Search
  • Follow NativePlanet
Share
» »మ‌రో ప్ర‌పంచ‌పు అంచుల‌కు చేర్చే.. కుద్రేముఖ్ ప‌ర్వ‌త శిఖ‌రాలు!

మ‌రో ప్ర‌పంచ‌పు అంచుల‌కు చేర్చే.. కుద్రేముఖ్ ప‌ర్వ‌త శిఖ‌రాలు!

ప‌చ్చ‌ద‌నంతో నిండిన ప‌చ్చిక‌బైయిళ్లు సంద‌ర్శ‌కుల‌ను ఆహ్వానించే ప్రాంతం కుద్రేముఖ్ కొండ‌ప్రాంతం. ఎటుచూసినా ఆహ్లాద‌ర‌క‌మైన వాతావ‌ర‌ణం ఇక్క‌డి సొంతం. అపార‌మైన ఖ‌నిజ సంప‌ద కొలువైన కుద్రేముఖ్‌లో వ‌ర్షాకాలం వ‌చ్చిందంటే ప‌ర్యాట‌కుల తాకిడి పెరిగిపోతుంది.

కుటుంబ స‌మేతంగా కేరింత‌లు కొట్టేందుకు ప‌ర్యాట‌కులు ఇక్క‌డికి వాలిపోతారు. మ‌రెందుకు ఆల‌స్యం మ‌రో ప్ర‌పంచ‌పు అంచుల‌కు చేర్చే కుద్రేముఖ్ కొండ‌ప్రాంత‌పు అందాల‌ను మ‌న‌మూ చూసేద్దాం రండి!

మ‌రో ప్ర‌పంచ‌పు అంచుల‌కు చేర్చే.. కుద్రేముఖ్ ప‌ర్వ‌త శిఖ‌రాలు!

మ‌రో ప్ర‌పంచ‌పు అంచుల‌కు చేర్చే.. కుద్రేముఖ్ ప‌ర్వ‌త శిఖ‌రాలు!

కుద్రేముఖ్ క‌ర్ణాట‌క‌లోని చిక్కమంగళూరుకి 95 కిలోమీట‌ర్ల దూరంలో నైరుతి దిశలో ఉంటుంది. ఇది ట్రెక్కింగ్ ప్రియుల‌కు స్వ‌ర్గధామంగా పేరుగాంచింది. చిక్కమంగళూరుకు ఆనుకొని ఉన్న కుద్రేముఖ్‌ కొండలు ఈ సీజ‌న్ వ‌చ్చిందంటే చాలు జలపాతాలు, ప్రకృతి రమణీయ దృశ్యాలతో పర్యాటకులను కనువిందు చేస్తుంది. నిజానికి, కన్నడ భాషలో కుద్రేముఖ్‌ అంటే గుర్రపు ముఖం అని అర్దం. ఈ పర్వత‌శ్రేణులు గుర్రపు ముఖం ఆకారంలో ఉండ‌టం వల్ల కుద్రేముఖ్‌ అని పిలుస్తారు. ఈ కుద్రేముఖ్‌ పర్వతకేంద్రంలో కుద్రేముఖ్ నేష‌న‌ల్ పార్క్‌ ఉంటుంది. ఇక్క‌డ చిరుత‌పులి, ఎలుగు, మ‌చ్చ‌ల జింక‌, అడ‌వి కుక్క‌లు, నక్క‌లు వంటి అనేక ర‌కాల వ‌న్య‌ప్రాణుల‌ను చూడొచ్చు.

అంద‌మైన పూల మొక్క‌లు ఇక్క‌డ అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయి. వివిధ ఆకృతుల్లో క‌నువిందు చేసే ప‌చ్చ‌ద‌నం సంద‌ర్శ‌కుల‌ను మంత్ర‌ముగ్ధుల‌ను చేస్తాయి. అరేబియా సముద్రం వైపు ఉన్న ఈ పర్వత శ్రేణుల పరంపర లోతైన లోయలు, ఏతైన శిఖరాలతో చాలా సుందరంగా ఉంటుంది. సముద్ర మట్టానికి 1894 అడుగుల ఎత్తులో ఉన్న ఇక్క‌డి పర్వత కేంద్రం కుద్రేముల్‌లో అపారమైన ఇనుప గనులకు ఆశ్ర‌యాన్ని క‌ల్పిస్తుంది. ఇక్క‌డ ప్ర‌భుత్వం కుద్రేముఖ్ ఐర‌న్ ఓర్ కంపెనీ లిమిటెడ్‌ను నిర్వ‌హిస్తోంది.

స్వ‌చ్ఛ‌మైన నీటి స‌వ్వ‌డులు..

స్వ‌చ్ఛ‌మైన నీటి స‌వ్వ‌డులు..

ఇక్కడి పరిసరాలు వర్షాకాలంలో అత్యంత సుందరంగా కనపడుతాయి. పర్వత శిఖరాలు కూడా పచ్చదనాన్ని సంతరించుకుంటాయి. శూల గడ్డి భూములలో ట్రెక్కింగ్ చేయటం ఎంతో ఆనందంగా ఉంటుంది. గడ్డి ప్రదేశాలపై సూర్యకిరణాలు పడి తళతళలాడతాయి. ఈ ప్రాంత‌పు ఉద‌య‌పు అందాల‌ను తిల‌కించేందుకు సంద‌ర్శ‌కులు ఎక్కువ ఆస‌క్తి క‌న‌బ‌రుస్తారు. చెల్లాచెదురుగా తార‌స‌ప‌డే మంచు తుంప‌రుల అందాలు చూడ‌ముచ్చ‌ట‌గా క‌నిపిస్తాయి. అడవికి ఇరువైపుల ఉన్న రోడ్డు మార్గంలో నడుస్తుంటే పచ్చటి అరణ్యం హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్లుగా ఉంటుంది.

కుద్రేముఖ్‌ ప్రదేశంలో అంబా తీర్థ నది స్వచ్ఛంగా పారుతుంది. ఈ న‌దిలోని స్వ‌చ్ఛ‌మైన నీటి స‌వ్వ‌డులు మ‌న‌సును ఉత్తేజ‌ప‌రుస్తాయి అన‌డంలో సందేహ‌మే లేదు. అందుకే స‌ర‌దాగా ఇక్క‌డ ఫిష్షింగ్‌ చేసేందుకు ఎక్కువ మంది ఆస‌క్తి క‌న‌బ‌రుస్తారు.

సైకిల్ స‌ఫారీ ఒక మధురానుభూతి..

సైకిల్ స‌ఫారీ ఒక మధురానుభూతి..

ఇక్కడ కొండలపై సైకిల్‌ మీద వెళ్లటం ఒక మధురానుభూతి. స్థానికంగా ప‌ర్యాట‌కుల‌కు అవ‌స‌ర‌మైన వ‌న‌రుల‌ను అందించ‌డంలో అక్క‌డివారు ప్ర‌త్యేక శ్ర‌ద్ధ చూపుతారు. చ‌ల్ల‌ని పిల్ల‌గాలుల మ‌ధ్య సాగే సైకిల్ స‌ఫారీ అనుభ‌వాల‌ను ఒక్క‌సారి రుచిచూడాల్సిందే. పర్వతాలు, వృక్షాల మధ్యలో నిర్మించిన రోడ్డు మార్గంలో నడుస్తుంటే కలిగే ఆనందాన్ని మాట‌ల్లో వ‌ర్ణించ‌డం క‌ష్ట‌మే. వర్షాకాలంలో ఇక్కడ కుద్రేముఖ్‌లోని లక్షా జలాశయం నీటితో కళకళలాడుతుంది. పొంగిపొర్లే నీటి అల‌ల‌ను బంధించేందుకు సంద‌ర్శ‌కులు చేసే ప్ర‌య‌త్నాలు భ‌లే ఆహ్లాదాన్ని అందిస్తాయి.

ఇక్క‌డి బండ‌రాళ్లు బాగా పాకుప‌ట్టి ఉంటాయి. ఆ సమయంలో పర్యాటకులు చూసేందుకు వస్తుంటారు. కుద్రేముఖ్‌లో ఇలా ఎన్నో అందమైన ప్రదేశాలు పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. మరెందుకు ఆల‌స్యం కుద్రేముఖ్ చేరుకునేందుకు మీ ప్ర‌యాణాన్ని మొద‌లుపెట్టండి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X