• Follow NativePlanet
Share
» »ఆంధ్రలోని అన్ని గుహాలయాలు...వీటిలోని అంతులేని సంపద గురించి

ఆంధ్రలోని అన్ని గుహాలయాలు...వీటిలోని అంతులేని సంపద గురించి

Written By: Beldaru Sajjendrakishore

కొండను తొలచుకుంటూ వెళ్లి దేవాలయాలను, ఆరామాలను, చైత్యాలను నిర్మిస్తే వాటిని గుహాలయాలు అంటారు. మన దేశంలో గుహాలయాలు అంటే అందరికి గుర్తుకు వచ్చేది అంజంతా ఎల్లోరాలే. అయితే అవే కాకుండా భారత దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఎన్నో గుహాలయాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గుహాలయాలు చాలా ఉన్నాయి. వాటిలో విశాఖపట్టణం దగ్గర్లోని బొర్రా గుహాలు, కర్నూలు జిల్లాలోని బెలూం గుహలు, ఉండవల్లి గుహలు ఎంతో ప్రఖ్యాతి గాంచినవి.

వేసవి పర్యాటకంలో వీటిని మిస్ కాకండి

ఏడు నదులు కలిసే చోటు ఆలయం ...సందర్శిస్తే నరక లోకం తప్పుతుంది...అయితే ఏడాదిలో నాలుగు నెలలే అవకాశం

ఇక్కడ దెయ్యానికి మినరల్ వాటర్, సిగరెట్ ఇవ్వాల్సిందే లేదంటే ప్రయాణం...

ఈ గుహాలయాలు హిందువులకే కాకుండా బౌద్ధ, జైన మతస్తులకు కూడా ప్రముఖ పుణ్యక్షేత్రాలుగా ఉంటున్నాయి. అంతే కాకుండా మతంతో సంబంధం లేకుండా దేశ విదేశాల నుంచి కూడా  ఎక్కువ మంది పర్యాటకులు కూడా ఈ గుహాలయాలను చూడటానికి వస్తుంటారు.   ఇక ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని గుహాలయాల్లో కేవలం కొంత దూరం వరకే వెళ్లడానికి వీలుంది. అంతకు మించి వెళితే అపాయమని చెబుతారు. మరికొంతమంది అక్కడ లక్షల కోట్ల విలువ చేసే సంద ఉందని చెప్పుకుంటారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని గుహాలయాలకు సంబంధించిన కథనం.   

1. అక్కన్న మాదన్న గుహలు

1. అక్కన్న మాదన్న గుహలు

Image Source:

అక్కన్న మాదన్న గుహాలయాలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో గల కనక దుర్గమ్మ గుడికి దగ్గరలో గల హిందూ దేవాలయాల శిథిలాలు. ఇవి 17వ శతాబ్దంలో నిర్మించినవిగా తెలుస్తున్నది. ఈ గుహలు అంతకు ముందు 6వ శతాబ్ద కాలానికి చెందినవని చరిత్రకారులు చెబుతారు. క్రీ.పూ. 2వ శతాబ్దానికి చెందిన ఒక గుహ కూడా ఈ ఆలయాలకి సమీపంలో ఉంది. ఆ గుహలో బ్రహ్మ, విష్ణు, శివుడు - తిమూర్తులకూ ఆలయాలు ఉన్నాయి.

2. ఇంద్రకీలాద్రి కొండ కింద

2. ఇంద్రకీలాద్రి కొండ కింద

Image Source:

ఈ ఆలయాలు ఇంద్రకీలాద్రి కొండకి తూర్పు దిశగా కొండ కింద భాగంలో ఉంటాయి. హైదరాబాదు-విజయవాడ రహదారిని ఆనుకొని దర్గా అవతల కృష్ణా నది వైపు కాకుండా వేరే వైపుకి అర్జున వీధి ఉంటుంది. ఆ వీధి వెంబడి గోశాల వైపుకి వెళుతుంటే కొద్ది దూరంలోనే ఈ గుహాలయాలు ఎడమ వైపుకి కొండకు దిగువన కనిపిస్తాయి.ప్రస్తుతం ఈ గుహాలయాలు, పరిసరాలు పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో ఉన్నాయి.

3. విష్ణు కుండికులు

3. విష్ణు కుండికులు

Image Source:

ఇవి 5-6 శతాబ్దాలకు చెందిన విష్ణు కుండినులు నిర్మించీ ఉండవచ్చని పురావస్తు శాఖ వారి అంచనా. నగరంలో ఉన్న మొఘల్ రాజ పురం గుహలు, కృష్ణా నదికి ఆ పక్క ఉన్న ఉండవల్లి గుహలు కూడా వారి కాలం లోనే నిర్మించినట్లుగా తెలుస్తోంది. విష్ణు కుండినులు స్వతహాగా శివారాధకులు. కొంత కాలం బౌద్ధం ఆచరించారని చరిత్ర కారుల అభిప్రాయము. ఆ కారణంగా ఈ గుహలు తొలుత బౌద్ధ బిక్షువుల ఆరామ కేంద్రాలుగా ఉండి తరువాత హిందూ గుహాలయాలుగా మారి ఉండవచ్చును అని అంటారు.

4. వారు ఈ గుహల వద్దకు పర్యటనకు రావడం వల్లే

4. వారు ఈ గుహల వద్దకు పర్యటనకు రావడం వల్లే

Image Source:

అయిదో శతాబ్దంలో చెక్కిన గుహలకు పదిహేడో శతాబ్దానికి చెందిన గోల్కొండ నవాబు తానీషా దగ్గర పనిచేసిన అన్నదమ్ములైన అక్కన్న మాదన్న పేర్లు రావడానికి కారణం వారు ఈ ప్రాంత పర్యటనకు వచ్చినప్పుడు ఇక్కడ విడిది చేయడం వలన వారి పేరుతొ పిలవడం ప్రారంభమై ఉండవచ్చును అని కూడా అంటుంటారు. దగ్గరలో ఇసుక రాతిలో చెక్కిన మరో పురాతన గుహలను త్రిమూర్తి గుహలంటారు.

5. లింగ రూపంలో శివుడు

5. లింగ రూపంలో శివుడు

Image Source:

ఇక్కడ ఉన్న రెండు రాతి గదులలోని ఒక దానిలోనే సదా శివుడు లింగ రూపంలో కనపడతాడు. మరొకటి ఖాళీగా ఉంటుంది. ద్వారపాలక విగ్రహాలు, విఘ్న నాయకుని రూపం గోడల పైన చెక్కబడ్డాయి. పక్కనే ఉన్న నల్లరాతి మండపం సుందర సూక్ష్మ చెక్కడాలతో బాటు తెలుగు శాసనంతో ఆకర్షిస్తుంది. మధ్యలో ఉన్న శాసన స్తంభము మహేశ్వరుని వివిధ రూపాలలో చూపుతుంది. హనుమంతుని ఆశీర్వదిస్తున్న సీతా రాములను కూడా ఈ స్తంభం పైన చూడవచ్చును.

6. బెలూం గుహలు

6. బెలూం గుహలు

Image Source:

బెలూం గుహలు కర్నూలు జిల్లాలోని కొలిమిగుండ్ల మండలంలో మండల కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. భారత ఉపఖండంలో మేఘాలయ గుహల తరువాత ఇవే రెండవ అతిపెద్ద గుహలుగా భావిస్తున్నారు. అత్యంత సహజంగా అతి పురాతన కాలంలో ఏర్పడిన గుహలు ఇవి. దేశ, విదేశీ, స్థానిక పర్యాటక ప్రదేశంగా అలరారే ప్రత్యేకతలు ఎన్నో బెలూం గుహల సొంతం. పొడవైన సొరంగమార్గాలు, జాలువారే శిలాస్పటికాలు, రకరకాల శిలాకృతులు, అడుగడుగునా అబ్బురపరిచే అద్భుతాలు బెలూం గుహల ప్రత్యేకత .

7. పది లక్షల క్రితం నాటివి

7. పది లక్షల క్రితం నాటివి

Image Source:

బెలూం గుహలు పది లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడినవని నిపుణుల అభిప్రాయం.క్రీ.పూ. 4,500 సంవత్సరాల ప్రాంతంలో అక్కడ మానవుడు నివసించినట్లు గుహల్లో లభించిన మట్టిపాత్రల ద్వారా తెలుస్తోంది. 1884 లో మొదటిసారిగా రాబర్ట్ బ్రూస్ ఫూట్ అనే ఆంగ్లేయుడు బెలూం గుహల ఉనికి గురించి ప్రస్తావించాడు. తరువాత దాదాపు ఒక శతాబ్దం వరకు వాటి గురించి ఎవరి వల్ల ప్రస్తావన జరగలేదు.

1982లో డేనియల్ జెబోర్ నాయకత్వంలో గుహలకు సంబంధించిన జర్మన్ నిపుణుల బృందం వీటిని సందర్శించి, పరిశీలించింది. బెలూం గుహల ఉనికి గురించి ఈ బృందం ద్వారానే బయటి ప్రపంచానికి ప్రముఖంగా చెలిసిందని చెప్పవచ్చు. ఈ గుహలు భూగర్బంలో 10 కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయని కనిపెట్టారు. 2002 ఫిబ్రవరిలో బెలూం గుహలను సందర్శించడానికి ప్రజలను అనుమతించారు.

8. బొజ్జన్న కొండ గుహాలయాలు

8. బొజ్జన్న కొండ గుహాలయాలు

Image Source:

విశాఖపట్టణం జిల్లా శంకరం గ్రామం దగ్గర గల కొండలపై గల బౌద్ధ స్థలాలు బొజ్జన్నకొండ మరియు లింగాలకొండ. ఇవి విశాఖపట్నం నుండి 45 కి.మీ మరియు అనకాపల్లి నుండి కొద్ది దూరంలో గలవు. ఈ స్థలాలు క్రీ.శ 4 నుండి 9 శతాబ్ది మధ్యవిగా నమ్ముతారు. ఒకనాడు సంఘారము (సంఘారామము) అని పిలవబడేది. మూడు రకాల బౌద్ధ మత వర్గాలు హీనయాన, మహాయాన, వజ్రయాన బాగా వృద్ధిలో వుండేవి.

9. ధ్యాన బుద్ధ విగ్రహాలు

9. ధ్యాన బుద్ధ విగ్రహాలు

Image Source:

ఏకశిలా స్తూపాలు, కొండలో తొలచబడిన గుహలు ఇచటి ప్రత్యేకతలు. నాలుగు గుహలు ఆశ్రయ స్థలాలు. మూడింటిలో ధ్యాన బుద్ధ విగ్రహాలున్నాయి. ప్రతి గుహ ద్వారము రెండుప్రక్కల పెద్ద ద్వారపాలకుల విగ్రహాలున్నాయి. గుహ అంతర్భాగము చతుర్భుజాకారములో ఉండి పదహారు స్థంబాలతో, ఇరువది గదులతో తొలచబడింది. గుహ మధ్యలో చతురస్రాకారపు తిన్నెపై రాతిలో తొలచబడిన ఘన స్తూపము గలదు.

10. రాతితో తొలచబడి

10. రాతితో తొలచబడి

Image Source:

ధ్యాన ముద్రలో గల భూమి స్పర్శ బుద్ధుని విగ్రహము బహు ఉన్నతముగా ఉంటుంది. ప్రధాన స్తూపము రాతిలో తొలచబడి ఇటుకలతో చుట్టబడి ఉన్నది. బొజ్జన్నకొండపై ఇటుకలతో కట్టబడిన విహారాలు, చైత్యము. భిక్షువుల గదులు ఉన్నాయి. 1907 లో జరిగిన త్రవ్వకాలలో ఇచట పలు నాణేలు దొరికాయి. 4వ శతాబ్దపు సముద్ర గుప్తుని నాణెము, చాళుక్య రాజు కుబ్జ విష్ణువర్ధనుని, ఆంధ్ర శాతవానుల కాలము నాటి నాణేలు దొరికాయి.

11. లింగాల కొండ అంచున

11. లింగాల కొండ అంచున

Image Source:


లింగాల కొండ అంచున రాతిలో తొలచబడిన పలు స్తూపాలున్నాయి. బౌద్ధమత వ్యాప్తితోబాటు పలు ఆరామములు, విద్యాస్థలాలు వెలిశాయి. వానిలో తొట్లకొండ, బావికొండ, పావురాలకొండ మొదలగునవి దగ్గరలోనే ఉన్నాయి. రెండు వేల సంవత్సరముల క్రితము ప్రశస్తి బొందిన ఈ ప్రదేశాలు కాలక్రమములో వాటి ప్రాభవము కోల్పోయాయి. అయినా ఇప్పటికీ ఇవి ఎంతో మంది పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.

12. బొర్రా అంటే రంధ్రం

12. బొర్రా అంటే రంధ్రం

Image Source:

బొర్రా గుహలను 1807 లో బ్రిటిష్ భౌగోళిక శాస్త్రవేత్త విలియం కింగ్ కనుగొన్నాడు. ఒరియా భాషలో 'బొర్ర ' అంటే రంధ్రమని అర్థం. సహజంగా ఏర్పడిన ఈ గుహలు 10 లక్షల ఏళ్ళ క్రితంనాటివని భావిస్తున్నారు. నీటిలోని హ్యూమిక్ యాసిడ్ సున్నపురాయిలోని కాల్షియమ్ బై కార్బోనేట్‌తో రసాయన చర్యకు గురైనప్పుడు ఖనిజాలను కరిగిస్తుంది. దానితో రాయి క్రమక్రమంగా కరిగిపోతుంది. కొంతకాలం పాటు ఈ విధంగా నీరు నిరంతరంగా ప్రవహిస్తూ ఉండటం వల్ల గుహలు ఏర్పడతాయి.

13. గోస్తని నది

13. గోస్తని నది

Image Source:

ఈ విధంగానే కొండలపై నుంచి గోస్తని నది వైపు ప్రవహించే చిన్న చిన్న వాగులు వల్ల ఈ గుహలు ఏర్పడ్డయి. కాల్షియమ్ బై కార్బోనేట్, ఇతర ఖనిజాలు కలిగిఉన్న పైకప్పు నుంచి కారుతున్న నీటివల్లే నేలపై దిబ్బల వంటివి ఏర్పడతాయి. వీటిని స్టాలగ్‌మైట్స్ అని అంటారు. అదేవిధంగా పైకప్పు నుంచి వేలాడుతున్న స్టాలక్టైట్స్ అనేవి కాడా ఈ ప్రక్రియ ద్వారా ఏర్పడతాయి. కాలక్రమేణా ఈ స్టాలగ్‌మైట్స్, స్టాలక్టైట్స్ వింతవింత ఆకృతులను సంతరించుకుంటాయి.

14. 50వేల సంవత్సరాల పనిముట్లు

14. 50వేల సంవత్సరాల పనిముట్లు

Image Source:

వారివారి ఊహాశక్తిని బట్టి యాత్రికులు, స్థానికులు వీటికి రకరకాల పేర్లూ పెడుతుంటారు. ఈ బొర్రా గుహల్లో తవ్వకాలు జరిపిన ఆంధ్రా విశ్వవిద్యాలయానికి చెందిన ఆంత్రోపాలజిస్టులకు మధ్య రాతియుగ సంస్కృతికి చెందిన 30,000 నుంచి 50,000 సంవత్సరాల క్రితం నాటి రాతిపనిముట్లు లభించాయి. ఈ ఆధారాలను బట్టి ఇక్కడ మానువులు నివసించినట్లు తెలుస్తోంది. స్థానిక గిరిజనులు బొర్రాగుహలను " బోడో దేవుడి ' (పెద్ద దేవుడు) నివాసంగా నమ్ముతుంటారు.

15. అనుమతి లేదు

15. అనుమతి లేదు

Image Source:

ఈ గుహలకు గోస్తాని నది తొలిచిన నాలుగు ద్వారాలు ఉన్నాయి. బొర్రా-1 అని వ్యవరించబడే ద్వారమే ప్రస్తుతం ఉపయోగంలో ఉంది. ఇక్కడి నుంచి లోపలికి ఒక కిలోమీటరు వరకూ వెళ్లి గోస్తాని నదిని చేరవచ్చు. అయితే ప్రస్తుతం గోస్తాని నది వరకు వెళ్లడాన్ని అనుమతించటం లేదు. 1990 దశకంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఈ బొర్రా గుహలను స్వాధీనం చేసుకుని గుహల వెలుపల ఉద్యాన పెంపకం, మొక్కలు నాటటం వంటి వాటిని చేపట్టటంతో బొర్రాగుహల పరిసరాలు చాలా అందంగా మారాయి.

16. 3 లక్షల మంది సందర్శన

16. 3 లక్షల మంది సందర్శన

Image Source:

గుహల్లోపల ఆధునిక దీపాలంకరణ చేయటం, గుహల్లోపలి వింత వింత ఆకారాలపై, రాళ్ళపై రకరకాల రంగులు, నీడలు పడేవిధంగా ఆధునిక దీపాలంకరణ అమర్చటం జరిగింది. ఇంతకుముందు కాగాడాలతో గైడుల సహాయంతో గుహలను చూపించేవారు. ప్రతీ సంవత్సరం సుమారు 3 లక్షల మంది పర్యాటకులు ఈ గుహలను సందర్శిస్తారని ఒక అంచనా. అరకు లోయ అందించిన ప్రకృతి అద్భుతమైన బొర్రాగుహల ఒక వరం.

17. విశాఖ పట్టణానికి 90 కిలోమీటర్ల దూరంలో

17. విశాఖ పట్టణానికి 90 కిలోమీటర్ల దూరంలో

Image Source:

తూర్పుకనుమల్లోని అనంతగిరి మండల వరుసలో విశాఖపట్నానికి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. విశాఖపట్నం నుంచి అరకులోయకు వెళ్లే దారి అంతా కనుమ రహదార్లతో కూడినదే. ఈదారి వెంట ప్రయాణమే ఓగొప్ప అనుభూతి. గుండెలు గుభేలు మనిపించే కొండ దారిలో వెళ్తుంటే కింద పచ్చని తెవాచీ పర్చినట్లు ప్రకృతి, దట్టమయిన అడవులు, అందమైన వన్యప్రాణులు కనబడతాయి.

18. గుంటు పల్లె గుహాలయాలు

18. గుంటు పల్లె గుహాలయాలు

Image Source:

గుంటుపల్లె లేదా గుంటుపల్లి, పశ్చిమ గోదావరి జిల్లా, కామవరపుకోట మండలానికి చెందిన గ్రామము. పురాతనమైన బౌద్ధరామ స్థానంగా ఈ గ్రామము. చారిత్రకంగా ప్రసిద్ధి చెందినది. జీలకర్రగూడెం గుంటుపల్లి గ్రామాలు ఒకే పంచాయితీ పరిధిలో ఉన్నాయి.ఈ బౌద్ద గుహలు గుంటుపల్లి గుహలుగా ప్రసిద్ధికెక్కినా అవి నిజానికి జీలకర్రగూడెం ఊర్ని ఆనుకొనే ఉన్నాయి. గుంటుపల్లి నుండి దాదాపు మూడు కీలో మీటర్లు వెళితే కాని జీలకర్రగూడెం రాదు జీలకర్ర గూడెం మీదుగానే కొండ పైకి మార్గం ఉంది.

19. ధాతుక దొరికింది

19. ధాతుక దొరికింది

Image Source:

గుంటుపల్లి వూరి కొండలపైన కనుగొన్న బౌద్ధారామాలు చారిత్రికంగా చాలా ముఖ్యమైనవి. ఇవి చారిత్రికమైన, పరిరక్షింపబడ వలసిన పురాతన అవశేషాలుగా భారత పురావస్తు శాఖ నిర్ణయించింది. కొండమీద చైత్యగృహము, ఆరామ మంటపాలు, స్తూపాలు ఉన్నాయి. వీటిలో ఒక స్తూపంలో ధాతుక దొరికింది. ఈ తీర్థం భక్తులను విశేషంగా ఆకర్షించేదనడానికి ఇక్కడ కనుపించే పెక్కు ఉద్దేశిక స్తూపాలే నిదర్శనం.

20. ఆరంభ కాలంలో

20. ఆరంభ కాలంలో

Image Source:

కొండలపైన అంచులో తొలిచిన గుహాలయం, బౌద్ధారామాలు, పైన ఉన్న ప్రార్థనా స్తూపాలు, రాతి స్తూపం వంటి కట్టడాలు క్రీ.పూ. 300 నుండి క్రీ.శ.300 మధ్యకాలంలో విస్తరిల్లినవని భావిస్తున్నారు. అలంకరణలకు ప్రాముఖ్యం లేకుండా కట్టిన కట్టడాలు, బుద్ధుని ప్రతిమ వంటివి లేకపోవడం - వంటి అంశాలవలన ఇవి బౌద్ధమతం ఆరంభకాలం (హీనయాన బౌద్ధం) నాటి ఆరామాలని విశ్లేషిస్తున్నారు.

21. ఉండవల్లి

21. ఉండవల్లి

Image Source:

ఉండవల్లి, గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలానికి చెందిన గ్రామము. ఈ గుహాలయం ఒక పర్వత సముదాయం. పర్వత ముందు భాగమునుండి లోపలికి తొలచుకుంటూ వెళ్ళడం చేసారు. మధ్యలో స్తంభాలు వాటిపై చెక్కిన అందమైన లతలు, గుహాంతర్భాగాలలో గోడలపై చెక్కిన దేవతా ప్రతిమలు మెదలైన వాటితో విశాలంగా ఉంటుంది. ఇవి క్రీ.శ. 4, 5 వ శతాబ్దానికి చెందినవని చరిత్రకారులు భావిస్తున్నారు.

22. నాలుగు అంతస్తుల్లో

22. నాలుగు అంతస్తుల్లో

Image Source:

ఇక్కడ నాలుగు అంతస్తులలో ఆలయాలు నిర్మించారు. అందులో ఒక పెద్ద గ్రానైట్ రాతిలో అనంత పద్మనాభ స్వామి శిల్పం చెక్కబడి ఉంది. ఇతర ఆలయాలు త్రిమూర్తులు అయిన బ్రహ్మ, విష్ణువు, శివుడు దేవతలకు ఉద్దేశించినవి. ఇవి గుప్తుల కాలంనాటి ప్రథమ బాగానికి చెందిన నిర్మాణ శైలికి లభిస్తున్న ఆధారాలలో ఒకటి. ఈ పర్వత గుహలలో పెద్దదైన ఒక గుహాలయము ఉంది.

23. 20 అడుగుల పై బడి

23. 20 అడుగుల పై బడి

Image Source:

ఈ గుహాలయములో లోదాదాపు 20 అడుగులపైబడి ఏకరాతితో చెక్కబడిన అనంతపద్మనాభస్వామి వారి ప్రతిమ ఉంటుంది. ప్రతిమ పొడవుగా శేషపానుపుతో కూడి గుహాంతర్బాగమున కమలంలో కూర్చున్న బ్రహ్మ మరియు సప్తర్షులు ఇతర దేవతల విగ్రహాలూ ఉన్నాయి. పర్వతము బయటివైపు గుహాలయ పైభాగములో సప్తఋషుల విగ్రహాలు పెద్దవిగా చెక్కారు. ఒకే పర్వతాన్ని గుహలుగానూ దేవతా ప్రతిమల తోడను ఏకశిలా నిర్మితముగా నిర్మించిన శిల్పుల ఘనత ఏపాటిదో ఇక్కడ చూస్తేనే తెలుస్తుంది.

24. మంగళగిరి వరకూ

24. మంగళగిరి వరకూ

Image Source:

ఈ గుహల నుంచి పూర్వ కాలంలో మంగళగిరి వరకు సొరంగ మార్గం ఉండేదని మన పూర్వీకులు చెప్పేవారు. ఈ మార్గం నుండి రాజులు తమ సైన్యాన్ని శత్రు రాజులకు తెలియకుండా తరలించేవారని ప్రతీతి. ఈ గుహల నిర్మాణ శైలి బౌద్ధ విహారాల శైలిని పోలి ఉంది. ఆలయాల చుట్టూరా పచ్చని పంటపొలాలు కనువిందు చేస్తాయి. ఈ గుహాలయాలు క్రీ.శ. 420 నుండి 620 వరకు సాగిన విష్ణుకుండినుల కాలానికి చెందినవి. అనంత పద్మనాభ స్వామి, నరసింహ స్వామి ఇక్కడ కొలువైన దేవుళ్ళు

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి