• Follow NativePlanet
Share
» »షిర్డీ... మందిరమొక్కటే కాదు...మరెన్నో చూడదగిన ప్రదేశాలు..

షిర్డీ... మందిరమొక్కటే కాదు...మరెన్నో చూడదగిన ప్రదేశాలు..

Written By: Beldaru Sajjendrakishore

షిరిడీ లేదా షిర్డీ తక్షణం మనకు మదిలో మెదిలేది సాయిబాబా గుడి. తిరుపతి శ్రీనివాసుని తర్వాత భారత దేశంలో అత్యంత ప్రసిద్ధమైన ఆలయం ఇది. సాధారణ దినాల్లో రోజూ ముప్పై వేల మందికి పైగా భక్తులు వస్తుంటారు. అదే పర్వ దినాలలో అయితే వీరి సంఖ్య లక్షకు దాటుతుంది. షిర్డి సాయిబాబా స్వామి వారికి, వడ్డీరూపంలోను, విరాళాల రూపంలోను ఏడాదికి మూడు వందల కోట్ల పైగా వస్తుంది.

స్వామివారు అమ్మవారిని పెనవేసుకున్న స్థితిలో కనిపించే క్షేత్రం ఇదే....

శ్రీ సాయిబాబా సంస్థాన్ అనే సంస్థ షిరిడీ కేంద్రంగా వివిధ కార్యక్రమాలు, ఆలయ నిర్వహణ కొనసాగిస్తున్నది. ఇదిలా ఉండగా షిరిడీతోపాటు దాని చుట్టుపక్కల కూడా పర్యాటకులను ఆహ్లాదపరిచే ఎన్నో పర్యాటక ప్రదేశాలున్నాయి. చారిత్రక ప్రదేశాలతోపాటు యువత ఇష్టపడే గ్లైడింగ్‌, ట్రెక్కింగ్‌, స్కూబా డైవింగ్‌, పారాగ్లైడింగ్‌, వైల్డ్‌లైఫ్‌ సఫారీ వంటి అడ్వంచరస్‌ టూరిజంను కూడా ఇక్కడ ఆస్వాదించవచ్చు. ఆ విశేషాలు తెలుసుకుందామా...

1. షిరిడి...

1. షిరిడి...

Image source:


షిరిడి టౌన్‌. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ జిల్లాలో ఉంది. షిరిడినగర్‌ పంచాయతీ కిందకు ఇది వస్తుంది. ఇది అహ్మద్‌నగర్‌ నుంచి 83 కిలోమీటర్ల దూరంలో ఉంది. అహ్మద్‌నగర్‌-మన్మాడ్‌ స్టేట్‌ హైవే నుంచి వెడితే దీన్ని చేరతాం. వెస్ట్రన్‌ సీషోర్‌ లైన్‌ (అహ్మద్‌నగర్‌-మన్మాడ్‌ రోడ్డు) తూర్పున 185 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. ఈ రూట్‌ ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. 19వ శతాబ్దానికి చెందిన గురువు సాయిబాబా వల్ల షిరిడి పేరు నలుదిశలా వ్యాపించింది.

2. ల్యాండ్ ఆఫ్ సాయి...

2. ల్యాండ్ ఆఫ్ సాయి...

Image source:


నేడు మనదేశంలో ఉన్న అత్యంత సంపద్వంతమైన దేవాలయాల్లో షిరిడీ బాబా దేవాలయం కూడా ఒకటి. సంవత్సరం పొడుగునా భక్తులతో, పర్యాటకులతో షిరిడి రద్దీగానే ఉంటుంది. అక్కడ సాధారణ హోటల్స్‌ నుంచి ఫైవ్‌స్టార్‌ హోటల్స్‌ దాకా అన్నీ ఉన్నాయి. పైగా బాబా టెంపుల్‌ ట్రస్టుకు సంబంధించిన అకామడేషన్‌ సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి. షిరిడిని ‘ల్యాండ్‌ ఆఫ్‌ సాయి' అని కూడా అంటారు. మహారాష్ట్రలో ముంబయి, పూనె, నాసిక్‌, ఔరంగాబాద్‌, నాందేడ్‌, నాగ్‌పూర్‌లు అర్బన్‌ సెంటర్లు. ఔరంగాబాద్‌ని మహారాష్ట్ర టూరిజం రాజధానిగా పేర్కొంటారు.

3. అలా ప్రాచుర్యం పొందింది.

3. అలా ప్రాచుర్యం పొందింది.

Image source:


నాగ్ పూర్ కు చెందిన కోటీశ్వరుడు శ్రీకృషుడు కోసం ఒక పెద్ద దేవాలయాన్ని కట్టడం మొదలుపెట్టాడట. కానీ 1918 లో సాయిబాబా దైవసాన్నిధ్యం పొందటంతో ఆయన అస్థికలు గుడిలో పెట్టారట. దాంతో దేవాలయం కాస్త 'షిర్డీ సాయిబాబా దేవాలయం' గా ప్రసిద్ధి చెందినది. ఇక్కడకు దేశం నలుమూలల నుంచే కాకుండా ప్రపంచంలోని పలు ప్రాంతాల నుంచి కూడా ఎందరో భక్తులు, పర్యాటకులు వస్తుంటారు. సందర్శనా సమయం : ఉదయం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఆలయాన్ని తెలుస్తారు.

4. మసీదు ఇక్కడే ...

4. మసీదు ఇక్కడే ...

Image source:


దేవాలయంలోని సమాధి మందిర్‌కు పక్కన ద్వారకామాయి మసీదు ఉంది. సాయిబాబా ఎక్కువ కాలం ఇందులోనే గడిపారు. బాబా అక్కడ ప్రతి సాయంత్రం దీపాలు వెలిగించేవారట. అక్కడ ధుని ఉంటుంది. అది నిరంతరాయంగా వెలుగుతూనే ఉంటుంది. ఇందులోని బూడిదను భక్తులు పరమపవిత్రంగా భావిస్తారు. షిర్డీని సందర్శించిన ప్రతి భక్తుడు ఈ బూడిదను ఇంటికి తీసువెళ్లి నిల్వచేసుకుంటారు.

5. బాబాను ఇక్కడే మొదటిసారిగా చూశారు..

5. బాబాను ఇక్కడే మొదటిసారిగా చూశారు..

Image source:


మసీదు దగ్గరిలో ఉండేది చావిడి. ఇది చిన్న ఇల్లు. రోజు విడిచి రోజు రాత్రి బాబా ఆ చావిడిలోనే గడిపేవారట. అక్కడ బాబా కూర్చునే ఆసనాన్ని కూడా చూడొచ్చు. గురుషాన్‌ అనే ప్రదేశంలో ఉన్న వేపచెట్టు కింద బాబాను మొదట చూడడం జరిగింది. ఇక అప్పటి నుంచే సాయిబాబా తన మహిమలను చూపించేవాడు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సాంత్వన చేకూర్చడమే కాకుండా సమాజంలోని మూడ నమ్మకాలను పాలదోలడానికి చాలా శ్రమించేవాడు.

6. ఖాండోబా...ఒక శివాలయం...

6. ఖాండోబా...ఒక శివాలయం...

Image source:


ఖాండోబా దేవాలయం కూడా ఎంతో ప్రసిద్ధిపొందిన గుడి. ఇది అహ్మద్‌నగర్‌, కొపెర్‌గాన్‌ రహదారిపై కనిపిస్తుంది. ఇది శివాలయం. షిరిడీలోని అత్యంత పురాతన దేవాలయాల్లో ఇది ఒకటి. ఈ గుడిలోని పూజారే బాబాను ‘ఓం సాయి' అని పిలిచారట. అప్పటినుంచి బాబా సాయిబాబాగా ప్రసిద్ధులయ్యారు. షిరిడీలోని లెండిబాగ్‌లో బాబా తరచూ ధ్యానం చేసుకునేవారట. మట్టి ప్రమిదలో దీపం వెలిగించేవారట. దాన్నే నందదీప్‌ అని పిలుస్తారు.

7. ఆ ఉద్యానవనం ఇప్పటికీ...

7. ఆ ఉద్యానవనం ఇప్పటికీ...

Image source:


అక్కడే ఒక చిన్న ఉద్యానవనాన్ని కూడా బాబా పెంచారు. అది ఇప్పటికీ పచ్చదనంతో మెరిసిపోతుంటుంది. సంస్థాన్‌ ఆవరణలోనే దీక్షిత్‌ వాడా మ్యూజియం ఉంది. ఇందులో సాయిబాబకు చెందిన అరుదైనా బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫోటోగ్రాఫులను చూడొచ్చు. బాబా వాడిన వస్తువులను కూడా ఇందులో భద్రపరిచారు. ఈ మ్యూజియం ప్రతిరోజూ ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ సందర్శకుల దర్శనార్థం తెరుస్తారు.

8. శని శింగణాపూర్

8. శని శింగణాపూర్

Image source:


షిరిడికి 73 కిలోమీటర్ల దూరంలో శని శింగణాపూర్ అనే గ్రామం ఉంది. శనిదేవుని దీవెనలందుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఈ దేవాలయానికి తరలివస్తారు. ఈ ఊరుకు సంబంధించి మరో విశేషం కూడా ఉంది. ఈ గ్రామంలోని ప్రజల ఎవ్వరు తమ ఇళ్లకు తాళాలు వేసుకోరు. శనిదేవుని అనుగ్రహంతో తమ గ్రామంలో ఎలాంటి నేరాలు, దొంగతనాలు జరగవని స్థానికుల ప్రగాఢ విశ్వాసం.

9. నాసిక్...

9. నాసిక్...

Image source:


షిరిడికి వెళ్లినప్పుడు చూడాల్సిన మరో ముఖ్య ప్రదేశం నాసిక్‌. ఇది షిరిడి నుంచి 86 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చాలా పవిత్రమైన ప్రదేశంగా నాసిక్‌ని పేర్కొంటారు. దీనికి పౌరాణిక ప్రాధాన్యత చాలా ఉంది. అంతేకాదు ఎంతో సుసంపన్నమైన సంస్కృతి, సంప్రదాయాలకు నెలవుగా దీన్ని భావిస్తారు. ఇక్కడ ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. అందుకే నాసిక్‌ని చూసినపుడు చాలామంది ఆధ్యాత్మిక పారవశ్యంలో మునిగిపోతారు. ఇండియా ‘గ్రేప్‌ సిటీ'గా కూడా దీనికి పేరు.

10. వనవాసం చేసింది ఇక్కడే

10. వనవాసం చేసింది ఇక్కడే

Image source:


శ్రీరామచంద్రడు వనవాసం చేసిన ప్రదేశం ఇదిట. శ్రీరామచంద్రుడి ఉనికిని తెలిపే ఎన్నో గుర్తులు నేటికీ అక్కడ కనిపిస్తాయి. నాసిక్‌లో ఎటు చూసినా పురాతన దేవాలయాలు కనిపిస్తాయి. నాసిక్‌ సమీపంలో త్రయంబకేశ్వర జ్యోతిర్లంగ దేవాలయం ఉంది. గోదావరి పుట్టిన ప్రదేశం ఇది. ఈ ప్రదేశాన్ని చూడడానికి ఎంతోమంది హిందువులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.

11. పంచవటి....

11. పంచవటి....

Image source:


ఇక్కడ ఉన్న మరో ప్రముఖ ప్రదేశం ‘పంచవటి'. ఇక్కడే శ్రీరాముడు సీతాదేవితో ఉన్నాడు. ఇక్కడి గోదావరి నది ఒడ్డున పచ్చదనంతో మెరిసిపోయే అరటి చెట్ల తోపుల్ని ఇప్పటికీ చూడొచ్చు. పూర్వం ఈ ప్రదేశాన్ని దండకారణ్యం అని పిలిచేవారు. ఇక్కడే శ్రీరాముని దేవాలయంగా ప్రసిద్ధి చెందిన కలారం గుడిని చూస్తాం. ఇక్కడ చూడాల్సిన మరో ముఖ్య ప్రదేశం సీతా గుఫ్ఫా. ఈ ప్రదేశం నుంచే సీతాదేవిని రావణాసురుడు తీసుకుపోయాడు.

12. దూద్ సాగర్ వాటర్ ఫాల్స్...

12. దూద్ సాగర్ వాటర్ ఫాల్స్...

Image source:


ఈ గుహలోకి వెళ్లాలంటే పర్యాటకులు బాగా తలలు వంచి లోపలికి వెళ్లాల్సిఉంటుంది. ఇవే కాకుండా ఇక్కడ తపోవన్‌, అంజెన్నీ, పాండవ లేని గుహలు వంటివెన్నో ఉన్నాయి. ఇక్కడ పర్యాటకుల్ని ఆకట్టుకునే ప్రదేశం మరొకటి ఉంది. అదే దూద్‌సాగర్‌ వాటర్‌ఫాల్స్‌. ఈ ప్రదేశం అందం చూడడానికి రెండు కళ్లు చాలవు. ఇవే కాదు యువతకు ఆసక్తికరంగా ఉండే ఫిషింగ్‌, రాక్‌ క్లైబింగ్‌, స్విమ్మింగ్‌, బోట్‌ రైడింగ్‌, ఎన్నో ఆర్చిడ్స్‌, వెనియార్డ్స్‌ వంటివి కూడా నాసిక్‌లో పర్యాటకులు ఎంజాయ్‌ చేయొచ్చు.

13.మరెన్నో ముఖ్యమైన ప్రాంతాలు....

13.మరెన్నో ముఖ్యమైన ప్రాంతాలు....

Image source:


నాసిక్‌లో షాపింగ్‌ సెంటర్లకు వెళ్లాలనుకునే వారు తప్పనిసరిగా మహాత్మాగాంధి మార్గ్‌, కెనడా కార్నర్‌, సర్‌ఫలకు వెళ్లాల్సిందే. వెండితో చేసిన వస్తువులకు నాసిక్‌ ఎంతో పేరు. అక్కడ మన బడ్జెట్‌కు తగ్గట్టు సామాన్యమైన హోటల్స్‌ నుంచి లగ్జరీ హోటల్స్‌ వరకూ అన్నీ ఉంటాయి. ఇవే కాకుండా షిరిడి చుట్టుపట్ల మరికొన్ని ముఖ్య ప్రదేశాలున్నాయి. వాటిలో అలాండి, రామ్‌కుండ్‌, ముక్తిధామ్‌ దేవాలయం, కాయిన్‌ మ్యూజియం, ఐదు జ్యోతిర్లింగాలలో ఒకటైన భీమశంకర్‌ దేవాలయం, ఒకప్పుడు దేవగిరిగా పేరొందిన దౌలతాబాద్‌ ఫోర్ట్‌, అజంతా, ఎల్లోరా గుహలు ఉన్నాయి. ఇవి ఎంతో ముఖ్యమైనవి. చూడాల్సినవి.

14. అంజంతా, ఎల్లోరా...

14. అంజంతా, ఎల్లోరా...

Image source:


ఇవి ఔరంగాబాద్‌కు సమీపంలో ఉన్నాయి. ఈ రాతి గుహల్ని మనుషులే తమ చేతితో చెక్కారంటే సంభ్రమాశ్చర్యాలకు గురవుతాం. ఇవి వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్స్‌ గా రికార్డుకెక్కాయి కూడా. అజంతాలో ఇలాంటివి 29 గుహలుంటే, ఎల్లోరాలో 34 ఉన్నాయి. భారత ఆర్కిటెక్చర్‌ నైపుణ్యానికి ఈ గుహల సౌందర్యం ఒక మచ్చుతునక మాత్రమే. బౌద్ధ సన్యాసులు వర్షాకాలంలో ఈ గుహల్లో తలదాచుకున్న సమయంలో సమయం వృథా చేయకుండా ఆ గుహల గోడల మీద మతం, నాటి సంస్కృతి సంబంధమైన పలు చిహ్నాలను అందంగా చెక్కారంటారు.

15. ఏక శిలతో....

15. ఏక శిలతో....

Image source:


ఎల్లోరాలో ఏకశిలతో చెక్కిన కైలాశ దేవాలయాన్ని కూడా తప్పనిసరిగా చూడాలి. అజంతాలో రాతితో చెక్కిన లార్డ్‌ బుద్ధా శిల్పాన్ని చూడాలి. అజంతా పూర్తిగా బౌద్ధ గుహలైతే, ఎల్లోరా గుహల్లో బుద్ధిజం, జైనిజం, హిందూయిజం జాలువారుతుంటుంది. అజంతా, ఎల్లోరా గుహలు మెల్లమెల్లగా బౌద్ధుల చైత్యాస్‌ (దేవాలయాలు)గా, విహారాస్‌ (లివింగ్‌ క్వార్టర్స్‌)గా మారాయి. అక్కడే వారు బోధనలు చేసేవారు. అవి బౌద్ధ సంస్కృతి ఉద్యమ కేంద్రాలయ్యాయి.

16. బౌద్ధపతాలకు సంబంధించిన...

16. బౌద్ధపతాలకు సంబంధించిన...

Image source:


ఉలి లాంటి చిన్న పరికరాలతో అందమైన శిల్పాలను ఈ గుహల గోడల మీద వారు చెక్కారు. వారు చెక్కిన బొమ్మల్లో బౌద్ధమతాలకు సంబంధించిన అనేక విషయాలను గురించి చిత్రీకరించారు. ఔరంగాబాద్‌లో మొగల్‌ ఆర్కిటెక్చర్‌ను ప్రతిఫలించే అద్భుతమైన కట్టడాలు సైతం ఎన్నో ఉన్నాయి. అందుకే షిరిడి వరకూ వచ్చిన పర్యాటకులే కాదు సాధారణ వీక్షకులు సైతం తప్పకుండా ఔరంగాబాద్‌ను చూసి వెళతారు.

17. బీబీకా మఖ్బారా...

17. బీబీకా మఖ్బారా...

Image source:


ఔరంగాబాద్‌లో చూడాల్సిన ప్రదేశాలెన్నో ఉన్నాయి. వీటిల్లో బిబి కా మఖ్బారా ఒకటి. తాజ్‌మహల్‌ని పోలి ఉంటుంది ఇది. దీన్ని ‘ది తాజ్‌మహల్‌ ఆఫ్‌ డెక్కన్‌' అని కూడా అంటారు. ఔరంగజేబ్‌ భార్య రబియా దురాని సమాధి ఇది. ఈ కట్టడంలో అణువణువునా పర్షియన్‌ ఆర్కిటెక్చర్‌ నైపుణ్యం ప్రతిఫలిస్తుంది. ఔరంగాబాద్‌లో ఎన్నో మ్యూజియంలు కూడా ఉన్నాయి.

18. దుర్భేద్యమైన కోటల్లో ఇది ఒకటి...

18. దుర్భేద్యమైన కోటల్లో ఇది ఒకటి...

Image source:


దౌలతాబాద్‌ కోట ఇక్కడే ఉంది. దేవగిరిగా పిలవబడే దీనికి దౌలతాబాద్‌ అని మహమద్‌ తుగ్లక్‌ పేరుపెట్టాడు. ఇండియాలో ఉన్న దుర్భేద్యమైన కోటల్లో ఒకటిగా దీనికి పేరుంది. ఎల్లోరాకు మూడు కిలోమీటర్ల దూరంలో ఖుల్దాబాద్‌ అనే టౌన్‌ ఉంది. ఇక్కడే మొగల్‌ చక్రవర్తి ఔరంగజేబ్‌ సమాధి ఉంది. ఈ సమాధిని చూడటానికి కూడా దేశం నలుమూలల నుంచి పర్యాటకులు ఎక్కువ మంది ఇక్కడకు వస్తుంటారు.

19.గృహనేశ్వర్‌ దేవాలయం

19.గృహనేశ్వర్‌ దేవాలయం

Image source:


ఔరంగాబాద్‌ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో గృహనేశ్వర్‌ దేవాలయం ఉంది. పన్నెండు జ్యోతిర్లింగ దేవాలయాల్లో ఇది ఒకటి. ఇది శివాలయం. ఇవే కాకుండా ఇక్కడ పంచాక్కి, సున్హేరీ మహల్‌ వంటి ఉన్నాయి. ఔరంగాబాద్‌ నుంచి షిరిడి 130 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఔరంగాబాద్‌కు రైలు, బస్సు, విమాన సర్వీసులు ఉన్నాయి. దీంతో ఇక్కడకు పర్యాటకుల తాకిడి కొంత ఎక్కువగానే ఉంటుంది.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి