
మనిషి ఆశాజీవి. తను చేసే ప్రతి పనిలోనూ విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతుంటాడు. ఇందు కోసం హిందూ సంప్రదాయం ప్రకారం తనకు తెలిసిన దేవాలయాలన్నింటినీ సందర్శిస్తుంటారు. హిందూ పురాణాల ప్రకారం దేవతలు ఎంత మంది అంటే ముక్కోటి మందన్న సమాధానం వస్తుంది. ఇందులో భక్తుల కోరిన కోరికలు తీర్చే దేవుళ్లు, వారు కొలవై ఉన్న దేవాలయాలు చాలా కొన్ని మాత్రమే ఉన్నాయి. అందులో శ్రీకాకుళం జిల్లా, అరసవల్లిలోని శ్రీ సూర్యనారాయణస్వామి దేవస్థానం ఒకటి. ఇక్కడ సూర్యకిరణాలు దేవస్థానంలోని సూర్యభగవానుడిని తాకే సమయంలో స్వామివారిని దర్శనం చేసుకుంటే విజయం తథ్యమని చాలా కాలంగా భక్తులు విశ్వసిస్తున్నారు. ఇందుకు సంబంధించిన కథనాన్ని ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాం.

1. పద్మ పురాణం ప్రాకం
శ్రీ సూర్యనారాయణస్వామి దేవస్థానం శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం మండలంలోఅరసవల్లి అనే గ్రామంలో ఉంది. శ్రీకాకుళం పట్టణానికి సుమారు ఒక కిలోమీటరు దూరంలో గల ఈ గ్రామం శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానము ద్వారా బహుళ ప్రసిద్ధి చెంది ఉన్నది. ఇది మన దేశంలో గల సూర్యదేవాలయాలలో ప్రాచీనమైనది. పద్మ పురాణం ప్రకారం ప్రజల క్షేమం కోసం కస్యప మహర్షి ఈ దేవాలయ విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు ఆధారాలున్నాయి.

2. మరో కథనం ప్రకారం
2. మరో కథనం ప్రకారం
Image Source:
కురు పాండవ యుద్ధంలో జరగబోయే బంధునాశనం చూడలేక బలరాముడు తీర్థ యాత్ర లకు బయలు దేరుతాడు. విధ్య పర్వతములు దాటి దండకారణ్యం అధిగమింఛి మాధవ వనములో పద్మనాభ పర్వత ప్రాంతములో నివశిస్తూ ఉంటాడు. కరువు కాటకములతోను బాధపడుచున్న కళింగ ప్రజలు తమను ఈ బాధ నుండి విముక్తులను చేయవలసిందిగా బలరాముని ప్రార్థిస్తారు.

3. హలముతో
Image Source:
దీంతో బలరాముడు తన ఆయుధమైన హలము (అనగా నాగలి వలన) ని భూమి పై నాటి జలధార వచ్చినట్లుగా చేస్తాడు. బలదేవుని ఆయుధమైన నాగావళి ఉధ్బవించినకి కాబట్టి నాగావళి (దీనినే లాంగుల్య నది) అని ఇప్పటికీ పిలివబడుతున్నది. ఈ నాగావళి నది తీరమందు బలరాముడు ఐదు విశిష్ట శివాలయాలను నిర్మిస్తాడు. అందులో నాలుగవది శ్రీకాకుళం పట్టణంలో వెలసిన ఉమారుద్ర కోటేశ్వరస్వామి ఆలయము.

4. దేవతలందరూ
4. దేవతలందరూ
ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించిన సమయంలో శ్రీ స్వామివారిని దేవతలందరూ కూడా దర్శించుకుని వెళుతారు. అదే విధంగా ఇంద్రుడు ఈ మహాలింగమును దర్శించుటకు వచ్చెను. అప్పటికే కాలాతీతమైనది. అయినా పట్టు విడవని ఇంద్రుడు ఆ పరమేశ్వరుడిని దర్శించుకోవాల్సిందేనని గట్టిగా ని ర్ణయించుకుంటాడు. అంతే కాకుండా పరమశివుడి ప్రమద గణాలను పరిపరి విధాలుగా వేడుకుంటాడు.

5. వారికి ఇంద్రుడికి
5. వారికి ఇంద్రుడికి
ఈ క్రమంలోనే నందీశ్వరుడు,శృంగేశ్వరుడు, బృంగేశ్వరుడు ద్వారపాలకులు శ్రీ స్వామివారిని దర్శించుటకు ఇది తగు సమయం కాదు అని గట్టిగా వారిస్తారు. దీంతో కోపగించుకున్న ఇంద్రుడు వారితో ఘర్షణకు దిగుతాడు. అపుడు నందీశ్వరుడు కోపంతో తన కొమ్ములతో ఇంద్రుడిని ఒక విసురు వేసెను. దీంతో ఇంద్రుడు రెండు పర్లాంగుల దూరంలో పడుతాడు. ఇంద్రుడు పడిన ఆ స్థలమునే ఇంద్ర పుష్కరిణి అంటారు.

6. సూర్యుడు ప్రత్యక్షమయ్యి
6. సూర్యుడు ప్రత్యక్షమయ్యి
Image Source:
అప్పుడు ఇంద్రుడు సర్వశక్తులు కోల్పోగా సూర్యభగవానుని ప్రార్థిస్తాడు. దీంతో సూర్యభగవానుడు ప్రత్యక్షమై "నీవు పడిన చోట నీ వజ్రాయుధముతో లోతుగా త్రవ్వమని" చెప్పను. వెంటనే ఇంద్రుడు వజ్రాయుధంతో త్రవ్వగా అచ్చట సూర్యభగవానుని విగ్రహం దొరికెను. దానితోపాటు ఉష,ఛాయ, మరియు పద్మిని విగ్రహాలు కూడా లభించినవి. అచ్చట ఇంద్రుడు దేవాలయమును కట్టి ప్రతిష్ఠించెను

7. ఆ వరం ప్రసాదించాడు
7. ఆ వరం ప్రసాదించాడు
Image Source:
అంతేకాకుండా సూర్యకిరణాలు ఈ విగ్రహాన్ని తాకే సమయంలో కనుక ఎవరైతే తనను దర్శనం చేసుకుంటారో వారికి విజయం తథ్యమని వరమిస్తాడు. అందువల్లే సూర్యకిరణాలు విగ్రహాన్ని తాకేసమయంలో స్వామివారిని దర్శనం చేసుకోవడానికి భక్తులు లక్షల సంఖ్యలో ఇక్కడకు చేరుకుంటారు. అదే ఈ నాటి అరసవెల్లి క్షేత్రము. అనంతరం శ్రీఉమారుద్ర కోటేశ్వర స్వామి వారిని దర్శించుకొని జన్మ పునీతం చేసుకొనెను.

8. రెండు పర్యాయాలు
Image Source:
ఈ దేవాలయంలో సంవత్సరానికి రెండు పర్యాయాలు సూర్య కిరణాలు ఉదయసంధ్యలో గర్బ గుడిలో ఉన్న మూలవిరాట్టు పాదాలను తాకుతాయి. అరసవల్లి దేవస్థానం ప్రాంగణంలోని ధ్వజస్తంభం నుంచి సుదర్శన ద్వారం మధ్యలో తొలి కిరణాలు గర్భ గుడిలోకి మాలవిరాట్టు ఆదిత్యుని శిరస్సును సృశిస్తాయి. ఆదిత్యునిని సూర్యకిరణాలు తాకిన వైనాన్ని తిలకించేందుకు తండోపతండాలుగా భక్తకోటి అరసవల్లికి తరలివస్తారు.

9.విదేశీయులు కూడా
9.విదేశీయులు కూడా
Image Source:
సకల జీవులకూ సంక్షేమాన్ని, ఆయురారోగ్యాలనూ, ప్రసాదించే ఈ స్వామివారి ఇరు చేతులూ అభయ ముద్రలోనే ఉంటాయి. మాములు రోజులతో పోలిస్తే మాఘ, వైశాఖ, కార్తీక మాసాల ఆదివారాల్లో ఈ క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అందులో ముఖ్యంగా రథసప్తమినాడు ఆ సంఖ్య లక్షల్లోకి చేరుకుంటుంది. ఈ విషయాన్ని చూడటానికి విదేశాల నుంచి కూడా భక్తులు ఇక్కడకు వస్తుంటారు.

10. సర్వ పాపాలు తొలిగిపోతాయని
10. సర్వ పాపాలు తొలిగిపోతాయని
Image Source:
అలాగే ఉత్తరాయణ, దక్షిణాయన మార్పుల్లో భాగంగా ప్రతిఏటా మార్చి 9, 10, 11, 12 తారీఖుల్లోనూ, అక్టోబరు 1, 2, 3, 4 తేదీల్లోనూ, స్వామివారి, ధ్రువమూర్తిపై ఆదిత్యునిని తొలికిరణాలు తాకుతాయి. స్వామి పాదాల మీదుగా మొదలై శిరోభాగం వరకూ సూర్యకిరణాలు ప్రసరించే అద్భుత, అపురూపమైన దృశ్యాన్ని తిలకిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని ప్రతీతి.

11. ఏడు గుర్రాలతో
11. ఏడు గుర్రాలతో
Image Source:
దేవాలయ ప్రధానమూర్తి సుమారు ఐదు అడుగుల ఎత్తు కలిగి కమలపు రేకలతో ఏడు గుర్రాలతో ప్రక్క పద్మ, ఉష, చాయా దేవేరులతో కూడుకొని ఉంటుంది. విగ్రహ పాదాల వద్ద ద్వారపాలకులగు పింగళ, దండులతో పాటు సనక సనందాది ౠషుల విగ్రహాలు ఉన్నాయి. సూర్య రథం, కిరణాలు కూడా చెక్కబడి ఉన్నాయి. ప్రతి రథ సప్తమికి సూర్య కిరణాలు మూలవిరాట్ పాదాలపై ప్రసరిస్తాయి. ప్రస్తుత దేవాలయం రథం నమూనాలో చక్రాలపై నిలిచినట్టుగా నిర్మించారు.

12. ప్రత్యేక పండుగలు
12. ప్రత్యేక పండుగలు
రథ సప్తమి. ఇది సూర్యనారాయణస్వామి వారి విశేష పర్వదినం.
కళ్యాణోత్సవం: ఇది చైత్ర శుద్ధ ఏకాదశి నుండి బహుళ పాడ్యమి వరకు 6 రోజులు జరుగును.
మహాశివరాత్రి : ఈ రోజున ఈ ఆలయ క్షేత్రపాలకుడైన భువనేశ్వరి సహిత రామలింగేశ్వరస్వామికి ఈ పర్వదినం రోజున ఉత్సవం జరుగుతుంది. ప్రత్యేక అభిషేకాలు రాత్రి జరుగుతాయి.
డోలోత్సవం : హోలీ పండగ రోజున సాయంత్రం కామదహనం పండగని జరుపుతారు.

13. మొదట హర్షవల్లి
13. మొదట హర్షవల్లి
Image Source:
ఉషోదయ కిరణాలతో సమస్త జీవ కోటినీ నవ చైతన్యంతో ఉంచుతున్న ఆ సూర్యభగవానుడికి నిత్య పూజలు జరుగుతున్న ఆలయం అరస వల్లి. ఆ ఆలయంలో భాస్కరుణ్ణి పూజించిన వారు అన్ని కష్టాలూ తొలగి హర్షంతో వెళతారని కాబట్టి ఒకప్పుడు ఈ ఊరిని హర్షవల్లి అనే వారనీ అదే క్రమేణా అరసవల్లిగా మారిందని ప్రతీతి. మహాభాస్కర క్షేత్రంగా పిలుస్తున్న ఆ ఆలయానికి యెంతో ఘనమైన చరిత్ర ఉంది

14.చరిత్రను అనుసరించి
Image Source:
చరిత్ర పుటలను తిరగేస్తే ఇప్పిలి అక్కన్న, సూరప్ప అనే సోదరులు తూర్పు గంగరాజులలో ప్రముఖుడైన దేవేంద్ర వర్మ రాజు దర్శనానికి వెళ్లి, తమకు సూర్యదేవుడు కలలో కనిపించి కొన్ని వివరాలు చెప్పారని విన్నవించారు. ఆ సోదరుల దైవభక్తిపై ఎంతో నమ్మకంతో వారిని అరసవల్లి సూర్యదేవాలయానికి అర్చకులుగా దేవేంద్రవర్మ నియమిస్తాడు. అంతే కాకుండా దేవాలయాన్ని క్రీస్తు శకం 545లో నిర్మించి నట్టు తెలుస్తోంది. వారి వారసులే ఇప్పటికీ ఆలయ అర్చకులుగా కొనసాగుతున్నారు.

15. మూల విరాట్టును
15. మూల విరాట్టును
Image Source:
గంగ వంశరాజులు తరువాత గజపతులు అరసవల్లితో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతంలోని ఆలయాలను సంరక్షించారు. మహ్మదీయుల దాడుల నుంచి ఈ దేవాలయాన్ని రక్షించే క్రమంలో అప్పట్లో ఈ ప్రాంతంలో ఉన్న తారామస్వామి అనే పండితుడు మహమ్మద్ ఖాన్ దండయాత్ర గురించి తెలుసుకుని, ఆలయంలో మూలవిరాట్ ను ఒక బావిలో పడేశారట.

16. ఓఢ్ర సంప్రదాయంలో
16. ఓఢ్ర సంప్రదాయంలో
Image Source:
క్రీ.శ.1778 లో ఎలమంచిలి పుల్లాజీ అనే ఆయన ఆ బావిలో మూలవిరాట్ ను కనుగుని బయటకి తీసి ధ్వంసమైన ఆలయాన్ని పునర్నిర్మించి, విగ్రహ ప్రతిష్ఠ చేసారు. ఆ సమయానికి నల్లని గ్రానైట్ శిలతో రూపొందించిన మూలవిరాట్ విగ్రహం తప్ప మరే అవశేషం మిగిలి లేదు. అలా కాలక్రమంలో యిప్పిలి జోగారావు ఆలయ ధర్మకర్తగా ఉన్న సమయంలో సారవకోట మండలం ఆలుదు గ్రామస్ధులైన వరుదు బాబ్జీ దంపతులు ఆలయ వాస్తు నిర్మాణం దెబ్బతినకుండా గర్భగుడిపై విమానాన్ని (గోపురం) పడ గొట్టి దక్షిణాది పద్ధతిన కాకుండా ఓఢ్ర (ఒరిస్సా) సంప్రదాయంలో నిర్మించారు.

17. ఎలా వెళ్లాలి
17. ఎలా వెళ్లాలి
Image Source:
శ్రీకాకుళం జిల్లా ముఖ్య కేంద్రమైన శ్రీకాకుళానికి అన్ని ప్రాంతాలనుండి విరివిగా బస్సులు లభిస్తాయి. విశాఖపట్నం నుండి ప్రతి 30 నిమిషాలకు నాన్‌స్టాప్ బస్సు సౌకర్యం ఉంది. శ్రీకాకుళానికి సుమారు 13 కి.మీ దూరంలో శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ ఉంటుంది. ఇచట అనేక ఎక్స్‌ప్రెస్ రైళ్ళు కూడా ఆగుతాయి. ఈ రైల్వే స్టేషను నుండి విరివిగా బస్సులు శ్రీకాకుళానికి ఉంటాయి. నేరుగా అరసవిల్లి వద్దకు చేరుకోవచ్చు.

18. విమానం ద్వారా
18. విమానం ద్వారా
Image Source:
శ్రీకాకుళానికి సుమారు 106 కి.మీ దూరంలో విశాఖపట్నంలో విమానాశ్రయం ఉంది. అక్కడి నుండి బస్సుల ద్వారా శ్రీకాకుళం చేరుకోవచ్చు. అక్కడి నుంచి ప్రభుత్వ, ప్రేవేటు బస్సులు, ట్యాక్సీల ద్వారా నేరుగా శ్రీకాకుళం దగ్గరలోని అరసవల్లిని సందర్శించుకోవచ్చు.

19. దగ్గర్లోని క్షేత్రాలు
19. దగ్గర్లోని క్షేత్రాలు
Image Source:
శ్రీ ఉమారుద్ర కోటేశ్వరస్వామి ఆలయము శ్రీకాకుళం జిల్లా, శ్రీకాకుళం పట్టణం లోని ఒక ప్రాచీన దేవాలయం. ఇక్కడ కోటేశ్వరస్వామి (శివుడు) చిరకాలంగా భక్తుల కోర్కెలను తీర్చుతూ కొలువైయున్నారు.ఈ ఆలయం బలరాముడు నిర్మించిన ఆలయం అయినందున ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. శ్రీకాకుళం పట్టణంలో భాగమైన గుడివీధిలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయం లోని కోటేశ్వర స్వామి ఉత్తరాంధ్ర భక్తజనకోటికి అభయప్రదాతగా విలసిల్లుతున్నారు. ఈ దేవాలయం కూర్మనాథస్వామి దేవస్థానం, శ్రీకూర్మం నకు 12 కి.మీ దూరంలో ఉన్నది.

20. బలరాముడు ప్రతిష్ఠించిన క్షేత్రాలు
20. బలరాముడు ప్రతిష్ఠించిన క్షేత్రాలు
Image Source:
నాగావళి నదీ తీరమందు ఒరిస్సాలో రాయఘడ దగ్గర పాకకపాడు అను గ్రామంలో పాయకేశ్వర స్వామి దేవాలయం
పాత్వతీపురం నకు 3 కి.మీ దూరంలో గుంప గ్రామం వద్ద సోమేశ్వర దేవాలయం
పాలకొండ దరి సంగాం గ్రామంలో సంగమేశ్వరుని దేవాలయం
శ్రీకాకుళంలో ఉమారుద్ర కోటేశ్వరస్వామి ఆలయము
కళ్లేపల్లి గ్రామంలో మణినాగేశ్వరస్వామి దేవాలయం