• Follow NativePlanet
Share
» »ఆదిమ మానవుడు నివసించిన ప్రాంతం...భీముడు తలదాచుకున్న చోటు ఒకటేనా

ఆదిమ మానవుడు నివసించిన ప్రాంతం...భీముడు తలదాచుకున్న చోటు ఒకటేనా

Written By: Beldaru Sajjendrakishore

భీమ్ బెట్కా భారతదేశంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న గుహలు. వీటికి అటు పురాణ ప్రాధాన్యతతో పాటు చారిత్రాత్మక ప్రాధాన్యత కూడా ఉన్నాయి. భీమ్ బెట్కా మధ్యప్రదేశ్ లోని భోపాల్ కు కేవలం 50 కిలోమీటర్ల దూరంలో, అమర్ కంటక్ నది తీరాన కొండల మధ్యలో, రతపాని వన్యప్రాణి అభయారణ్యంలో ఉన్నాయి. ఒకప్పుడు ఆదిమానవులకు, ఆతర్వాత క్రూరమృగాలకు నివాసమైన ఈ ప్రదేశం నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంటుంది.

శంకరాచార్యులకు అమ్మవారు పరీక్షపెట్టిన చోటు ....ఇక్కడికి వెళ్లితే అన్ని రంగాల్లో విజయమేఎడారి

రాష్ట్రంలో అందమైన సరస్సుల నగరం...సందర్శిస్తే మనస్సు ఆహ్లాదమే...

వరాహం...సింహం...మనిషి రూపంలో వెలిసిన విష్ణుమూర్తి ఇక్కడే...ఏడాదికి ఒక్కసారే దర్శనం...

భీమ్ బెట్కా అన్న పేరు మహాభారతంలోని భీముడి పేరు మీద వచ్చింది. జూదంలో రాజ్యం పోగొట్టుకున్నాక పాండవులు కొంతకాలం ఈ గుహల్లో తలదాచుకున్నట్లు పురాణ కథనం. మనిషి మొట్టమొదట జీవించి ఇక్కడే అట. పదిహేను వేల ఏళ్ల కిందటే ఆదిమానవుడు ఇక్కడ నివసించినట్లు ఆధారాలు కూడా లభ్యమయ్యాయి మన పురావస్తు శాఖవారికి.

1. రైలులో వెలుతూ...

1. రైలులో వెలుతూ...

Image source:


ఎలా కనుగొన్నారు ? భీమ్ బెట్కా గుహలు కనుగొనే తీరు ఆసక్తికరంగా ఉంటుంది. ప్రముఖ పురాతత్వ శాస్త్రవేత్త వీ.ఎస్. వకాన్కర్ రైలులో భోపాల్ కు వెళుతుండగా తాను ఐరోపా ఖండంలో చూసిన గుహలను పోలిన వాటిని ఇక్కడ చూసాడు. ఆతర్వాత 1957 లో తన బృందంతో కలిసి గుహలను కనుగొన్నాడు. భీమ్ బెట్కా గుహల విశేషాలు భీమ్ బెట్కా గుహలు ప్రాచీన శిలాయుగం కాలం నాటివి.

అనేక ఆధారాలు...

అనేక ఆధారాలు...

Image source:


ఈ గుహలు భారతదేశంలో ఆది మానవుడు నివసించాడు అనటానికి అనేక ఆధారాలు ఉన్నాయి. ఈ గుహలలో లక్ష సంవత్సరాల క్రితం హోమో ఎరక్టస్ ఆదిమానవులు నివసించారు. భీమ్ బెట్కా లో మొత్తం 750 గుహలు కనుగొన్నారు అందులో 243 భీమ్ బెట్కా చెందినవిగా మరియు 178 లకర్ జువార్ వర్గానికి చెందినవిగా గుర్తించారు. ప్రస్తుతం ఈ గుహలలో సందర్శకుల కోసం 12 మాత్రమే తెరచి ఉంచారు.

పెయింటింగ్స్ ప్రధాన ఆకర్షణ...

పెయింటింగ్స్ ప్రధాన ఆకర్షణ...

Image source:


పెయింటింగ్స్ ఆదిమానవులు వేసిన పెయింటింగ్స్ గుహలలో ప్రధాన ఆకర్షణలు. గుహలలో సుమారు 453 పెయింటింగ్స్ కలవు. ఇవి 30,000 ఏళ్ల క్రితం నాటివిగా చెబుతారు. ఈ గుహలు పూర్వం నాట్యం యొక్క ఉనికిని కూడా కనబర్చాయి. ఒకానొక రాతిగుహలో చేతిలో త్రిశూలం కలిగి నాట్యం చేస్తున్న భంగిమలోని చిత్రం ఇక్కడి పెయింటింగ్స్ లో కెల్లా సెంటర్ ఆఫ్ అట్ట్రాక్షన్స్. వీటిని చూడటానికే చాలా మంది ఇక్కడికి వస్తుంటారు.

వారసత్వ సంపద

వారసత్వ సంపద

Image source:


భీమ్ బెట్కా గుహలను యునెస్కో 2003 లో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. భీమ్ బెట్కా గుహలో ఉన్న ఏక శిలపై ఉపయోగించిన రంగుల యొక్క ముడిసరుకు బార్కేదా వనరుగా వ్యవహరించారు పురాతత్వ శాస్త్రవేత్తలు. కొన్ని వాతావరణ పరిస్థితుల కారణంగా గుహలలో అరుదైన చిత్రాల కోతకు గురైతున్నాయి. వీటిని సంరక్షించడం కోసం పురావస్తుశాఖ రసాయనాలను మరియు మైనాన్ని ఉపయోగిస్తున్నది.

రైలు మార్గం ఇలా...

రైలు మార్గం ఇలా...

Image source:


సందర్శన సమయం : ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు భీమ్ బెట్కా గుహలను పర్యాటకులు/ యాత్రికులు సందర్శించవచ్చు. భీమ్ బెట్కా గుహలకు ఎలా చేరుకోవాలి ? భీమ్ బెట్కా గుహలు భోపాల్ కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి కనుక ముందు భోపాల్ చేరుకొని అక్కడి నుంచి లోకల్ ట్రాస్పోర్ట్ ద్వారా భీమ్ బెట్కా చేరుకోవచ్చు.

విమానయాన సేవలు కూడా

విమానయాన సేవలు కూడా

Image source:


వాయు మార్గం ద్వారా : భీమ్ బెట్కా గుహలకు సమీపాన 45 కిలోమీటర్ల దూరంలో రాజ భోజ్ ఎయిర్ పోర్ట్ కలదు. దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి ఇక్కడికి విమానాలు వస్తుంటాయి. టాక్సీ లేదా క్యాబ్ అద్దెకు తీసుకొని భీమ్ బెట్కా సులభంగా చేరుకోవచ్చు. రైలు మార్గం ద్వారా : భోపాల్ రైల్వే స్టేషన్ భీమ్ బెట్కా కు 37 కి. మీ ల దూరంలో కలదు. ఈ రైల్వే స్టేషన్ దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి, పట్టణాల నుండి చక్కగా కనెక్ట్ చేయబడింది. రోడ్డు మార్గం ద్వారా : భీమ్ బెట్కా కు చుట్టుపక్కల ప్రాంతాల నుండి, భోపాల్, ఇండోర్ నుంచి ప్రభుత్వ బస్సులు అందుబాటులో ఉంటాయి.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి