Search
  • Follow NativePlanet
Share
» »ఇక్కడి నుంచి గ్రహాంతర వాసులకు హలో చెప్పవచ్చా?..అందుకే రహస్యంగా

ఇక్కడి నుంచి గ్రహాంతర వాసులకు హలో చెప్పవచ్చా?..అందుకే రహస్యంగా

మహాబలిపురం ఒకవైపు చారిత్రక కళావైభవంతో, మరోవైపు ఆధ్యాత్మిక సంపదతో తలతూగుతూ పర్యాటకులతో కిటకిటలాడుతూ ఉంటుంది. మామల్లాపురం గా కూడా పిలువబడే మహాబలిపురం తమిళనాడులోని కంచి జిల్లాలో కలదు.

By Beldaru Sajjendrakishore

మహాబలిపురం ఒకవైపు చారిత్రక కళావైభవంతో, మరోవైపు ఆధ్యాత్మిక సంపదతో తలతూగుతూ పర్యాటకులతో కిటకిటలాడుతూ ఉంటుంది. మామల్లాపురం గా కూడా పిలువబడే మహాబలిపురం తమిళనాడులోని కంచి జిల్లాలో కలదు. రాష్ట్ర రాజధానైన చెన్నై నగరం నుండి 70 కిలోమీటర్ల దూరంలో మరియు కంచి పట్టణం నుండి 66 కిలోమీటర్ల దూరంలో మహాబలిపురం ఉన్నది. మహాబలిపురం పల్లవ రాజుల కాలంలో అతి ముఖ్యమైన ఓడరేవు. ఒకానొక సమయంలో పల్లవులకు రెండవ రాజధానిగా కూడా వ్యవహరించింది.

15 తరాల మందు ఎలాంటి దుస్తులు ధరించే వారో తెలుసుకోవడానికి వెలుదాం15 తరాల మందు ఎలాంటి దుస్తులు ధరించే వారో తెలుసుకోవడానికి వెలుదాం

పర్వత అందాలను సైకిల్ తో పలకరిద్దాం....పర్వత అందాలను సైకిల్ తో పలకరిద్దాం....

వారికి ఈ పర్యటక ప్రాంతాలు అంటేనే ఎక్కువ ఇష్టంవారికి ఈ పర్యటక ప్రాంతాలు అంటేనే ఎక్కువ ఇష్టం

ఇక్కడి దేవాలయాల పై అంతరిక్షాలకు సంబంధించిన కొన్ని శిల్పాలను చూడవచ్చు. దీని వల్ల ఆ కాలంలోనే అంతరిక్షం, ఏలియన్స్ మొదలైన విషయాల పట్ల అప్పటి వారికి అవగాహన ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడి కొన్ని విషయాలను లోతుగా పరిశీలించి పరిశోధనలు చేస్తే గ్రహాంతరవాసులతో మనం మాట్లాడవచ్చుననే సమాధానం వినిపిస్తోంది. అందుకే కొంతమంది ఇక్కడి శిల్పాల పై రహస్యంగా పరిశోధనలు చేస్తున్నట్టు సమాచారం. దీనితో పాటు మహాబలిపురం చుట్టు పక్కల ఉన్న పర్యాటక ప్రాంతాల వివరాలతో కూడిన కథనం

1. ఆ పేరు పై పలు కథనాలు

1. ఆ పేరు పై పలు కథనాలు

1. ఆ పేరు పై పలు కథనాలు

Image Source:

7 వ శతాబ్దంలో దక్షిణ భారత దేశాన్ని పరిపాలించిన పల్లవ ప్రభువుల రాజ్యానికి ప్రముఖ తీరపట్టణం. మామల్లాపురం అనేది మహాబలిపురానికి వున్న మరో పేరు. ఈ పట్టనణానికి అప్పటి పల్లవ ప్రభువైన మామ్మల్ల పేరు మీద కట్ట బడిందని చరిత్రకారులు చెబుతారు. మహాబలిపురానికి ఆ పేరు రావటానికి మరొక కథనం ప్రకారం పూర్వం బలిచక్రవర్తి ఈ ప్రాంతాన్ని పాలించటంవల్ల ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది అని స్థానికులు అంటుంటారు.

2. పల్లవుల కాలంలో

2. పల్లవుల కాలంలో

2. పల్లవుల కాలంలో

Image Source:

తదనంతర కాలంలోనూ పల్లవుల పరిపాలనా కాలంలోనూ ఈ ప్రాంతం స్వర్ణయుగాన్ని చూసింది. పల్లవులు ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని కొంతకాలం పాలించారు. అప్పుడు కట్టించినవే ఈ శిల్పకళా సంపద. పల్లవులు దీనిని మంచిరేవుపట్నంగా తీర్చిదిద్దారు. దానికోసం ఇక్కడ కొండమీద ఒక లైట్ హౌస్ ని కట్టారు. దీనిని నిర్మించి దాదాపు వెయ్యి ఏళ్లు అయివుంటుందని భావిస్తున్నారు. మహాబలిపురానికి వచ్చే ఓడలకు దారిచూపించటానికి ఈ లైట్ హౌస్ ఏర్పాటుచేసారని చరిత్ర కారులు చెబుతున్నారు.

3. అయిదు రథాలు

3. అయిదు రథాలు

3. అయిదు రథాలు

Image Source:

వీటినే పంచపాండవుల రథాలు లేదా పంచ రథాలు అని అంటారు. ఈ నిర్మాణం ఏకశిలా శిల్పశైలికి అద్దం పడుతుంది. రాజు మహేంద్రవర్మ-1 మరియు అతని కుమారుడు నరసింహన్ వర్మన్ -1 కాలంలో నిర్మించబడిన ఈ నిర్మాణ రహస్యం ఇప్పటికీ ఎవరికీ బోధపడటం లేదు. ఈ సముదాయంలో ఉన్న ప్రతి కట్టడం రథాన్ని పోలి, ఒకే నల్లరాయితో చెక్కబడి ఉంటుంది.

4. అర్జునుడు తపస్సు చేసిన ప్రదేశం

4. అర్జునుడు తపస్సు చేసిన ప్రదేశం

4. అర్జునుడు తపస్సు చేసిన ప్రదేశం

Image Source:

క్రీ. శ. 7 వ శతాబ్దానికి చెందిన ఈ కట్టడం గురించి మహాభారతంలో పేర్కొనబడింది. కౌరవులను కురుక్షేత్ర యుద్ధంలో ఓడించటానికి పాండవులలో ఒకడైన అర్జునుడు శివుని ఆయుధం పొందేందుకు ఇక్కడే శిలమీద కూర్చొని ఘోర మైన తపస్సు చేసినట్లు చెబుతారు. అంతేకాదు భగీరథుడు కూడా గంగను దివి నుంచి భువికి రప్పించటానికి ఇక్కడే తపస్సు ఆచరించాడని చెబుతారు. ఇక్కడ చెక్కిన శిల్పాలు ఆనాటి పనితనానికి ధ్రువపత్రాలుగా ఉన్నాయి.

5. బాలన్సింగ్ రాక్

5. బాలన్సింగ్ రాక్

5. బాలన్సింగ్ రాక్

Image Source:


బాలన్సింగ్ రాక్ మహాబలిపురం ఆకర్షణలలో ఒకటి. కృష్ణుని వెన్న బంతి గా ఇది ప్రసిద్ధి. ఇది 45 డిగ్రీల కోణంతో వంగి ఉంటుంది. పర్యాటకులు ఇక్కడికి వచ్చి రాయిని బ్యాలెన్స్ చేస్తున్నట్లు ఫోటోలు దిగుతారు. ఈ రాయిని పల్లవ రాజులు ఏనుగులతో తరలించటానికి ఎంతోమంది ప్రయత్నించినప్పటికీ విఫలమయ్యారు. అయితే వారు ఆ రాయిని కొంచెం కూడా కదిలించలేక నిరాశతో వెళ్ళిపోయారని చరిత్ర మనకి చెబుతుంది.

6. అకాశ దేవుడిదట

6. అకాశ దేవుడిదట

6. అకాశ దేవుడిదట

Image Source:

ఇంత ప్రసిద్ధిగాంచిన ఆ రాయి కి సంబంధించి ఆనాటి పల్లవుల రాజు నరసింహవర్మ చెప్పినట్లు ఒక కథనం ప్రచారంలో ఉంది. దాని ప్రకారం ఇది ఆకాశదేవుని రాయని, దీన్ని ఏ శిల్పి ముట్టకూడదని శాసించాడని పురాణ కధలలో చెబుతున్నారు. మరి కొందరు మాత్రం ఇది గుడి కోసం తెచ్చిన రాయని దాన్ని మధ్యలోనే వదిలేసారని భావిస్తున్నారు.

7. ఎగిరే పళ్లాలు

7. ఎగిరే పళ్లాలు

7. ఎగిరే పళ్లాలు

Image Source:

మరికొందరు ఆ రాయి గ్రహాంతర వాసులు ఎగిరే పళ్ళాలని చెబుతున్నారు.దాదాపు 250టన్నులు వుండే ఈ రాయిని కొండపైకి తీసుకురావాలంటే ఆ రోజుల్లో సాధ్యమయ్యేపని కాదని అందుకే ఈ రాయి ఎలియన్స్ కు సంబంధించిందని చెబుతుంటారు.అచ్చం ఇలాంటి రాయిని పోలిన రాళ్ళు ప్రపంచంలో కొన్ని చోట్ల వున్నాయి. అవి ఎలియన్స్ తిరుగుతున్నారని వూహాగానాలు వెలువరే ప్రదేశాలనీ మెక్సికన్ నగరం అలాగే పెరూ నగరంలో ఇలాటి రాళ్ళే వున్నాయి.

8. ఆ టెక్నాలజీ అప్పుడే తెలుసా

8. ఆ టెక్నాలజీ అప్పుడే తెలుసా

8. ఆ టెక్నాలజీ అప్పుడే తెలుసా

Image Source:

ఇక ఈ ప్రదేశంలోని శిల్పాలను చూస్తే పురాతనకాలంలోనే ఇంతటి టెక్నాలజీని వాడారా? అనే ఆశ్చర్యం కలిగిస్తుంది.ఒకే చిత్రంలో ఆవుని మరియు పాలు త్రాగుతున్న దూడని చూడవచ్చును. అదే చిత్రంలో ఏనుగుని పాలు త్రాగుతున్న పిల్లఏనుగుని చూడవచ్చు. అప్పట్లోనే అంతరిక్ష పరిశోధనలకు శ్రీకారం చుట్టారనటానికి ఇక్కడ వున్న శిలాశిల్పాలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. అప్పట్లోనే పల్లవరాజు ఇక్కడ అంతరిక్షపరిశోధన చేసారనటానికి చాలా ఆధారాలు కనపడతాయి.

10. వ్యోమగాముల వలే ప్రతిమలు

10. వ్యోమగాముల వలే ప్రతిమలు

10. వ్యోమగాముల వలే ప్రతిమలు

Image Source:

ఆ శూలాన్ని పరీక్షించినట్లయితే అచ్చం శాటిలైట్ స్థంభం లాగానే కనపడుతుంది. ఆ విగ్రహాన్ని చూస్తే రోదసిలోకి వెళుతున్న వ్యోమగాముల లాగా మనకు అనిపిస్తుంది. అంతేగాక విమానగోపురం చుట్టూ అచ్చం వ్యోమగాములను తలపించే ప్రతిమలు కనిపిస్తాయి. గర్భగుడి ఇంకా విచిత్రమైన విషయం ఏమిటంటే గర్భగుడిలోకి గాలి చొరబడకుండా దాన్ని నిర్మించారు.

11. రేడియేషన్ తట్టుకునే విధంగా

11. రేడియేషన్ తట్టుకునే విధంగా

11. రేడియేషన్ తట్టుకునే విధంగా

Image Source:

శాటిలైట్ పంపినప్పుడు విడుదలయ్యే వాయువులు పోయే విధంగా ఆ ద్వారాలను కట్టారని అనిపిస్తుంది.ఎక్కడా కిటికీలు,తలుపులు కూడా కనపడవు. అంటే రాకెట్ లాంచింగ్ సమయంలో వెలువడే రేడియేషన్ ని తట్టుకునే విధంగా ఈ గుడిని నిర్మించారని తెలుస్తుంది. పురాతనకాలంలోనే మన టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా అయ్యిందని చెప్పటానికి ఈ దేవాలయమే ఒక చక్కటి వుదాహరణ. అణువణువూ టెక్నాలజీని నింపుకుని పర్యాటకులను ఆకట్టుకుంటున్న ఈ గుడిని ఒక్కసారైనా మీరు దర్శించాల్సిందే.

12. కృష్ణ మండపం

12. కృష్ణ మండపం

12. కృష్ణ మండపం

Image Source:

కృష్ణ మండపం, మహాబలిపురం లో ఉన్న పురాతన కట్టడాలతో ఒకటి. మండపంలో శ్రీ కృష్ణ లీలలు ఎన్నో చిత్రీకరించారు. గోవర్ధనగిరి కొండను చిటికెన వేలుతో లేపి ఊరిప్రజలను కాపాడే చిత్రం అలరిస్తుంది.

13. సీ షోర్ ఆలయం (సముద్ర తీర ఆలయం)

13. సీ షోర్ ఆలయం (సముద్ర తీర ఆలయం)

13. సీ షోర్ ఆలయం (సముద్ర తీర ఆలయం)

Image Source:

మహాబలిపురం సముద్ర తీర ప్రాంతంలో ఒకప్పుడు ఏడు ఆలయాలు ( సెవన్ పగోడాస్) ఉండేవని అంటారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల ఆలయాలన్నీ సముద్ర గర్భంలో కలిసిపోయి సీ షోర్ ఆలయం ఒక్కటే మిగిలిందని చారిత్రక గాధ. గ్రానెట్ రాళ్లతో నిర్మించబడిన ఈ ఆలయంలో శివుడు, విష్ణుమూర్తి విగ్రహాలతో పాటు, దుర్గా దేవి కూడా దర్శనం ఇస్తుంది. ఈ ఆలయం యునెస్కో చేత సంరక్షించబడుతున్నది.

14. టైగర్ కేవ్స్

14. టైగర్ కేవ్స్

14. టైగర్ కేవ్స్

Image Source:

టైగర్ కేవ్ పర్యాటకుల ప్రసిద్ధ పిక్నిక్ ప్రదేశం. ఇదొక హిందూ టెంపుల్. ఒకే కొండరాయిని తోలిచి దీనిని నిర్మించారు. ప్రవేశ ద్వారం లో మలచిన పులుల తలలు ఉండటంవల్ల దీనికి ఆపేరు పెట్టారు. దీనిని పల్లవ రాజులు 8 వ శతాబ్దం లో నిర్మించినట్లు చెపుతారు. ఇదిఒకప్రసిద్ధ పిక్నిక్ ప్రదేశం. ఈ టెంపుల్ కాంప్లెక్స్ ను అర్కేయోలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది.

15. క్రోకడైల్ బ్యాంకు

15. క్రోకడైల్ బ్యాంకు

15. క్రోకడైల్ బ్యాంకు

Image Source:

క్రోకడైల్ బ్యాంకు క్రోకడైల్ బ్యాంకు మహాబలిపురానికి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో ప్రధాన ఆకర్షణ. ఇక్కడ వివిధ రకాల పాములు, మొసళ్ళు ఉంటాయి. మొసళ్లను ఉత్పత్తి చేసి చంబల్ నది, మహా నదులలో వదులుతారు.

16. ఇతర ఆకర్షణలు

16. ఇతర ఆకర్షణలు

16. ఇతర ఆకర్షణలు

Image Source:

శిల్పకళా మ్యూజియం, మామల్లాపురం లైట్ హౌస్, వరాహకేవ్ టెంపుల్, గణేశ రథం, మహిశాసురమర్ధిని కేవ్, త్రిమూర్తి కేవ్, వైడ్ బీచ్, ధర్మరాజ కేవ వంటి ఎన్నో పర్యాటక ఆకర్షణలు పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తాయి.

17. అందమైన బీచ్

17. అందమైన బీచ్

17. అందమైన బీచ్

Image Source:

మహాబలిపురం బీచ్ అందమైనది. సాయంకాలం చల్లగాలిని ఆస్వాదించవచ్చు. ఈ బీచ్ లోని అలలు చాల భయంకరంగా వుంటాయి. మరియు బీచ్ లో సముద్రపు లోతు ఎక్కువ. కనుక సముద్ర స్నానం ప్రమాధకరము. గవ్వలతో చేసిన వస్తువులు కొనుక్కోవచ్చు. ఇక్కడ బీచ్ తీరం వెంబడి దొరికే రకరకాల వేడి వేడి సీఫుడ్ అత్యంత రుచికరంగా ఉంటుంది.

18. వసతి

18. వసతి

18. వసతి

Image Source:

వసతి సౌకర్యాలు ఇక్కడ భోజనం హోటళ్ళకి, లాడ్జిలకి కొరతే లేదు. కాని రాత్రి సమయాలలో ఉండేటందుకు అనువైన సౌకర్యాలు కలిగిన ప్రాంతంకాదు. భారతీయులతో పాటు ఫారినర్స్ కూడా ఎక్కువమంది ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంటారు.

19. ఎలా చేరుకోవాలి

19. ఎలా చేరుకోవాలి

19. ఎలా చేరుకోవాలి

Image Source:


రవాణా వ్యవస్థ మహాబలిపురం ఎలా చేరుకోవాలి ? బస్సు మార్గం : కంచి, చెన్నై ప్రాంతాల నుండి ప్రతి రోజూ మహాబలిపురానికి బస్సులు తిరుగుతుంటాయి. రైలు మార్గం : చెంగల్పట్టు మహాబలిపురానికి సమీప రైల్వే స్టేషన్(29 కి. మీ) వాయు మార్గం : చెన్నై అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ మహాబలిపురానికి సమీపాన కలదు.

20. తిరుకండల్ మండై

20. తిరుకండల్ మండై

20. తిరుకండల్ మండై

Image Source:

విష్ణుమూర్తిని ప్రధాన దేవాలయం. పల్లవ రాజు ఈ దేవాలయాన్ని సముద్రం నుండి వచ్చే కోత నుండి శిలా సంపదని రక్షించడం కోసం విష్ణుప్రీతి కోసం నిర్మించాడు. ఈ దేవాలయ నిర్మాణం జరిగాక సముద్ర కోత తగ్గిందని చరిత్ర కారులు చెబుతారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X