Search
  • Follow NativePlanet
Share
» »భారత దేశంలోని ఈ వింతలను చూసారా

భారత దేశంలోని ఈ వింతలను చూసారా

భారత దేశంలోని సహజ, మానవ నిర్మితమైన ప్రాంతాలకు సంబంధించిన కథనం.

By Beldaru Sajjendrakishor

భారతదేశంలో అనేక విషయాలు ఎంతో నిగూఢమైనవిగా కనిపిస్తుంటాయి. అందులో కొన్నిప్రకృతి సిద్ధంగా ఏర్పడినవి కాగా, మరికొన్ని మానవ నిర్మితం. సహజ సిద్ధంగా ఏర్పడిన కొన్ని ప్రాంతాలు పుణ్యక్షేత్రాలుగా కూడా విరాజిల్లు తున్నాయి. ఇక మానవ నిర్మితమైన కొన్ని భవనాల చిక్కు ముళ్లను నేటి ఆధునిక సాంకేతిక పరిజ్జానం కూడా ఛేదించలేక పోతుండటం గమనార్హం.

చెడు కలల నుంచి విముక్తిని ఇచ్చే దేవాలయం ఇదేచెడు కలల నుంచి విముక్తిని ఇచ్చే దేవాలయం ఇదే

రజస్వలకాని వారు ఇక్కడ కుర్చొంటే..రజస్వలకాని వారు ఇక్కడ కుర్చొంటే..

వీటిలో కొన్ని నాటి చరిత్రను కళ్లకు కట్టినట్లు చూపించే సౌధాలు కావచ్చు, శిల్పాలు కావచ్చు, తటాకాలు ఉన్నాయి. ఇవి మనలను ఎల్లప్పుడూ ఆశ్చర్యచకితులను చేస్తాయి. వాటిని ఎలా నిర్మించారో వివరించడం సాధ్యం కాదు. ఇవి ఊహలకు ఎంతమాత్రం అందవు. ఎన్ని రకాలుగా ఆలోచించినా సరైన సమాధానం లభించదు. మనిషి మేధస్సుకు అర్థం కాని చిక్కుముడులు అవి. అలాంటి కొన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.

భారత దేశంలోని ఈ వింతలను చూశారా

భారత దేశంలోని ఈ వింతలను చూశారా

1. డ్రైవర్ లేకుండానే కొండపైకి

Image Soruce:


అయస్కాంత పర్వతం ఇదొక వివరించ సాధ్యం కాని అద్భుతం. సాధారణంగా కొండపైకి ఎక్కాలంటే ఎంతో కష్టపడాలి. ఒకవేళ ఆ కొండ మీదకు రోడ్డు వేసి కారులో వెళ్లమన్నా కారు నెమ్మదిగా పైకి వెళుతుంది. ఎంతో ఇంధనం వృధా అవుతుంది. కాశ్మీర్‌ లోని లడక్‌ ప్రాంతంలో లేహ్ సమీపంలో ఉన్న ఈ కొండ మాత్రం మిగిలిన కొండల్లాగా కాదు. తన దగ్గరకు వచ్చే వారిని ఎంతో ఆప్యాయంగా పలుకరించి, తనే స్వయంగా తీసుకువెళ్లిపోతుంది.

భారత దేశంలోని ఈ వింతలను చూశారా

భారత దేశంలోని ఈ వింతలను చూశారా

2. చిన్నా పెద్దా తేడా ఉండదు

Image Soruce:


అంటే, ఈ కొండ మీదకు కారులో వెళ్లాలనుకునేవారు హాయిగా ఇంజన్‌ను ఆఫ్‌ చేసి స్టీరింగ్‌ పట్టుకుని కూర్చుంటే చాలు. ఇనుపముక్కను అయస్కాంతం ఆకర్షించినట్లు కారును పైకి లాక్కుంటుంది. సహజసిద్ధంగా ఏర్పడిన అయస్కాంత తత్వమున్న ఈ కొండపైకి వెళ్లేవారు దీనిలోని అయస్కాంత శక్తికి అబ్బురపోతారు. కేవలం ఈ విషయాన్ని చూడటానికి మాత్రమే చిన్నా పెద్దా తేడా లేకుండా చాలా మంది కారులో ఇక్కడికి వస్తుంటారు.

భారత దేశంలోని ఈ వింతలను చూశారా

భారత దేశంలోని ఈ వింతలను చూశారా

3. గరుత్వాకర్షణకే సవాల్...

Image source:

గురుత్వాకర్షణకే సవాల్‌ లక్నో లోని ఒక ప్యాలెస్‌. ఈ ప్యాలెస్‌ ను 18వ శతాబ్దిలో అప్పటి రాజు నవాబ్‌ అస్‌ ఉద్‌ దౌలా నిర్మింపజేశారు. అత్యద్భుతమైన వాస్తును ఈ భవనంలో చూడవచ్చు. ఈ భవనంలోకి ప్రవేశించిన వారు అక్కడి సెంట్రల్‌ హాల్‌లోనుంచి బైటికి రావడానికి ఇష్టపడరు. ఎంతమంది ఆ హాల్‌లోకి ప్రవేశించినా, పురాణాల్లోని పుష్పక విమానంలో మాదిరిగా మరొకరికి చోటు ఉన్నట్లు కనిపిస్తుంది.

భారత దేశంలోని ఈ వింతలను చూశారా

భారత దేశంలోని ఈ వింతలను చూశారా

4. ఒక్క స్తంభం కూడా కనిపించదు...

Image source:

50 మీటర్ల పొడవుతో ఉండే ఈ హాల్‌ పైకప్పు కనీసం మూడంతస్తుల ఎత్తులో ఉంటుంది. ఈ హాల్‌ మొత్తాన్ని ఎక్కడా ఒక్క స్తంభం కూడా లేకుండా నిర్మించారు. స్తంభాలు లేకుండా, అంత ఎత్తులో పైకప్పుతో అంత పెద్ద హాల్‌ ఎలా నిర్మించారనేది ఆశ్చర్యం కలిగించే అంశమే. ఇంటర్‌లాకింగ్‌ విధానంలో ఇటుకలను పేర్చి ఈ హాల్‌ను నిర్మించారు. ఈ భవనం చూస్తున్నంత చేపు మరికొంత కాలం చూడాలనిపిస్తుంటుంది.

భారత దేశంలోని ఈ వింతలను చూశారా

భారత దేశంలోని ఈ వింతలను చూశారా

5. శనివార్‌వాడ కోట

Image source:

శనివార్‌వాడ కోట చారిత్రక చిహ్నంగా మిగిలిన వాటిలో శనివార్‌వాడ కోట ఒకటి. ఈ కోటను 1746లో నిర్మించారు. 1818 వరకూ ఈ కోట పీష్వా రాజుల ఆధీనంలో, తరువాత ఆంగ్లేయులపరమైంది. నాశనం కాకుండా మిగిలిన భాగాలను ప్రస్తుతం పర్యాటక ప్రదేశాలుగా నిర్వహిస్తున్నారు. మహారాష్ట్రలోని పూణెలో ఉన్న ఈ కోట గురించి స్థానికులలో అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ కోటను పాలించిన వారి వంశంలోని ఒక యువరాణి హత్యకు గురైంది.

భారత దేశంలోని ఈ వింతలను చూశారా

భారత దేశంలోని ఈ వింతలను చూశారా

6. ఆమె ఆత్మ ఇప్పటికీ...

Image source:


ఆమె ఆత్మ ఇప్పటికీ ఆ కోటలో తిరుగాడుతుంటుందని స్థానికులు చెబుతారు. రాత్రి వేళల్లో బిగ్గరగా, కీచుమనే అరుపులు చాలా భయానకంగా వినవస్తుంటాయని వారు అంటారు. కోటను సందర్శించడమే కాకుండా, రాత్రి వేళల్లో వినవచ్చే అరుపులను వినడానికి ఇక్కడ ఉండాలని స్థానికులు చెబుతుంటారు. నమ్మశక్యం కాని ఇలాంటి విషయాలను పక్కన ఉంచి కోటను చూడటానికి చాలామంది వెళుతుంటారు.

భారత దేశంలోని ఈ వింతలను చూశారా

భారత దేశంలోని ఈ వింతలను చూశారా

7. మంచు శిలింగం.

Image source:


మంచు శివలింగం అమర్ నాథ్ గుహల్లో ఉన్న మంచు శివలింగం హిందువుల పవిత్ర ప్రదేశం. గుహలోపల మంచుతో ఏర్పడ్డ శివలింగం పూర్తిగా సహజమైనది. ఈ శివలింగం ఆకారం ప్రతి ఏడాది మే నుంచి ఆగస్ట్ వరకు మాత్రమే ఉంటుంది. అత్యంత ఎక్కువ సందర్శకులు వచ్చే పవిత్ర పుణ్యక్షేత్రాలలో ఈ ఆలయం ఒకటి. అసలు మంచు కేవలం ఒక నిర్థిష్ట సమయంలో అక్కడ మంచుగా ఎలా ఏర్పడుతోందన్న విషయం ఇప్పటికీ నిగూడ రహస్యమే.

భారత దేశంలోని ఈ వింతలను చూశారా

భారత దేశంలోని ఈ వింతలను చూశారా

8. బెరుడు బ్రిడ్జ్ ఎవరు కట్టారు

Image source:


ఇండియాలోని టాప్ నాచురల్ వండర్స్ లో చెప్పుకోదగినది బెరడు బ్రిడ్జ్. ప్రపంచంలో అత్యంత సహజంగా ఏర్పడిన ప్రాంతం ఇది. మేఘాలయకు సమీపంలో ఉన్న చిరపుంజిలో రెండు పెద్ద చెట్ల బెరడుతో.. బ్రిడ్జ్ ఏర్పడింది. ఈ వంతెన ఎవరైనా నిర్మించారా అన్నట్టు ఉంటుంది. కానీ.. ఇది కూడా న్యాచురల్ వండరే. ఈ బ్రిడ్జ్ ని చుట్టుపక్కల ఉన్నవాళ్లు తమ రాకపోకల కోసం ఈ బెరుడు బ్రిడ్జ్ ను వినియోగిస్తున్నారు.

భారత దేశంలోని ఈ వింతలను చూశారా

భారత దేశంలోని ఈ వింతలను చూశారా

9. వేలాడే రాతి స్తంభం

Image source:

వేలాడే రాతి స్తంభం పైన పేర్కొన్న వాటితో పాటుగా, ఆంధ్రప్రదేశ్‌ లోని లేపాక్షి లో ఉన్న వేలాడే రాతి స్తంభం కూడా ఒకటి. ఈ రాతి స్తంభం ఎలా వేలాడదీశారో ఇప్పటికీ అంతుచిక్కని రహస్యమే. సాధారణంగా స్తంభాలు నేలలో పాతి వాటిపైన కట్టడాలు నిర్మిస్తారు. దానికి భిన్నంగా ఈ స్తంభం మాత్రం చూరును పట్టుకుని వేలాడుతుంటుంది. నేలకు, స్తంభానికి మధ్య అతి సన్నటి ఖాళీ ఉంటుంది. ఈ మధ్యలోనుంచి పేపర్లు, దారం, వస్త్రాలను ఒకవైపు నుంచి తోసినప్పుడు అవి రెండవవైపునుంచి బైటికి వస్తుంటాయి. అంత బరువైన స్తంభం ఎలా వేలాడదీసారో ఎవరికీ అర్థం కాదు. అదీగాక ఇన్ని శతాబ్దాలుగా ఆ స్తంభం అలాగే వేలాడుతూ ఉండటం మరొక విచిత్రం.

భారత దేశంలోని ఈ వింతలను చూశారా

భారత దేశంలోని ఈ వింతలను చూశారా

10. శ్రీకృష్ణుడి వెన్నముద్ద

Image source:

ఇండియాలోని టాప్ నాచురల్ వండర్స్ ! బ్యాలెన్సింగ్ రాక్ తమిళనాడులోని మహాబలిపురంలోని బ్యాలెన్సింగ్ రాక్ అందరినీ ఆకట్టుకుంటుంది. దీన్ని శ్రీకృష్ణుడి వెన్నముద్ద అని కూడా పిలుస్తారు. ఇక్కడ గుహలో శివాలయం ఉంటుంది. అలాగే బీచ్ కి సమీపంలో.. ఈ రాయి ఉంది. దీన్ని చూస్తే.. పడిపోతుందేమో అనిపిస్తుంది. ఇక్కడ యాత్రికులు ఫోటోలు దిగితుంటారు. ఏ ఆధారం లేకుండా చాలా కాలంగా ఈ రాయి ఎలా నిలబడి ఉందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.

భారత దేశంలోని ఈ వింతలను చూశారా

భారత దేశంలోని ఈ వింతలను చూశారా

11. వేడినీటి బుగ్గ

Image source:

ఇండియాలోని టాప్ నాచురల్ వండర్స్ లో మరొక చెప్పుకోదగ్గ ప్రాంతం వేడి నీటి బుగ్గ హిమాచల్ ప్రదేశ్ లోని కుల్లు జిల్లాలో ఉంది.. మణికరన్ పుణ్యక్షేత్రం. ఇక్కడ వేడి నీళ్లు ఎగిరిపడుతూ ఉంటాయి. అదే ఇక్కడ ఫేమస్. ఇది కూడా న్యాచురల్ గా ఏర్పడిన వండర్. చుట్టూ ఎముకలు కొరికే చలి ఉంటే వేడి నీటి బుగ్గ ఎలా ఏర్పడిందన్న దాని కి ఆధునిక సాంకేతిక పరిజ్జానం కూడా సమాధానం చెప్పలేక పోతోంది.

భారత దేశంలోని ఈ వింతలను చూశారా

భారత దేశంలోని ఈ వింతలను చూశారా

12బొర్రా గుహలు...

Image source:

ఇండియాలోని టాప్ నాచురల్ వండర్స్ ! బొర్రా గుహలు బొర్రా కేవ్స్ కూడా చాలా సహజంగా ఏర్పడినవే. ఇవి విశాఖపట్నంలోని అనంతగిరి కొండలు, అరకులోయలో ఉన్నాయి. ఇండియాలోనే అత్యంత లోతైన గుహలు ఇవి. 80 మీటర్ల లోతులో ఉంటాయి. బొర్రా గుహలను 1807 లో బ్రిటిష్ భౌగోళిక శాస్త్రవేత్త విలియం కింగ్ కనుగొన్నాడు. ఒరియా భాషలో 'బొర్ర ' అంటే రంధ్రమని అర్థం. సహజంగా ఏర్పడిన ఈ గుహలు 10 లక్షల ఏళ్ళ క్రితంనాటివని భావిస్తున్నారు.

భారత దేశంలోని ఈ వింతలను చూశారా

భారత దేశంలోని ఈ వింతలను చూశారా

13. మైనస్ 50 డిగ్రీల్లో జనావాసం

Image source:

ద్రాస్‌ లోయ ఆసియాలో అతి శీతల ప్రదేశాల్లో ద్రాస్‌ లోయ రెండవది. జమ్ము కాశ్మీర్‌లోని కార్గిల్‌ జిల్లాలో ఈ లోయ ఉంది. సాధారణ కాలాల్లోనే ఇక్కడ చలిని భరించడం కష్టం. ఇక చలికాలం వస్తే చెప్పనవసరం లేదు. ఉష్ణోగ్రత మైనస్‌ 50 నుంచి మైనస్‌ 60 డిగ్రీల వరకూ పడిపోతుంది. ఎన్ని దుప్పట్లు కప్పుకుంటే ఆ చలిని తట్టుకోగలమో ఆలోచించండి. అయితే ఇది జనావాసం ఉన్న ప్రాంతం. టైగర్‌ కొండలపైన పాకిస్తానీయులు చేసిన దుస్సాహసాల సమయంలో దాస్‌ లోయ ప్రముఖంగా వెలుగులోకి వచ్చింది. ఈ లోయనుంచి టైగర్‌ పర్వతాలను చూడవచ్చు.

భారత దేశంలోని ఈ వింతలను చూశారా

భారత దేశంలోని ఈ వింతలను చూశారా

14. రామయణ కాలం నాటి ప్రాంతం

Image source:

ధనుష్కోడి రామాయణ కాలంలో శ్రీరాముడు విభీషణుడికి పట్టాభిషేకం జరిపిన స్థలంగా ధనుష్కోడి ని చెబుతారు. రావణాసురుడిని చంపి, విజయం సాధించిన తరువాత రాముడు తన ధనుస్సును ఇక్కడి ఇసుకలో పెట్టాడని కథనం. హిందూమహాసముద్రం, బంగాళాఖాతం కలిసే ప్రాంతంలోని రామేశ్వరం వద్ద ధనుష్కోడి ఉంది. సముద్రం మధ్యలో ద్వీపంలా కనిపించే ఈ ప్రాంతంనుంచి శ్రీలంకకు రైలు మార్గం వేయడానికి ఆంగ్లేయుల కాలంలో యత్నాలు జరిగాయట. అయితే 1964లో సంభవించిన పెను తుపాను ఈ పట్టణాన్ని నాశనం చేసింది. అయినప్పటికీ మీటర్‌ గేజ్‌ రైల్వే మార్గం తాలూకు చిహ్నాలు ధనుష్కోడికి వెళ్లే రోడ్డు మార్గంలో ఇప్పటికీ చూడవచ్చు.

భారత దేశంలోని ఈ వింతలను చూశారా

భారత దేశంలోని ఈ వింతలను చూశారా

15. దెయ్యాల లైట్లు...

Image source:


ఇండియాలోని టాప్ నాచురల్ వండర్స్ ! చిర్ భట్టి బన్ని గ్రాస్ లాండ్స్ లోని కుచ్ అనే ప్రాంతంలో రాత్రి అయ్యిందంటే చాలు.. వివరించలేని విధంగా.. లైట్లు కనిపిస్తాయి. ఇవి.. దయ్యాల రూపంలో కనిపిస్తాయని నమ్మకం ఉంది. ఈ లైట్స్ రెడ్, ఎల్లో, బ్లూ కలర్స్ లో ఏర్పడతాయట. ఇండియాలోని ఇదో న్యాచురల్ వండర్. గుజరాత్ లోని రాన్ ఆఫ్ కచ్ ప్రాంతంలో కనిపించే ఈ లైట్లను చూడటానికి చాలా మంది యాత్రికులు వస్తుంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X