Search
  • Follow NativePlanet
Share
» »బ్రిటీష్ వారిచే నిర్మింపబడిన ఏకైక హిందూ దేవాలయం !

బ్రిటీష్ వారిచే నిర్మింపబడిన ఏకైక హిందూ దేవాలయం !

మనుష్యులు నిర్మించిన గోడలు కులం,మతం, ప్రాంతం. కానీ భగవంతుడు నిర్మించింది ఈ సృష్టిని అందులోని జీవుల్ని.ఆయన ఈ జీవిలో చూసేది ప్రార్ధించే గుణాన్ని, లెక్కించేది పాపపుణ్యాలను.

By Venkatakarunasri

మనుష్యులు నిర్మించిన గోడలు కులం,మతం, ప్రాంతం. కానీ భగవంతుడు నిర్మించింది ఈ సృష్టిని అందులోని జీవుల్ని.ఆయన ఈ జీవిలో చూసేది ప్రార్ధించే గుణాన్ని, లెక్కించేది పాపపుణ్యాలను. ఆ సృష్టికర్త కులాన్ని చూడడు,మతాన్ని చూడడు.ఇక ప్రాంతంతో సంబంధమే లేదు. ఆయన మనల్ని చూసేది అంతఃకరణశుద్దితో మనం చేసే ప్రార్థన. అది మనలో వుంటే చాలు,ఎలాంటి పరిస్థితులలోనైనా మనకై పరుగెత్తుకుని వస్తాడు.అందుకనే ఆయనను దైవం అన్నాం.దైవం గురించి నేను చెప్పిన ఈ వాక్యాలు ఉట్టి మాటలు కాదని చెప్పటానికి ఒక ఆలయాన్ని సాక్షంగా చూపించబోతున్నాం. ఆ ఆలయం హిందువులు అమితంగా పూజించే మహేశ్వరుడిది.ఈ ఆలయాన్ని నిర్మించినది ఒక మహాఋషో, ఒక యుగపురుషుడో లేక దేవదానవ గంధర్వులో కాదు.మన దేశాన్ని 200ఏళ్ల పైనే పాలించిన బ్రిటీష్ వారు. ఇదేంటి బ్రిటీష్ వారు ఒక శివాలయాన్ని నిర్మించడమేంటి?క్రైస్తవులు కదా? వారు శివాలయాన్నే ఎందుకు కట్టారు? అనే ప్రశ్నలు మీ మదిలో తలెచ్చవచ్చు. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఈ వ్యాసంలో తెలుసుకుందాం.

బ్రిటిష్ వారు నిర్మించిన హిందూ ఆలయ రహస్యం

బ్రిటిష్ వారు నిర్మించిన హిందూ ఆలయ రహస్యం

‘భారత దేశం హృదయం' గా పిలువబడే మధ్య ప్రదేశ్ దేశంలోని రెండో అతి పెద్ద రాష్ట్రం. ఈ రాష్ట్ర చరిత్ర, దాని భౌగోళిక స్థానం, ప్రాకృతిక అందం, సాంస్కృతిక వారసత్వ౦, ప్రజలు ఈ రాష్ట్రాన్ని దేశంలోని అత్యుత్తమ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాయి. రాజధాని భోపాల్ ‘సరస్సుల నగరం'గా ప్రసిద్ది పొందింది. పర్యాటకులు ఆస్వాదించేలా అన్ని రకాల పర్యాటక అవకాశాలను మధ్య ప్రదేశ్ పర్యాటకం అందిస్తోంది.

PC: youtube

బ్రిటిష్ వారు నిర్మించిన హిందూ ఆలయ రహస్యం

బ్రిటిష్ వారు నిర్మించిన హిందూ ఆలయ రహస్యం

బాంధవ్ ఘర్ జాతీయ పార్కులో పులులను చూడడం దగ్గర నుంచి ఖజురహో లాంటి దేవాలయాల్లో నిర్మాణాల వరకు నిజమైన భారత దేశాన్ని పర్యాటకులు కనుగొంటారు.మధ్య ప్రదేశ్ భౌగోళిక స్వరూపం దేశం మధ్యలో వున్న ఈ రాష్ట్రంలోని ప్రకృతి వైవిధ్యం దీన్ని ఒక అద్భుతమైన పర్యాటక కేంద్రంగా నిలబెడుతుంది. ఎత్తైన పర్వత శ్రేణులు, దట్టమైన పచ్చటి అరణ్యాలు, నదులు సరస్సుల తో ప్రకృతి లోని వివిధ అంశాల మధ్య సమన్వయము కనపడుతుంది.

PC: youtube

బ్రిటిష్ వారు నిర్మించిన హిందూ ఆలయ రహస్యం

బ్రిటిష్ వారు నిర్మించిన హిందూ ఆలయ రహస్యం

వింధ్యా, సాత్పురా పర్వత శ్రేణుల మధ్య నర్మదా, తపతి నదులు సమాంతరంగా ప్రవహిస్తూ వుంటాయి. ఇక్కడి వైవిధ్య భరితమైన వృక్ష, జంతు జాతులు, ప్రాకృతిక అందం మధ్య ప్రదేశ్ పర్యాటకానికి తలమానికంగా నిలుస్తాయి.మధ్య ప్రదేశ్ చరిత్ర, సాంస్కృతిక వారసత్వం వివిధ వంశాలకు చెందినా ఎంతో మంది రాజుల పాలన చూసింది మధ్య ప్రదేశ్.

PC: youtube

బ్రిటిష్ వారు నిర్మించిన హిందూ ఆలయ రహస్యం

బ్రిటిష్ వారు నిర్మించిన హిందూ ఆలయ రహస్యం

ప్రాచీన కాలం లో మౌర్యులు, రాష్ట్రకూటులు, గుప్తుల నుంచి ఇటీవలి బుందేలా, హోల్కర్, ముఘలాయి, సింధియాల పాలన వరకు దాదాపు పద్నాలుగు రాజవంశాల ఉత్థాన పటణాలకు ఇది సాక్షి. వివిధ రాజుల పాలన వల్ల రకరకాల కళా, నిర్మాణ శైలులు కూడా వచ్చాయి.

PC: youtube

బ్రిటిష్ వారు నిర్మించిన హిందూ ఆలయ రహస్యం

బ్రిటిష్ వారు నిర్మించిన హిందూ ఆలయ రహస్యం

ఖజురహో లోని శృంగార శిల్పాలు, రాజసం వుట్టి పడే గ్వాలియర్ కోట, ఉజ్జయిని లోని దేవాలయాలు, ఒర్చ్చా లోని చిత్రకూట్ లేదా చట్ట్రిస్ - అన్నీ అద్భుత నిర్మాణాలకు ప్రతీకలే. ఖజురహో, సంచి, భీమ్ బెట్కా లను యునెస్కో ప్రపంచ వారసత్వ కేంద్రాలుగా ప్రకటించింది. మధ్య ప్రదేశ్ లోని గిరిజన సంస్కృతి ఇక్కడి పర్యాటకంలో ప్రధాన భాగం. గోండ్ లు, భిల్లులు, ఇక్కడ నివసించే ప్రధాన జాతులు. గిరిజన హస్త కళాకృతులు ఇక్కడి పర్యాటకులకు ప్రధాన ఆకర్షణ.

PC: youtube

బ్రిటిష్ వారు నిర్మించిన హిందూ ఆలయ రహస్యం

బ్రిటిష్ వారు నిర్మించిన హిందూ ఆలయ రహస్యం

ఇక్కడి జానపద సంగీతం, నృత్యం దేశ కళా వారసత్వానికి పట్టుగొమ్మలు. వన్య ప్రాణులు - మధ్య ప్రదేశ్ లో ప్రేరణ కలిగించే అంశం.వింధ్య, సాత్పురా పర్వతాలు, పచ్చటి అడవులు చాలా జీవజాతులకు ఆలవాలం. వన్య ప్రాణి అభయారణ్యాలు, వన్యప్రాణి జాతీయ పార్కులు కూడా మధ్య ప్రదేశ్ పర్యాటకం లోని ప్రధాన ఆకర్షణలు. బాంధవ్ ఘర్ జాతీయ పార్కు, పెంచ్ జాతీయ పార్కు, వన్ విహార్ జాతీయ పార్కు, కాన్హా జాతీయ పార్కు, సాత్పురా జాతీయ పార్కు, మాధవ్ జాతీయ పార్కు, పన్నా జాతీయ పార్కు మధ్య ప్రదేశ్ లోని కొన్ని సుప్రసిద్ధ పర్యాటక కేంద్రాలు.

PC: youtube

బ్రిటిష్ వారు నిర్మించిన హిందూ ఆలయ రహస్యం

బ్రిటిష్ వారు నిర్మించిన హిందూ ఆలయ రహస్యం

ఈ కేంద్రాల్లో చాలా జాతులకు చెందిన పక్షులు, జంతువులూ, మొక్కలూ చూడవచ్చు. నీముచ్ లోని గాంధీ సాగర్ అభయారణ్యం కూడా వన్యప్రాణి నిలయమే. ఈనాడు మధ్య ప్రదేశ్ ఒక సుప్రసిద్ధ పర్యావరణ పర్యాటక కేంద్రం.మధ్య ప్రదేశ్ లోని ఆహారం, పండుగలు పబ్బాలుమధ్య ప్రదేశ్ లోని విభిన్న వంటకాలు మధ్య ప్రదేశ్ పర్యాటకానికి కీలకమైన భాగం.

PC: youtube

బ్రిటిష్ వారు నిర్మించిన హిందూ ఆలయ రహస్యం

బ్రిటిష్ వారు నిర్మించిన హిందూ ఆలయ రహస్యం

ఖజురహో లోని ఖజురహో నృత్యోత్సవం, గ్వాలియర్ లో జరిగే తాన్సేన్ సంగీత ఉత్సవం ప్రపంచ ప్రసిద్ది పొందాయి. మడాయి పండుగ, భాగోరియా పండుగ గిరిజన తెగలు జరుపుకునే సుప్రసిద్ధ గిరిజన పండుగలు.

PC: youtube

బ్రిటిష్ వారు నిర్మించిన హిందూ ఆలయ రహస్యం

బ్రిటిష్ వారు నిర్మించిన హిందూ ఆలయ రహస్యం

ఎక్కడ వుంది?

మధ్యప్రదేశ్ లోని అగర్మాల్వా అనే వూరికి వెళ్ళాల్సిందే. అక్కడ చిన్న కొండపై వుండే ఆలయంలో ఆ లయకారుడు వైద్యనాధుడిగా కొలువై వున్నాడు. ఈ ఆలయం బయటవున్న ఒక శిలా శాసనం భక్తుడి భక్తిని, దేవుని అస్థిత్వాన్ని తెలియచేస్తుంది.

PC: youtube

బ్రిటిష్ వారు నిర్మించిన హిందూ ఆలయ రహస్యం

బ్రిటిష్ వారు నిర్మించిన హిందూ ఆలయ రహస్యం

అది 1839వ సం. ఆ సమయంలో అఖండ భారతావనిపై పట్టుసాధించాలన్న కాంక్షతో వున్న బ్రిటీష్ వారికి ఆఫ్ఘన్లనుంచి తీవ్రవ్యతిరేకత రావటంతో యుద్ధం అనివార్యమైంది. ఈ యుద్ధం 1841వరకు తీవ్రస్థాయిలో జరుగగా, 1842జనవరిలో ఆఫ్ఘన్లు ఓటమిపాలైనారు.

PC: youtube

బ్రిటిష్ వారు నిర్మించిన హిందూ ఆలయ రహస్యం

బ్రిటిష్ వారు నిర్మించిన హిందూ ఆలయ రహస్యం

ఆ తరువాత కూడా అక్కడ కొండల్లో,గుహల్లో దాగివున్న ఎంతో మంది ఆఫ్ఘన్లతెగల వారు అడపాదడపా బ్రిటీష్వారి స్థావరాలపై బడివారిని హతమార్చడమో లేక ఆంగ్లేయులచేతిలో వీరే హతమవ్వటమో జరిగేది ఈ క్రమంలో లెఫ్టినెంట్ కల్నల్ మార్టిన్,అతని భార్య మిసెస్ మార్టిన్ లండన్ నుంచి ఇండియాకి వచ్చి ఇక్కడ తన ఉద్యోగబాధ్యతను నిర్వహిస్తుండగా ప్రభుత్వఆదేశ రీత్యా ఆఫ్ఘన్ కి సైన్యాదికారిగా వెళ్ళాడు.

PC: youtube

బ్రిటిష్ వారు నిర్మించిన హిందూ ఆలయ రహస్యం

బ్రిటిష్ వారు నిర్మించిన హిందూ ఆలయ రహస్యం

అయితే తన భార్యపై వున్న అమితమైన ప్రేమతో రోజూ అక్కడ జరిగిన విషయాలు తమ క్షేమసమాచారాన్ని ఉత్తరం ద్వారా తెలియపరచేవాడు.ఇది ఇలా సాగగా కొన్ని రోజులతర్వాత అతని నుంచి మిసెస్ మార్టిన్ కి ఉత్తరాలు రావటం ఆగిపోయాయి.

PC: youtube

బ్రిటిష్ వారు నిర్మించిన హిందూ ఆలయ రహస్యం

బ్రిటిష్ వారు నిర్మించిన హిందూ ఆలయ రహస్యం

అలా కొన్ని రోజులు గడవటంతో తన భర్తకు ఏమైందో అన్న భయానికి లోనై,ఆ భయం ఉద్వేగంగా మారి కన్నీటిపర్యంతంఅయ్యింది.అలా ఆమె ఓ సాయంత్రం గుర్రంపై వెళుతూవుండగా ఒక చిన్న కొండపై వున్న గుడిలోంచి గంటలశాభ్దాలు, దీపపుకాంతులు రావటం చూసి ఆమె ఆ గుడిలోకి వెళ్ళింది.శిథిలావస్థలో వున్న ఆ గుడిలో ఒక పూజారి ఆ పరమేశ్వరుడికి హారతిస్తూ గంటలు మ్రోగిస్తూ,ఏవో మంత్రాలను వుచ్చరించటం చూసింది.

PC: youtube

బ్రిటిష్ వారు నిర్మించిన హిందూ ఆలయ రహస్యం

బ్రిటిష్ వారు నిర్మించిన హిందూ ఆలయ రహస్యం

ఆ పూజారి పూజ ముగించుకుని ప్రసాదంతో ఆమె వద్దకురాగాకన్నీటితో నిండిన ఆమె కళ్ళనుచూసి అమ్మ,నీవు ఎవరవు?ఎందుకు? బాధపడుతున్నావు? అని అడుగగా ఆమె భోరున ఏడుస్తూ తన వృత్తాంతాన్ని వివరించింది.ఇది విన్న ఆ పూజారి బాధపడవద్దని చెప్పి ఓం నమః శివాయ అనే పంచాక్షరిమంత్రాన్ని అంతఃకరణ శుద్ధితో జపిస్తే ఆ పరమేశ్వరుడు నీకు ఖచ్చితంగా మంచి చేస్తాడని చెప్పాడట.

PC: youtube

బ్రిటిష్ వారు నిర్మించిన హిందూ ఆలయ రహస్యం

బ్రిటిష్ వారు నిర్మించిన హిందూ ఆలయ రహస్యం

ఆ తరువాత అక్కడినుంచి నేరుగా ఇంటికి వెళ్లిన ఆమె తనగదిలో తెలియని తన్మయత్వంలో కూర్చుండి పోయి ఆ పరమేశ్వరునిపంచాక్షరి నామాన్నిజపిస్తూ కొన్నిరోజుల పాటువుండిపోయింది. అలా ఆమె మహేశ్వరుని నామాన్ని జపిస్తూండగా తన భర్తవద్ద నుంచి వచ్చిందని ఒక ఉత్తరం పట్టుకుని పనిమనిషి వచ్చింది.సంతోషంతో ఆమె ఆ ఉత్తరాన్ని తెరిచి చూడగా డియర్ నేను క్షేమంగా వున్నాను.

PC: youtube

బ్రిటిష్ వారు నిర్మించిన హిందూ ఆలయ రహస్యం

బ్రిటిష్ వారు నిర్మించిన హిందూ ఆలయ రహస్యం

అతిత్వరలో నీవద్దకు వస్తున్నానుఅనే సందేశం అందులో వుంది. కొన్ని రోజులకి మార్టిన్ వచ్చి అక్కడ జరిగిన వృత్తాంతాన్ని చెప్ప సాగాడు.మేము మా సభ్యులు ఆఫ్ఘన్ లోని ఒక కొండప్రాంతంలో శిబిరం నిర్మించుకుని వుండగా మాపై కొన్ని వందల మంది ఆఫ్ఘన్ తెగల వారు విరుచుకుపడ్డారు.మాకు,వారికి మధ్య యుద్ధం చాలా రోజులపాటు సాగింది.

PC: youtube

బ్రిటిష్ వారు నిర్మించిన హిందూ ఆలయ రహస్యం

బ్రిటిష్ వారు నిర్మించిన హిందూ ఆలయ రహస్యం

మా సైన్యబలం ఎక్కువగావుండటంతో మాలో దాదాపు అందరూ చనిపోగా మిగిలిన కొద్దిమందితో వారిని ప్రతిఘటిస్తూండగా ఆఖరినిమిషంలో ఎక్కడి నుంచి వచ్చాడో కానీ ఒక వ్యక్తిఒంటి నిండా బూడిదపూసుకుని మొలకి పులిచర్మం కట్టుకుని చేతిలో త్రిశూలం వంటి ఆయుధం పట్టుకిని వున్నాడు.

PC: youtube

బ్రిటిష్ వారు నిర్మించిన హిందూ ఆలయ రహస్యం

బ్రిటిష్ వారు నిర్మించిన హిందూ ఆలయ రహస్యం

అతడు ప్రళయకాల రుద్రుడిలా ఆఫ్ఘన్ సైన్యంపై విరుచుకుపడి వారందరినీ నిమిషాలవ్యవధిలో కకా వికలంచేసి వారి బారినుంచి మమ్మల్ని కాపాడి అంతర్ధానమైపోయాడు. అతను ఎవరో ఎక్కడనుంచి వచ్చాడో?ఎలా వెళ్ళాడో తెలియదు.కానీ మా ప్రాణాలను రక్షించటానికే వచ్చినట్లుందిఅని చెప్పాడు.

PC: youtube

బ్రిటిష్ వారు నిర్మించిన హిందూ ఆలయ రహస్యం

బ్రిటిష్ వారు నిర్మించిన హిందూ ఆలయ రహస్యం

భర్తచెప్పిన విషయానికి ఆశ్చర్యపోయిన భార్య వెంటనే భర్తను వెంటబెట్టుకుని ఆ శివాలయానికి వెళ్లి శివుడ్ని దర్శించుకుని తన భర్తచెప్పిన విషయాన్ని ఆ గుడిపూజారికి వివరించగా నీ పూజ ఫలించింది.నీ భర్తను కాపాడిందిసాక్ష్యాత్తూ ఆ పరమేశ్వరుడే అని చెప్పాడు.ఆ మాటలకు ఆశ్చర్యపోయిన భార్యాభర్తలిద్దరూ అప్పటినుంచి ఆ విశ్వేశ్వరుడిభక్తులుగా మారిపోయి శిథిలావస్థలో వున్న ఆ గుడిని 15000రుల ఖర్చుతో జీర్ణోద్ధారణచేయించారు.

PC: youtube

బ్రిటిష్ వారు నిర్మించిన హిందూ ఆలయ రహస్యం

బ్రిటిష్ వారు నిర్మించిన హిందూ ఆలయ రహస్యం

వారి కథను ఒక శిలాఫలకంపై చెక్కించి ఆ గుడిఆవరణలో ప్రతిష్టించారు.ఆ తరువాత కొన్ని సంలకి మార్టిన్,అతని భార్య లండన్ వెళిపోయినా వారితో పాటు ఒక శివలింగాన్ని కూడా తీసుకువెళ్ళి పూజించారు.

PC: youtube

బ్రిటిష్ వారు నిర్మించిన హిందూ ఆలయ రహస్యం

బ్రిటిష్ వారు నిర్మించిన హిందూ ఆలయ రహస్యం

ఈ విధంగా బ్రిటీష్ వారు మనదేశంలో కట్టిన ఏకైకహిందూఆలయం ఇదే అయింది.భక్తి వుంటే భగవంతుడికి మతం, ప్రాంతం అనే బేధాలు లేవని నిరూపించిన ఈ కథ మరోసారి ఆ పరమేశ్వరుడిఅస్థిత్వాన్ని మనందరికీ తెలియజెప్పింది.

PC: youtube

ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి?

రోడ్ మార్గం

అగార్ దేశంలోని ఇతర ప్రధాన నగరాలకు సాధారణ బస్సుల ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది.

ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి?

రైలు మార్గం

ఇతర ప్రధాన నగరాల నుండి అగర్ వరకు రెగ్యులర్ రైళ్లు లేవు. సమీప రైలు స్టేషన్ షజపూర్.

ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి?

విమానమార్గం

అగర్ కు బదులుగా మీరు ఇండోర్ ఎయిర్పోర్ట్కు కు వెళ్లి వెళ్ళవచ్చును.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X