Search
  • Follow NativePlanet
Share
» »మేజిక్ కొలనుల అంతు చూడండి.... అరుదైన మత్స్యావతార మూర్తిని దర్శించండి

మేజిక్ కొలనుల అంతు చూడండి.... అరుదైన మత్స్యావతార మూర్తిని దర్శించండి

By Beldaru Sajjendrakishore

భారతదేశం యొక్క తూర్పు కనుమలలో ఒక అందమైన ట్రెక్కింగ్ బాట నాగలాపురం. ఇవి భారతదేశం యొక్క తూర్పు తీరంలో తూర్పు కనుమలలో గల చెదురుమదురు పర్వత శ్రేణులుగా వున్నాయి.

పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తూర్పు కనుమల రాష్ట్రాలలో వ్యాపించి వున్న పర్వత శ్రేణులు. దక్షిణ భారతదేశంలో పశ్చిమ కనుమలతో ముఖ్యంగా పోలిస్తే, నాగలాపురం ట్రెక్ చాలా అసాధారణమైనది. కానీ చాలా సహజంగా వుంటుంది. ఇక్కడే మ్యాజిక్ కొనలు ఉన్నాయి. ఇక ఈ నాగలాపురంలోనే శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో కనిపిస్తారు. ఇన్ని విశిష్టతలు ఉన్న ఈ ఈ నగాలాపురానికి సంబంధించిన వివరాలన్నీ నేటివ్ ప్లానెట్ పాఠకుల కోసం...

అత్యంత అరుదైన శివుడు తలకిందులుగా కనిపించేది ఇక్కడే

1. 15 కిలోమీటర్ల దూరం నుంచి

1. 15 కిలోమీటర్ల దూరం నుంచి

Image source:

నాగలాపురం ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఒక చిన్న గ్రామం. తిరుపతికి ఆగ్నేయంగా 70 కిలోమీటర్ల దూరంలో గల ఒక ప్రసిద్ధ యాత్రా స్థలం. రోడ్డు మార్గం సౌకర్యవంతంగా ఉంది. చెన్నై మరియు నాగలాపుర గ్రామం మధ్య దూరం సుమారు 90 కి.మీ. నాగలాపురంగ్రామం నుండి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో వున్న ఆరై గ్రామం నుండి కాలిబాట ప్రారంభమవుతుంది. ఇక్కడ ట్రెక్కింగ్ కు అనుమతి తప్పనిసరి

2. వేసవి కాలం మంచిది..

2. వేసవి కాలం మంచిది..

Image source:

ఇక్కడ గల దట్టమైన చెట్లు, చల్లని జలపాతాలు మరియు సహజ కొలనులు వేసవిలో ట్రెక్కింగ్ చేయడానికి ఆహ్లాదకరంగా వుంటుంది. ఇక్కడ వింటర్ ట్రెక్కింగ్ మరో ఆకర్షణ. వర్షాకాలంలో ట్రెక్కింగ్ అయితే నాగలాపురం కొండలలో కాలిబాట మార్గంలో జలపాతాలను చూడవచ్చు. అలాగే కాలిబాట చేసేటప్పుడు జారే అవకాశం వుంది. ఇది చాలా ప్రమాదకరం. కాబట్టి వర్షాకాలంలో వెళ్ళకుండా వుంటే మంచిది.

3. 2 నుంచి 3 గంటలు...

3. 2 నుంచి 3 గంటలు...

Image source:

నాగలాపురం కొండలు తూర్పు నుండి పడమర వైపునకు వుంటుంది. ట్రెక్కింగ్ తూర్పు లేదా పశ్చిమ భాగాన ఉన్నా మార్గంల్లో వెళ్లవచ్చు. ట్రెక్కింగ్ దూరం సుమారు 13 కి.మీ వుంటుంది. ట్రెక్కింగ్ కు సులభంగా ఒక రోజు పడుతుంది. కొండ మీద అధిరోహించటానికి ట్రెక్కింగ్ సమయం సాధారణంగా 2-3 గంటలు పడుతుంది. ట్రెక్కర్స్ ఒక క్యాంప్ వేసుకొని రాత్రిపూట కొండ మీద స్టే చేయవచ్చును.

4. ఫోటోగ్రఫర్లకు పండగే

4. ఫోటోగ్రఫర్లకు పండగే

Image source:

ట్రెక్ మార్గం మధ్యాహ్నసమయంలో కూడా దట్టమైన చెట్ల వల్ల ఆహ్లాదకరంగా చాలా చల్లగా వుంటుంది. కాలిబాటలో జలపాతాలు, ప్రవాహాలు మరియు నీటి కొలనులు ఎంతో రిఫ్రెష్ ను అందిస్తాయి. ఈ జలపాతాలు మరియు కొలనులు దగ్గర నడుస్తూ ఆనందిస్తూ ఆ ప్రశాంతతను అనుభవిస్తూ ఫోటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ వుండే వాళ్ళు అక్కడక్కడా ఆగి ప్రకృతి దృశ్యాలను కెమెరాలో బంధించవచ్చు.

5. ఇక్కడే మేజిక్ కొలనులు

5. ఇక్కడే మేజిక్ కొలనులు

Image source:

ట్రెక్ మార్గం వెంట ఉన్న జలపాతాల దగ్గర 3 అద్భుతమైన నీటి కొలనులు వున్నాయి. ఈ నీటి కొలనులలోని నీటి ప్రవాహం ఏ మాత్రం కూడా తగ్గకుండా వేసవిలో కూడా అలాగే ప్రవహిస్తూనే వుంటుంది. దీనిని ట్రెక్కర్స్ 'మేజిక్ కొలనులు' అంటారు. మొదటి రెండు నీటి కొలనుల్లోని నీరు చాలా తేటగా ఉంటుంది. ఇక్కడ ఈత కొట్టే వాళ్ళు కొట్టవచ్చు. మూడో నీటి కొలను సహజమైన ప్రకృతి దృశ్యాలను కలిగి వుంది. శిఖరాగ్రానికి సమీపంలో 30 అడుగుల లోతులో నీటిగుంటలు వున్నాయి. ఇక్కడ ఈత కొట్టడం అంతమంచిది కాదు. ఈతలో బాగా అనుభవం వున్నవారు మాత్రమే ఈత కొడితే మంచిది. ఇక్కడ చాలా జాగ్రత్తగా వుండాలి.

6. ఇవి ఉంటే మంచిది

6. ఇవి ఉంటే మంచిది

Image source:

దుస్తులు (అదనపు జత), ఆహారం, మందులు, నీళ్ళ బాటిల్స్, దోమల రక్షణ కొరకు మొదలైనవి తీసుకువెళ్ళాలి. ఇక్కడికి ట్రెక్కింగ్ కై వచ్చే వారు దాదాపు ట్రావెల్ సంస్థలనే ఆశ్రయిస్తుంటారు. ఒక్కొక్కరికి 2500-3000 వరకు ఛార్జ్ వసూలు చేస్తారు. భోజనం, వసతి, గైడ్, పొనురాను ట్రాస్పోర్ట్ మొత్తం ట్రావెల్ సంస్థలదే భాద్యత. సొంతంగా వెళ్లే వారికి ఈ సౌకర్యాలు ఏవీ ఉండవు కనుక తగినన్ని ఏర్పాట్లు చేసుకొని వెళితే బాగుంటుంది. సమీపంలో దుకాణాలు లేవు. తగిన ఆహారం మరియు త్రాగుటకు నీరు వెళ్ళటం మంచిది. అక్కడక్కడ నీటి వనరులు ఉన్నాయి. మీరు రాత్రిపూట వుండాలనుకుంటే స్లీపింగ్ బ్యాగ్స్, స్లీపింగ్ మ్యాట్స్, టార్చ్ తీసుకువెళ్లటం మంచిది.

7. మత్స్యావతార మూర్తి...

7. మత్స్యావతార మూర్తి...

Image source:

ఈ ఊళ్ళో గల శ్రీ వేదనారాయణస్వామి దేవాలయం చాలా ప్రసిద్దమైనది. శ్రీమహావిష్ణువు మహర్షుల కోరికపై సొమకాసురుడిని వధించడానికి మత్స్యావతార మెత్తుతాడు. సోమకాసురుని సంహరించి వేదాలను బ్రహ్మకు తిరిగి ఇస్తాడు. ఇక్కడి విగ్రహాన్ని స్వయంభువుగా చెబుతారు. గర్భగుడిలో ఉన్న ఈ మత్స్యావతారమూర్తికి ఇరు ప్రక్కల శ్రీదేవి, భూదేవి ఉన్నారు. స్వామివారి చేతిలో సుదర్శన చక్రం ప్రయోగానికి సిద్దంగా ఉన్నట్లు ఉంటుంది. స్వామివారి నడుముకు దశావతార వడ్డాణం ఉంటుంది.

8. శ్రీకృష్ణదేవరాయలు నిర్మించాడు...

8. శ్రీకృష్ణదేవరాయలు నిర్మించాడు...

8. శ్రీకృష్ణదేవరాయలు నిర్మించాడు...

Image source:

ఈ దేవాలయ ప్రాకారాలను శ్రీకృష్ణదేవరాయలు నిర్మింపజేశాడని చరిత్రకారులు చెబుతారు. ఈ ప్రాకారాలు విజయనగర కాలపు శిల్పకళా నైపుణ్యానికి ఒక మచ్చు తునక. జీర్ణావస్థలో ఉన్న ఈ దేవాలయ ప్రాకారాలను ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానములు జీర్ణోద్దరణ చేస్తోంది. ఈ దేవాలయ నిర్మాణం ఇంజనీరింగ్ ప్రతిభకు తార్కాణం. కాలగమనాన్ని అనుసరించి నిర్మించిన ఈ దేవాలయ నిర్మాణం మెచ్చుకోదగినది.

9. సూర్య కిరణాలు తాకుతాయి...

9. సూర్య కిరణాలు తాకుతాయి...

Image source:

ఈ ఆలయ విశిష్టత ఏమంటే........ ప్రతియేడు మార్చి నెల 25, 26, 27/26,27,28 వ తేదీలలో సాయంకాలం మూల విరాట్టుకు 630 అడుగుల దూరంలో ఉన్న రాజగోపురం నుండి సూర్య కిరణాలు నేరుగా వచ్చి, మొదటి రోజున స్వామి వారి పాదభాగాన, రెండో రోజున స్వామివారి నాభి భాగాన, మూడో రోజున స్వామివారి ముఖ భాగాన ప్రసరిస్తాయి. ఈ కారణంగానే ఆ మూడు రోజులు స్వామివారికి సూర్య పూజోత్సవాలు జరుపుకుంటారు. ఈ ఉత్సవాలకు ఇతర రాష్ట్రాలనుండి కూడా భక్తులు తండోప తండాలుగా వచ్చి దర్శనం చేసుకుంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more