• Follow NativePlanet
Share
» »శివ లింగం పై నాశికా రంద్రాలు...ఒకే పానిపట్ట పై రెండులింగాలు ఎన్ని విశిష్టతలో

శివ లింగం పై నాశికా రంద్రాలు...ఒకే పానిపట్ట పై రెండులింగాలు ఎన్ని విశిష్టతలో

Written By: Beldaru Sajjendrakishore

భారత దేశం అనేక ఆలయాలకు నిలయం. మరోవైపు ఒక్కొక్క దేవాలయంలో శివుడు ఒకొక్క రూపంలో దర్శనమిస్తాడు. అటువంటి కోవకు చెందినదే కాలేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయం. ఇందులో ఒకే పానిపట్టు పై రెండు లింగాలు ఉంటాయి. ఇటువంటి నిర్మాణం దేశంలో మరే చోట కనిపించదు. అదే విధంగా లింగం పై భాగంలో నాశికా రంద్రాలు ఉంటాయి. ఈ వీటి ద్వారా నీటిని పోస్తే ఎక్కడికి వెళుతోందన్న విషయం ఇప్పటికీ అంతపట్టని రహస్యం. ఆ ప్రముఖ పుణ్యక్షేత్రానికి సంబంధించిన వివరాలు నేటివ్ ప్లానెట్ పాఠకుల కోసం...

1. ఇది ఇక్కడ విశిష్టత

1. ఇది ఇక్కడ విశిష్టత

Image source

కర్నూలు జిల్లా లోని శ్రీశైలం, తూర్పు గోదావరి జిల్లాలోని ద్రాక్షారామ, తెలంగాణలోని ప్రస్తుతం మనం చెప్పుకోబోయే కాళేశ్వరంతో మధ్య ఉన్న భూమిని త్రిలింగ దేశమని పిలిచేవారు. ఈ విషయం అనేక పురాణాల్లో కూడా ఉంది. ఒకే పాణిపట్టు పై రెండు శివలింగాలు ఉండటం కాళేశ్వరం విశిష్టత.

2.గోదావరి ఒడ్డున

2.గోదావరి ఒడ్డున

Image source

ఈ ప్రాంతంలో గోదావరి అర్థచంద్రాకారంలో ప్రవహిస్తుంది. ఈ అర్థచంద్రాకారం మధ్యలోనే కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం నిర్మించబడింది. ఈ ఆలయ నిర్మాణం కోసం కాకతీయులు ఎంతగానో తోట్పాటు అందించారని ఇక్కడ దొరికిన పలు రాతి శాసనాలు స్పష్టం చేస్తున్నాయి.

3. త్రివేణి సంగమమని కూడా

3. త్రివేణి సంగమమని కూడా

Image source

పెన్ గంగా పేరుగాంచిన ప్రాణహితతో పాటు అతర్వాహిణిగా సరస్వతి నది కూడా ఇక్కడ ప్రవహిస్తున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. అందువల్ల ఈ క్షేత్రానికి త్రివేణి సంగమమం అని కూడా పేరు. ఈ ఆలయ విశిష్టతను స్కంధపురాణంలో వివరించబడింది.

4. గోదావరి తప్పస్సు కోసం

4. గోదావరి తప్పస్సు కోసం

Image source

ఒకసారి గోదావరి పరమశివుడి గురించి తప్పస్సు చేసి తన తీర ప్రాంతమైన కాళేశ్వరంలో ముక్తేశ్వరుడిగా కొలువై ఉండాలని కోరుకుంటుంది. ఇందుకు అంగీకరించిన శివుడు ప్రస్తుత కాళేశ్వరంలో లింగరూపంలో ఆవిర్భవించి ముక్తేశ్వ రుడిగా కొలువు దీరుతాడు. అదే విధంగా ఈ లింగాన్ని దర్శించుకుని పూజించిన వారికి మరుజన్మ ఉండదని కూడా పరమేశ్వరుడు గోదావరికి చెబుతాడు.

5. యముడి వేడుకోలు

5. యముడి వేడుకోలు

Image source

ఈ క్రమంలో చాలా మందికి ముక్తి లభించి యమలోక బాధ నుంచి తప్పించుకుంటారు. దీంతో యమ లోకానికి వెళ్లేవారి సంఖ్య తగ్గిపోతూ వస్తుంది. దీనిని గమనించిన యముడు శివుడికి పరిస్థితి వివరిస్తాడు. దీంతో శివుడు కాళేశ్వరంలోని లింగం పక్కనే మరో లింగాన్ని ప్రతిష్టించాలని సూచిస్తారు.

6. అందుకే కాళేశ్వర లింగమని పేరు

6. అందుకే కాళేశ్వర లింగమని పేరు

Image source

శివుడి ఆదేశాలను అనుసరించి యముడు ప్రతిష్టించిన లింగానికి కాళేశ్వర లింగమని పేరు. యముడికి కాళుడు అన్న పేరు కూడా ఉండటం తెలిసిందే. అందువల్లే ఈ లింగానికి కాళేశ్వర లింగమని కూడా పేరు. ఈ దేవాలయానికి వచ్చిన వారు మొదట కాళేశ్వర లింగాన్ని దర్శించిన తర్వాత మక్తేశ్వర లింగాన్ని దర్శించాలని అప్పుడు మాత్రమే ముక్తి లభిస్తుందని చెబుతారు.

7. లింగం పై రెండు రంధ్రలు

7. లింగం పై రెండు రంధ్రలు

Image source

అలా ఒకే పానిపట్టు పై రెండు లింగాలు ఉంటాయి. ఇటువంటి ఏర్పాటు ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ఇక ముక్తేశ్వరం లింగం శిరస్సు భాగంలో రెండు రంద్రాలు ఉంటాయి. వీటి ద్వారా ఎంత నీరు పోసినా కిందికి వెలుతుందే తప్పిస్తే బయటకు రాదు. అలా పోసిన నీరు ఏమవుతుందో ఇప్పటికీ తెలియక పోవడం గమనార్హం.

8. నాలుగు నందులు

8. నాలుగు నందులు

Image source

ఇక్కడ శివలింగాలు ఉన్న గర్భగుడిలోకి భక్తులు నేరుగా వెళ్లి అభిషేకం చేయడం విశేషం. ఇటువంటి ఏర్పాటు దేశంలో అతి కొన్ని దేవాలయాల్లో మాత్రమే కనిపిస్తుంది. ఇక గర్భగుడికి నాలుగు వైపులా నాలుగు నందులు ఉండటం కూడా విశేషం. ఇటు వంటి ఏర్పాటు ఎక్కడా లేదు.

9.శుభానంద దేవిగా

9.శుభానంద దేవిగా

Image source

దేవాలయం ఆవరణంలో దక్షిణం వైపునకు పార్వతీ దేవి శుభానంద దేవిగా కొలువై ఉంది. ఈ దేవతను దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని కష్టాలు తీరిపోతాయని భక్తులు నమ్ముతారు.

10. అక్షరాభ్యాసం చేయించడానికి

10. అక్షరాభ్యాసం చేయించడానికి

Image source

అటు పై భక్తులు దేవాలయం ఆవరణంలోనే ఉన్న సరస్వతి దేవిని కొలుస్తారు. ప్రౌడ సరస్వతిగా పిలుచుకునే ఈమె సన్నిధిలో అక్షాభాస్యం చేస్తే పిల్లలు విద్యలో రాణిస్తారని ప్రతీతి. అందువల్ల చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడానికి ఇక్కడికి వస్తుంటారు.

11. యమకోణం

11. యమకోణం

Image source

ఇక్కడ ఉన్న యమకోణం ద్వారా వెళ్లిన వారికి నరక బాధ తొలుగుతుందని నమ్మకం. ఈ కోణం ద్వారా వెళ్లడానికే చాలా మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. దీని తర్వాత భక్తులు దేవాలయ ప్రాంగణంలోనే ఉన్న సూర్యదేవాలయంతో పాటు కాళభైరవ, మశ్చ్యవతరంలో ఉన్న విష్ణువు తదితర దేవుళ్లను సందర్శిస్తుంటారు.

12. ఇక్కడ ఉంది ఎలా వెళ్లాలి

12. ఇక్కడ ఉంది ఎలా వెళ్లాలి

Image source

తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో కాళేశ్వర క్షేత్రం ఉండేది. అయితే ఆ రాష్ర్టంలో కొత్త జిల్లాల ఏర్పాటైన తర్వాత ఈ క్షేత్రం జై శంకర్ భూపాల జిల్లా పరిధిలోకి వచ్చింది. హైదరాబాద్ నుంచి ఇక్కడకు 263 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ప్రయాణ సమయం 6 గంటలు. హైదరాబాద్ కు దేశంలోని చాలా చోట్ల నుంచి విమానయాన సేవలు అందుబాటులో ఉంటుంది.

13. మరికొన్ని పర్యాటక ప్రాంతాలు

13. మరికొన్ని పర్యాటక ప్రాంతాలు

Image source

ఆలికమన్, డీర్ పార్క్, వివిధ వాటర్ ఫాల్స్, రాజేశ్వరి దేవి దేవాలయం, రామగిరి ఫోర్ట్, లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం, మోలంగూరు ఫోర్ట్ తదితర పర్యాటక ప్రాంతాలను ఇక్కడ చూడవచ్చు.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి