• Follow NativePlanet
Share
» »కప్పకు కూడా ఓ గుడి

కప్పకు కూడా ఓ గుడి

Written By: Beldaru Sajjendrakishore

ఉత్తరప్రదేశ్ లోని పలు జిల్లాల్లో లఖింపూర్ కేరి జిల్లా ఒకటి. లఖింపూర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లా లక్నో డివిషన్‌లో భాగంగా ఉంది. జిల్లావైశాల్యం 7680 చ.కి.మీ. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జిల్లాలలో జిలా ఒకటి. ఇక్కడే  ధుద్వా నేషనల్ పార్క్ (ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ఒకే ఒక అభయారణ్యం). ఉంది. ఈ నేషనల్ పార్క్‌లో అంతరించి పోతున్న పులి, చిరుత, చత్తడి నేలల జింక, హిస్పిడ్ హేర్ మరియు బెంగాల్ ఫ్లోరికాన్ మొదలైన జంతువులు ఉన్నాయి. మహాభారత కాలం నుండి ఈ ప్రాంతం మనుగడలో ఉందని చెప్పవచ్చు. రాజ పుత్రులు, ముస్లిం రాజులు ఇలా ఎందరో లఖింపూర్ ను పరిపాలించారు. అప్పట్లో మంగోలులు, నేపాలుల దాడికి తట్టుకొని నిలబడటానికి కోటలను సైతం ఇక్కడ నిర్మించారు. ఇక ఈ లఖింపూర్ కేరికి దగ్గర్లోనే కప్ప దేవాలయం ఉంది. 

1. మహాభారతానికి సంబంధం

1. మహాభారతానికి సంబంధం

Image Source:

హస్థినాపురానికి ఈ ప్రాంతానికి సంబంధం ఉందని మభారతం సూచిస్తుంది. జిల్లాలో పలుప్రాంతాల గురించిన ప్రస్తావన మహాభారతంలో ఉంది. [7] [8] పలుగ్రామాలలో పురాతనమైన మట్టి గుట్టలు ఉన్నాయి. వీటిలో పురాతన శిల్పాలు లభించాయి. బాల్మిర్ - బర్కర్ మరియు ఖైర్ల్గర్ ప్రధానమైనవి. ఖైరాబాద్ (సీతాపూర్) సమీపంలో రాతి గుర్రం ఒకటి లభించింది. దీనిమీద 4వ శతాబ్ధానికి గుప్తుల కాలానికి చెందిన శిలాక్షరాలు ఉన్నాయి. రాతి గుర్రం ప్రస్తుతం లక్నో జూ మ్యూజియంలో ఉంది.

2. గోలా గోకరనాథ్ శివాలయం

2. గోలా గోకరనాథ్ శివాలయం

Image Source:

లఖింపూర్ కేరికి దగ్గర్లో గోలా గోకరనాథ్ శివాలయం ఒక శివాలయం. గోలా గోకరనాథ్‌ని చోటీ కాశీ అని పిలుస్తారు. పరమశివుడు రావణుని తపసుకు మెచ్చి వరం ప్రసాదించాడని రావణుడు హిమాలయాలను విడిచి శాశ్వతంగా తనవెంట వచ్చి శాశ్వతంగా లంకలో నివసించమని ఈశ్వరుడిని కోరాడు. శివుడు తన ఆత్మలింగాన్ని ఇచ్చి దానిని శ్రీలంకకు చేరే లోపల మద్యలో ఎక్కడ భూమి మీద పెట్టకూడదని షరతు పెట్టాడు.

3. గణేషుడు వస్తాడు

3. గణేషుడు వస్తాడు

Image Source:

ఒకవేళ అది ఎక్కడ ఉంచితే తాను అక్కడే శాశ్వతంగా ఉంటానని చెప్పాడు. రావణుడు అందుకు అంగీకరించి శివలింగాన్ని తీసుకుని శ్రీలంకకు బయలు దేరాడు. రావణుడు గోలాగోకర్నాథ్ (అప్పుడు గోలిహర అనేవారు) చేరగానే కాలకృత్యాలు తీర్చుకోవలసిన అవసరం ఏర్పడింది. రావణుడు అక్కడన్న గొల్లపిల్లావాడిని (భగవానుడు గణేశుడు)పిలిచి కొన్ని బంగారు నాణ్యాలను ఇచ్చి కొంతకాలం శివలింగాన్ని తలమీద ఉంచుకోవలని తాను తిరిగి వచ్చి శివలింగాన్ని తిరిగి తీసుకుంటానని కోరాడు.

4. గోకర్ణతో సంబంధం

4. గోకర్ణతో సంబంధం

Image Source:

గొల్లనాని రూపంలో ఉన్న గణేశుడు శివలింగాన్ని భూమి మీద పెట్టాడు. శివుడు శాశ్వతంగా అక్కడే నిలిచిపోయాడు. తిరిగి వచ్చిన రావణుడు శివలింగాన్ని పెకిలించాలని సర్వవిధాల ప్రయత్నించి విఫలమయ్యాడు. రావణుడి నిరాశవలన కలిగిన ఆగ్రహంతో శివలింగం మీద బొటనవ్రేలితో నొక్కాడు. ఇప్పటికీ శివలింగం మీద రావణుని వేలి ముద్ర ఉందని భావిస్తున్నారు. చైత్ర మాసంలో ఆలయంలో చేతి- మేళా పేరుతో ఒక మాసకాలం మేళా నిర్వహిస్తారు. ఈ కథనం గోకర్ణతో సంబంధం ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే స్థానికులు మాత్రం ఇక్కడే ఈ ఘటన జరిగినట్లు చెబుతుంటారు.

5. కప్పకు ఒక గుడి

5. కప్పకు ఒక గుడి

Image Source:

అసమానమైన కప్పగుడి ఒయెల్ గుడి పట్టణంలో ఉంది. ఇది లఖింపూర్‌కు 12 కి.మీ దూరంలో లల్హింపూర్ - సీతాపూర్ మార్గంలో ఉంది. ముండక్ తంత్రా ఆధారిత ఆలయం దేశంలో ఇది ఒక్కటే అని భావిస్తున్నారు. లఖింపూర్ కేరి జిల్లాలోని ఈ ఆలయాన్ని క్రీ.స్తు పూర్వం 1860 - 1870 మధ్య పూర్వకాలపు ఒయెల్ రాజు నిర్మించాడని భావిస్తున్నారు. ఆలయ ప్రధాన దైవం పరమశివుడు. ఆలయం ముందు పెద్ద కప్ప ఉంటుంది. ఈ కప్పకు కూడా పూజలు చేస్తారు.

6. అఘోరాలు వస్తుంటారు.

6. అఘోరాలు వస్తుంటారు.

Image Source:

ఆలయం అష్టదళ తామర ఆకారంలో నిర్మించబడింది. బనారస్ ప్రతి నర్మదేశ్వర్ నర్మదా కుండ్ నుండి తీసుకువచ్చిన శివలింగం ఈ ఆలయంలో ప్రతిష్ఠించబడింది. ఆలయ ప్రధాన ద్వారం తూర్పు ముఖంగా ఉంటుంది. మరొక ద్వారం దక్షిణదిశలో ఉంటుంది. ఈ ఆలయం తంత్ర విద్య ఆధారితంగా నిర్మించబడిందని భావిస్తున్నారు. అందువల్ల ఈ దేవాలయం దగ్గరకు ఎక్కువగా అఘోరాలు వస్తుంటారు.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి