• Follow NativePlanet
Share
» »‘ముద్దు’ ముద్దుగా పిలుద్దాం

‘ముద్దు’ ముద్దుగా పిలుద్దాం

Written By: Beldaru Sajjendrakishore

తాజా కథనాల కోసం బ్రహ్మకే పోయిన జ్జానం ప్రసాదించిన చోటు సందర్శిస్తే పోగొట్టుకున్న సంపద, జ్జానం...

ఇక్కడకు వెళితే బ్రహ్మచారులకు వివాహం...దంపతులకు వెంటనే సంతానం

బియ్యపు మూట ఇస్తే కోర్కెలు తీర్చే రంగులు మారే వినాయకుడు

ముద్దుపేరు. నిక్ నేమ్ అన్నవి మనుషులకు, ప్రాంతానికి లేదా వస్తువులకు పెడుతుంటారు. పరిచయస్తులు లేదా బాగా కావలసినవారు లేదా తెలిసినవారు నిక్ నేమ్ లతో పిలుస్తుంటారు. కొన్ని సార్లు పొడవాటి పేర్లున్న వారికి కూడా నిక్ నేమ్ లు వాడుతుంటారు. చాలా వరకు స్టార్ డమ్ ఉన్న సెలెబ్రిటీల అభిమానులు, తమకిష్టమైన హీరో హీరోయిన్ల ముద్దుపేర్లు తెలుసుకోవటానికి ఇష్టపడుతుంటారు. మరికొందరు వాటితోనే స్టార్ లు అయిపోతుంటారు. అలానే భారతదేశంలో కూడా కొన్ని ప్రదేశాలకు, ప్రాంతాలకు నిక్ నేమ్ లు ఉన్నాయి. ఇండియాలో ఉన్న కొన్ని ప్రధాన నగరాలకు గల మారుపేర్ల గురించి తెలుసుకుందాం.

1. బెంగళూరు

1. బెంగళూరు

Image Source:

బెంగళూరు కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు. ఇక్కడ సందర్శించటానికి అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో బెంగళూరు ప్యాలెస్, లాల్ బాగ్, విధాన సౌధ, బుల్ టెంపుల్, దొడ్డ గణేశ టెంపుల్ మరియు మొదలుగునవి. షాపింగ్ మాల్స్, గోల్ఫ్ క్రీడామైదానాలు, ఉద్యానవనాలు, వాణిజ్య వీధులు కూడా పర్యాటకులను అలరిస్తాయి. బెంగళూరు నగరానికి మారుపేర్లు : ఎలక్ట్రాన్ సిటీ ఆఫ్ ఇండియా, సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా, స్పేస్ సిటీ, సైన్స్ సిటీ ఆఫ్ ఇండియా, గార్డెన్ సిటీ, పెన్షనర్డ్ ప్యారడైజ్, ఐటీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా.

2. చెన్నై

2. చెన్నై

Image Source:

చెన్నై తమిళనాడు రాష్ట్ర రాజధాని మరియు కోరమాండల్ తీరంలో ఉన్నది. బీసెంట్ నగర బీచ్, జగన్నాథ టెంపుల్, కపాలీశ్వర టెంపుల్, మెరీనా బీచ్ మొదలుగునవి ఇక్కడ చూడవచ్చు. షాపింగ్ మాల్స్, వాణిజ్య వీధులు యాత్రికులను అలరిస్తాయి. నిక్ నేమ్ : మద్రాస్, చెన్నపట్నం, సౌత్ ఇండియన్ కల్చరల్ సిటీ, డెట్రాయిట్ అఫ్ ఆసియా, ఆటోమొబైల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, గేట్ వే ఆఫ్ సౌత్ ఇండియా, హెల్త్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా.

3. కోయంబత్తూర్

3. కోయంబత్తూర్

Image Source:

కోయంబత్తూరు కోవై అని కూడా పిలుస్తారు. తమిళనాడు రాష్ట్రములోని రెండవ అతిపెద్ద నగరం. ఇది తమిళనాడులోని కొంగునాడు ప్రాంతములో భాగము. నొయ్యల్ నది తీరాన ఉన్న కోయంబత్తూరు నగరం, వస్త్ర పరిశ్రమలకు, ఇంజనీరింగు కర్మాగారాలకు, వాహన విడిభాగాల నిర్మాణకేంద్రాలకు, వైద్య సౌకర్యాలకు, విద్యాసంస్థలకు, ఆహ్లాదకరమైన వాతావరణానికి, ఆతిధ్యానికి మరియు ప్రత్యేకత కలిగిన కొంగు తమిళ మాండలికానికి ప్రసిద్ధి చెందినది కోవై కుట్రాలం, పట్టీశ్వర్ టెంపుల్, అజియార్ డ్యాం, ధ్యాన్ లింగ టెంపుల్, ఇందిరాగాంధీ నేషనల్ పార్క్ మొదలుగునవి చూడదగ్గవి.

మారు పేరు : మాంచెస్టర్ అఫ్ సౌత్ ఇండియా, టెక్స్ టైల్స్ సిటీ ఆఫ్ ఇండియా.

4. హైదరాబాద్

4. హైదరాబాద్

Image Source:

హైదరాబాదు, తెలంగాణ రాజధాని మరియు ఆంధ్ర ప్రదేశ్ తాత్కాలిక రాజధాని, హైదరాబాదు జిల్లా మరియు రంగారెడ్డి జిల్లాల ముఖ్యపట్టణం . దీనిని భాగ్యనగరము అని, గ్రామీణ ప్రజలు "పట్నం" అని కూడా పిలుస్తారు. హైదరాబాదు నగరము సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వానికి, ప్రముఖ చరిత్రకు, కట్టడాలకు, మసీదులకు, దేవాలయములకు, చక్కని కళలకు, హస్తకళలకు ఇక్కడ చార్మినార్ దగ్గరి నుంచి గోల్కొండ వరకు చూడవలసినవి, చేయవలసినవి ఎన్నో ఉన్నాయి.

నిక్ నేమ్ : హైటెక్ సిటీ, ముత్యాల నగరం, సిటీ ఆఫ్ నిజామ్స్, వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ బిర్యాని.

5. ఆగ్రా

5. ఆగ్రా

Image Source:

ఢిల్లీ కి 180 కి. మీ ల దూరంలో ఆగ్రా కలదు. ఇక్కడ ప్రపంచ అద్భుత కట్టడాలతో ఒకటైన తాజ్ మహల్ కలదు. భారత దేశంలో అతి ఎక్కువ మంది సందర్శించే పర్యాటక ప్రాంతంగా దీనికి పేరుంది. ముఖ్యంగా విదేశీయులు కూడా ఎంతో మంది దీనిని చూడటానికి వస్తుంటారు. ఒక రకంగా ఆగ్రాకు ఎక్కువ ఆదయం పర్యాటక రంగం నుంచే వస్తోంది. ఇక్కడ బస చేయడానికి చక్కని హోటల్స్ ఎన్నో ఉన్నాయి.

నిక్ నేమ్ : తాజ్ నగరి.

6. అలహాబాద్

6. అలహాబాద్


Image Source:
అలహాబాద్ యూపీలోని పెద్ద నగరాలలో ఒకటి. అలహాబాద్ కు మరొక పేరు ప్రయాగ. అలహాబాద్ జిల్లాకు ఇది ప్రధానకేంద్రం. ప్రపంచంలో అత్యంతవేగంగా అభివృద్ధిచెందుతున్న నగరాలలో అలహాబాద్ 130వ స్థానంలో ఉంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అలహాబద్ అతిపెద్ద వాణిజ్యం కేంద్రం, తలసరి ఆదాయంలో 2వ స్థానం, జి.డి.పిలో మూడవస్థానంలో ఉంది అని భావిస్తున్నారు. అలహాబాదు నగరానికి ప్రధానమంత్రుల నగరమన్న ఖ్యాతి ఉంది. భారతదేశ 13 మంది ప్రధానమంత్రులలో 7 మంది ప్రధానమంత్రులు అలహాబాదు వాసులే.

మరికొన్ని ముద్దు పేర్లు. దేవుని నివాసం, సంగం సిటీ,

7. అమృత్ సర్

7. అమృత్ సర్

Image Source:

అమృత్ సర్ పంజాబ్ రాష్ట్రంలో కలదు. ఇది సిక్కుల పవిత్ర క్షేత్రం. ప్రసిద్ధి చెందిన స్వర్ణ దేవాలయం ఇక్కడ కలదు. ఈ పవిత్రమైన స్వర్ణ దేవాలయాన్ని దర్శించడం కోసం దేవ విదేశాల నుంచి కూడా పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ఇక భారత దేశానికి ఇతర దేశాల ప్రధానులు, అధ్యక్షులు వంటి వారు వచ్చిన సమయంలో కూడా ఈ క్షేత్రాన్ని తప్పక సందర్శిస్తుంటారు.

నిక్ నేమ్ : గోల్డెన్ సిటీ.

8. జైపూర్

8. జైపూర్

Image Source:

భారతదేశంలోని పురాతన నగరమైన జైపూర్ ను పాక్షిక ఎడారి ప్రాంతంలో అంబర్ మహారాజు, రెండవ మహారాజ సవాయి జై సింగ్ బెంగాల్ కు చెందిన వాస్తు శిల్పి విద్యాధర్ భట్టాచార్య సహాయంతో నిర్మించాడు. భారత దేశంలో విదేశీయులు ఎక్కువగా సందర్శించే ప్రాంతాల్లో జైపూర్ కూడా ముందు వరుసలో నిలుస్తుంది. ఎడారి ప్రాంతంలో ఉన్నా ఇక్కడ పర్యాటకులు ఉండటానికి మంచి వసతి ప్రాంతాలు ఉన్నాయి.

నిక్ నేమ్ : పింక్ సిటీ, పారిస్ ఆఫ్ ఇండియా, సిటీ ఆఫ్ ప్యాలెస్.

9. జంషెడ్ పూర్

9. జంషెడ్ పూర్

Image Source:

జంషెడ్‌పూర్ జార్ఖండ్ రాష్ట్రంలోని అతి పెద్ద నగరము. భారతదేశపు మొట్టమొదటి ప్రణాళికాయుత పారిశ్రామిక నగరమైన జంషెడ్‌పూర్ కీ.శే జంషెడ్‌జీ నస్సర్‌వాంజీ టాటా చే నిర్మింపబడింది. ఇక్కడ ప్రసిద్ధి చెందిన జంషెడ్ జీ టాటా స్థాపించిన స్టీల్ ఫ్యాక్టరీ కారణంగా దీనికి ఆ పేరు వచ్చింది. జార్ఖండ్ రాష్ట్రంలోని తూర్పు సింగ్బం జిల్లాకిది ముఖ్యపట్టణము. మారుపేర్లు : స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా, పిట్స్బర్గ్ ఆఫ్ ఇండియా, టాటానగర్.

10. కోల్కతా

10. కోల్కతా

Image Source:

కోల్‌కాతా భారత దేశములోని పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని. ఇది తూర్పు భారత దేశములోని హుగ్లీ నది తూర్పు తీరముపై ఉంది. ఈ నగరం కుటీర పరిశ్రమల ద్వారా పొందుతున్న ఆదాయం దక్షిణఆసియా దేశాలలో మూడవ స్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాలలో ముంబయ్ ఢిల్లీ నగరాలు ఉన్నాయి. ఇక్కడ విక్టోరియా మహల్, ఈడెన్ గార్డెన్, హౌరా బ్రిడ్జి, పార్క్ స్ట్రీట్, ఇండియన్ మ్యూజియం, ఆడిటోరియం మొదలుగునవి చూడవచ్చు.

నిక్ నేమ్ : సిటీ ఆఫ్ జాయ్, సిటీ అడ్డు ప్యాలెస్, భారతదేశ సాంస్కృతిక రాజధాని, గేట్ వే ఆఫ్ ఈస్టర్న్ ఇండియా, హెవెన్ ఆఫ్ ఏజ్డ్.

11. కొల్హాపూర్

11. కొల్హాపూర్


Image Source:

కొల్హాపూర్ మహారాష్ట్ర రాష్ట్రంలో కలదు. ఇక్కడ ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మి దేవి ఆలయం కలదు. జ్యోతిబా టెంపుల్, రాధానగరి డ్యాం లకు కూడా వెళ్ళిరావచ్చు. ఈ పుణ్యక్షేత్రం పురాణ పరంగానే కాకుండా చారిత్రాత్మకంగా కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగినది.

ఈ నగరానికి నిక్ నేమ్ : సిటీ ఆఫ్ రెస్ట్లెర్ (కుస్తీ), దక్షిణ కాశీ.

12. కొల్లామ్

12. కొల్లామ్

Image Source:

కేరళ రాష్ట్రంలో కలదు. అష్టమూడి సరస్సుకు సమీపంలో ఉండటంతో ఈ నగరం పర్యాటకంగా ప్రసిద్ధి చెందినది. హౌస్ బోట్, బీచ్, ప్యాలెస్ లు మొదలుగునవి చూడదగ్గవి. మారు పేరు : ప్రపంచపు జీడిపప్పులు రాజధాని, ప్రిన్స్ ఆఫ్ అరేబియన్ సీ, గేట్ వే ఆఫ్ బ్యాక్ వాటార్స్

13. లక్నో

13. లక్నో

Image Source:

లక్నో - ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని. మసీదులు, ప్యాలెస్ లు, చారిత్రక కట్టడాలు తప్పక సందర్శించాలి. లక్నోను చూడటానికి వేసవి కంటే చలికాలం అనువుగా ఉంటుంది. అందువల్లే ఈ సమయంలో ఎక్కువ మంది ఇక్కడికి వస్తుంటారు.

స్థానిక రుచులు నోరూరిస్తాయి. మారుపేర్లు : సిటీ ఆఫ్ నవాబ్స్, షిరాజ్-ఈ- హింద్, కాన్స్టాంటినోపుల్ ఆఫ్ ఈస్ట్, ది గోల్డెన్ సిటీ ఆఫ్ ఇండియా.

14. మధురై

14. మధురై

Image Source:

మధురై తమిళనాడు దక్షిణ భాగంలో ఉన్నది. ఇక్కడ మీనాక్షి ఆలయం ప్రసిద్ధి చెందినది. ఇక్కడి గర్భగుడిలోని అమ్మవారితో పాటు ఆలయ గోపురాలు ఎంతో ప్రాముఖ్యం కలిగినవి. కేవలం తమిళనాడుకు చెందిన వారే కాకుండా చాలా మంది ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తుంటారు. మారుపేర్లు : ఏథెన్స్ ఆఫ్ ది ఈస్ట్, పండుగల నగరం, సిటీ ఆఫ్ ఫోర్ జుంక్షన్స్, టెంపుల్ సిటీ, స్లీప్లెస్ సిటీ.

15. మంగళూరు

15. మంగళూరు


Image Source:

మంగళూరు కు ఒకవైపు అరేబియా సముద్రం మరోవైపు పశ్చిమ కనుమలు వన్నె తెచ్చాయి. ప్రకృతి ఆస్వాదకులకు ఇదొక స్వర్గం. నిక్ నేమ్ : కార్డ్లె ఆఫ్ ఇండియన్ బ్యాంకింగ్, గేట్ వే ఆఫ్ కర్ణాటక, రోమ్ ఆఫ్ ది ఈస్ట్, పెట్రో కెమికల్ క్యాపిటల్ అఫ్ సౌత్ ఇండియా, ఐస్ క్రీమ్ క్యాపిటల్ అఫ్ ఇండియా, పశ్చిమ తీర ఆభరణం, వంటల నగరం.

16. ముంబై

16. ముంబై

Image Source:

ముంబై దేశంలో ఢిల్లీ తర్వాత అతిపెద్ద నగరం మరియు మహారాష్ట్ర రాజధాని. బీచ్ లు, గేట్ వే ఆఫ్ ఇండియా, విక్టోరియా టర్మినల్, సిద్ధి వినాయక మందిర్ మొదలుగునవి చూడదగ్గవి. నిక్ నేమ్ : ఏడు దీవుల నగరం, గేట్ వే ఆఫ్ ఇండియా, హాలీవుడ్ ఆఫ్ ఇండియా, మాయ నగరం, కలల నగరం, హాలీవుడ్ ఆఫ్ ఇండియా, మాక్సిముమ్ సిటీ.

17. వడోదర

17. వడోదర

Image Source:

వడోదర విశ్వామిత్ర నది ఒడ్డున ఉన్న వడోదర లేదా బరోడా, ఒకప్పుడు గైక్వాడ్ రాష్ట్ర రాజధాని. ఇక్కడ సందర్శించవలసిన రాచరిక ప్రదేశాలు అనేకం ఉన్నాయి. పండుగలకు వడోదర ప్రసిద్ధి. నిక్ నేమ్ : సంస్కృతి నగరం, సంస్కారి నగరి, బన్యన్ సిటీ, వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ గార్భా, భారతదేశపు విద్యుత్ పరికరాల తయారీ కేంద్రం.

18. ఉదయపూర్

18. ఉదయపూర్

Image Source:

ఉదయపూర్ బ్రహ్మాండమైన కోటలకి, గుళ్ళకు, సరస్సులకు, రాజ భవనాలకు, మ్యూజియాలకు, అభయారణ్యాలకు ప్రసిద్ధి ఉదయపూర్. ఎడారి రాష్ట్రంలో సరస్సులు పచ్చటి మైదానాలు ఉండటం విశేషం. అంతే కాకుండా ఇక్కడ ఉన్న జైన దేవాలయం భారతీయ శిల్పకళ ప్రావిణ్యానికి ప్రత్యక్ష నిదర్శనం. నిక్ నేమ్ : శ్వేత నగరం, సరస్సుల గరం, వెనిస్ ఆఫ్ ది ఈస్ట్.

19. అహ్మదాబాద్

19. అహ్మదాబాద్

Image Source:

అహ్మదాబాద్ భారత్ లోని గుజరాత్ రాష్ట్రంలో కలదు. భారత దేశంలో అత్యంగా వేగంగా అభివ`ద్ధి చెందుతున్న నగరాల్లో అహ్మద్ నగర్ మొదటి వరుసలో ఉంటుంది. ఈ నగరంలో చారిత్రాత్మకంగా ఎంతో ప్రాముఖ్యత కలిగినది. ప్రస్తుతం ఆధునిక దిశ వైపు పరుగులు తీస్తోంది. నిక్ నేమ్ : బోస్టన్ ఆఫ్ ఇండియా, మాంచెస్టర్ ఆఫ్ ఇండియా.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి