• Follow NativePlanet
Share
» »సృష్టి నాశనాన్ని ముందుగా తెలుసుకోవడానికి వెలుదామా

సృష్టి నాశనాన్ని ముందుగా తెలుసుకోవడానికి వెలుదామా

Written By: Beldaru Sajjendrakishore

యుగాంతం. ఈ విషయం పై విశ్వవ్యాప్తంగా అనాధి కాలం నుంచి ఎన్నో పరిశోధనలు జరిగాయి. ఇప్పటికీ జరుగుతున్నాయి. అయినా చిక్కుముడి మాత్రం విప్పలేక పోతున్నారు. భారత దేశంలో కూడా యుగాంతానికి సంబంధించిన విషయాలు దేవాలయాల గోడల పై, ప్రాచీన తాళపత్ర గ్రంథాల్లో నిక్షిప్తం చేశారు. అటు వంటి కోవకు చెందినదే కేదారేశ్వర గుహ. ఈ గుహలోని దేవాలయం యుగాంతాన్ని ముందుగా తెలుపుతుందని స్థానికుల నమ్మకం. అంతే కాకుండా ఆ గుహలోని ప్రతి విషయం నిగూడ రహస్యం..

1. కలియుగాంతంతో సృష్టి నాశనం...

1. కలియుగాంతంతో సృష్టి నాశనం...

Image source

హిందూ పురాణాల ప్రకారం కాలమానాన్ని నాలుగు యుగాలుగా విభజించారు. అవి కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ప్రస్తుతం మనం నివశిస్తోంది కలియుగంలోనే. ఈ యుగాంతంతో మొత్తం సృష్టి అంతమై పోతోందని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని ఇతర దేశాలకు చెందిన వారు చాలా మంది నమ్మతున్నారు.

2. లయకారకుడు చెప్పేస్తాడు...

2. లయకారకుడు చెప్పేస్తాడు...

Image source

హిందూ పురాణాల ప్రకారం మహాశివుడిని లయకారకుడని పిలుస్తారు. ఈ జగత్తులో జరిగే ప్రతి కార్యానికి అతని అనుమతి తప్పని సరి అనేది చాలా మంది ప్రగాడ విశ్వాసం. ఆయన లింగాకారంలో ఉంటారన్న విషయం తెలిసిందే. అటువంటి లింగం ఉన్న ఓ గుహాలయం మనకు యుగాంతం గురించి మొదటగా చెప్పేస్తుంది.

3. నాలుగు యుగాలకు నాలుగు స్థంభాలు...

3. నాలుగు యుగాలకు నాలుగు స్థంభాలు...

Image source

ఈ గుహలో నాలుగు స్థంభాల మధ్య ఐదు అడుగుల ఎత్తైన లింగం ఉంది. ఈ లింగాన్ని ఎవరు, ఎప్పుడు ప్రతిష్టించారన్నదానికి సరైన సమాధానం ఇప్పటికీ ఎవరూ చెప్పలేక పోతున్నారు. ఆ నాలుగు స్థంభాలు ఒక్కొక్క యుగానికి అంటే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగానికి ప్రతీకలన్నమాట.

4. పెద్ద బండరాని ఎలా ఆపగలిగింది...

4. పెద్ద బండరాని ఎలా ఆపగలిగింది...

Image source

ఒక్కొక్కో యుగాంతంలో ఒక్కో స్థంభం విరిగి పోయిందని చివరిగా కలిగానికి సంభందించిన స్థంభం మాత్రం అలాగే ఉందని స్థానికలు చెబుతున్నారు. అందుకు తగ్గట్టే మనకు స్థంభాలు విరిగి పోయిన విషయం గుహలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇక విరిగి పోకుండా ఉన్న ఒక్క స్థంభం అంత పెద్ద బండరాయిని ఎలా మోస్తోందన్న విషయం ఇప్పటికీ తెలియడం లేదు.

5. ఎండాకాలంలో ఉండి వర్షాకాలంలో కనపడని నీరు...

5. ఎండాకాలంలో ఉండి వర్షాకాలంలో కనపడని నీరు...

Image source

కేదారేశ్వర గుహలో చుట్టూ ఉన్న నాలుగు గోడల నుంచి నిత్యం నీరు వస్తూ ఉంటుంది. ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందన్న విషయం ఇప్పటికీ జవాబు చెప్పలేని ప్రశ్న. ఇక ఈ నీరు చాల చల్లగా ఉంటుంది. వేసవి, శీతాకాలాల్లో కనిపించే ఈ నీరు వర్షా కాలంలో మాత్రం కనిపించక పోవడం విశేషం.

6. 24 గంటలు ముందే...

6. 24 గంటలు ముందే...

Image source

కలియుగాంతానికి సరిగ్గా 24 గంటల ముందు చివరిదైన నాలుగో స్థంభం విరిగి పోతుందని చెబుతారు. దీని తర్వాత యుగాంతం ప్రారంభమయ్యి మొత్తం ఇరవైనాలుగు గంటల్లోపు సృష్టి నాశనం అవుతుందని చెబుతారు. యుగాంతం, సృష్టి నాశనం వంటి విషయాలు రష్యా, ఈజిప్టు వంటి దేశాలకు చెందిన గ్రంధాల్లో కూడా ఉన్నాయి.

7.ఇంజనీరింగ్ ప్రతిభకు దర్భణం

7.ఇంజనీరింగ్ ప్రతిభకు దర్భణం

Image source

ఈ కేదారేశ్వర గుహకు దగ్గర్లోనే హరిశ్చంద్రేశ్వర గుడి ఉంది. ఇందులో ప్రధానంగా పూజలు అందుకునేది వినాయకుడు. ఈ గుహ అప్పటి మన దేశ నిర్మాణ చాతుర్యానికి మచ్చుతునకగా చెబుతారు. ముఖ్యంగా నీటి నిల్వ కోసం నిర్మించిన ట్యాంకులు అప్పటి ఇంజనీరింగ్ ప్రతిభకు దర్భణంగా చెప్పవచ్చు. ఈ గుహకు దగ్గర్లోనే మంగళ గంగా అనే నది ఉద్భవిస్తుందని చెబుతారు.

8. పర్యాటక ప్రియులకు కూడా...

8. పర్యాటక ప్రియులకు కూడా...

Image source

ఈ కేదారేశ్వర గుహ కేవలం హిందూ భక్తులకే కాక పర్యాటక ప్రియులను కూడా ఎంతగానో ఆకర్షిస్తోంది. ఇక్కడికి దగ్గర్లో ఉన్న పచాని వాటర్ ఫాల్స్ ను చూస్తున్నంత సేపు ఈ లో కాన్నే మర్చపోతామంటే అతిశయోక్తి కాదేమో. అంతే కాకుండా సప్త తీర్త పుష్కరిణి కూడా ఇక్కడ ప్రధాన ఆకర్షణగా ఉంది. తారామతి శిఖరం పై ఉన్న ఈ గుహాలయానికి ట్రెక్కింగ్ ద్వారా కూడా చేరుకోవచ్చు. ప్రకృతి సోయగాల నడుమ నడుచుకుంటూ వెళ్లడం మరపురాని అనుభూతి.

9. ఎక్కడ ఉంది, ఎలా చేరుకోవాలి

9. ఎక్కడ ఉంది, ఎలా చేరుకోవాలి

Image source

మహారాష్ర్టలోని అహ్మద్ నగర్ జిల్లాలో ఉన్న హరిశ్చంద్ర కోటలో కేదారేశ్వర గుహ ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అహ్మద్ నగర్ కు బస్సు సదుపాయం ఉంది.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి