Search
  • Follow NativePlanet
Share
» » గుహ జాడ తెలుసుకుంటే భూ భాగంలో సగం....ఆ ఆకు తింటే...నమ్మశక్యం కాని వింతలెన్నో

గుహ జాడ తెలుసుకుంటే భూ భాగంలో సగం....ఆ ఆకు తింటే...నమ్మశక్యం కాని వింతలెన్నో

By Beldaru Sajjendrakishore

తిరుమల హిందువుల పవిత్ర పుణ్య క్షేత్రం. వెంకటేశ్వర స్వామి నడియాడిన తిరుమల గిరుల్లో ఎన్నో అద్భుతాలు ఉన్నాయని నమ్ముతున్నారు. వాటిలో కొన్ని రుజువులు మాత్రం దొరకడం లేదు. అయితే పురాణాలు మాత్రం తిరుమల ప్రశస్తి గురించి, అక్కడ ఉన్న ఎన్నో అద్భుతాల గురించి పేర్కొన్నాయి. మరి అటువంటి అద్భుతాలలో ఒకటి రహస్య వైకుంఠం గుహ ఈ గుహలోనే అంతులేని సంపద ఉందని చెబుతారు. ఈ గుహ జాడ కనుగొంటే ప్రపంచ భూ భాగాన్నంతిటనీ కొనేయవచ్చునని చెబుతారు.

ఈ వింతలకు కారణాలు చెప్పినా చెప్పక పోయినా మొక్షం ఖచ్చితం

ఇక్కడ పిండప్రధానం చేస్తే మోక్షం తధ్యం

స్వర్ణ త్రికూటంలో

ఇక తిరుమలలోని ఒక ఆకు తింటే ఆకలి దప్పికల నుంచి దూరంగా ఉండటమే కాకుండా సంపూర్ణ ఆరోగ్య వంతులమవుతారచి చెబుతున్నారు. దీనితో పాటు తిరుమలకు సంబంధించిన కొన్ని ఆశ్చర్యకరమైన వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

ఆ గుహ జాడ తెలుసుకుంటే...

ఆ గుహ జాడ తెలుసుకుంటే...

1. త్రేతాయుగం నాటిది

Image Source:

ఇక్కడ చెప్పబోయే గాధ త్రేతాయుగం నాటిది. రావణాసురుడు అపహరించుకొని పోయిన సీతాదేవిని వెతుక్కుంటూ రామలక్ష్మణులు వానర సేనతో కలిసి అడవిబాట పట్టారు. అప్పుడు వారు వెంకటాద్రి అనే దివ్య గిరికి చేరుకున్నారు. అప్పుడు అక్కడ వారికి ఆంజనేయుని తల్లి అంజనాదేవి తపస్సు చేస్తూ కనిపించింది. రాముణ్ణి చూసిన అంజనాదేవి ఆనందపడుతూ .. నమస్కరిస్తూ ... రండి అని ఆహ్వానించింది.

ఆ గుహ జాడ తెలుసుకుంటే...

ఆ గుహ జాడ తెలుసుకుంటే...

2. వైకుంఠ గుహ చరిత్ర

Image Source:

ఆకాశగంగ తీర్థంలో స్నానం చేసిన రామలక్ష్మణులు అంజనాదేవి కుటీరానికి వెళ్ళి విశ్రాంతి తీసుకున్నారు. అయితే వెంట వచ్చిన వానరసేన మాత్రం వేంకటాద్రిలోని అన్ని ప్రదేశాలను తిరుగుతూ ఉండగా, శ్రీవారు ప్రస్తుతం ఉన్న కొలనుకు ఈశాన్య దిశలో ఒక గుహ కొంత మంది వానరుల కంటపడింది. వెలుగులు చిమ్ముతూ ఈ గుహ కనిపించడంతో వానరులందరూ అందులోకి వెళ్లి చూడగా ప్రకాశిస్తున్న మహానగరం కనిపించింది.

ఆ గుహ జాడ తెలుసుకుంటే...

ఆ గుహ జాడ తెలుసుకుంటే...

3. మరో లోకం

Image Source:

అక్కడ వానరులకు ఎంతోమంది స్త్రీ, పురుషులు కనిపించారు. వారందరూ శంఖు చక్రాలను ధరించి మల్లెపూవువలె తెల్లని వస్త్రాలను ధరించి ఉన్నారు. ఇంకాస్త లోపలికి వెళ్ళి చూడగా నగరం మధ్యలో సూర్యకాంతిలో వెలిగిపోతున్న ఒక దివ్యవిమానం కనిపించింది. సూర్యకాంతిలో ప్రకాశిస్తున్న ఆ దివ్య విమానం నడుమ భాగాన ఉన్న ఆదిశేషుని వేయి పడగల పై పడుకొని ఉన్న శ్రీ మహావిష్ణువు వానరులకు దర్శనమిచ్చారు.

ఆ గుహ జాడ తెలుసుకుంటే...

ఆ గుహ జాడ తెలుసుకుంటే...

4. గుహ మాయమయ్యింది

Image Source:

ఇదంతా చూసిన వానరులు ఆశ్చర్యానికి లోనయ్యారు. వారు ఆ ఆశ్చర్యము నుండి తెరుకొనే లోపే ఆ గుహ మాయమయింది.. జరిగిన విషయాన్ని మిగితా వానరసేనలకు చెప్పగా, సరేనని అందరూ కలిసి అక్కడికి వెళ్లారు. అయితే వారికి అక్కడ ఎంత వెతికినా ఆ గుహ జాడ తెలియలేదు. వెంటనే జరిగిన విషయాన్ని శ్రీరామచంద్రులకు చెప్పుకున్నారు.

ఆ గుహ జాడ తెలుసుకుంటే...

ఆ గుహ జాడ తెలుసుకుంటే...

5. ఏ సమయంలో ఎక్కడైనా

Image Source:

అప్పుడు వానరులతో రాముడు - "మీరు తిరుమల కొండలను చూడడమే మహా అదృష్టం. శ్రీనివాసుడు తిరుమల గిరులలో ఏ సమయంలో ఎక్కడైనా ఉంటారు. కేవలం ఆ గుహ ఒక్కటే కాదు ఇలాంటి గుహలు తిరుమలలో ఎన్నో ఉన్నాయి. ఆయన అన్ని చోట్లా ఉంటాడు. ఆయన లేని చోటంటూ లేదు." అని అన్నాడు. వైకుంఠ గుహ చరిత్ర "విశ్రాంతి కోసం అప్పుడప్పుడు శ్రీనివాసుడు వైకుంఠ గుహలో సేదతీరుతుంటారు. అలాంటి గుహలోకి వెళ్ళడం ఎవరికైనా అసాధ్యమే" అని శ్రీరాముడు వివరించాడట.

ఆ గుహ జాడ తెలుసుకుంటే...

ఆ గుహ జాడ తెలుసుకుంటే...

6. ఇప్పటికీ పరిశోధన

Image Source:

వైకుంఠ గుహ చరిత్ర పురాణాలు కూడా తిరుమల గిరులలో ఉన్న గుహల గురించి పేర్కొన్నాయని . . మఠాధిపతులు, స్వామీజీ లు కూడా కొన్ని కొన్ని సందర్భాలలో వీటి గురించి ప్రస్తావించారని చెబుతుంటారు. వెంకటేశ్వర స్వామి ఎప్పుడు ఏ గుహలో రహస్యంగా సేదతీరుతాడో ఆయనకొక్కరికే తెలుసని ... ఇది వినటం తప్ప, చూడటానికి ఆ భాగ్యము కలగదని, ఒకవేళ కలిగిన ఎవరికి ఎప్పుడు కలుగుతుందో చెప్పడం కష్టమని అంటారు. ఆ గుహలో అంతులేని సంపద ఉందని, ఆ గుహ జాడ తెలుసుకుంటే ఈ భూభాగంలో సగ భాగాన్ని కొనుక్కొవచ్చునని చెబుతారు.

ఆ గుహ జాడ తెలుసుకుంటే...

ఆ గుహ జాడ తెలుసుకుంటే...

7. హథీరాంజీ

Image Source:

హథీరాంజీ క్రీ.శ 1500కాలంలో తిరుమలకు వచ్చిన భక్తుడు.ఇతడు స్వామివారితో పాచికలాడెంతసన్నిహిత భక్తుడని.పాచికలాడుతూ వేంకటేశ్వరుడు ఓడిపోయాడని ఆందుకే తిరుమలలో హథీరాంజీ ఆలయం తిరుమల ఆలయంకన్నా 100మీ ఎత్తులో వుంటుందని ఒక కధనం. కథ ప్రకారం ఇతని గురించి అర్చకులు రాజుకు పిర్యాదు చేసారు. అతనిని శిక్షించటానికి ముందు రాజు ఒక పరీక్షపెట్టాడు. అది చాలా కఠినమైనది.

ఆ గుహ జాడ తెలుసుకుంటే...

ఆ గుహ జాడ తెలుసుకుంటే...

8. బండెడు చెరుకు గడలు

Image Source:

ఒక బండెడు చెరుకు గడలు అతని గదిలో పెట్టి తాళంవేసారు. ఆ చెరుకుగడలను రాత్రికిరాత్రే తినగలిగితే అతనిని శ్రీవారి సన్నిహితునిగా అంగీకరిస్తామని రాజు అంటాడు. స్వామి ఏనుగురూపంలో వచ్చి చెరుకు గడలన్నీ తినేస్తాడు. అప్పటి నుంచి ఇతడిని అందరూ గౌరవించడం మొదలు పెడుతారు. అయితే ఆలయ నిర్వాహకులకు మాత్రం ఇతని పై ద్వేషం అలాగే ఉండేది. సమయం వచ్చినప్పడు తమ తడాఖ చూపించాలని భావిస్తుండేవారు.

ఆ గుహ జాడ తెలుసుకుంటే...

ఆ గుహ జాడ తెలుసుకుంటే...

9. అది షరత్తు

Image Source:

ఇదిలా ఉండగా బాలాజీ మొదట్లో శ్రీవారి ప్రసాదాన్ని ఆహారంగా తీసుకునేవారు. అయితే ప్రతీరోజూ వూరికే ప్రసాదాలు ఇష్టంలేని ఆలయఅధికారులు హథీరాంజీ ని కట్టెలు కొడితేనే ప్రసాదాలని షరతులు విధించారు. హథీరాంజీఏనుగులా బలంగా వుండేవాడని పురాణాలు చెబుతున్నాయి. శ్రీ వారి ప్రసాదాల కోసం కట్టెలు తెచ్చి వాటిని గొడ్డళ్ళతో హథీరాంజీ ముక్కలు చేసేవాడట. కొన్ని రోజుల తర్వాత బాబాజీకి బాధనిపించిందట.

ఆ గుహ జాడ తెలుసుకుంటే...

ఆ గుహ జాడ తెలుసుకుంటే...

10. తపస్సుకు ఉపక్రమించాడు

Image Source:

తన సమయమంతా దీనికి కేటాయిస్తున్నానేంటి అనుకునేవారట హథీరాంజీ. తన దేవుడి ధ్యానం కూడా చేయడానికి వీలు దొరకడం లేదని భావించి దేవాలయం నుంచి దూరంగా వెళ్లి తపస్సుకు ఉపక్రమించాడు. శ్రీవారి ఆలయానికి దూరంగా పాపవినాసనంఅడవుల్లోకి వచ్చేసారు. అతి సమీపంలోని అటవీప్రాంతంలో హథీరాంజీబాబాజీ తపస్సుకు కూర్చున్నాడు. ఆ సమయంలో ఆయనకు ఆకలివేసింది.

ఆ గుహ జాడ తెలుసుకుంటే...

ఆ గుహ జాడ తెలుసుకుంటే...

11. తియ్యటి, పుల్లటి ఆకులు

Image Source:

ఆకలిని తట్టుకోలేక ఎదురుగా వున్న చిన్నచెట్టు ఆకులను తీసుకుని ఆరగించాడు.ఆ ఆకులు తియ్యగా వుండటంతో ఆవురావురమంటూ ఆ ఆకులన్నిటినీ ఆరగించాడు హథీరాంజీ. పక్కనే వున్న తీర్థంలో నీళ్ళు తాగాడు. ఆకలి తగ్గాక బాబాజీకి భయం వేసింది. ఆకులవల్ల ఏమన్నా అవుతుందా అని ఆలోచించటం మొదలుపెట్టాడు.అయితే బాబాజీకి ఏమీకాలేదు. అలా తన తపస్సును పూర్తిచేసాడు.

ఆ గుహ జాడ తెలుసుకుంటే...

ఆ గుహ జాడ తెలుసుకుంటే...

12. ఇంక ఎక్కడా కనిపించవు

Image Source:

12ఏళ్ల పాటు తపస్సుచేసి ఆ బద్ధాకును తింటూ వచ్చాడు. కొంత మంది ఈ ఆకులను రామబద్రం ఆకులని లేక రామపత్తి ఆకులని పిలుస్తూవుంటారు. గతంలో అన్ని చెట్లు వుండగా బాబాజీ ఈ ఆకులనే తినటం ఆశ్చర్యంగా వుందికదా. ఇదంతా శ్రీవారి మహిమేనని పురాణాలు చెబుతున్నాయి. ఈ బద్ది చెట్టు శేషాచలంలోమాత్రమే విరివిగా పెరుగుతాయి. ఇంకా ఎక్కడా కనిపించదు.

ఆ గుహ జాడ తెలుసుకుంటే భూ భాగంలో సగం..

ఆ గుహ జాడ తెలుసుకుంటే భూ భాగంలో సగం..

13. అక్కడ మాత్రమే

Image Source:

పాపవినాశనం దగ్గరలో వేణుగోపాలస్వామి ఆలయందగ్గర హథీరాంజీ బాబాజీ సమాధివుంది. అక్కడే ఆయన తపస్సు చేసారు.అక్కడికి వెళ్ళిన బద్దాకును ఇస్తూవుంటారు. ఈ ఆకు తియ్యగాపుల్లగా వుంటుంది. దీనిని ఎంతైనా తినోచ్చును.దీనిని తింటే సంపూర్ణఆరోగ్యం పొందటం ఖాయమట. ఇంకెందుకాలస్యం ఈ సారి తిరుమల వెళ్ళినప్పుడు ఈ ఆకులు ఆరగించి మీరు కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులు

ఆ గుహ జాడ తెలుసుకుంటే భూ భాగంలో సగం..

ఆ గుహ జాడ తెలుసుకుంటే భూ భాగంలో సగం..

14. వేల ఏళ్ల నాటి గుణపం

Image Source:

ఆలయ ప్రవేశంలో మహద్వారానికి కుడివైపున వెంకటేశ్వర స్వామివారిని శిరస్సుపై అనంతాళ్వారు కొట్టిన గుణపం ఉంటుంది. బాల్య దశలో ఉన్న స్వామివారిని ఆ గుణపంతో కొట్టడంతో స్వామివారి గడ్డంపై గాయమై రక్తంవస్తుంది. అప్పట్నుంచే స్వామి వారి గడ్డానికి గంధం పూయడమనే సాంప్రదాయం ప్రారంభమైంది. వెంకటేశ్వర స్వామి విగ్రహానికి జుట్టు (నిజమైన జుట్టు) ఉంటుంది. ఇది అస్సలు చిక్కుపడదని అంటుంటారు.

ఆ గుహ జాడ తెలుసుకుంటే భూ భాగంలో సగం..

ఆ గుహ జాడ తెలుసుకుంటే భూ భాగంలో సగం..

15. ఇతరులకు ప్రవేశం లేదు

Image Source:

తిరుమలలో శ్రీవారి దేవాలయం నుండి సుమారు 23 కి.మీ దూరంలో ఒక గ్రామం ఉంటుంది. అక్కడ ఆ గ్రామస్తులకు తప్ప ఇతరులకు ప్రవేశం లేదు. ఆ గ్రామస్థులు ఎంత పద్ధతిగా ఉంటారంటే, స్త్రీలు రవికలు(జాకెట్లు) కూడా వేసుకోరు అంత పద్దతిగా ఉంటారు మరి. అక్కడ ఉండే తోట నుండే స్వామి వారికి వాడే పూలు తీసుకొస్తారు. గర్భగుడిలో ఉండే ప్రతీది అంటే పాలు, నెయ్యి, పూలు, వెన్న మొదలైనవన్నీ కూడా ఆ గ్రామం నుండే వస్తాయి.

ఆ గుహ జాడ తెలుసుకుంటే భూ భాగంలో సగం..

ఆ గుహ జాడ తెలుసుకుంటే భూ భాగంలో సగం..

16. ఓ మూలకు విగ్రహం

Image Source:

నాల్గవది స్వామివారు గర్భగుడి మధ్యలో ఉన్నట్టు కనిపిస్తారు కానీ, నిజానికి ఆయన గర్భగుడి కుడివైపు ఒక మూలలో ఉంటారు. బయటి నుండి గమనిస్తే ఈ విషయం మనకు భోధపడుతుంది. స్వామివారికి ప్రతీరోజూ క్రింద పంచె, పైన చీరతో అలంకరిస్తారు. దాదాపు 50 వేల ఖరీదు చేసే శ్రీవారి సేవ ఒకటుంది (ఇది బహుశా అతి కొద్ది మందికి మాత్రమే తెలిసిన సేవ). ఆ సేవలో పాల్గొన్న భార్యాభర్తలకు చీరను స్త్రీకి, పంచె పురుషునికి ఇస్తారు. ఈ టికెట్లు దొరకడం చాలా కష్టం. తక్కువ టిక్కెట్స్ మాత్రమే అమ్ముతారు.

ఆ గుహ జాడ తెలుసుకుంటే భూ భాగంలో సగం..

ఆ గుహ జాడ తెలుసుకుంటే భూ భాగంలో సగం..

17. అక్కడ పైకి తేలుతాయి

Image Source:

గర్భగుడిలో నుండి తీసేసిన పూలన్నీ కూడా బయటికి తీసుకొనిపోరు. స్వామి వారి వెనకాల ఒక జలపాతం ఉంటుంది. అందులో వెనక్కి తిరిగిచూడకుండా పడవేస్తారు. ఆ పూలు అన్నీ కూడా తిరుపతి నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పేడు (శ్రీకాళహస్తికి వెళ్ళేదారిలో) దగ్గర పైకి వస్తాయి.స్వామి వారి వెనక భాగం వీపు మీద ఎన్ని సార్లు తుడిచినా తడి ఉంటుంది. అలాగే అక్కడ చెవి పెట్టి వింటే సముద్రపు ఘోష వినిపిస్తుంది.

ఆ గుహ జాడ తెలుసుకుంటే భూ భాగంలో సగం..

ఆ గుహ జాడ తెలుసుకుంటే భూ భాగంలో సగం..

18. దీపాలు ఎప్పటికీ కొండెక్కవు

Image Source:

స్వామివారి గుండె మీద లక్ష్మీదేవి ఉంటుంది. ప్రతి గురువారం నిజరూప దర్శనం సమయంలో స్వామివారికి చందనంతో అలంకరిస్తారు. అది తీసివేసినప్పుడు లక్ష్మీదేవి అచ్చు(ముద్ర) అలానేవస్తుంది. దాన్ని అమ్ముతారు. స్వామివారి ముందర వెలిగే దీపాలు ఎప్పటికీ కొండెక్కవు (ఆరిపోవు). అవి ఎన్నివేల సంవత్సరాల నుంచి వెలుగుతున్నాయో కూడా ఎవ్వరికీ తెలీదు. క్రీ.శ. 1800 వ శతాబ్ధంలో గుడి పన్నెండేళ్లపాటు మూసేశారట. ఎవరో ఒక రాజు పన్నెండు మందిని గుడి దగ్గర తప్పు చేసినందుకుగానూ హతమార్చి గోడకు వ్రేలాడదీశాడట. ఆ సమయంలోనే విమాన వెంకటేశ్వర స్వామి వెలసిందని అంటారు.

ఆ గుహ జాడ తెలుసుకుంటే భూ భాగంలో సగం..

ఆ గుహ జాడ తెలుసుకుంటే భూ భాగంలో సగం..

19. అప్పట్లో అలా

Image Source:

అలపిరి దగ్గరున్న మెట్ల దారిలో వున్న తల తాకుడు గుండు:---దీన్నె తలయేరు గుండు అని కూడా అంటారు.- గతంలో అంటరాని వారు కొండ పైకి వెళ్ళే వారు కాదు. వారు ఈ గుండుకు తమ తలను తాకించి ఇక్కడి నుండే వారు తిరిగి వెనక్కి వెళ్ళే వారు. ఏడు కొండలపై తమ పాదాలను సైతం ఉంచ రాదు అని అనుకునె వారు.

ఆ గుహ జాడ తెలుసుకుంటే భూ భాగంలో సగం..

ఆ గుహ జాడ తెలుసుకుంటే భూ భాగంలో సగం..

20. ఇప్పటికీ చూడవచ్చు

Image Source:

ఇంకో కథనం ప్రకారం ఈ తలయేరు గుండు నుండి మెట్ల దారి అతి కష్టం వుంటుండి. దీనిని మోకాళ్ల మెట్ల దారి అంటారు. తమ మోకాళ్ల నెప్పులు తగ్గాలంటే ఈ గుండుకు తమ మోకాళ్లను తాకించి నడిస్తే మోకాళ్లు నెప్పులు వుండవని భక్తుల నమ్మిక. కారణం ఏదైతేనేమి తల తాకించినా, మోకాలు తాకించినా ఆ గుండుకు అనేక గుంటలు పడి ఉన్నాయి. గత కాలానికి దర్పణంగా ఈగుండును ఇప్పటికి చూడవచ్చు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more