• Follow NativePlanet
Share
» »స్వర్ణ త్రికూటంలో...గిర గిర తిరిగే స్థంభం, గాల్లో నిలిచిన స్థంభం, సంతానం ప్రసాదించే..

స్వర్ణ త్రికూటంలో...గిర గిర తిరిగే స్థంభం, గాల్లో నిలిచిన స్థంభం, సంతానం ప్రసాదించే..

Written By: Beldaru Sajjendrakishore

హళేబీడు, బేలూరు, శ్రావణబెళగొళను కలిపి స్వర్ణ త్రికూటంగా పిలుస్తారు. అదే విధంగా హళేబీడును, బేలూరును, హోయసలుల జంట పట్టణాలుగా పేర్కొంటారు. ఇక హళేబీడులోని హోయసలేశ్వరంలోని ఒక లింగాన్ని పూజిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని స్థానికులు నమ్మకం. బేలూరులోని చెన్నకేశవ దేవాలయంలో తనంతకు తానుగా తిరిగే పెద్ద రాతి స్థంభం ఉంది. దీనిని ఇప్పటికీ చూడవచ్చు. మరోవైపు 42 అడుగుల ఎతైన ధ్వజ స్థంభం ఎటు వంటి ఆధారం లేకుండా కేవలం మూడు వైపుల మాత్రమే నిలబడి ఉంది. నాలుగో వైపున గాల్లో నిలిచి ఉంటుంది.

మహిళ వక్షస్థలంలో ఈశ్వరుడు వెలిసిన చోటు..

బ్రహ్మయజ్జం చేసిన చోట...రక్తం ప్రవహించిన నది

షిర్డీ... మందిరమొక్కటే కాదు

హళేబీడు, బేలూరులోని శిల్ప సౌదర్యం గురించి ఎంత విరించినా తక్కువే. దేశ విదేశాల నుంచి ఇక్కడకు పర్యాటకులు నిత్యం వేల సంఖ్యలో వస్తూ ఉంటారు. శ్రావణబెళగోళ ను జైనులు పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రంగా భావిస్తుంటారు. ఇక్కడ 12 ఏళ్లకు ఒకసారి మహామస్తకాభిషేకం జరిగే విషయం తెలిసిందే.

గిర గిర తిరిగే స్థంభం...గాల్లో నిలిచిన స్థంభం...సంతానం ఇచ్చే

గిర గిర తిరిగే స్థంభం...గాల్లో నిలిచిన స్థంభం...సంతానం ఇచ్చే

1. హళేబీడు

Image Source:

హళేబీడు కర్ణాటకలోని హాసన్ జిల్లాలో ఉంది. ఇది ఒక చిన్న పట్టణం. హళేబీడు, బేలూరు, శ్రావణబెళగొళను కర్ణాటక పర్యాటక శాఖవారు స్వర్ణ త్రికూటంగా పిలుస్తారు. హళేబీడును, బేలూరును, హోయసలుల జంట పట్టణాలుగా పిలుస్తారు. హళేబీడు మరియు బేలూరు జిల్లా కేంద్రమైన హాసన్‌కు అతి సమీప చిన్న పట్టణాలు. హాలేబీడు అనగా శిథిలనగరం లేదా పాత నివాసం.

గిర గిర తిరిగే స్థంభం...గాల్లో నిలిచిన స్థంభం...సంతానం ఇచ్చే

గిర గిర తిరిగే స్థంభం...గాల్లో నిలిచిన స్థంభం...సంతానం ఇచ్చే

2. పూర్వం ఇలా పిలిచేవారు

Image Source:

దీనికి పూర్వం దొరసముద్ర, ద్వారసముద్ర అని పేర్లు ఉండేవి. అనగా సముద్రానికి ద్వారం వంటిదని. ఢిల్లీ సుల్తాన్‌ల కాలంలో మాలిక్ కాఫర్ దాడులను ఈ ప్రాంతం చవి చూసింది. అనేక శిథిలాలు ఇక్కడ మిగిలిపోయాయి. వీటిని మనం ఇప్పటికీ చూడవచ్చు. అందుకే దీనికి హలెబీడు (శిథిల నగరమని, పాత నివాసమని) అనే పేరు స్థిరపడిపోయింది.

గిర గిర తిరిగే స్థంభం...గాల్లో నిలిచిన స్థంభం...సంతానం ఇచ్చే

గిర గిర తిరిగే స్థంభం...గాల్లో నిలిచిన స్థంభం...సంతానం ఇచ్చే

3. హోయసల రాజధాని

Image Source:

ఈ హాలేబీడు 12 - 13 శతాబ్ది మధ్యకాలంలో హోయసల రాజ్యానికి రాజధానిగా ఉండేది. ఇదే సమయంలో ఇక్కడ ఆలయం నిర్మించబడింది. ఈ ఆలయాన్ని విష్ణువర్ధనుడు నిర్మించాడని అంటారు. ఈ నిర్మాణంలో తన మంత్రి కేతనమల్ల తోడ్పడినాడని, ఇతనితో పాటూ కేసరశెట్టి అను శివభక్తుడు కూడా తోడ్పడినట్టు తెలుస్తుంది. ఈ నిర్మాణం 1160 ప్రాంతంలో పూర్తైంది.

గిర గిర తిరిగే స్థంభం...గాల్లో నిలిచిన స్థంభం...సంతానం ఇచ్చే

గిర గిర తిరిగే స్థంభం...గాల్లో నిలిచిన స్థంభం...సంతానం ఇచ్చే

4. సంతాన ప్రాప్తి

Image Source:

ఇక్కడ ప్రధానాలయం హొయసలేశ్వరాలయం. ఇది ద్వికూటాలయం. ఇందులో రాజా హోయసల పేరు మీదుగా ఒకటి, రాణి శాంతలదేవి పేరు మీదుగా మరొకటి మొత్తం, రెండు శివలింగాలను ప్రతిస్ఠించారు. వీటికి హోయసలేశ్వరుడని, శాంతలేశ్వరుడని పేరు. ఈ రెండు శివలింగాలకు ఎదురుగా రెందు పెద్ద నందులు ఏర్పాటు చేశారు. వీటి చుట్టూ మండపాలు ఉన్నాయి. శాంతల దేవి పేరు మీద నిర్మించిన శివాలయం సందర్శన వల్ల సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం.

గిర గిర తిరిగే స్థంభం...గాల్లో నిలిచిన స్థంభం...సంతానం ఇచ్చే

గిర గిర తిరిగే స్థంభం...గాల్లో నిలిచిన స్థంభం...సంతానం ఇచ్చే

5. అతి పెద్ద నందులు

Image Source:

ఈ నందులు రకరకాల అలంకరణలతో అందంగా చెక్కబడినవి. ఇవి దేశంలో అతి పెద్ద నందులలో ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నాయి. గర్భగుడి ముఖద్వారం, నంది, బృంగీ విగ్రహాలు, ఆలయంలోపల పై కప్పుపై, వెలుపల ఆలయ గోడలపై హిందూ పూరాణ గాథలను స్ఫురింపజేసే శిల్పాలు, జంతువులు, పక్షులు, నర్తకిల శిల్పాలు బహు సుందరంగా తీర్చిదిద్దబడ్డాయి. ఇక్కడి శిల్పాలు, కళాకృతులు, హోయసల శిల్ప శైలికి నిలువుటద్దాలు.

గిర గిర తిరిగే స్థంభం...గాల్లో నిలిచిన స్థంభం...సంతానం ఇచ్చే

గిర గిర తిరిగే స్థంభం...గాల్లో నిలిచిన స్థంభం...సంతానం ఇచ్చే

6. సబ్బురాతిని

Image Source:

ఈ దేవాలయాల నిర్మాణానికి సబ్బురాతిని/బలపపు రాయిని ఉపయోగించారు. ఈ ఆలయం తూర్పు ముఖమై ఉంటుంది. ఈ ఆలయానికి నాలుగు ద్వారాలు ఉన్నాయి. రెందు ద్వారాలు తూర్పు వైపు, ఒకటి ఉత్తరం వైపు, మరోటి దక్షిణం వైపునూ. ఉత్తరం ద్వారం దగ్గర ఉన్న ద్వారపాలక విగ్రహం ఆకర్షణియంగా ఉంటుంది. ఆలయం వెలుపల ఉద్యానవనంలో గోమఠేశ్వరుడి విగ్రహం ఉంది.

గిర గిర తిరిగే స్థంభం...గాల్లో నిలిచిన స్థంభం...సంతానం ఇచ్చే

గిర గిర తిరిగే స్థంభం...గాల్లో నిలిచిన స్థంభం...సంతానం ఇచ్చే

7. యాగాచి నది ఒడ్డున

Image Source:

బేలూరు కర్ణాటక రాష్ట్రంలోని హాసన్ జిల్లాలో ఒక పట్టణం. జిల్లా కేంద్రానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ప్రసిద్ధి చెందిన చెన్నకేశావాలయం ఉంది. హొయసల శైలి శిల్పకళకు ఈ దేవాలయం ఒక నిలువుటద్దం. బేలూరును పూర్వం వేలా పురీ అనే వారు. క్రమంగా వేలూరుగా చివరికి బేలూరుగా మారింది. ఈ పట్టణం యాగాచి నది ఒడ్డున ఉంది.

గిర గిర తిరిగే స్థంభం...గాల్లో నిలిచిన స్థంభం...సంతానం ఇచ్చే

గిర గిర తిరిగే స్థంభం...గాల్లో నిలిచిన స్థంభం...సంతానం ఇచ్చే

8. మొదట ఇదే రాజధాని

Image Source:

బేలూరు ఒకనాడు హొయసలుల రాజధాని. ఆ తర్వాత ఇక్కడ నుండి హళేబీడుకు రాజధానిని మార్చారు. ఈ హళేబీడు బేలూరుకు 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ రెండు పట్టణాలు హాసన్ జిల్లాలోనే ఉన్నాయి. వీటిని జంట పట్టణాలుగా పిలుస్తారు. ఇవి కర్ణాటక రాష్ట్రంలో ప్రధాన పర్యాటక ప్రాంతాలు. హొయసల రాజులు ఈ రెండు ప్రాంతాలలోనూ అద్భుత శిల్పకళతో కూడిన ఆలయాలను నిర్మించారు.

గిర గిర తిరిగే స్థంభం...గాల్లో నిలిచిన స్థంభం...సంతానం ఇచ్చే

గిర గిర తిరిగే స్థంభం...గాల్లో నిలిచిన స్థంభం...సంతానం ఇచ్చే

9. చెన్నకేశవాలయం

Image Source:

బేలూరులో వైష్ణవాలయాన్ని చెన్నకేశవాలయం పేరుతో పిలుస్తారు. దీనిని హొయసల రాజు విష్ణువర్ధనుడు నిర్మించాడు. క్రీ.శ. 1117లో పశ్చిమ చాళక్యులపై విజయ సూచికగా ఈ ఆలయాన్ని నిర్మిచినట్లు తెలుస్తుంది. చోళులపై తాలకాడ్ యుద్దవిజయంగా నిర్మిచినట్లు మరికొన్ని ఆధారాలు ఉన్నాయి. వైష్ణవ మత ప్రాశస్త్య ప్రచారానికై జగద్గురు రామానుజాచార్యుల ప్రబోధానుసారం నిర్మించాడని మరో వాదన కూడా ఉంది.

గిర గిర తిరిగే స్థంభం...గాల్లో నిలిచిన స్థంభం...సంతానం ఇచ్చే

గిర గిర తిరిగే స్థంభం...గాల్లో నిలిచిన స్థంభం...సంతానం ఇచ్చే

10. తనంతట తానే తిరిగేది

Image Source:

ఈ ఆలయం లోని స్థంభాన్ని నరసింహస్వామి స్థంభం అంటారు. గతంలో ఈ ఆలయంలోని ఈ స్థంభం తనంతట తానే తిరుగేదని అయితే అది అలాగే తిరుగుతూ ఉంటే కొన్ని ఏళ్లకు దేవాలయం కూలిపోతుందని పురావస్తు శాఖ లెక్కలు గట్టింది. దీంతో ఆ స్థంభం తిరగ కుండా వారు ఆపేశారని సమాచారం. పురాణాల్లోని అనేక గాధలను, ఉపనిషత్తులను, ఏనుగులు, రామాయణ మహాభారతాలలోని అనేక శిల్పాలను ఈ స్థంభం పై మనం చూడవచ్చును. వీటితో పాటు నవ యవ్వన పడతుల చిత్రాలు మరియు సువర్ణ చిత్రాలు కూడా ఉన్నాయి.

గిర గిర తిరిగే స్థంభం...గాల్లో నిలిచిన స్థంభం...సంతానం ఇచ్చే

గిర గిర తిరిగే స్థంభం...గాల్లో నిలిచిన స్థంభం...సంతానం ఇచ్చే

11. సబ్బు వలే అతి మెత్తగా

Image Source:

చెన్నకేశవాలయంలో రోజూ పూజాదికాలు నిర్వహిస్తారు. ఇక్కడ ఆంజనేయస్వామి, నరసింహస్వామి విగ్రహాలను చూడవచ్చు. ఆలయ ప్రవేశ మార్గం దగ్గర హొయసలుల రాజముద్ర కనిపిస్తుంది. ఆలయాన్ని ద్రావిడ శైలిలో నిర్మించారు. ఈ ఆలయాన్ని సబ్బురాతి తో నిర్మించారు. ఇది తేలిక అకుపచ్చ రంగులో ఉంటుంది. ఈ శిల సబ్బు వలె అతి మెత్తగా ఉండి, కావలసిన తీరుగా మలచడానికి అనువుగా ఉంటుందట.

గిర గిర తిరిగే స్థంభం...గాల్లో నిలిచిన స్థంభం...సంతానం ఇచ్చే

గిర గిర తిరిగే స్థంభం...గాల్లో నిలిచిన స్థంభం...సంతానం ఇచ్చే

12. ఆకర్షణీయ శిల్పాలు

Image Source:

అందుకే ఈ దేవాలయంపై గల శిల్పాలు అతి సూక్ష్మంగా ఉండి, అద్భుత సౌందర్యంతో అలరారుతాయి. దేవాలయ గోడలపై, పై కప్పు భాగంలో, వివిధ రకాలైన పక్షులు, జంతువులు, లతలు, వివిధ భంగిమలలోని నర్తకిల శిల్పాలు, ద్వారాల దగ్గర ద్వారపాలకుల శిల్పాలు ఆకట్టుకుంటాయి. దర్పణ సుందరి, భస్మ మోహిని అనునవి చెప్పుకోదగిన ఆకర్షణీయ శిల్పాలలో మరి కొన్ని.

గిర గిర తిరిగే స్థంభం...గాల్లో నిలిచిన స్థంభం...సంతానం ఇచ్చే

గిర గిర తిరిగే స్థంభం...గాల్లో నిలిచిన స్థంభం...సంతానం ఇచ్చే

13. ఆమె ప్రేరణ

Image Source:

బేలూర్ దేవాలయములో ‘దర్పణ సుందరి'గా ప్రసిద్ది పొందిన శిల్ప౦ అందాన్ని సమయం దొరికితే తప్పక తిలకించాల్సిన ఆకర్షణలలో ఒకటి. పర్యాటకులు ఇక్కడ ఆధ్యాత్మిక, ఖగోళ చిత్రాలను, నృత్య , గానాలు చేస్తున్న మదనికల చిత్రాలను చూడవచ్చు. విష్ణువర్ధన రాజు భార్య రాణి శంతల దేవి అద్భుతమైన అందం ఈ శిల్పాలకు ప్రధాన ప్రేరణ అని నమ్ముతారు.

గిర గిర తిరిగే స్థంభం...గాల్లో నిలిచిన స్థంభం...సంతానం ఇచ్చే

గిర గిర తిరిగే స్థంభం...గాల్లో నిలిచిన స్థంభం...సంతానం ఇచ్చే

14. 42 అడుగుల ధ్వజస్థంభం

Image Source:

ఆలయం బయట నలభై రెండడుగుల ధ్వజస్తంభం ఉంది. దీనిని గ్రావిటీ పిల్లర్ అని పిలుస్తారు. అంతే కాకుండా మహాస్తంభం లేదా కార్తిక దీపోత్సవ స్తంభం అని పిలవబడే 42 అడుగుల ఈ స్తంభం చెన్నకేశవ ఆలయ ప్రధాన ఆకర్షణలలో ఒకటి. ఆశ్చర్యం ఈ స్థూపం ఎటువంటి ఆధారం లేకుండా ఒకే రాతితో తయారు చేసిన వేదిక మీద నిలబడి ఉంది. ఈ స్థూపం దాని స్వంత బరువుపై మూడు వైపుల నిలబడి, నాలుగో వైపు నేలకు ఆనకుండ కాగితం ముక్కను దూర్చినా దూరే విధంగా ఖాళీ తో నిరాధారంగా నిలబడి ఉంచుతుంది.

గిర గిర తిరిగే స్థంభం...గాల్లో నిలిచిన స్థంభం...సంతానం ఇచ్చే

గిర గిర తిరిగే స్థంభం...గాల్లో నిలిచిన స్థంభం...సంతానం ఇచ్చే

15. విష్ణు సముద్రం పేరున సరస్సు

Image Source:

రాజగోపురానికి కుడివైపు పుష్కరిణి ఉంది. విష్ణు సముద్రముగా ఈ సరస్సును పిలుస్తారు. ఈ సరస్సు పద్మరాస పర్యవేక్షణలో నరసింహ రాయల కాలములో నిర్మించారు. కృష్ణ దేవరాయల కాలంలో, ఉత్పతనహళ్లి కి చెందిన బసప్ప నాయక ఈ చతుర్శ్రాకారపు సరస్సు ఉత్తరపు మెట్లను నిర్మించి, మూడు వైపులా మరి కొన్ని మెట్లను జోడించారు. ఈ సరస్సు మధ్యలో ఒక ద్వీప మంటపం కూడా నిర్మించాడు. నేటికీ భక్తులు ఉపయోగిస్తుంటారు.

గిర గిర తిరిగే స్థంభం...గాల్లో నిలిచిన స్థంభం...సంతానం ఇచ్చే

గిర గిర తిరిగే స్థంభం...గాల్లో నిలిచిన స్థంభం...సంతానం ఇచ్చే

16. అనేక ప్రాంతాల నుంచి బస్సు సౌకర్యం

Image Source:

బేలూరుకు కర్ణాటకలోని అనేక ప్రాంతాల నుండి బస్సు సౌకర్యం ఉంది.బెంగళూరు (222 కి.మీ.), హళేబీడు (16 కి.మీ.), కదూర్ (62 కి.మీ.), చిక్‌మగ్‌ళూరు (22 కి.మీ.), హాసన్ (40 కి.మీ.), హోస్పేట్ (330 కి.మీ.), మంగళూరు (124 కి.మీ.), మైసూరు (149 కి.మీ.) ల నుండి నిత్యం బస్సులు తిరుగుతుంటాయి. హాసన్, బనవార, అరసికేర మొదలగునవి బేలూరుకు సమీప రైలు స్టేషన్‌లు కలిగిన ప్రాంతాలు.

గిర గిర తిరిగే స్థంభం...గాల్లో నిలిచిన స్థంభం...సంతానం ఇచ్చే

గిర గిర తిరిగే స్థంభం...గాల్లో నిలిచిన స్థంభం...సంతానం ఇచ్చే

17. శ్రావణ బెళగోళ

Image Source:

శ్రావణబెళగొళ కర్ణాటక రాష్ట్రంలోని హాసన్ జిల్లాలోని చెన్నగరాయపట్టణానికి సమీపంలోని పట్టణం. ఇది బెంగుళూరుకు 158 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జైనులకు ప్రీతిపాత్రమైన బాహుబలి (గోమఠేశ్వరుడి) అతి ఎత్తైన విగ్రహం ఇక్కడ ఉంది. ఇక్కడ 2000 ఏళ్ళ సంవత్సరాలకు పూర్వమే జైన మతం ఉండినట్లు తెలుస్తుంది. పశ్చిమ గంగ సామ్రాజ్యపు శిల్ప, వాస్తు కళా నైపుణ్యానికి ఇది ఆలవాలం.

గిర గిర తిరిగే స్థంభం...గాల్లో నిలిచిన స్థంభం...సంతానం ఇచ్చే

గిర గిర తిరిగే స్థంభం...గాల్లో నిలిచిన స్థంభం...సంతానం ఇచ్చే

18. జైనకాశీ

Image Source:

మౌర్య రాజు చంద్ర గుప్త మౌర్యుడు యుద్ధ జీవితంతో విసిగి ఇక్కడికి వచ్చి ధ్యానంతో మనశ్శాంతిని పొందినట్లు తెలుస్తుంది. దక్షిణ కాశీ, జైన కాశీ గాను ఈ పట్టణాన్ని వ్యవహారిస్తారు. రాజస్థాన్‌లోని అబూ పర్వతం, ఒడిశాలోని ఉదయగిరి గుహలతో పాటు జైనులు శ్రావణబెళగొళను పరమ పవిత్ర స్థలంగా భావిస్తారు. శ్రావణబెళగొళలో క్రీ.శ.600 నుండి 1830 మధ్య వివిధ కాలాలకు చెందిన దాదాపు 800 శాసనాలు ఇక్కడ లభించాయి.

గిర గిర తిరిగే స్థంభం...గాల్లో నిలిచిన స్థంభం...సంతానం ఇచ్చే

గిర గిర తిరిగే స్థంభం...గాల్లో నిలిచిన స్థంభం...సంతానం ఇచ్చే

19. అందుకే ఆ పేరు

Image Source:

పట్టణానికి మధ్యలో ఒక కొలను ఉంది. దీనికి శ్వేతకొలను లేదా దవళ సరోవరం అని పేరు. ఈ శ్వేతకొలనుకు కన్నడంలో బెళగొళ అని పేరు. శ్రవణుడి (గోమఠేశ్వరుడి) బెళగొళ కాబట్టి శ్రావణబెళగొళగా ఈ ప్రాంతానికి పేరు స్థిరపడిపోయింది. ఈ పట్టణంలో చంద్రగిరి, వింధ్యగిరి అను రెండు కొండలు ఉన్నాయి. ఇక్కడ ఆచార్య బద్రబాహు మరియు అతని శిష్యుడు చంద్రగుప్త మౌర్యుడు తపస్సు ఆచరించినట్లు తెలుస్తుంది

గిర గిర తిరిగే స్థంభం...గాల్లో నిలిచిన స్థంభం...సంతానం ఇచ్చే

గిర గిర తిరిగే స్థంభం...గాల్లో నిలిచిన స్థంభం...సంతానం ఇచ్చే

20. దూరం ఇలా

Image Source:

ఇది కర్ణాటకలోని హాసన్ జిల్లా, చెన్నగరాయపట్టణానికి ఆగ్నేయాన 13 కిలో మీటర్ల దూరంలోను, జిల్లా కేంద్రమైన హాసన్‌కు ఆగ్నేయంలో 51 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. బెంగుళూరు- మంగుళూరును కలిపే 48 వ జాతీయ రహదారికి 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. యాత్రాస్థలాలైన హాళేబీడు నుండి 78 కిలోమీటర్లు, బేలూరు నుండి 89 కిలోమీటర్లు, మైసూరు నుండి 83 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి