారెస్ట్ రీసెర్చ్ స్టేషన్

ఇక్కడ చూడాల్సిన ప్రదేశాల్లో అగుంబే రెయిన్ ఫారెస్ట్ రీసెర్చ్ స్టేషన్ ఒకటి. ఏడాది మొత్తంలో 7 వేల మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అగుంబేలోని అడవుల వైవిధ్యంపై ఇక్కడి శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తూ ఉంటారు. వాటి విశేషాలను ఇక్కడ తెలుసుకోవచ్చు.

wikimedia.org

అగుంబేలోని శ్రీకృష్ణ ఆలయం, శ్రీ సిద్ధి వినాయక ఆలయం

అగుంబేలోని శ్రీకృష్ణ ఆలయం, శ్రీ సిద్ధి వినాయక ఆలయం

అగుంబేలోని శ్రీకృష్ణ ఆలయం, శ్రీ సిద్ధి వినాయక ఆలయం, నడబర ఈశ్వరాలయం, ఇక్కడకు చేరువలోని నాగూరులో ఆంజనేయ ఆలయం వంటి పురాతన ఆలయాలు ఆధ్యాత్మిక ఆసక్తి గల పర్యాటకులను ఆకట్టుకుంటాయి. ఇక్కడి చేరువలోనే ఉడిపి శ్రీకృష్ణ క్షేత్రం, శృంగేరీ శంకరాచార్య పీఠం ఉన్నాయి. అగుంబేలో విహార యాత్ర తర్వాత వీటిని కూడా సందర్శించుకోవచ్చు.

wikimedia.org

అగుంబే చేరువలోని సోమేశ్వర వన్యప్రాణి అభయారణ్యం

అగుంబే చేరువలోని సోమేశ్వర వన్యప్రాణి అభయారణ్యం

ఇక్కడి జీవవైవిధ్యాన్ని తిలకించాలనుకునే వారు అగుంబే చేరువలోని సోమేశ్వర వన్యప్రాణి అభయారణ్యం, కుద్రేముఖ్ జాతీయ పార్కులను తిలకించవచ్చు. ఈ రెండు చోట్ల రకరకాల వన్యప్రాణులు, అరుదైన పక్షులు కనిపిస్తాయి.

PC:Subramanya C K

ఏం చేయాలి?

ఏం చేయాలి?

అగుంబేలోని ఎత్తయిన కొండలు పర్వతారోహకులకు సవాలుగా ఉంటాయి. సరదాగా ఈ కొండలపై ట్రెక్కింగ్ చేయవచ్చు. అయితే తరచు కురిసే వానల వల్ల నిత్యం తడిగా ఉండే ఈ కొండలపై ఆచి తూచి అడుగులేయాల్సి ఉంటుంది.

వాహనాల రద్దీ తక్కువగా ఉండే ఇక్కడి వీధులు నడక, జాగింగ్, సైక్లింగ్ వంటి వ్యాయామ కాలక్షేపాలకు అనువుగా ఉంటాయి.

ఊరికి దూరంగా ప్రశాంత వాతావరణంలో వనవిహారాలకు వెళ్లవచ్చు. జలపాతాల వద్ద జలక్రీడలు ఆడవచ్చు. పిక్నిక్ పార్టీలు చేసుకోవచ్చు.

wikimedia.org

ఎలా చేరుకోవాలి?

ఎలా చేరుకోవాలి?

ఇక్కడకు దగ్గర్లోని రైల్వేస్టేషన్ ఉడిపిలో ఉంది. రైలు మార్గంలో వచ్చేవారు ఉడిపి చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అగుంబే చేరుకోవచ్చు.

ఉడిపి నుంచి అగుంబే వరకు బస్సులు, ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి.

విమానాల్లో వచ్చేవారు మంగళూరు విమానాశ్రయంలో దిగి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఇక్కడకు రావాల్సి ఉంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X