Search
  • Follow NativePlanet
Share
» »వేసవి పర్యాటకంలో వీటిని మిస్ కాకండి

వేసవి పర్యాటకంలో వీటిని మిస్ కాకండి

By Beldaru Sajjendrakishore

వేసవిలో పర్యాటకం సాధారణం విషయం. చాలా మంది తాము వెళ్లే ప్రాతంలో ఎన్ని చూడదగిన ప్రాంతాలు ఉన్నాయి, వాటిలో మనం వేటికి వెళ్లాలి, తదితర విషయాలన్నీ బేరీజు వేసుకుని ఎక్కడికి వెళ్లాలన్న విషయం పై నిర్ణయానికి వస్తారు. అటు పై అక్కడ ఎన్ని రోజులు గడపాలన్న విషయాన్ని అలోచిస్తారు. ఈ నేపథ్యంలో కర్ణాటకలో వేసవిలో పర్యాటకానికి అనుకూలమైన ప్రాంతాల్లో బెంగళూరు, కూర్గ్, మంగళూరు, కార్వార, హంపిలు ఉన్నాయి. ఈ ప్రాంతాలకు వెళ్లితే అను పుణ్యక్షేత్రాల దర్శనంతో పాటు పిల్లలు, పెద్దలు ఇష్టపడే బీచ్, నదీ జలాల్లో క్రీడలు ఆడవచ్చు. ఇలా ఒకే ప్రాంతంలో వివిధ రకాల పర్యాటక అనుభావాలు సొంతం చేసుకోవడానికి మీరు సిద్ధమా

1. బెంగళూరు

1. బెంగళూరు

Image source

ఈ నగరంలో అనేక రకాల పర్యాటక అనుభూతులు మిగులుస్తుంది. అటు ప్రాచీన చరిత్రకు ఆలవాలమైన భవంతులతో పాటు అత్యాధునిక మాల్స్ కూడా ఈ నగరం సొంతం చేసుకుంది.

చూడదగిన ప్రాంతాలు.... 1.బన్నేరుగట్ట నేషన్ పార్క్, 2.ఇక్కడే ఉన్న సీతాకోక చిలుకల పార్క్, 3. లాల్ బాగ్, 4. కబ్బన్ పార్క్, 5.టిప్పు సుల్తాన్ ప్యాలెస్, 6.వండర్ లా, 7.ఇస్కాన్, 8.ఎరోస్పేస్ మూజియం

విమానం, రైలు.... బెంగళూరు నగరంలోనే అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఈ సిటీలోనే రైల్వే స్టేషన్ కూడా ఉంది. దేశంలోని పలు ప్రాతంల నుంచి బస్సు సౌకర్యం ఉంది.

2. కూర్గ్

2. కూర్గ్

Image source

ప్రకృతి రమణీయతను ఎక్కువగా ఇష్టపడే వారు ఈ ప్రాంతాన్ని ఎన్నుకోవచ్చు. చుట్టూ అందమైన పచ్చటి కొండలు, గలగల పారే సెలయేళ్లు ఇక్కడ కనువించదు చేస్తాయి.

తప్పకుండా చూడాల్సిన ప్రాంతాలు 1.అబ్బే ఫాల్స్, 2.ఇరుప్పి పాల్స్, 3.బైలుకుప్పే, దుబారే ఎలిఫెండ్ క్యాంప్, నాగర్ హోల్ నేషనల్ పార్క్, బ్రహ్మగిరి శిఖరం, చిట్టల్లి

విమానం, రైలు.... కూర్గ్ కు దగ్గరగా 106 కిలోమీటర్ల దూరంలో మైసూరు నగరంలో రైల్వే స్టేషన్ ఉంది. మంగళూరు, హాసన్ నుంచి కూడా ఇక్కడకు రైలు సౌకర్యం కలదు. ఇక్కడకు బెంగళూరు విమానాశ్రంయం 260 కిలోమీటర్లు, మంగళూరు ఎయిర్ పోర్ట్ 135 కిలోమీటర్ల దూరం ఉంటుంది.

3.కబిని

3.కబిని

Image source

కావేరి నది ఉపనది అయిన కబిని నదీ జలాల్లో ప్రయాణం, ఆ తీరం వెంబడి ఉన్న పర్యాటక ప్రాంతాలను చూడటం మరిచిపోలేని అనుభూతి

తప్పకుండా చూడాల్సిన ప్రాంతాలు...నాగర్ హోల్ జాతీయ పార్క్ లో ఎలిఫెంట్ సఫారీ, కబినీ నదీ జలాల్లో ప్రయాణం, కబిని జలాశయం.

రైలు, విమానం. కబినికి దాదాపు 250 కిలోమీటర్ల దూరంలో బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం ఉంటుంది. ఇక్కడకు మైసూరు రైల్వే స్టేషన్ కేవలం 10 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది.

4. జోగ్ ఫాల్స్

4. జోగ్ ఫాల్స్

Image source

దేశంలో అత్యంత ఎతైన జలపాతాల్లో ఒకటైన జోగ్ జలపాతం వర్షాకాలంలో చూడటానికి బాగుంటుంది. అయితే వేసవి కూడా ఇక్కడి ప్రకృతి అందాలు రా రమ్మని ఆహ్వానిస్తుంటాయి.

తప్పకుండా చూడాల్సిన ప్రాంతాలు..లింగనమక్కి డ్యాం, తుంగా డ్యాం, తవరే కొప్ప పులి సంరక్షణ కేంద్రం,

విమాన, రైలు సౌకర్యం...జోగ్ జలపాతానికి 33 కిలోమీటర్ల దూరంలో సాగర్ రైల్వే స్టేషన్ ఉంది. హుబ్లీ విమానాశ్రయం ఇక్కడకు 133 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

5.శివమొగ్గ...

5.శివమొగ్గ...

Image source

ప్రకృతి రమణీయతను ఇష్టపడే వారు వేసవిలో శివమొగ్గకు కచ్చితంగా వెలుతారు. వేసవిలో కూడా ఇక్కడ పచ్చదనం కనుమరుగు కాదు.

తప్పక చూడాల్సిన ప్రాంతాలు....శివప్పనాయక్ సమ్మర్ ప్యాలెస్, సీతారామ దేవాలయం, లయన్ సఫారీ సక్రేబైలు ఎలిఫెంట్ క్యాంప్

విమాన, రైలు సౌకర్యం మంగళూరు విమానాశ్రయం ఇక్కడకు 195 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక శివమొగ్గలోనే రైల్వే స్టేషన్ ఉంది.

6. మంగళూరు బీచ్ స్వర్గధామం

6. మంగళూరు బీచ్ స్వర్గధామం

Image source

బీచ్ టూరిజాన్ని ఇష్టపడే వారు ఇక్కడకు ఎక్కువగా వెలుతుంటారు. అరాబియా సముద్ర తీర ప్రాంతంలోని వీటి అందాలను తిలకించడానికి వీకెండ్ టూర్స్ ను కూడా ప్లాన్ చేసుకోవచ్చు.

తప్పక చూడాల్సిన ప్రాంతాలు తన్నీరు బావి బీచ్, పనంబూర్ బీచ్ మంగళాదేవి దేవాలయం, కాద్రి మంజునాథ దేవాలయం, సోమేశ్వర దేవాయం,

విమాన, రైలు సౌకర్యం మంగళూరులో రైల్వే స్టేషన్, ఎయిర్ పోర్ట్ రెండూ ఉన్నాయి. రవాణా సౌకర్యాలు బాగా ఉండటంతో పర్యాటకులు ఎక్కువ మంది వస్తుంటారు.

7.కార్వార్

7.కార్వార్

Image source

కర్వార బీచ్ లకే కాకుండా టెంపుల్ టూరిజానికి కూడా చాలా ప్రఖ్యాతి గాంచింది. అంతే కాకుండా చరిత్రను తెలుసుకోవాలని భావించేవారికి శిథిలమైన కోట గోడలు ఎన్నో కథలు చెబుతాయి.

తప్పక చూడాల్సిన ప్రాంతాలు.... మజలిబీచ్, కురుమ్ ఘాడ్ ద్వీప్ వరకూ బోటు ప్రయాణం, సదాశివఘడ్ కోట, దుర్గాదేవి, నాగనాథ్ దేవాలయం

విమాన, రైలు సౌకర్యం....గోవా ఎయిర్ పోర్ట్ ఇక్కడకు రెండు గంటల ప్రయాణ దూరంలో ఉంటుంది. కార్వార పట్టణంలో రైల్వే స్టేషన్ ఉంది.

8.గోకర్ణ

8.గోకర్ణ

Image source

హిందువులకు పరమపవిత్రమైన శైవక్షేత్రాల్లో ఇది ఒకటి. అయితే ఇక్కడ బీచ్ లు కూడా పర్యాటకులను రారమ్మని ఆహ్వనిస్తుంటాయి.

తప్పక చూడాల్సిన ప్రాంతాలు.... మహాబలేశ్వర్ దేవాలయం, మహాగణపతి దేవాలయం, ఓంబీచ్, ఇక్కడ బానాన బోట్ రైడింగ్ ను మాత్రం మరిచిపోకండి.

విమాన, రైలు సౌకర్యం....గోకర్ణలో రైల్వే స్టేషన్ ఉంది. గోవ విమానాశ్రయం ఇక్కడకు దాదాపు 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

9.బండీపుర నేషనల్ పార్క్

9.బండీపుర నేషనల్ పార్క్

Image source

ప్రకృతితో ఊసులు పంచుకోవాలని భావించే వారికి అత్యంత సురక్షితమైన పర్యాటక కేంద్రాల్లో బండిపుర నేషనల్ పార్క్ ఒకటి. ఇక్కడ ఏనుగుల మీద స్వారీ చేస్తూ దగ్గరగా పులులను చూడవచ్చు.

తప్పక చూడాల్సిన ప్రాంతాలు.... హిమవాడ గోపాలస్వామి దేవాలయం, బిలిగిరి రంగస్వామి దేవాలయం, ఆంజనేయస్వామి దేవాలయం, బిలిగిరి పర్వత ప్రాంతాల్లో ట్రెక్కింగ్, బండీపురే నేషన్ పార్క్ లో సఫారీ

విమాన, రైలు సౌకర్యం....బెంగళూరు విమానాశ్రయం ఇక్కడకు దగ్గరగా ఉంటుంది. దాదాపు 220 కిలోమీటర్ల దూరం. ఇక మైసూరు రైల్వే స్టేషన్ జాతీయ పార్క్ కు 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

10.దండేలి

10.దండేలి

Image source

ప్రకృతి రమణీయతే కాకుండా ఇక్కడ అడ్వెంచర్ స్పోర్ట్ ను ఇష్టపడే వారికి దండేలి అరణ్యం ఆహ్వానం పలుకుతుంది. ఇక్కడ కనీసం రెండు రోజులు గడిపితే మొత్తం అన్ని ప్రాంతాలను చూడటానికి వీలవుతుంది.

తప్పక చూడాల్సిన ప్రాంతాలు.... దండేలి అభయారణ్యం, శిరోలిపార్క్, కవాల గుహలు, కయాకింగ్, రివర్ రాఫ్టింగ్ వంటి జల క్రీడలు కూడా దండేలిలో అందుబాటులో ఉంటాయి.

విమాన, రైలు సౌకర్యం....హుబ్లీ ఎయిర్ పోర్ట్ ఇక్కడకు 56 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అల్నవర్ రైల్వే జంక్షన్ ఇక్కడకు 28 కిలోమీటర్లు.

11.హంపి

11.హంపి

Image source

ఇక్కడ భారతీయ శిల్పచాతుర్యం తెలుసుకోవాలనుకునే వారికి హంపి ఆహ్వనం పలుకుతూ ఉంటుంది. దేశ విదేశీయుల నుంచి కూడా ఇక్కడి శిల్ప సౌదర్యం చూడటానికి ఎంతో మంది వస్తుంటారు.

తప్పక చూడాల్సిన ప్రాంతాలు.... హంపి విరుపాక్షదేవాలయం, సంగీతం వినిపించే స్థంబాలు, తుంగభద్రనదిలో తెప్పలో ప్రయాణం, పురావస్తు మ్యూజియం తదితరాలు ఇక్కడ చూడవచ్చు.

విమాన, రైలు సౌకర్యం....హంపికి 13 కిలోమీటర్ల దూరంలో హొసపేట రైల్వే జంక్షన్ ఉంది. హుబ్లీ ఎయిర్ పోర్ట్ ఇక్కడకు 74 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక బళ్లారీ, బెల్గాం ఎయిర్ పోర్టులు కూడా దగ్గరగానే ఉంటాయి.

12.బిజాపుర

12.బిజాపుర

Image source

చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగిన ఈ బిజాపూర్ లో ఇస్లామిక్ సాంప్రదాయ శైలి నిర్మాణాలు కనిపిస్తాయి. అప్పటి ఇంజనీరింగ్ ప్రతిభ అధునిక సాంకేతిక పరిజ్జానం అందుబాటులోకి వచ్చిన నేటి ఇంజనీరింగ్ కు ఏమాత్రం తీసిపోదు.

తప్పక చూడాల్సిన ప్రాంతాలు.... గోల్ గుంబాచ్, ఇబ్రహీం రౌజా, మాలిక్ కి మదీన్, బిజాపూర్ కోట, జామీమసీద్, గగన్ మహల్, ఉప్లీ బరుజ్

విమాన, రైలు సౌకర్యం.... బెల్గాం ఎయిర్ పోర్ట్ ఇక్కడకు 164 కిలోమీటర్ల దూరం ఉంటుంది. బిజాపూర్ లో రైల్వే స్టేషన్ ఉంది.

13.బాదామి

13.బాదామి

Image source

టెంపుల్ టూరిజాన్ని ఇష్టపడే వారికి బాదామి మంచి పర్యాటక అనుభవాన్ని మిగులుస్తుందనడంలో సందేహం లేదు. ఇక్కడి కొండను తొలిచి నిర్మించిన గుహాలయాలు ఆశ్చర్యాన్ని కలిగించక మానవు.

తప్పక చూడాల్సిన ప్రాంతాలు.... బాదామి కోట, రాతిని తొలిచి మలిచిన గుహాలయలు, బూతనాథ్ దేవాలయం, దుర్గా దేవాలయం, హుచ్చిమల్లి దేవాలయం, విరూపాక్ష దేవాలయం,

విమాన, రైలు సౌకర్యం....బెల్గాం ఎయిర్ పోర్ట్ ఇక్కడకు 190 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అదే విధంగా హుబ్లీ రైల్వే స్టేషన్ 190 కిలోమీటర్లు.

14.ఉడిపి

14.ఉడిపి

Image source

ఆధ్వాత్మిక పర్యాటకాన్ని ఇష్టపడే వారికి ఉడిపి మంచి అనుభూతిని మిగులుస్తుంది. అంతే కాకుండా ఇక్కడకు దగ్గరగా ఉన్న బీచ్ లు ద్వీపాల సముదాయం చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిని అలరిస్తుంది.
తప్పక చూడాల్సిన ప్రాంతాలు.... . శ్రీ కృష్ణ దేవాలయం, మాల్పే బీచ్, సెయిట్ మేరీస్ ఐలాండ్ ఇక్కడ తప్పక చూడాల్సిన పర్యాటక ప్రాంతాలు

విమాన, రైలు సౌకర్యం....మంగళూరు ఎయిర్ పోర్ట్ ఇక్కడకు 48 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఉడిపి పట్టణంలోనే రైల్వే స్టేషన్ ఉంది.

15.చిత్రదుర్గ కోట

15.చిత్రదుర్గ కోట

Image source

కర్ణాటకతో పాటు భారతీయ చరిత్రను మనకు తెలియజెప్పడానికి ఇక్కడి కోట గోడలు ఆహ్వానిస్తుంటాయి. అంతేకాకుండా మహాభారతంతో కూడా చిత్రదుర్గకు అనుబంధం ఉందని పురాణ కథనం.

తప్పక చూడాల్సిన ప్రాంతాలు.... ఆంకాళిమఠ్, వాణి విలాస్ సాగర్ డ్యాం, హిడింబేశ్వరీ దేవాలయం, కూగే బండే, షూటింగ్ రాక్

విమాన, రైలు సౌకర్యం....బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం ఇక్కడకు 197 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చిత్రదుర్గలో రైల్వే స్టేషన్ ఉంది.

16.నందిహిల్స్

16.నందిహిల్స్

Image source

ప్రకృతి రమణీయతను ఇష్టపడే వారు నంది హిల్స్ కు తప్పక వెలుతారు. ఇక్కడ సూర్యాస్తమయం చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంటుంది.

తప్పక చూడాల్సిన ప్రాంతాలు.... బోగనందీశ్వర దేవాలయం, నంది దేవాలయం ఇక్కడ చూడదగిన ప్రాంతాలు

విమాన, రైలు సౌకర్యం....బెంగళూరు ఎయిర్ పోర్ట్ ఇక్కడి నుంచి గంట ప్రయాణం. అదే విధంగా చిక్కబళాపుర రైల్వే స్టేషన్ ఇక్కడకు 19 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X