Search
  • Follow NativePlanet
Share
» »ఈ ఐదు సరస్సుల్లో మునిగితే మోక్షం తథ్యం

ఈ ఐదు సరస్సుల్లో మునిగితే మోక్షం తథ్యం

హిందూ పురాణాల ప్రకారం ఐదు పవిత్రమైన సరస్సుల గురించి

By Kishore

బ్రహ్మ నారసింహుడి కాళ్లు కడిగిన ప్రాంతం...బ్రహ్మ నారసింహుడి కాళ్లు కడిగిన ప్రాంతం...

దేశంలో ఏకైక 30 అడుగుల విగ్రహం ఉన్న వామనాలయందేశంలో ఏకైక 30 అడుగుల విగ్రహం ఉన్న వామనాలయం

హిందూ పురాణాలు అంటే మొదట మనకు గుర్తుకు వచ్చేది దేవతలు, పురాణ పురుషులు, బుుషులు. ఇప్పటికీ వీరంతా ఉన్నారని చాలా మంది నమ్ముతారు. అయితే అటు వంటి గొప్ప వ్యక్తులు ఉండే చోటు పరమ పవిత్రమైనది పెద్దవాళ్లు చెబుతారు. అటు వంటి ప్రాంతాల్లో సరస్సులు మొదటి స్థానంలో ఉంటాయి. హిందూ పురాణాల ప్రకారం మన దేశంలో ఉన్న పంచ సరోవరాలు ఉన్నాయని వాటి చుట్టూ ఇప్పటికీ దేవతలు వివిధ రూపంలో సంచరిస్తూ ఉంటారని చెబుతారు. మనుష్యులు ఈ సరోవరాల్లో స్నానం చేస్తే వారికి మోక్షం లభిస్తుందని పెద్దలతో పాటు పురాణాలు చెబుతున్నాయి. ఈ ఐదు సరస్సులు మన భారత దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి. ఇందులో ఒక సరస్సు ఏకంగా విష్ణువు ఆనంద భాష్పాలు రాల్చడం వల్ల ఏర్పడినది కావడం గమనార్హం. ఇక ఈ ఐదు సరస్సులు ఎక్కడ ఉన్నాయి వాటి ప్రత్యేకతలు గురించి మనం ఈ కథనంలో తెలుసుకొందాం.

1.మానస సరోవరం

1.మానస సరోవరం

Image Source:

మనస సరోవరం ఉత్తరాఖండ్ లో ఉంది. ఇక్కడ పార్వతి దేవితో పాటు సకల దేవతలు స్నానం చేస్తారని చెబుతారు ఆ సమయంలో ఒక వెలుగు కనబడుతుందని ఇక్కడికి వెళ్లి వచ్చినవారు చెబుతుంటారు.
ఈ మనస సరోవరం పర్కనే కైలాస పర్వతం ఉంది. ఇది శివుడు నివసించే ప్రాంతంగా చెబుతారు. అందువల్లే ఈ పర్వతం పైకి ఎవరూ ఎక్కడానికి వీలు కాలేదని హందువుల నమ్మకం. ఈ మానస సరోవరం హిందువులతో పాటు బౌద్దులకు కూడా పవిత్రమైన స్థలం.

2.బింద్ సరోవరం

2.బింద్ సరోవరం

Image Source:

గుజరాత్ లోని పఠాన్ జిల్లాలో ఉన్న సిద్ధాపూర్ తాలూకాలో బిందు సరోవరం ఉంది. దీనిని మాత`గయ అని కూడా అంటారు. విష్ణువు ఆనంద బాష్పాలు రాల్చడం వల్ల ఏర్పడిన సరోవరం కావడం వల్లే ఇది పవిత్రమైనది హిందువులు భావిస్తారు. ఇక్కడ మాత`దేవతలకు కర్మలను కూడా నిర్వహిస్తారు. హిందూ పురాణాల ప్రకారం ప్రపంచం మొత్తం మీద పిత్రు దేవతలకు కాకుండా మాత`దేవాలకు శ్రద్ధలను నిర్వహించడానికి అర్హమైన ప్రాంతం ఇదొక్కటే. దీని ప్రస్తావన బుుగ్వేదంలో కూడా ఉంది.

3.నారాయణ సరోవరం

3.నారాయణ సరోవరం

Image Source:

గుజరాత్ లోని కచ్ జిల్లాలో లక్ పట్ తాలూకాలోని నారాయణ్ సర్ అనే గ్రామం వద్ద ఈ నారయణ సరోవరం ఉంది. హిందువులకు అతి పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో ఇది కూడా ఒకటి. ఈ సరోవరంలో సాక్షాత్తు నారాయణుడు స్నానం చేయడం వల్ల అవిత్రమైనదని హిందువుల భావన. హిందు పురాణాల్లో ఈ నారాయణ సరోవరం ప్రస్థావన ఉంది. అందువల్ల ఇది అతి పురాతనమైన సరోవరంగా భక్తులు నమ్ముతారు.

4.పుష్కర సరోవరం

4.పుష్కర సరోవరం

Image Source:

భారత దేశంలోని పరమ పవిత్రమైన సరోవరాల్లో పుష్కర్ సరోవరం కూడా ఒకటి. ఈ సరోవరంలోనే బ్రహ్మదేవుడు అతి గొప్ప యాగం చేసాడని చెబుతారు. అందువల్ల ఈ సరోవరం హిందువులకు అత్యంత పవిత్రమైనది.

5.పంపా సరోవరం

5.పంపా సరోవరం

Image Source:

కర్ణాటకలోని ఈ సరోవరం ప్రసిద్ధ పర్యాటక కేంద్రం హంపికి దగ్గరగా ఉంది. ఇక్కడే పరమేశ్వరుడు తప్పస్సు చేయడం వల్ల ఈ సరోవరం పరమ పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ సరోవరం ప్రస్తావన రామయణ కాలంలో కూడా వినిపిస్తుంది. ఈ సరోవరం వద్దే శబరి రాముడి కోసం ఎదురు చూస్తున్నట్లు చెబుతారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X