• Follow NativePlanet
Share
» »అటు శృంగారానికీ ఇటు ఆధ్యాత్మికతకు అనువైనవి...ఈ వేసవి సెలవుల్లో మిస్ కానీయకండి

అటు శృంగారానికీ ఇటు ఆధ్యాత్మికతకు అనువైనవి...ఈ వేసవి సెలవుల్లో మిస్ కానీయకండి

Written By: Beldaru Sajjendrakishore

బీచ్ అంటే సముద్ర తీర ప్రాంతంమన్న విషయం తెలిసిందే కదా. ఇక మొదట మనకు ఆహ్లాద కరమైన, శృంగార పరమైన భావన మదిలో మెరుస్తుంది. అయితే అదే విధంగా దేవాలయం అంటే మొదట మనకు గుర్తుకు వచ్చేది భక్తి భావం. అటు పై ఆధ్యాత్మికత. ఇక బీచ్ కు చిన్న పిల్లలతో పాటు వయస్సులో ఉన్న యువతీ యువకులు ఆకర్షితులైతే దేవాలయాలకు మధ్య వయస్సులు, ముసలి వారు వెళ్లాలను కుంటారు. అయితే కుంటుంబమన్న తర్వాత అటు యువతీ యువకులూ, ఇటు మధ్య వయస్కులు, ముసలి వారు కూడా ఉంటారు.

ఇక్కడకు మీరు వెళితే ...'శని'...మీ నుంచి దూరంగా వెలుతాడు...

దంపతులు జంటగా వెళ్లకూడని ఏకైక దేవాలయం ఇదే...అలా వెలితే విడాకులే...

బ్రహ్మయజ్జం చేసిన చోట...రక్తం ప్రవహించిన నది...స్నానం చేస్తే...

వేసవి సెలవుల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క చోటుకు పర్యాటకానికి వెళ్లాలను కుంటే కుదరదు కదా అప్పుడే అటు బీచ్ లు ఇటు దేవాలయాలు రెండూ ఒకే చోటు ఉండే ప్రాంతాలు ఏవైనా ఉన్నాయా అనే ఆలోచన మదిలో మెదులుతుంది. అందుకు సమాధానమే ఈ కథనం. ఈ కథనంలో దక్షిణ భారత దేశంలో అటు బీచ్ ఒడ్డునే దేవాలయాలు ఉన్న ప్రాంతాలు, అక్కడకు ఎలా వెళ్లాలి తదితర విషయాలన్నింటినీ ఈ కథనంలో తెలుసుకుందాం.

1. మురుడేశ్వర్

1. మురుడేశ్వర్

Image Source:

కర్ణాటకలోని మురుడేశ్వర్ వెళ్ళటానికి రోడ్డు, రైలు మరియు విమాన మార్గాలు అందుబాటులో ఉన్నాయి. విమానమార్గం మురుడేశ్వర్ కు సమీపాన ఉన్న విమానాశ్రయం మంగళూరు విమానాశ్రయం. ఇది 153 కి. మీ. దూరంలో ఉంటుంది. ఏర్ పోర్ట్ నుండి క్యాబ్ లేదా ప్రవేట్ ట్యాక్సీ లను ఆద్దెకు తీసుకొని మురుడేశ్వర్ చేరుకోవచ్చు. రైలు మార్గం మురుడేశ్వర్ లో రైల్వే స్టేషన్ ఉన్నది కానీ కొన్ని రైళ్లు మాత్రమే ఆగుతాయి. సమీపాన ఉన్న ప్రధాన రైల్వే జంక్షన్ మంగళూరు స్టేషన్.

2. బస్సులు ట్యాక్సీలు

2. బస్సులు ట్యాక్సీలు

Image Source:

ఇక్కడి నుండి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు ప్రయాణించవచ్చు. ట్యాక్సీ లేదా ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించి మురుడేశ్వర్ చేరుకోవచ్చు. రోడ్డు మార్గం మురుడేశ్వర్ కు సమీప నగరాల నుండి, పట్టణాల నుండి ప్రభుత్వ మరియు ప్రవేట్ బస్సులు తిరుగుతుంటాయి. బెంగళూరు నుండి హోనావార్ కు నేరుగా బస్సులు అందుబాటులో ఉన్నాయి. హోనావార్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మురుడేశ్వర్ కు క్యాబ్ లేదా ట్యాక్సీ లలో చేరుకోవచ్చు.

3. నిలువెత్తు విగ్రహం

3. నిలువెత్తు విగ్రహం

Image Source:

శివుని విగ్రహం మురుడేశ్వర్ లో శివుని విగ్రహం ప్రధాన ఆకర్షణ. చుట్టూ అరేబియా సముద్రం పక్కనే 123 అడుగుల ఎత్తులో భారీ శివుని విగ్రహం మరియు శివలింగాలతో కూడిన అనేక ఆలయాలు దర్శనమిస్తాయి. సమీపంలోని రాజగోపురం 20 అంతస్తులు కలిగి ఉండి గ్రానైట్ రాయితో నిర్మించబడింది. భారత దేశంలో అత్యంత ఎతైన దేవాలయ గోపుర విషయంలో ఇది రెండో స్థానంలో నిలుస్తుంది.

4. బీచ్

4. బీచ్

Image Source:

మురుడేశ్వర్ లో ఆలయాలు చూసిన తర్వాత పక్కనే ఉన్న బీచ్ తప్పక సందర్శించాలి. బీచ్ లో పర్యాటకులు సేదతీరుతూ పొడవైన శివుని విగ్రహాన్ని చూసి ఆనందిస్తారు. యాత్రికులు నీటి సంబంధిత ఆటలు అంటే బోటింగ్, స్విమ్మింగ్ వంటివి చేయవచ్చు. సాయంత్రంవేళ బీచ్ లో కూర్చొని సూర్యాస్తమ ఘట్టాన్ని తిలకించవచ్చు. ముఖ్యంగా సూర్యాస్తమయాన్ని చూడటానికే చాలా మంది ఇక్కడకు వస్తుంటారు.

5.మహాబలిపురం

5.మహాబలిపురం

Image Source:

చేరుకోవడం ఎలా ?? మహాబలిపురం చేరుకోవటానికి రోడ్డు, రైలు మరియు విమాన మార్గాలు అందుబాటులో ఉన్నాయి విమాన మార్గం మహాబలిపురానికి సమీపంలో ఉన్న విమానాశ్రయం చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది సుమారు 54 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. క్యాబ్ లేదా ట్యాక్సీ వంటి ప్రవేట్ వాహనాలు అద్దెకు తీసుకొని మహాబలిపురం చేరుకోవచ్చు. ఇక్కడ నుంచి మహాబలిపురానికి 24 గంటల పాటు ట్యాక్సీ సేవలు అందుబాటులో ఉంటాయి.

6. రైలు మార్గం

6. రైలు మార్గం

Image Source:

మహాబలిపురం లో ఎటువంటి రైల్వే స్టేషన్ లేదు కానీ సమీపంలో చెంగల్పట్టూ రైల్వే స్టేషన్ కలదు. ఇది 29 కిలోమీటర్ల దూరంలో కలదు. ట్యాక్సీ లేదా బస్సుుల్లో ప్రయాణించి మహాబలిపురం చేరుకోవచ్చు. రోడ్డు మార్గం చెన్నై మరియు సమీప ఇతర పట్టణాల నుండి , నగరాల నుండి మహాబలిపురం కు ప్రభుత్వ బస్సులు తిరుగుతుంటాయి. చెన్నై నుండి ప్రభుత్వ మరియు ప్రవేట్ బస్సులు మహాబలిపురానికి నిత్యం తిరుగుతుంటాయి.

7. షోర్ టెంపుల్

7. షోర్ టెంపుల్

Image Source:

మహాబలిపురం లో చూడవలసినది సముద్ర ఒడ్డున ఉన్న షోర్ టెంపుల్. గ్రానైట్ రాళ్లతో నిర్మించిన ఈ ఆలయం మహాబలిపురానికి స్మారకం లాంటిది. ఈ ఆలయం లో శివుడు, విష్ణువు మరియు దుర్గ అమ్మవారి విగ్రహాలు దర్శనం ఇస్తాయి. దీనితో పాటు పంచ రథాల నిర్మాణం మరియు టైగర్ గుహలు మొదలగునవి చూడవచ్చు. ఇక్కడ ఆలయాల పై ఉన్న విగ్రహాలను చూస్తూ ఉంటే ఏలియన్స్ (గ్రహాంతర వాసులు) గుర్తుకు వస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు.

8. బీచ్

8. బీచ్

Image Source:

మహాబలిపురం లో షోర్ టెంపుల్ చూసిన తర్వాత పక్కనే ఉన్న బీచ్ తప్పక సందర్శించాలి. ఈ బీచ్ లో సాయంత్రం పూట చల్లని గాలులను ఆస్వాదించవచ్చు. బీచ్ లోతు ఎక్కువగా ఉంటుంది కాబట్టి లోనికి పోకపోవడం ఉత్తమం. ఇక్కడ గవ్వల తో చేసిన వస్తువులు కొనుక్కోవటం, మంచి రుచికరమైన సీ ఫుడ్ లను తినటం చేయవచ్చు. ధరలు కూడా సమాన్య, మధ్య తరగతి వర్గాలకు అందుబాటులోనే ఉంటాయి.

9. విజింజమ్

9. విజింజమ్

Image Source:

విజింజమ్ ఎలా చేరుకోవాలి ? విజింజమ్ గ్రామం చేరుకోవాలంటే ముందుగా ఈ గ్రామానికి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరువనంతపురం నగరానికి చేరుకోవాలి. తిరువనంతపురం నగరంలో అంతర్జాతీయ విమానాశ్రయం కలదు. దేశంలోని అన్ని నగరాల నుంచి తిరువనంతపురానికి విమాన సర్వీసులు ఉన్నాయి. అక్కడి నుండి రోడ్డు మార్గం గుండా 17 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే విజింజమ్ చేరుకోవచ్చు.

10. రైలు మార్గం

10. రైలు మార్గం

Image Source:

తిరువనంతపురం లో రైల్వే స్టేషన్ కలదు. అక్కడి నుండి ట్యాక్సీ లేదా బస్సు లో ప్రయాణించి విజింజమ్ సులభంగా చేరుకోవచ్చు. రోడ్డు మార్గం విజింజమ్ చేరుకోవటానికి తిరువనంతపురం నుండి ప్రభుత్వ బస్సులు అందుబాటులో ఉన్నాయి. అలాగే కోవాలం నుండి కూడా బస్సులు విజింజమ్ తిరుగుతుంటాయి. కాబట్టి ఎటు చూసిన తిరువనంతపురం నుండి రోడ్డు మార్గం గుండా మాత్రమే విజింజమ్ చేరుకోవటానికి సౌకర్యాలు అధికంగా ఉన్నాయి.

11. అజ్హిమలై శివ ఆలయం

11. అజ్హిమలై శివ ఆలయం

Image Source:

విజింజమ్ గ్రామంలోని ఒక కొండ మీద అజ్హిమలై శివ ఆలయం ఉన్నది. కొండ మీద ఉన్న ఈ శివాలయానికి శివరాత్రి మరియు పండుగ పర్వదినాల్లో భక్తులు అధికంగా వస్తుంటారు. చర్చి, మసీదు కూడా ఉంది. విజింజమ్ లో కొండ మీద ఉన్న శివుని ఆలయాన్ని చూసిన తర్వాత కింద ఉన్న బీచ్ తప్పక సందర్శించాలి. ఈ బీచ్ లోని ఇసుక తిన్నెల మీద కూర్చొని సాయంత్రం పూట సూర్యాస్తమాన్ని వీక్షించవచ్చు. నీటి క్రీడలకు ఈ బీచ్ అనువైనదే ..!

12. గోకర్ణం

12. గోకర్ణం

Image Source:

ఎలా చేరుకోవాలి ? కర్ణాటకలోని గోకర్ణం చేరుకోవటానికి రైలు, రోడ్డు మరియు విమాన మార్గాలు అందుబాటులో ఉన్నాయి. గోకర్ణం పట్టణానికి సమీపంలో ఉన్న విమానాశ్రయం గోవా లోని అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది గోకర్ణకు 140 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. పర్యాటకులు విమానాశ్రయం నుండి క్యాబ్ లేదా ట్యాక్సీ లను అద్దెకు తీసుకొని గోకర్ణం చేరుకోవచ్చు. దేశ విదేశాల నుంచి గోవా కు నిత్యం విమానయాన సేవలు అందుబాటులో ఉన్నాయి.

13. రైలు మార్గం

13. రైలు మార్గం

Image Source:

గోకర్ణంకు ఎటువంటి రైల్వే స్టేషన్ లేదు. అంకోలా రైల్వే స్టేషన్ 20 కి.మీ. దూరం ఉండి, సమీపంలో ఉంటుంది. ఈ రైలు స్టేషన్ నుండి స్ధానిక బస్ లేదా టాక్సీ లపై గోకర్ణం చేరవచ్చు. రోడ్డు మార్గం మార్గోవా, డబోలిం, బెంగళూరు మరియు మంగళూరు ల నుండి గోకర్ణం పట్టణానికి బస్సులు నిత్యం తిరుగుతుంటాయి. పర్యాటకులు ప్రతిరోజు నిర్వహించే టూరిస్ట్ బస్సుల ద్వారా కూడా గోకర్ణం పట్టణానికి చేరుకోవచ్చు.

14. మహాబలేశ్వర్ ఆలయం

14. మహాబలేశ్వర్ ఆలయం

Image Source:

గోకర్ణం కర్ణాటకలో బీచ్ లకు మరియు ఆలయాలకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం. చాలావరకు ఆలయాలన్ని బీచ్ ఒడ్డునే ఉంటాయి. అందులో ప్రధానమైనది మహాబలేశ్వర్ ఆలయం. ఇక్కడి ప్రధాన దైవం లింగ రూపంలో ఉన్న శివుడు. అలాగే ఇక్కడ భద్రకాళి ఆలయం, మహా గణపతి ఆలయం చూడదగినవి. బీచ్ గోకర్ణం బీచ్ చుట్టు పక్కల అంతా అరేబియా సముద్రం, పడమటి కనుమలు మరియు ఆలయాలు. వాటర్ బోటింగ్, సన్ బాతింగ్ వంటివి ఇక్కడ చేయవచ్చు. ఎటువంటి కాలుష్యం, శబ్ధాలు లేని ప్రశాంతమైన వాతావరణాన్ని బీచ్ లో ఆస్వాదించవచ్చు.

15. తిరుచెందూర్

15. తిరుచెందూర్

Image Source:

తిరుచెందూర్ ఎలా చేరుకోవాలి ? తమిళనాడులోని తిరుచెందూర్ చేరుకోవటానికి రోడ్డు, రైలు మరియు విమాన మార్గాలు అందుబాటులో ఉన్నాయి. విమాన మార్గం తిరుచెందూర్ కు సమీపాన ఉన్న విమానాశ్రయం తూటికోరిన్ విమానాశ్రయం. ఇది 27 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఆలాగే మధురై విమానాశ్రయం మరియు తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం (150 కి. మీ) లు కూడా తిరుచెందూర్ కు సమీపాన ఉన్నాయి.

16. అద్దెకు ట్యాక్సీలు

16. అద్దెకు ట్యాక్సీలు

Image Source:

క్యాబ్ లేదా ట్యాక్సీ వంటి వాహనాలను ఆద్దెకు తీసుకొని తిరుచెందూర్ చేరుకోవచ్చు. రైలు మార్గం తిరుచెందూర్ కు సమీపాన ఉన్న ప్రధాన రైల్వే జంక్షన్ తిరునల్వేలి రైల్వే జంక్షన్. ఇది 60 కిలోమీటర్ల దూరంలో ఉండి రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలతో, పట్టణాలతో కలుపబడి ఉన్నది. స్థానిక బస్సుల్లో గాని ట్యాక్సీ లో గాని ప్రయాణించి తిరుచెందూర్ చేరుకోవచ్చు.

17. రోడ్డు మార్గం

17. రోడ్డు మార్గం

Image Source:

చెన్నై, మధురై, తిరునల్వేలి, తిరువనంతపురం మరియు కన్యాకుమారి నగరాల నుండి తిరుచెందూర్ కు ప్రభుత్వ బస్సులు తరచూ అందుబాటులో ఉంటాయి. తిరుచెందూర్ మురుగన్ ఆలయం తిరుచెందూర్ మురుగన్ టెంపుల్, పట్టణం లోనే ప్రధాన ఆకర్షణ. ఈ ఆలయంలో మురుగన్ తో పాటు ఆయన భార్యలు వల్లి మరియు దేవసేన కొలువుదీరి ఉంటారు. ఆలయం ప్రవేశంలో తొమ్మిది అంతస్తుల గోపురం, ప్రాంగణంలో నీటి బుగ్గ కూడా ఉన్నది.

18. బీచ్

18. బీచ్

Image Source:

మురుగన్ ఆలయానికి పక్కనే సముద్రం ఉన్నది. ఈ సముద్రం ఒడ్డున ప్రకృతిని ఆస్వాదిస్తూ సాయంత్రంపూట హాయిగా గడిపేయవచ్చు. తడిసిన ఇసుక తిన్నెల మీద నడుస్తూ, కాళ్లకు చిన్న చిన్న ఇసుక రాళ్లు తగులుతూ ఎంజాయ్ చేయవచ్చు. సముద్రంలో సూర్యాస్తమ సన్నివేశాలను కనులారా వీక్షించి ఆనందం పొందవచ్చు. ముఖ్యంగా హనిమూన్ జంటలకు ఈ ప్రాంతం అత్యంత అనువైనదని చెప్పవచ్చు.

19. రామేశ్వరం

19. రామేశ్వరం

Image Source:

రామేశ్వరం ఎలా చేరుకోవాలి ? రామేశ్వరం చేరుకోవటానికి రైలు, రోడ్డు మరియు వాయు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. రామేశ్వరానికి 168 కిలోమీటర్ల దూరంలో ఉన్న విమానాశ్రయం మధురై విమానాశ్రయం. ఇది చెన్నై ఆంతర్జాతీయ విమానాశ్రయానికి చక్కగా అనుసంధానించడం జరిగింది. విమానాశ్రయం నుండి క్యాబ్ లేదా ట్యాక్సీ వంటి ప్రవేట్ వాహనాలను ఆద్దెకు తీసుకొని రామేశ్వరానికి చేరుకోవచ్చు.

అటు శృంగారానికీ ఇటు ఆధ్యాత్మికతకు అనువైనవి

అటు శృంగారానికీ ఇటు ఆధ్యాత్మికతకు అనువైనవి

20. రైలు మార్గం

Image Source:

రామేశ్వరంలో రైల్వే స్టేషన్ ఉన్నది. ఇక్కడి నుండి దక్షిణ భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలకు ప్రయాణించవచ్చు. చెన్నై, మధురై, కొచ్చి, బెంగళూరు, తిరుపతి వంటి నగరాలకు బాగా అనుసంధానించబడి ఉన్నది. రోడ్డు మార్గం మధురై, కన్యాకుమారి, చెన్నై, ట్రిచి వంటి నగరాల నుండి రామేశ్వరానికి ప్రభుత్వ బస్సుల తో పాటుగా , ప్రవేట్ బస్సులు అందుబాటులో ఉన్నాయి.

అటు శృంగారానికీ ఇటు ఆధ్యాత్మికతకు అనువైనవి

అటు శృంగారానికీ ఇటు ఆధ్యాత్మికతకు అనువైనవి

21. రామనాథస్వామి ఆలయం

Image Source:

రామనాథస్వామి ఆలయం రామేశ్వరం హిందువుల పుణ్య క్షేత్రం. ఇక్కడ చెప్పుకోవలసినది రామనాథస్వామి ఆలయం. ఈ ఆలయం దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటి. 12 వ శతాబ్ధంలో పాండ్య రాజులచే నిర్మించబడ్డ ఈ ఆలయంలో శిల్ప శైలి, కళలు అద్భుతంగా ఉంటాయి. కాశీ యాత్ర రామేశ్వరం దర్శనంతోనే పూర్తవుతుందని హిందువుల నమ్మకం.

అటు శృంగారానికీ ఇటు ఆధ్యాత్మికతకు అనువైనవి

అటు శృంగారానికీ ఇటు ఆధ్యాత్మికతకు అనువైనవి

22. బీచ్

Image Source:

రామనాథ స్వామి ఆలయానికి సమీపంలో అందమైన ఒక బీచ్ కూడా కలదు. పర్యాటకులు శని, ఆదివారాలలో ఈ బీచ్ ను సందర్శించడానికి వస్తుంటారు. వారికి ఇదొక పిక్నిక్ స్పాట్ గా మారిపోయింది. ఈ బీచ్ అందాలను మరింత పెంచుతూ ఇక్కడ సరివి చెట్లు తోటలుంటాయి. స్విమ్మింగ్, బోటింగ్, సర్ఫింగ్ వంటి నీటి ఆటలు కలవు. దగ్గర్లోని ధనుష్కోటికి కూడా మనం వెళ్లి రావచ్చు. ఇక్కడ నీటి పై తేలే రాళ్లు ఎక్కువగా దొరుకుతుంటాయి.

అటు శృంగారానికీ ఇటు ఆధ్యాత్మికతకు అనువైనవి

అటు శృంగారానికీ ఇటు ఆధ్యాత్మికతకు అనువైనవి

23. కన్యాకుమారి

Image Source:

కన్యాకుమారి కి రైలు, రోడ్డు మరియు విమాన మార్గాలు అందుబాటులో ఉన్నాయి. విమాన మార్గం కన్యాకుమారి లో ఎటువంటి విమానాశ్రయం లేదు కానీ 93 కిలోమీటర్ల దూరంలో తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నది. ఈ విమానాశ్రయం నుండి క్యాబ్ లేదా ట్యాక్సీ వంటి ప్రవేట్ వాహనాలను అద్దెకు తీసుకొని కన్యాకుమారి చేరుకోవచ్చు. కన్యాకుమారి లో రైల్వే స్టేషన్ ఉన్నది. రోడ్డు మార్గం చెన్నై, తిరువనంతపురం, మధురై, చెన్నై వంటి ప్రాంతాల నుండి కన్యాకుమారి కి చక్కటి రోడ్డు మార్గం కలదు.

అటు శృంగారానికీ ఇటు ఆధ్యాత్మికతకు అనువైనవి

అటు శృంగారానికీ ఇటు ఆధ్యాత్మికతకు అనువైనవి

24. కుమారి అమ్మన్ ఆలయం

Image Source:

కుమారి అమ్మన్ టెంపుల్ లేదా కన్యాకుమారి టెంపుల్ సముద్రపు ఒడ్డున కలదు. ఈ దేవత పార్వతి అవతారం. ఈ టెంపుల్ ను పాండ్య రాజులు ఎనిమిదవ శతాబ్దం లో నిర్మించారు. కన్యాకుమారి టెంపుల్ లో నేటికి 18 వ శతాబ్దం నాటి ఒక పవిత్ర ప్రదేశం దేవత యొక్క పాద ముద్రలు చూడవచ్చు. ఇవే కాకుండా కన్యాకుమారిలో వివిధ స్మారకాలు కూడా వయోభేదం లేకుండా ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తుంటాయి.

అటు శృంగారానికీ ఇటు ఆధ్యాత్మికతకు అనువైనవి

అటు శృంగారానికీ ఇటు ఆధ్యాత్మికతకు అనువైనవి

25. బీచ్

Image Source:

ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత పర్యాటకులు తప్పకుండా సమీపంలోని బీచ్ సందర్శించాలి. సూర్యోదయ, సూర్యాస్తమ దృశ్యాలు కనులారా చూడటానికి ఇక్కడి బీచ్ లన్నీ అనుకూలంగా ఉంటాయి. ఇసుక తిన్నెల వెంబడి మనకు నచ్చిన, మెచ్చిన నెచ్చెలి వెంట నడవడం మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుందనడంలో సందేహం లేదు. ఈ బీచ్ లో సినిమాల చిత్రీకరణ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఇక ఇప్పుడిప్పుడే జల క్రీడలు కూడా అందుబాటులోకి వచ్చాయి.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి