• Follow NativePlanet
Share
» »ఈ నదీ లోయల్లో...మనసు నాట్యమాడుతోంది

ఈ నదీ లోయల్లో...మనసు నాట్యమాడుతోంది

Written By: Beldaru Sajjendrakishore

పరీక్షలు అయిపోయిన వెంటనే పిల్లలు టూర్ వెళ్లాలని పట్టుపట్టడం ఎప్పుడూ జరిగేదే. ఇక దేశంలోని అనేక రాష్ట్రాల్లో అప్పుడే ఎండలు తమ ప్రతాపాన్ని చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో అటు పిల్లల కోరికా తీర్చిలన్నా, ఇటు ఈ ఉక్కపోతల నుంచి కొద్ది రోజుల పాటు దూరంగా చల్లని ప్రాంతాలకు టూర్ వెళ్లడమే ఉత్తమమైన మార్గం. సువిశాల భారత దేశంలో అనేక చల్లని ప్రదేశాలు ఉన్నాయి. ఇందులో కొన్ని పర్వత ప్రాంతాలు కాగా, మరికొన్ని పచ్చటి అటవీ ప్రాంతాలు. వీటితో పాటు నదీ, పర్వత లోయల ప్రాంతాలు కూడా ఉన్నాయి. సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో ఉన్న ఈ ప్రాంతల్లో చల్లని వాతావరణం మనలను రారమ్మని ఆహ్వనిస్తోంది. మరెందుకు ఆలస్యం రానున్న వేసవిలో మీ పర్యాటక జాబితాలో ఈ ప్రాంతాలు కూడా ఉండేలా చూసుకోండి

1.కాశ్మీర్ వ్యాలీ...

1.కాశ్మీర్ వ్యాలీ...

Image source

జమ్ము కాశ్మీర్ లోని ఈ ప్రాంతం చుట్టూ ఎతైన కొండలు, పచ్చని చెట్లతో పాటు చల్లని మంచు కూడా కనువిందును చేస్తుంది. ఇక అనేక నదుల జల సవ్వడులు మన చెవులతో పాటు మనస్సుకు ఆనందభైరవి రాగాన్ని వినిపిస్తాయి. హిమాలయ, పంజల్ పర్వత పంక్తుల మధ్య జీలం నదీ ఒడ్డున ఉన్న వ్యాలీ 32 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. దీన్ని భూమి పై ఉన్న స్వర్గంగా అభివర్ణిస్తారు. ఇక్కడకు దగ్గరగా గుల్మార్గ్ హిల్ స్టేషన్, దాల్ సరస్సు, అమర్నాథ్ దేవాలయం తదితర ప్రముఖ పర్యాటక ప్రాంతాలను చూడవచ్చు.

2.కంగ్రా వ్యాలీ

2.కంగ్రా వ్యాలీ

Image source

హిమాచల్ ప్రదేశ్ రాష్ర్టంలోని ఈ లోయ ప్రాంతం చుట్టూ ఎక్కడ చూసిన తెల్లని మంచు కొండలే కనిపిస్తాయి. వేసవిలో ఇక్కడికి వెళ్లిన వారు తిరిగి రావాలని భావించరు. అనేక సరస్సులు, నదీలకు కొలవైన ఈ ప్రాంతంలో పాలంపూర్ హిల్ స్టేషన్, కాంగ్రా టెంపుల్, ధర్మశాల వంటి ఎన్నో పర్యాటక కేంద్రాలు ఉన్నాయి.

3.వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్

3.వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్

Image source

ఉత్తరాఖండ్ లోని ఈ పర్వత లోయ ప్రాంతాన్ని దేవతలు నాట్యం చేసే ప్రాంతంగా అభివర్ణిస్తారు. హిమాలయ పర్వత పంక్తుల్లోని ఈ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ వేలాది రకాల పుష్పాలను ఒకే చోట చూడటం మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక్కడ నందాదేవి, జాతీయ ఉద్యావనం మరికొన్ని చూడదగిన పర్యాటక ప్రాంతాలు. ఇక్కడ అంతరించే జాబితాలోకి చేరిన స్నో లెపర్డ్, బ్రౌన్ బియర్, బ్లూ షీప్ తదితర జంతువులను కూడా ఇక్కడ చూడవచ్చు. ఇక్కడకు ఎక్కువ మంది ట్రెక్కింగ్ కోసం వస్తుంటారు.

4. దబాంగ్ వ్యాలీ

4. దబాంగ్ వ్యాలీ

Image source

ఇక్కడి పర్వత పంక్తుల్లో పుట్టే దబాంగ్ నదీ వల్ల దీనిని దబాంగ్ వ్యాలీ అని పేరు వచ్చింది. అరుణాచల్ ప్రదేశ్ లోని ఈ దబాంగ్ వ్యాలీ పర్యాటకులతో పాటు అడ్వెంచర్ స్పోర్ట్స్ ను ఇష్టపడే వారిని, పురాతన శాస్ర్తవేత్తలను కూడా ఆహ్వానిస్తుంటుంది. దబాంగ్ వ్యాలీ జీవ వైవిద్యానికి ఒక మచ్చుతునక. ఇక్కడ అంతరించే జాతుల జాబితాలో చేరిన ఎగిరే ఉడత, హార్న్ బిల్ వంటి జంతు, పక్షు జాతులను ఇక్కడ చూడవచ్చు.

5. డ్జుకోవ్ వ్యాలీ

5. డ్జుకోవ్ వ్యాలీ

Image source

మణిపూర్, నాగాలాండ్ సరిహద్దు ప్రాంతంలో ఈ డ్జుకోవ్ వ్యాలీ ఉంది. ట్రెక్కింగ్ కు అనుకూలమైన ఈ ప్రాంతంలో అనేక రకాల జాతుల పుష్పాలకు కూడా నిలయం. చలికాలంలో మంచుతో కప్పబడి ఉండే ఈ ప్రాతం వేసవిలో పర్యటకానికి అనుకూలంగా ఉంటుంది.

6. నిరా వ్యాలీ

6. నిరా వ్యాలీ

Image source

పశ్చిమ బెంగాల్ లోని డార్జిలింగ్ జిల్లాలో నిరా వ్యాలీ ఉంది. పచ్చని చెట్లతో పాటు టీ తోటల మధ్య వేసవిని గడపాలనుకునే వారు ఇక్కడికి ప్రతి ఏడాది వస్తూ ఉంటారు. ఇక్కడి జల పాతాలు వేసవిలో కూడా కనివిందు చేయడం గమనార్హం.

7.అరకు వ్యాలీ

7.అరకు వ్యాలీ

Image source

దక్షిణ భారత దేశంలో అత్యంత ఆదరణ పొందిన పర్వత లోయ ప్రాంతం అరకు వ్యాలీ. ఇక్కడి కాఫీ తోటల్లో వేసవి ఉదయ, సాయంత్రాలనే కాకుండా మధ్యాహ్న సమయాన్ని కూడా చల్లగా గడపవచ్చు. ఈ వ్యాలీ ప్రాంతంలోనే బొర్ర గుహలు కూడా పర్యాటకులను రా రమ్మని ఆహ్వానిస్తున్నాయి. ఇక్కడి గిరిజన తెగల సంప్రదాయాలను కళ్లకు కట్టినట్లు చూపించే మ్యూజియం కూడా చూడదగిన ప్రదేశం.

8.కెట్టి వ్యాలీ

8.కెట్టి వ్యాలీ

Image source

ప్రపంచంలో అతి విస్తీర్ణమైన పర్వత లోయ ప్రాంతాల్లో తమిళనాడులోని కెట్టీ వ్యాలీ రెండోస్థానంలో ఉంటుంది. ప్రఖ్యాత పర్యాటక కేంద్రమైన ఊటీ ఈ కెట్టీ వ్యాలీలో ఒక భాగం. వేసవిలో కూడా పచ్చగా కనబడే నీలగిరి పర్వతాలు అనేక వేల జాతుల పక్షులకు ఆశ్రయం కల్పిస్తోంది. దీంతో వేసవిలో పర్యాటకులతో పాటు పక్షి ప్రేమికులు కూడా ఇక్కడకు ఎక్కువగా వస్తుంటారు. ట్రెక్కింగ్ కు కూడా అనువైన ప్రాంతం.

9. సైలెంట్ వ్యాలీ

9. సైలెంట్ వ్యాలీ

Image source

పశ్చిమ కలనుమల్లో ఒక భాగమైన ఈ సైలెంట్ వ్యాలీ కేరళ రాష్ట్రంలో ఉంది. ఇక్కడి నీలగిరి పర్వత ప్రాంతాలు వేసవిలో కూడా చల్లని వాతావరణాన్ని కలిగి ఉంటాయి. అత్యంత అరుదైన, అంతరించే జాతులకు చెందిన వృక్ష, జంతు, పక్షుజాతులకు ఈ సైలెంట్ వ్యాలీ నిలయం.

10.శరావతి వ్యాలీ

10.శరావతి వ్యాలీ

Image source

ఈ శరావతి వ్యాలీ కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో ఉంది. ఇక్కడ శరావతి నదీ ప్రవహించడం వల్ల ఆ పేరు వచ్చింది. జోగ్ ఫాల్స్ ఇక్కడ ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉంది. అదే విధంగా శరావతి అభయారణ్యం కూడా ఈ వ్యాలీలోనే ఉంది. భారత దేశంలో ట్రెక్కింగ్ తో పాటు జల క్రీడలకు అత్యంత అనువైన ప్రాంతంగా శరావతి వ్యాలీకి పేరుంది.

11. కాస్ ప్లాటు వ్యాలీ

11. కాస్ ప్లాటు వ్యాలీ

Image source

మహారాష్ట్రా లోని సతారా జిల్లాలో ఈ వ్యాలీ ఉంది. ఇక్కడ అత్యంత అరుదైన జాతులకు చెందిన పుష్పలు వేల సంఖ్యలో కనిపిస్తాయి. ఇవి వేసవి కాలంలోనే వికసించడం గమనార్హం. దీంతో చాలా మంది వేసవిలో ఈ ప్రాంతానికి వస్తుంటారు. అంతే కాకుండా కాస్ సరస్సు కూడా చూడదగిన ప్రాంతం.

12. సట్లేజ్ వ్యాలీ

12. సట్లేజ్ వ్యాలీ

Image source

పంజాబ్ లోని సట్లేజ్ నదీ వల్ల ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. మంచుతో కప్పడిన పర్వత పంక్తులు ఇక్కడ పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి. హరకి పక్షి సంరక్షణ కేంద్రం కూడా ఇక్కడ మరో పర్యాటక ప్రాంతం. ఇది ట్రెక్కింగ్ కు కూడా అనువైన ప్రాంతం.

13. స్పిటీ వ్యాలీ

13. స్పిటీ వ్యాలీ

Image source

లడక్, టిబెట్ మధ్య భాగంలో ఈ స్పిటీ వ్యాలీ ఉంది. ఎల్లప్పుడు మంచుతో రక్తాన్ని గడ్డకట్టించే ఉష్ణోగ్రతతో కూడిన ఈ ప్రాంతం వేసవిలో చూడటానికి అనువైన వాతావరణం కలిగి ఉంటుంది. మంచు సరస్సులు, అనేక జీవనదుల జన్మస్థానమైన ఈ స్పిటీ వ్యాలీ ట్రెక్కింగ్ కు కూడా అనుకూలంగా ఉంటుంది.

14. చంబల్ వ్యాలీ

14. చంబల్ వ్యాలీ

Image source

మధ్య ప్రదేశ్ లోని ఈ లోయ ఒకప్పుడు దోపిడి దొంగలకు నిలయం. అయితే ప్రస్తుతం ఉత్తమ పర్యాటక కేంద్రంగా పేరుతెచ్చుకుంది. చంబల్ నది వల్ల ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. హిమాలయ పర్వత పంక్తుల్లో భాగమైనా కూడా ఇక్కడ పర్వత ప్రాంతాలు మంచుతో కప్పబడి ఉండక పోవడం విశేషం. పచ్చని చెట్లు, వివిధ జాతుల పక్షులు పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి.

15. యుమ్తాంగ్ వ్యాలీ

15. యుమ్తాంగ్ వ్యాలీ

Image source

పచ్చని తివాచి పరిచినట్లు ఉండే ఈ ప్రాంతం టిబెట్ కు దగ్గరగా ఉంటుంది. అత్యంత అరుదైన జాతులకు చెందిన పుష్పాలకు ఈ ప్రాంతం నిలయం. సముద్ర మట్టానికి 3500 మీటర్ల ఎత్తులో ఉన్న వ్యాలీ ట్రెక్కింగ్ కు కూడా అనుకూలం.

Read more about: lakes travel

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి