• Follow NativePlanet
Share
» »అడిగిన వెంటనే వరాలు ఇచ్చేది ఈయనే అందుకే

అడిగిన వెంటనే వరాలు ఇచ్చేది ఈయనే అందుకే

Written By: Beldaru Sajjendrakishore

అన్నవరం దేవాలయం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రసిద్ధిచెందినది. ఈ అన్నవరం తూర్పుగోదావరి జిల్లా, రత్నగిరి కొండ మీద ఉన్నది. అడిగిన వెంటనే వరాలిచ్చే సత్యదేవునిగా అన్నవరంలోని సత్యనారాయణ స్వామికి పేరుంది. అందుకే కొత్తగా పెళ్ళైన జంటలు ఇంట్లో అన్నవరం సత్యనారాయణ స్వామి పూజ చేయటం ఆనవాయితీ. అయితే అన్నవరం వెళ్ళి సత్యదేవుని సన్నిధానంలో వ్రతం చేయటం శ్రేష్టమని అందరూ భావిస్తారు. ఈయనను కోరిన వెంటనే కోరికలు తీరుస్తాడని అందరూ నమ్ముతారు.

లక్షల ఏళ్లనాటి చెట్టే శివ లింగం...దర్శిస్తే తప్పక

ఆ తిరుపతి మొక్కును ఈ తిరుపతి లో తీర్చుకోవచ్చు...కానీ

ఆసియాలో పొడవైన గుహ...అనంత సంపద, వింత జీవుల, వస్తువుల నిలయం

ఇతిహాసాల ప్రకారం అడిగిన (అనిన) (వరం)వరాలను తీర్చే దేవుడు కాబట్టి ( అనిన+ వరం = అన్నవరం) "అన్నవరం దేవుడు" అంటారు. పంపా నది ఒడ్డున ఉన్న రత్నగిరి కొండ మీద వెలసిన సత్య దేవును ఆలయం సముద్ర మట్టానికి 300 మీటర్ల ఎత్తున ఉన్నది. అన్నవరం ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారాముల వారి గుడి, వన దుర్గమ్మ గుడి, కనక దుర్గమ్మ గుడి వంటి ఆలయాలు కూడా ఉన్నాయి. కొండ కింద గ్రామ దేవత గుడి తో మొదలయ్యే దర్శనం చివరగా సత్యదేవునితో ముగుస్తుంది. తూర్పు గోదావరి జిల్లా కు చెందిన అన్నవరం, రాజమండ్రి కి 70 కి. మీ. దూరంలో మరియు కాకినాడ కి 45 కి. మీ. దూరంలో ఉన్నది.

1. స్థల పురాణం

1. స్థల పురాణం

Image source:

స్థలపురాణం ప్రకారం పర్వతశ్రేష్ఠులలో ఒకడైన మేరు పర్వతం ఆయన భార్య మేనక శ్రీమహావిష్ణువు గురించి తపం ఆచరించి విష్ణువు అనుగ్రహంతో ఇద్దరు కొడుకులను పర్వతాలుగా పొందుతారు. ఒకడేమో భద్రుడు, ఇంకొకడు రత్నకుడు. భద్రుడు విష్ణుమూర్తిని గురించి తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తికి నివాస స్థానమైన భద్రాచలంగా మారుతాడు. ఆ భద్రాచలం నేడు తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మంలో ఉంది.

2. మరో కుమారుడు కూడా

2. మరో కుమారుడు కూడా

Image source:

రత్నకుడు అనే ఇంకో కొడుకు కూడా విష్ణువు గురించి తపమాచరించి మెప్పించి మహావిష్ణువు శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామిగా వెలసే రత్నగిరి, లేదా రత్నాచలం కొండగా మారుతాడు. తూర్పు గోదావరి జిల్లాలో పిఠాపురంకి సమీపంలో గోరస గ్రామ ప్రభువు శ్రీ రాజా ఇనుగంటి వేంకటరామారాయణిం బహద్దరు వారి ఏలుబడిలో అరికెంపూడి దగ్గర అన్నవరం అనే గ్రామం ఉంది.

3. ఇద్దరికీ ఒకేసారి

3. ఇద్దరికీ ఒకేసారి

Image source:

అక్కడ ఈరంకి ప్రకాశరావు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన మహా భక్తుడు. ఒకనాడు శ్రీమహావిష్ణువు వీరికీ, శ్రీ రాజా ఇనుగంటి వేంకటరామారాయణిం బహద్దరు వారికీ ఏక కాలంలో కలలో కనపడి "రాబోవు శ్రావణ శుక్ల విదియా మఖా నక్షత్రములో గురువారము నాడు రత్నగిరిపై వెలుయుచున్నాను. నీవు నన్ను శాస్త్రనియమానుసారము ప్రతిష్టించి సేవించుము" అని చెప్పి మాయమయ్యారు.

4. అంకుడు చెట్టు కింద

4. అంకుడు చెట్టు కింద

Image source:

మరునాడు ఇరువురు కలసి, తమకు వచ్చిన కలను చెప్పుకొని, ఖరనామ సంవత్సర శ్రావణ శుక్ల పాడ్యమి నాటికే అందరు అన్నవరం చేరుకున్నారు. అక్కడ స్వామివారి కొరకు వెదుకుతుండగా ఒక అంకుడు చెట్టు కింద పొదలో స్వామి వారి పాదముల మీద సూర్యకిరణములు పడ్డాయి. వెంటనే వారు ఆ పొదను తొలగించి, స్వామి విగ్రహాన్ని రత్నగిరి కొండ పైకి తీసుకొని పోతారు. ఆ సమయంలో గ్రామం చుట్టు పక్కల వారు కూడా అక్కడ ఎక్కువ సంఖ్యలో ఉంటారు.

5. ఆలయ నిర్మాణం అప్పుడే

5. ఆలయ నిర్మాణం అప్పుడే

Image source:

అటు పై కాశీ నుండి తెచ్చిన శ్రీమత్రిపాద్విభూతి మహావైకుంఠనారాయణ యంత్రాన్ని విష్ణుపంచాయతన పూర్వకంగా సాధారణ శకం 1891, ఆగష్టు 6 వ తేదీని (శాలివాహన శకం 1813) ప్రతిష్ఠించి పూజలు చేసేవారు. ఇక ఆలయాన్ని క్రీస్తు శకం 1934 లో నిర్మించారు. పంచాయతనం ఉండటం చేత దానికి ప్రతీకగా ముందు గణపతి, శంకరుల చిహ్నములు గలవి, శూల శిఖరములతో ఉన్నాయి.

6. అన్ని రకాల దేవతా మూర్తులు

6. అన్ని రకాల దేవతా మూర్తులు

Image source:

అయిన రెండు చిన్న విమాన గోపురాలు, మధ్యగా ప్రధాన విమాన గోపురం, వెనుకగా ఆదిత్య దేవతా, అంబికా దేవతా ప్రతీకలగు చక్రశిఖరములు ఉన్నవి. ఒకే చోట ఇన్ని రకాలైన దేవతా చిహ్నాలు ఉండటం అపురూపం. అందువల్ల ఇది పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రంగా భక్తులు చెబుతారు. ఇక పంపా నది ఒడ్డున ఉన్న రత్నగిరి మీద ఈ ఆలయం సముద్ర మట్టానికి 300 అడుగుల ఎత్తులో ఉంది. ఈ గుడికి పాదచారులు చేరు కోవడానికి 460 మెట్లు ఉన్నాయి.

7. ఆలయం రథాకాలరంలో

7. ఆలయం రథాకాలరంలో

Image source:

ప్రధాన ఆలయం రథాకారంలో ఉండి, నాలుగు దిక్కులలో నాలుగు చక్రాలతో ఉంటుంది. ప్రధాన ఆలయానికి ఎదురుగా కళ్యాణ మండపం ఉంటుంది. ఈ కళ్యాణ మండపం ఆధునిక నిర్మాణ చాతుర్యానికి ఒక మచ్చుతునక. వనదుర్గ ఆలయం, రామాలయాలు ప్రక్కన కనిపిస్తూ ఉంటాయి. ఆలయ రూపం, అగ్ని పురాణంలో చెప్పబడినట్లు, ప్రకృతిని తలపిస్తూ ఉండాలి. ఈ ఆలయం ఆ ప్రకారం రెండు అంతస్తులలో నిర్మింపబడింది.

8. స్వామి వారి విగ్రహం 4 మీటర్లు

8. స్వామి వారి విగ్రహం 4 మీటర్లు

Image source:

క్రింది భాగంలో యంత్రం, పై అంతస్తులో స్వామి విగ్రహాలు ఉన్నాయి. స్వామి విగ్రహం 4 మీటర్ల ఎత్తు ఉంది. క్రింద గర్భగుడి ఉన్న భాగాన్ని విష్ణుమూర్తిగా అర్చిస్తారు, మధ్యభాగంలో ఉన్నదానిని శివునిగా పూజిస్తారు. మూలవిరాట్టు అంతా ఏక విగ్రహంగా ఉండి త్రిమూర్తులుగా పూజింప బడడం ఇక్కడి విశేషం. త్రిపాద విభూతి నారాయణ ఉపనిషత్తులో వర్ణింపబడిన యంత్రం ఇక్కడ ఉంది.

9. పునరుద్ధరణ

9. పునరుద్ధరణ

Image source:

1970లో ఆలయం మీద పిడిగు పడి ఆలయవిమాన గోపురం పగులుబారటంతో రుద్రాక్షమడపం మీద పగులువారి వర్షపు నీరు విగ్రహాల మీద పడుతుందని ఆలయ నిర్వాజకులు ఆలయానికి పునరుద్ధరణ్జ కార్యక్రమాలు చేపట్టారు. శ్రీశైలం, విజయవాడ, సింహాచలం, వేములవాడ ఆలయాల మాదిరిగా ఈ ఆలయంలో గ్రానైటు నిర్మాణాలు చేపట్టారు. ఈ పనుల కొరకు తమిళనాడు నుండి 1000 టన్నుల గ్రామైట్ తీసుకువచ్చారు.

10.900 టన్నుల గ్రానైట్

10.900 టన్నుల గ్రానైట్

Image source:

దిగువ మరియు మొసటి అంతస్తుకు మాత్రమే 900 టన్నుల గ్రానైటు రాయి వాడబడింది. పునర్నుర్మాణానికి ముందు చిన్నదిగా ఉన్న గర్భాల్స్యాన్ని కొంచం విశాలంచేసి ఆలయ ప్రధాన ధ్వారాన్ని పెద్దదిచేసి ఎక్కువ మంది భక్తులు దర్శానం చేసుకునే వీలు కల్పించబడింది. దిగువన ఉన్న యంత్రమందిరం కూడా విశాలం చేయబడింది. ఆలయ పునరుద్ధరణ తర్వాత భక్తుల రాక మరింత పెరిగింది. దీంతో ఆదాయం కూడా చేరుతూ వస్తోంది.

11 . బంగారు శిఖరాలు

11 . బంగారు శిఖరాలు

Image source:

పునరుద్ధరణలో భాగంగా నారాయణ గోపుర కలశం, గణేశ, బాలాత్రిపుర సుందరి, సూర్యనారాయణ, శంకర పంచాయత కలశాలు స్వర్ణపు పూత పూసుకున్నాయి. క్షేత్రపాలకులయిన రామాలయ గోపుర కలశం, ఆంజనేయస్వామి గోపురకలశం కూడా బంగరుపూతపూయబడ్డాయి. రుద్రాక్షమండపం, మంకరతోరణం, ద్వారాలు, ఊయలకు కూడా బంగారు పూత పూయబడ్డాయి. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో వీటిని చూడటానికి వెయ్యి కళ్లు చాలవు.

12. ఉదయం నుంచి సాయంత్రం వరకూ

12. ఉదయం నుంచి సాయంత్రం వరకూ

Image source:

ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు శ్రీ సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహిస్తారు. సాధారణ వ్రతమైతే రూ. 150, ప్రత్యేక వ్రతమైతే రూ.300, ధ్వజస్తంభం వద్ద చేసేందుకు రూ. 700, విశిష్ట వ్రతమైతే.. రూ. 1500 చొప్పున రుసుం చెల్లించాలి. వ్రతం చేయించుకునే భక్తులు కొబ్బరికాయలు, అరటిపళ్లు తీసుకొస్తే సరిపోతుంది. మిగతా పూజా సామగ్రి ప్రసాదం, స్వామివారి రూపు, పసుపు, కుంకుమ, తమలపాకులు తదితర పూజా సామగ్రిని దేవస్థానమే సమకూర్చుతుంది. వ్రతకర్తలైన భార్యాభర్తలతో పాటు వారి పిల్లల్ని అనుమతిస్తారు.

13. నిత్య కళ్యాణం

13. నిత్య కళ్యాణం

Image source:

రోజూ ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకూ శ్రీ స్వామివారికి నిత్యకల్యాణం జరుగుతుంది. ఇందులో పాల్గొనదల్చిన భక్తులు రూ. 1,000 రుసుం చెల్లించాలి. ఆ మేరకు దేవస్థానమే భక్తులకు కావాల్సిన పూజాసామగ్రి సమకూరుస్తుంది. పూజ అనంతరం కల్యాణంలో పాల్గొన్న భక్తులందరికీ స్వామివారి కండువా, జాకెట్టు ముక్క, ప్రసాదం, బంగీ ప్రసాదం అందజేస్తారు.

14. 500 పైగా గదులు

14. 500 పైగా గదులు

Image source:

రత్నగిరిపైన.. అన్నవరంలోనూ దేవస్థానం కాటేజ్‌లు... సత్రాల్లో భక్తులకు వసతి కల్పిస్తారు. మొత్తం మీద సుమారు 500 గదులకు పైగా అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో రోజుకు కనిష్టంగా రూ. 250 నుంచి గరిష్ఠంఆ రూ. 20వేల వరకూ రుసుం వసూలు చేస్తారు. వీటికి ఆన్‌లైన్‌ ద్వారా ముందస్తు బుకింగ్‌ సదుపాయం ఉంది. వీటితో పాటు పలు ప్రైవేటు.. ఆధ్యాత్మిక సంస్థల వసతిగృహాలూ భక్తులకు వసతి సౌకర్యం కల్పిస్తున్నాయి. దేవస్థానం నిత్యాన్నదాన పథకం కింద భక్తులందరికీ ఉచిత అన్నప్రసాదం అందిస్తోంది.

15. ఆన్ లైన్ సేవలు

15. ఆన్ లైన్ సేవలు


Image source:

దేవస్థానంలో వసతిగదులు, వ్రత, కల్యాణ టికెట్లను ఆన్‌లైన్‌ ద్వారా బుక్‌చేసుకోవచ్చు. వసతి గదులకు మాత్రం సాధారణ ధరకన్నా 50శాతం ఎక్కువ చెల్లించాలి. ఈ సేవలన్నింటినీ మీ-సేవ కేంద్రాల్లో బుక్‌చేసుకునే అవకాశముంది. మరిన్ని వివరాలకు... ఫోన్‌ 08868-238163 నంబర్లలో దేవస్థానం అధికారులను సంప్రదించవచ్చు. ఉపాలయాల్లో నిర్వహించే పూజలు: ప్రతి శుక్రవారం రత్నగిరిపై ఉన్న వనదుర్గ అమ్మవారి ఆలయంలో చండీహోమం జరుగుతుంది.

16. ప్రకృతి చికిత్సాలయం

16. ప్రకృతి చికిత్సాలయం

Image source:

రత్నగిరి కొండపై భక్తుల ఆయురారోగ్యాల కోసం పకృతి చికిత్సాలయ కేంద్రం ఉంది. ఈ కేంద్రంలో నిష్ణాత్తులైన యోగ విద్య నిపుణులు, ప్రకృతి వైద్య నిపుణులు ఆద్వర్యంలో చిక్సిత అందిస్తారు. అనేక వ్యాదులకు చికిత్స అందిస్తారు. అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు నిత్య అన్నప్రసాద కార్యాక్రమం అందుబాటులో ఉంది. దేవస్థానంలో గోధుమ రవ్వతో తయారయ్యే ప్రసాడానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. 200 గ్రాముల ప్రసాదాన్ని రూ. 10 అమ్ముతారు.

17. సన్ డయల్

17. సన్ డయల్

Image source:

కాల నిర్ణయ గడియారం పిడపర్తి కృష్ణమూర్తి శాస్త్రి నిర్మించిన కాల నిర్ణయ నిర్దేశక యంత్రం రత్నగిరి పైన ప్రధాన ఆలయానికి ప్రక్కన ఉంది. సూర్యుని నీడ (ఎండ) ఆధారంగా కాల నిర్ణయం చేసి, పని చేసేగడియారం ఇది. దీని పక్కనే తులసి వనం ఉంది. దేవాలయం కి వచ్చే భక్తులు సేదతీరేందుకై దేవస్థానం వారు ఏర్పాటు చేసిన ఉద్యానవనం తప్పక చూడాలి. అనేక రకాల పూల మొక్కలు, పూజ కు ఉపయోగపడే జాపత్రి మొక్కలు, పొగడ చెట్లు ఇలా ఎన్నో వైవిధ్యభరితమైన ఆకర్షణలతో ఈ ఉద్యానవనం నిర్మితమైనది.

18. అన్నవరం ఎలా చేరుకోవాలి ?

18. అన్నవరం ఎలా చేరుకోవాలి ?

Image source:

వాయు మార్గం అన్నవరం గ్రామానికి చేరుకోవడానికి సమీపంలో విమానాశ్రయం రాజమండ్రి దేశీయ విమానాశ్రయం. ఇది సుమారు 80 కి. మీ. దూరంలో ఉండి, రెండు గంటల్లో అన్నవరం చేరుకొనే విధంగా ఉంటుంది. రైలు మార్గం అన్నవరంలో రైల్వే స్టేషన్ ఉంది. చెన్నై-హౌరా రైల్వేలైన్‌లో ఉన్న అన్నవరం రైల్వేస్టేషన్‌లో సూపర్‌ ఫాస్ట్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లన్నీ ఆగుతాయి. రైల్వే స్టేషన్ నుంచి అన్నవరం చాలా దగ్గరగా ఉంటుంది.

19. రోడ్డు మార్గం

19. రోడ్డు మార్గం

Image source:

బస్సు మార్గం రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం నుంచి ప్రతీ పావుగంటకు బస్సులున్నాయి. రాజమండ్రి నుంచి విశాఖపట్నం అన్నవరం సింగిల్‌స్టాప్‌ బస్సులుకూడా ప్రతీ 45 నిమిషాలకు అందుబాటులో ఉన్నాయి. అన్నవరం చేరుకున్న తర్వాత దేవస్థానం బస్సులు అందుబాటులో ఉంటాయి. ఓపిక ఉన్నవారు 450 మెట్లు ఎక్కి కూడా వెళ్ళవచ్చు. సాధారణంగా భక్తులు ఈ మెట్ల ద్వారానే పైకి వెళ్లి స్వామి వారి దర్శనం చేసుకుంటారు.

20 దగ్గర్లోని పర్యాటక ప్రాంతాలు

20 దగ్గర్లోని పర్యాటక ప్రాంతాలు

Image source:

అన్నవరానికి దగ్గరగా ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. ముఖ్యంగా పంపానది, తలుపులమ్మ దేవి దేవాలయం, ఉప్పాడ బీచ్, కుక్కుటేశ్వర స్వామి దేవాలయం, సామర్ల కోట, దాక్షారామం, సింహాచలం, వైజాగ్, పాపికొండలు తదితర పర్యాటక, సందర్శనీయ పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. ఈ ప్రాంతాలన్నీ మన అన్నవరం పుణ్యక్షేత్రానికి సుమారు 2 నుంచి 100 కిలోమీటర్ల పరిధి లోపల ఉన్నవే.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి