• Follow NativePlanet
Share
» »శివుడి కాలిబొటన వేలును పూజించే ఏకైక దేవాలయం సందర్శిస్తే సర్వ పాపాలు...

శివుడి కాలిబొటన వేలును పూజించే ఏకైక దేవాలయం సందర్శిస్తే సర్వ పాపాలు...

Written By: Kishore

యుగాంతాన్ని ఈ క్షేత్రంలో చీమలు, ఈగలు ముందుగా చెబుతాయి

బహిస్టు వస్త్రం, మద్యం ఇక్కడ ప్రసాదాలు

ఈ పంచ లింగాల దర్శనంతో పాపాలన్నీ పటాపంచలు

రాజస్థాన్ లోని మౌంట్ అబు గుట్టలు ఆరావళి పర్వతాల్లోనే అత్యంత ఎతైన గుట్టలు. ఈ మౌంట్ అబు పర్వతాల్లోని పలు దేవాలయాలు, ప్రాంతాలు అటు హిందువులతో పాటు జైనులకు కూడా అత్యంత పవిత్రమైన స్థలాలు. అంతే కాకుండా రాజస్థాన్ లోనే అత్యంత ఎతైన మౌంట్ అబులో పచ్చదనం కూడా ఎక్కువ. అందువల్ల ఈ ప్రాంతం చల్లని హిల్ స్టేషన్ కూడా ప్రజల మన్నలను అందుకోంది. ఈ మౌంట్ అబు గుట్టల పై ఉన్న దేవాలయంలో విభిన్న రీతిలో శివపూజ జరుగుతుంది. ఇందుకు సంబంధించిన విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

1. అఛల్ ఘర్

1. అఛల్ ఘర్

Image Source:

ఇప్పటి వరకూ మనం శివుడిని లింగ రూపంలో పూజిస్తారని మాత్రమే తెలుసు. ప్రపంలోని అతి తక్కువ ప్రాంతాల్లో మాత్రమే శివుడిని విగ్రహ రూపంలో పూజిస్తారు. అయితే అఛాల్ ఘర్ లోని అఛాలేశ్వర మహాదేవ్ ఆలయంలో మత్రం శివుడి కుడి కాలు బొటన వేలును పూజిస్తారు.

2. బొటన వేలుకు విశేష పూజలు

2. బొటన వేలుకు విశేష పూజలు

Image Source:

ఈ బొటన వేలుకు విశేష పూజలు చేయడం పురాణ కాలం నుంచి వస్తోందని చెబుతారు. ముఖ్యంగా ఈ బొటన వేలుకు శివుడికి ఇష్టమైన రోజులైన సోమవారం, శివరాత్రి, పౌర్ణమి తదితర రోజుల్లో ప్రత్యేకంగా జలాభిషేకం చేస్తారు. ఆ జలం పరమ పవిత్రమైనదిగా భావించి భక్తులు దానిని ఇళ్లకు కూడా తీసుకువెళుతారు.

3. అర్థ కాశి

3. అర్థ కాశి

Image Source:

కాశిఈని సందర్శించడం వల్ల ఎంత పుణ్యం వస్తోంది. ఈ అచలేశ్వర్ మహాదేవ్ ఆలయంలో పూజలు చేయడం వల్ల అందులో సగం వస్తుందని భక్తుల నమ్మకం అందువల్లే ఈ మౌంట్ అబులోని ఈ అచలేశ్వర్ దేవాలయాన్ని అర్థ కాశీ అని స్థానికంగా పిలుస్తారు. ఈ దేవాలయం పరిసర ప్రాంతాల్లోనే 108 శివుడి దేవాలయాలు ఉన్నాయి.

4. పురాణాల ప్రకారం

4. పురాణాల ప్రకారం

Image Source:

స్కంధ పురాణం ప్రకారం భూలోక పర్యటన చేసే సమయంలో ఈ మౌంట్ అబు పర్వతానికి శివుడు ఒకసారి వస్తాడు. అప్పుడు ఇక్కడ ఉన్నటు వంటి సాధు పుంగవులు ‘స్వామి మీరు ఎప్పుడూ ఇక్కడే ఉంటూ మమ్ములను అనుగ్రహించండి' అని వేడుకున్నారు.

5. నేను భూలోక సంచారిని

5. నేను భూలోక సంచారిని

Image Source:

ఇందుకు స్వామి వారు నేను భూలోక సంచారిని ఒకే చోట ఉండటం కుదరదు. అయితే నా శరీరంలో అతి ముఖ్యమైన అవయవం కాలి బొటనవేలుకు సంబంధించిన గుర్తును ఇక్కడ వదిలి వెలుతున్నానని చెబుతాడు. దీనిని పూజిస్తే నన్ను పూజించినట్టే అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

6. మరో కథనం ప్రకారం

6. మరో కథనం ప్రకారం

Image Source:

మరో కథనం ప్రకారం ఈ మౌంట్ అబు పూర్వ కాలంలో అర్బుదారణ్యం అని పిలిచే వారు. ఈ పర్వత ప్రాంతం ఎప్పుడూ కదులుతూ ఉండటం వల్ల ప్రజలు, ప్రాణులు నశించేవి. సమస్య పరిష్కారం కోసం శివుడు తన కాలి బొటనవేలితో తొక్కి పెట్టారని అందువల్లే ఇక్కడ శివుడి బొటనవేలును పూజిస్తారని చెబుతారు.

7. పర్యాటక ప్రాంతం

7. పర్యాటక ప్రాంతం

Image Source:

మౌంట్ అబులో అనేక పర్యాటక ప్రాంతాలు కూడా ఉన్నాయి. మౌంట్ అబు వన్యప్రాణుల అభయారణ్యం ఇక్కడ చూడదగిన ప్రాంతాల్లో ఒకటి. ఇది దాదాపు 290 చదరపు కిలోమీటర్ల మేర వ్యాపించి ఉంది.

8. దిల్వారా ఆలయాలు

8. దిల్వారా ఆలయాలు

Image Source:

ముందే చెప్పుకున్నట్లు మౌంట్ అబు జైనులకు కూడా పరమ పవిత్రమైన యాత్రా స్థలం. ఇక్కడ తెల్లని పాలరాతితో మలచబడిన దిల్వారా ఆలయాలు చూడ ముచ్చటగా ఉంటాయి. ముఖ్యంగా విమల్ ఆలయం మొదటి జైన తీర్థాకుడికి సంబంధించినదని ఇక్కడి వారు చెబుతుంటారు.

9. నక్కీ సరస్సు

9. నక్కీ సరస్సు

Image Source:

మౌంట్ అబు ప్రాంతంలో సందర్శకులను ఆకర్షించే మరొక ప్రాంతం నక్కీ సరస్సు. ఇది ఎల్లప్పుడూ చల్లగా ఉంటుంది. ఇక ఈ సరస్సుకు సమీపంలోని పర్వతం పై రఘునాథ ఆలయం ఉంది. దీనితో పాటు ఇక్కడ ఉన్న మహారాజా జైపూర్ ప్యాలెస్ కూడా సందర్శకులను ఎంతగానో ఆకర్షిస్తోంది.

10. విష్ణువు పాదముద్రలు కూడా

10. విష్ణువు పాదముద్రలు కూడా

Image Source:

మౌంట్ అబు పై భాగాన విష్ణువు పాదముద్రలు ఉన్నట్లు చెబుతారు. అదే విధంగా ఇక్కడ దుర్గా ఆలయం, అంబికా మాత ఆలయం, అధర్ దేవి ఆలయం, దత్తాత్రేయ ఆలయం వంటి పలు హిందూ దేవాలయాలు కూడా చూడదగినవే.

11. రవాణా

11. రవాణా

Image Source:

మౌంట్ అబు కు దగ్గరగా 27 కిలోమీటర్ల దూరంలో రైల్వే స్టేషన్ ఉంది. ఢిల్లీ, అహ్మదాబాద్ తదితర ముఖ్య పట్టణాల నుంచి ఇక్కడకు నిత్యం రైళ్ల రాకపోకలు ఉంటాయి. అదే విధంగా బెంగళూరు, హైదరాబాద్ ఉజ్జయినీ వంటి నగరాల నుంచి వారానికి ఒకసారి మౌంట్ అబుకు రైలు సౌకర్యం ఉంది.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి