• Follow NativePlanet
Share
» »హైదరాబాద్ టెక్కీలూ... మీకు దగ్గర్లోని ఈ ట్రెక్కింగ్ స్పాట్స్ పై ఈ వీకెండ్ లుక్కేయండి...

హైదరాబాద్ టెక్కీలూ... మీకు దగ్గర్లోని ఈ ట్రెక్కింగ్ స్పాట్స్ పై ఈ వీకెండ్ లుక్కేయండి...

Written By: Beldaru Sajjendrakishore

వారం మొత్తం నాలుగు గోడల మధ్య పనిచేయడం..., ఉదయం, సాయంత్రం ఆఫీసుకు వచ్చే, వెళ్లే సమయాల్లో ట్రఫిక్ రణగొణుల మధ్య విసిగి పోయారా? ఈ కాంక్రీట్ జంగిల్ నుంచి దూరంగా రెండు రోజుల పాటు సేదదీరాలని మనసు కోరుకుటోందా? మీకోసమే ఈ కథనం. ప్రకతి రమణీయతకు, వేలాది జాతుల జంతు, వక్ష సంపదకు తెలంగాణ నిలయం. హైదరాబాద్ కు అనుకొని ఎన్నో అభయారణ్యాలు, జాతీయ పార్కులు ఉన్నాయి. వీటిలో కొన్ని ట్రెక్కింగ్ కు కూడా అనుకూలం.

వేసవి పర్యాటకంలో వీటిని మిస్ కాకండివేసవిలో

తెలుగు రాష్ట్రాల కొండ కోనల్లో చల్ల...చల్లగా

అందులో అంత్యంత సుందరమైనవి, సురక్షితమైనవే కాకుండా దేశంలోని వివిధ చోట్ల నుంచి సదరు ప్రాంతాలను చేరుకోవడానికి మంచి రవాణా సదుపాయాలన్న వాటిని నేటివ్ ప్లానెట్ మీ ముందుకు తెలుస్తోంది. రానున్న వీక్ ఎండ్ ఎక్కడికి వెళ్లాలి అటు పై వీకెండ్ ఎక్కడికి వెళ్లాలి అన్న విషయం పై ప్రణాళిక తయారు చేసుకుని ట్రవెల్ బ్యాగ్ ను సర్థు కోవడం మాత్రం మీ వంతు...

1. భువనగరి కోట

1. భువనగరి కోట

Image source:

భువనగిరి కోట యాదాద్రి భువనగిరి జిల్లా లోని భువనగిరి పట్టణంలో ఉంది. భువనగిరిలో ఉన్న కోట కాకతీయుల కాలంలో మిక్కిలి ప్రసిద్ధి చెందినది. ఈ కోట పశ్చిమ చాళుక్య వంశానికి చెందిన పాలకుడైన త్రిభువన మల్ల విక్రమదిత్య (ఆరవ) చే ఏకశిలారాతి గుట్టపై నిర్మించబడింది. అతని పేరు మీదుగా దీనికి త్రిభువనగిరి అని పేరు వచ్చింది.ఈ పేరు క్రమంగా భువనగిరి అయ్యింది.

2. కొంత సులభమే

2. కొంత సులభమే

Image source:


ఇక ట్రెక్కింగ్ ద్వారా కొండపై భాగన ఉన్న కోటకు చేరుకోగానే అక్కడ శిథిలమైన అంత:పురాలు, నంది విగ్రహాలు, అంజనేయ విగ్రహం సొరంగ మార్గాలు తదితరాలను చూడవచ్చు. సమీపంలోని యాదగిరి గుట్టను కూడా దర్శించుకోవచ్చు. హైదరాబాద్ నుంచి ఇక్కడకు 54 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ట్రెక్కింగ్ మార్గం సులభంగా ఉంటుంది. అయినా అటవీశాఖ వారి సహాయం తీసుకుని గైడ్ ను తీసుకుని వెలితే మంచిది.

3. అనంతగిరి హిల్స్...

3. అనంతగిరి హిల్స్...

Image source:


అనంతగిరి కొండలు తెలంగాణ రాష్ట్రంలో గల వికారాబాదు జిల్లా లోని అనంతగిరిలో ఉన్నాయి. ఇది తెలంగాణ రాష్ట్రం లోని అతి పెద్ద దట్టడవి. ఇందులో అనంతగిరి దేవాలయం ఉంది. ఈ కొండలు హైదరాబాదు నుండి ప్రవహిస్తున్న మూసీ నది యొక్క జన్మస్థానం. ఇవి వికారాబాదుకు 5 కి.మీ దూరంలో ఉంటాయి. ఇది ప్రాచీన ఆవాస ప్రదేశం. ప్రాచీన గుహలు కొన్ని కోటలు మరియు దేవాలయం ఈ ప్రదేశ ఔన్నత్యాన్ని తెలియజేస్తాయి

4.బాగా పాపులర్ అవుతోంది

4.బాగా పాపులర్ అవుతోంది

Image source:


చుట్లూ అందమైన అడవితో ఆహ్లాద కరంగా కనిపించే ఈ మార్గంలో ట్రెక్కింగ్ అంత సులభమైనది కాదు. అయినా గైడ్ సహాయంతో వీకెండ్ లో స్నేహితులతో కలిసి ఇక్కడ ట్రెక్కింగ్ చేయడానికి చాలా మంది వస్తుంటారు. ఇటీవల కాలంలో ఈ ట్రెక్కింగ్ ట్రెండ్ బాగా పాపులర్ అయ్యింది. దీంతో వీకెండ్ సమయంలో కొన్ని ప్రైవేటు టూరిజం సంస్థలు హైదరాబాద్ కు 79 కిలోమీటర్ల దూరంలోని అనంతగిరి ట్రెక్కింగ్ కోసం ప్రత్యేక ప్యాకేజీలను అందజేస్తున్నారు.

5. మెదక్ ఫోర్ట్

5. మెదక్ ఫోర్ట్

Image source:


మెదక్ కోట తెలంగాణ రాష్ట్రం లోని మెదక్ జిల్లాలో ఉంది. ఇది రాష్ట్ర ముఖ్య పట్టనమైన హైదరాబాదు నగరానికి 100 కి.మీ దూరంలో ఉంటుంది. మెదక్ నగరానికి ఉత్తరాన మూడు వందల అడుగుల ఎత్తైన కొండపై 400 ఎకరాల్లో విస్తరించి ఉంది ఈ మెదక్ కోట. ఇది ప్రాచీన భారతదేశం లోని కాకతీయుల కాలంనాడు కొండపై నిర్మించిన దుర్గము. ఈ కోట సుమారు 12 వ శతాబ్దం నాటిది. ఈ కోటను కాకతీయుల కాలంలో ప్రతాపరుద్రుడు కాలంలో నిర్మించారని ప్రతీతి.

6. సులభమే...

6. సులభమే...

Image source:


ఇక్కడ ట్రెక్కింగ్ సులభమే. పది మందితో కూడిన ట్రెక్కింగ్ సభ్యులు ఇక్కడకు చేరుకుని సులభంగా కోట పై భాగానికి చేరుకోవచ్చు. ఈ కోటలో "ప్రధాన ద్వారం", సింహద్వారం మరియు "గజ ద్వారం" అనే రెండు ప్రధాన ద్వారాలు ఉనక్నాయి. కాకతీయ పాలకులకు, వారి తర్వాత చాలా కాలానికి రాజ్యం చేసిన కుతుబ్ షాహిలకు కూడా ఈ కోట నియంత్రణా కేంద్రంగా ఉండేది. కుతుబ్ షాహి పాలకులు ఈ కోట లోపల దాన్యాగారాల గదులతో కూడిన ఒక మసీదును 17వ శతాబ్ద౦లో నిర్మించారు.

7. ఖిల్లా ఘన్‌పూర్

7. ఖిల్లా ఘన్‌పూర్

Image source:


ఖిల్లా ఘనపురం అను చారిత్రత్మక ప్రదేశం తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్ మరియు వనపర్తి పట్టణాలకు మధ్యలో 25 కిలోమీటర్ల సమదూరంలో ఉంది. ఈ ప్రదేశం హైదరాబాద్ నగరానికి దక్షిణాన 111 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఖిల్లా గణపురాన్ని రేచర్ల పద్మనాయకులు, మాల్యాల మరియు గోన వంశస్తులు 13వ శతాబ్దంలో పరిపాలించారు.వీరు కాకతీయుల ప్రభువుల వద్ద సామంత రాజులు.కాకతీయుల కాలం నాటి కోట మరియు ఒక చెరువు (గణపసముద్రంగా ప్రసిద్ధి) ఈ ప్రదేశంలో గలదు.

8.ఇతర పర్యాటక ప్రాంతాలు ఇలా

8.ఇతర పర్యాటక ప్రాంతాలు ఇలా

Image source:


ఘనపురంలో రెండు పర్వతాలను కలుపుతు కట్టిన ఈ గిరిదుర్గం పై భాగానికి చేరుకోవడం కొంత కష్టమైనా కూడా చాలా మంది ట్రెక్కింగ్ కు వచ్చే వారు ఈ ఖిల్లా పై ఆసక్తి కనబరుస్తుంటారు. ఈ గిరిదుర్గం నుండి రెండు రహస్య సొరంగమార్గాలు ఉన్నాయని ఇక్కడి ప్రజలు విశ్వసిస్తారు. ఈ కోట ఎత్తైన కొండలపై దాదాపు 4 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగియున్నది.ఇక్కడ వీరభద్ర ఆలయం, నరసింహ ఆలయం మరియు చౌడేశ్వరిదేవి ఆలయాలు ఉన్నాయి.

9. కోయిలకొండ

9. కోయిలకొండ

Image source:


కోయిలకొండ, తెలంగాణ రాష్ట్రములోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒక మండలము. కోయిలకొండ గ్రామంలో పురాతన కోటతో పాటు పురాతన ఆలయాలు, చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఈ గ్రామము మహబూబ్ నగర్ నుంచి 24 కిలోమీటర్ల దూరంలో ఉంది. రెండు రాష్ట్రాల్లో కలిపి ప్రసిద్ధి చెందిన 7 గిరిదుర్గాలలో ఇది. ఒకటి కొండపై వెలిసిన దుర్గం కాబట్టి కోవెలకొండ అని పేరు. కోవెల అనగా దేవాలయం. కోవెలకొండ నామమే మార్పు చెంది ప్రస్తుతం కోయిలకొండగా మారింది.కోయిలకొండ గ్రామానికి దక్షిణ దిశలో ఎత్తయిన గుట్టపై కోటను నిర్మించారు.

10. కొంత కష్టంతో కూడుకున్నదే

10. కొంత కష్టంతో కూడుకున్నదే

Image source:


ఈ ట్రెక్కింగ్ కొంత కష్టమైనదే అయితే కోట పైకి చేరుకున్న తర్వాత ఆ కష్టాన్ని మరిచిపోతాం. కోటలో నిర్మించిన అద్భుత కట్టడాలైన గోడలు, సిరస్సులు, ధాన్యారాగాలు, దేవాలయాలు, రెండు పెద్ద పిరంగులతో పాటు కోట చుట్టూ గల కొండలపై అలనాడే మహిమ గల దేవాలయాల నిర్మించారు. కోటకు పడమటి భాగాన రామగిరి అని నాడు రామకొండ అని నేడు పిలిచే ఎత్తైన కొండపై శ్రీ రాముని పాదములు ఉంది. ఆ కొండపై సైతం లెక్కలెనన్ని గృహాలు ఉన్నాయి.

11. గాయత్రి జలపాతం

11. గాయత్రి జలపాతం

Image source:

గాయత్రి జలపాతాలు నిర్మల్ పట్టణం చుట్టూ ఉన్న అనేక జలపాతాల్లో ఒక జలపాతం. ఈ గాయత్రి జలపాతాలు ఆదిలాబాద్ జిల్లా లోని నేరడిగొండ మండలంలో ఉన్నాయి. సుమారు 70 మీటర్ల ఎత్తునున్న రాతికొండ నుంచి కిందకు జాలువారుతున్న ఈ జలపాత అందాలు చూసినవారిని మైమరపిస్తున్నాయి. ఈ జలపాతం తెలంగాణ లోనే అతి ఎత్తైనా జలపాతం. దీని ఎత్తు 363 అడుగుల ఎత్తు ఉంటుంది. ఎత్తునుండి జాలువారే జలదారాల చప్పుడు సంగీతాన్ని మరిపించే విధంగా ఉంటుంది. జలపాత నీటి బిందువులు శీతాకాలంలో హిమచల్ ప్రదేశ్, జమ్ముకాశ్మీర్ లో పడే మంచుబిందువులను తలపిస్తుంటాయి.

12. ఇలా వెళ్లాలి...

12. ఇలా వెళ్లాలి...

Image source:


గాయత్రి జలపాతానికి హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వెళ్లే జాతీయ రహదారికి దగ్గరలో ఈ జలపాతం ఉంటుంది. హైదరాబాద్ నుంచి నిర్మల్, అక్కడి నుంచి నేరేడిగొండకు చేరుకొని అక్కడి నుంచి తర్నం గ్రామానికి చేరుకోవాలి. కాలి నడకన దాదాపు ఐదు కిలో మీటర్లు నడవాల్సి ఉంటుంది. వెంట గైడ్‌ను తీసుకువెళ్తే తప్ప ఈ జలపాతం చేరుకోలేం. జలపాతం కింది ప్రాంతానికి వెళ్లాలంటే రాళ్లతో కూడిన ప్రమాదకరమైన ఒర్రె నుంచి వెళ్లాలి.

13. నిజామాబాద్ కోట

13. నిజామాబాద్ కోట

Image source:


నిజామాబాదు కోట తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ లో ఉంది. దీనిని 10 వ శతాబ్దంలో రాష్ట్రకూట రాజులు నిర్మించారు. ఇది నిజామాబాద్ పట్టణానికి నైరుతి దిశలో, మహాత్మా గాంధీ చౌక్ నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. కోట పైన ఉన్న ఆలయాన్ని రఘునాథ ఆలయం (జగన్నాథ్ ఆలయం, రామాలయం ఖిల్లా) అని పిలుస్తారు. ఇక్కడికి హిందూ మతం భక్తులు వస్తారు. పర్యాటక కేంద్రంగా కూడా ఉంది. ఛత్రపతి శివాజీ తన గురువైన రాందాస్ ఆజ్ఞపై ఈ శ్రీరామ దేవాలయాన్ని నిర్మించినట్లు చెబుతారు.

14. ఎల్లప్పుడూ చల్లగా ఉంటుంది.

14. ఎల్లప్పుడూ చల్లగా ఉంటుంది.

Image source:


విశాలమైన మందిరాలతో ఉన్న ఈ ఆలయ 3,900 చదరపు. అడుగుల విస్తీర్ణంలో, ఎల్లప్పుడూ చల్లగా ఉండేందుకు తగు విధంగా నిర్మించబడింది. ఆలయంలో 53 అడుగుల ఎత్తు ఉన్న ఒక స్తంభం ఉంది. ప్రతిరోజు దీపం వెలిగించడానికి ఈ స్తంభాన్ని ఉపయోగిస్తారు. ఈ దీపం చూసిన తర్వాతే చుట్టప్రక్కల ఉన్న గ్రామాలలోని ప్రజులు వారివారి ఇళ్లలో దీపాలు వెలిగిస్తారట. ఇక్కడ చుట్టు పక్కల ప్రదేశాలను చూసుకుంటూ నడుచుకుని వెళ్లడం మరుపురాని అనిభూతిని అందిస్తుంది.

15. అహోబిలం

15. అహోబిలం

Image source:


అహోబిలం, కర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ మండలానికి చెందిన గ్రామం. ఇక్కడ ప్రసిద్ధి చెందిన లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఉంది. అహోబలం హిందూ యాత్రికులకే కాక, పర్యాటక కేంద్రంగా, కొండలు, నదులు, ప్రకృతి అలంకారాలకు నైసర్గిక స్వరూపాలు. ఇది ముఖ్యంగా వైష్ణవ యాత్రికులకు పవిత్ర పుణ్యక్షేత్రం. పురాణ ప్రసిద్ధిగాంచిన అహోబిలాన్ని అహోబలం అని కూడా వ్యవహరిస్తారు.

 16. గైడ్ సహాయం తప్పక తీసుకోవాలి

16. గైడ్ సహాయం తప్పక తీసుకోవాలి

Image source:


చుట్టూ ఉన్న జలపాతాలను చూస్తూ ముందుకు వెళ్లడం మరిచిపోలేని అనుభూతి, హైదరాబాద్ నుంచి 351 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రదేశం ఉంటుంది. అందువల్ల ఒక రోజు ముందుగానే ఇక్కడకు చేరుకుని రాత్రి గడిపిన తర్వాత ఉదయమే ఇక్కడ ట్రెక్కింగ్ చేస్తుంటారు. ఇది కొంత కఠినమైన ట్రెక్కింగ్ మార్గం. అందువల్ల అటవీ శాఖ అధికారుల అనుమతితో పాటు ఈ ప్రాంతం గురించి తెలిసిన గైడ్ సహాయం తప్పక తీసుకోవాలి.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి