Search
  • Follow NativePlanet
Share
» »తంజావూరులోని పంచనదీశ్వర ఆలయం కళ్లు మిరుమిట్లు గొలిపే కుడ్యచిత్రాలు..

తంజావూరులోని పంచనదీశ్వర ఆలయం కళ్లు మిరుమిట్లు గొలిపే కుడ్యచిత్రాలు..

రొటీన్‌ ట్రిప్స్‌కు భిన్నంగా కొన్ని ప్రదేశాల్లో వారసత్వ సంపదల్ని చూస్తే ఆశ్చర్యంతో పాటు ఆసక్తి, ఆనందం కలుగుతుంది. చారిత్రక కట్టడాల కాణాచి మనదేశం.భారతదేశంలోని సాంస్కృతిక, ఆధ్యాత్మి కేంద్రాల్లో తంజావూ

రొటీన్‌ ట్రిప్స్‌కు భిన్నంగా కొన్ని ప్రదేశాల్లో వారసత్వ సంపదల్ని చూస్తే ఆశ్చర్యంతో పాటు ఆసక్తి, ఆనందం కలుగుతుంది. చారిత్రక కట్టడాల కాణాచి మనదేశం.

భారతదేశంలోని సాంస్కృతిక, ఆధ్యాత్మి కేంద్రాల్లో తంజావూరు ఒకటి. చైన్నెకి 218 కిలోమీటర్ల దూరంలో తంజావూరు ఉంది. తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ఈ చారిత్రక ప్రదేశం కావేరీ నది దక్షిణ ఒడ్డున రాజ చోళుడు నిర్మించాడు. తంజావూరులో చోళులు అనేక దేవలయాలు నిర్మించారు. అద్భుతమైన కళానైపుణ్యంతో నిర్మించిన ఈ దేవాలయాల్లో బృహదీశ్వర ఆలయం ప్రముఖమైనది. దక్షిణభారతదేశంలో ఆశ్చర్యం గొలిపే చారిత్రక దేవాలయాలు చూడాలంటే తంజావూరు వెళ్లాల్సిందే.

మన దేశంలో శివుడికి అంకితం చేయబడని దేవాలయాలు చాలనే ఉన్నాయి. తంజావూరులో ప్రసిద్ది చెందిన బృహదీశ్వర ఆలయంతో పాటు తిరువయారు గ్రామంలో అయ్యరప్పర్ ఆలయం ఉంది. ఈ ఆలయం శివుడికి అంకితం చేయబడినది. మరి ఈ ఆలయం ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం..

తంజావూరులో ఉన్న అనేక దేవాలయాలు అద్భుతమైనవి

తంజావూరులో ఉన్న అనేక దేవాలయాలు అద్భుతమైనవి

తమిళనాడులో తంజావూరు సందర్శించడానికి ఒక అద్భుతమైన ప్రదేశం. తంజావూరులో ఉన్న అనేక దేవాలయాలు అద్భుతమైనవి, ప్రాచీనమైనవి. ఈ దేవాలయాల గోపురాలు గొప్ప కళా నైపుణ్యం కలిగిన కళాకారుల ప్రతిభకు, శిల్పకళా చాతుర్యానికి మచ్చుతునక. అలా నిర్మితమైనదే బృహదీశ్వర ఆలయం. కుంబకోణం మరియు తంజావూర్ దేవాలయాలు అప్పటి రాజుల నిర్మాణ కౌశలానికి అద్దం పడతాయి.

పాండ్యరాజులచే నిర్మించ బడిన మధుర మీనాక్షి దేవాలయం

పాండ్యరాజులచే నిర్మించ బడిన మధుర మీనాక్షి దేవాలయం

పాండ్యరాజులచే నిర్మించ బడిన మధుర మీనాక్షి దేవాలయం, తమిళనాడు లోని దేవాలయ నిర్మాణ కౌశలానికి శిల్పకళా నైపుణ్యానికి ఒక గొప్ప ఉదాహరణ. సముద్ర తీర ప్రాంతాన ఉన్న శివక్షేత్రం రామేశ్వరం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇంకా తమిళనాడు అనేక దేవాలయాలు ఆధ్యాత్మిక పర్యటనకు కొలువై ఉన్నాయి. తంజావూరులోని అనేక దేవాలయాల్లో అయ్యరప్పర్ దేవాలయం ఒకటి.

తిరువయూర్ లో పంచనదేశ్వరకు అంకితం చేసిన పురాతన శివాలయం

తిరువయూర్ లో పంచనదేశ్వరకు అంకితం చేసిన పురాతన శివాలయం

ఈ దేవాలయం తమిళనాడులోని తంజావూరు జిల్లా, తిరువుయ్యూర్ పంచాయతీలో ఉంది. ఇది తంజావూరు పట్టణం నుండి సుమారు 13కిలోమీటర్ల దూరంలో కావేరి నది ఒడ్డున ఉంది. తిరువయూర్ లో పంచనదేశ్వరకు అంకితం చేసిన పురాతన శివాలయం ఉంది. తంజావూర్ లోని అయ్యరప్పర్ దేవాలయం ప్రాచీన కాలం నాటిది. ఇది చాలా సంవత్సరాల క్రితం చాలా పొడవుగా నిర్మించబడినది. ఈ ఆలయంలోని శివుడుని పంచనాధీశ్వర లేదా అయ్యరప్పర్ అని కూడా పిలుస్తారు.

ఇక్కడ మొత్తం 7 దేవాలయాలున్నాయి.

ఇక్కడ మొత్తం 7 దేవాలయాలున్నాయి.

ఇక్కడ మొత్తం 7 దేవాలయాలున్నాయి. అలాగే శివునికి అంకితం చేయబడని ఉపవిభాగాలున్నాయి. తంజావూరులోని అయ్యరప్పర్ ఆలయం ఈ ఆలయాల్లో ఒకటిగా అత్యంత ముఖ్యమైన ఆకర్షణలలో ఒకటిగా పరిగణిపంబడుతున్నది. తిరువయ్యారుకు అరిశలూరు, వెన్నారు, వెట్టారు, కుడమురుత్తియారు మరియు కవిరియారు అనే కావేరి నది యొక్క 5 నదుల మధ్య ఉన్నందున ఈ పేరొచ్చినది. స్వామి వారిని "ఐయరప్పన్"(అయిదు నదుల మధ్య ఉన్నవాడు)అని పిలుస్తారు. చోళ రాజులచే నిర్మించబడిన ఆలయం చక్కని శిల్పకళకు నిలయం.

PC:P. Jeganathan

అయిదు ప్రాకారాలు, నలుదిక్కుల రాజగోపురాలతో

అయిదు ప్రాకారాలు, నలుదిక్కుల రాజగోపురాలతో

అయిదు ప్రాకారాలు, నలుదిక్కుల రాజగోపురాలతో అలరారు తుంటుందీ ఆలయం.సువిశాల ప్రాంగణంలో దక్షిణ కైలాసం మరియు ఉత్తర కైలాసం అని పిలిచే రెండు భాగాలుంటాయి. దక్షిణ కైలాసాన్ని నైమిశ మహర్షి నిర్మించగా, రాజేంద్ర చోళుని సతీమణి మర్మత్తులు చేయించారు. ఉత్తర కైలాసాన్ని రాజరాజచోళుడు నిర్మించినట్లుగా శాసనాలు తెలుపుతున్నాయి.

PC: PJeganathan

 ఊరు చుట్టూ అయిదు నదులున్నట్లే ఆలయంలో

ఊరు చుట్టూ అయిదు నదులున్నట్లే ఆలయంలో

ఊరు చుట్టూ అయిదు నదులున్నట్లే ఆలయంలో సూర్య, చంద్ర, నంది, గంగ, పాలరు అనే అయిదు పుష్కరుణులు ఉంటాయి. ప్రాంగణంలో ఉన్న మండపాలలో ముక్తి మండపం ప్రసిద్ధి చెందినది.ఈ ఆలయంను శివుని ఆజ్ఝ మేరకే నిర్మించినట్లు స్థల పురాణం తెలుపుతున్నది.అలాగే పంచాక్షర జపాలను నడుపుతున్న ఒక మంటపం కూడా ఉంది.

PC:பா.ஜம்புலிங்கம்

ఎందరో భక్తులు ఇక్కడ శివ నామ ధ్యానం

ఎందరో భక్తులు ఇక్కడ శివ నామ ధ్యానం

ఎందరో భక్తులు ఇక్కడ శివ నామ ధ్యానం చేస్తుంటారు. శ్రీ కాల సంహార మూర్తి సన్నిధి సమీపంలో ఉండే హోమకుండాన్నిశ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య వెలిగించినట్లు పేర్కొంటారు. ప్రాంగణంలో నిర్దేశించిన ఒక ప్రదేశంలో నిలబడి స్వామివారి పేరును పెద్దగా పలికితే ఏడు సార్లు ప్రతిధ్వనిస్తుంది అని అంటారు.

PC: Vadakkan

ఆలయాలలో ప్రదక్షణ తప్పనిసరి. కానీ

ఆలయాలలో ప్రదక్షణ తప్పనిసరి. కానీ

ఆలయాలలో ప్రదక్షణ తప్పనిసరి. కానీ ఈ ఆలయంలో ప్రదక్షణ నిషేధం. గర్భాలయం చుట్టూ కపర్ది జటాజూటాలు పరుచుకొని ఉంటాయన్న భావనతో ప్రదక్షణలు చేయరు.అరవై మూడు మంది నయమ్మారులలో ముఖ్యుడైన "అప్పార్" శ్రీ పంచనాథేశ్వర స్వామి గురించి తన పాటికాలలో ప్రస్తుతించారు. అందువలన ఈ క్షేత్రం పడాల్ పేట్ర స్థలాలలో ఒకటిగా గుర్తించబడినది.

PC:Jamstechs

ఇక్కడ ఆది శంకరాచార్య ప్రారంభించిన హోమ గుండంను

ఇక్కడ ఆది శంకరాచార్య ప్రారంభించిన హోమ గుండంను

ఇక్కడ ఆది శంకరాచార్య ప్రారంభించిన హోమ గుండంను దేవాలయం వెలుపల చూడవచ్చు. ఈ దేవాలయం యొక్క ప్రసిద్ద దేవాలయం 5నదులు కలయికలో ఉంది. సూర్య పుష్కరాణి, గంగా తీర్థం, చంద్రపుష్కరిని, పల్లూర్ మరియు నంది తీర్థం అని 5 ఉపనదులు సమూహం.

PC:PJeganathan

తంజావూరులోని అయ్యరప్పర్ దేవాలయం పెద్ద ఆలయం

తంజావూరులోని అయ్యరప్పర్ దేవాలయం పెద్ద ఆలయం

తంజావూరులోని అయ్యరప్పర్ దేవాలయం పెద్ద ఆలయం మాత్రమే కాదు, అందమైన ఆలయం కూడా. అయ్యరప్పరన్ దేవాలయం గురించి ప్రశంసించే పాటలు పాడేవారు . అలాంటి వారాలో ప్రఖ్యాత వాగ్గేయకారుడు త్యాగరాజ స్వామి వారి సమాధి మందిరం ఉంది. అనర్గలమైన సంగీత రత్నాలను అందించిన ఆయన సమాధి వద్ద ప్రతి సంవత్సరం ‘త్యాగరాజస్వామివారి ఆరాధన ఉత్సవాలు' ఘనంగా జరుపుతారు. ఆరోజు ఇక్కడికి దేశం నలుమూలల నుంచి సంగీత విద్వాంసులు వచ్చి స్వామివారికి నీరాజనాలు పలుకుతారు. ఆయన రచించిన గీతాలను ఆలపిస్తూ ఈ కార్యక్రమం సాగుతుంది.

PC: Vadakkan

తిరువయ్యారు పంచనదీశ్వర ఆలయంలో సప్తస్థాన ఉత్సవం

తిరువయ్యారు పంచనదీశ్వర ఆలయంలో సప్తస్థాన ఉత్సవం

చైత్రమాసంలో ప్రతీఏటా తిరువయ్యారు పంచనదీశ్వర ఆలయంలో సప్తస్థాన ఉత్సవం అని ఒకటి జరుగుతుంది. ఈ ఉత్సవంలో క్రమం తప్పకుండా త్యాగరాజు ప్రతీ ఏడూ పాల్గొనేవాడు. ఈ పంచనదీశ్వర ఆలయం సమీపంలోనే మరో ఆరు దేవాలయాలున్నాయి. అవి తిరుచత్రుదురై, తిరువెదికుడి, తిరుప్పొందురితి, తిల్లైస్థానం, కందియూర్ మరియు తిరుప్పళనం. ఈ సప్తస్థానం ఉత్సవంలో శివుడు ఊరేగింపుగా పంచనదీశ్వరాలయంతో మొదలు పెట్టి, పైన చెప్పిన ఆలయాలన్నీ దర్శించి చివరకి తిరువయ్యారు చేరుకుంటాడు. ఈ ఏడు గుళ్ళకీ సంబంధించిన ఉత్సవం కాబట్టి సప్తస్థాన ఉత్సవం అన్నారు.

ఎల్లప్పుడు ఈ ఆలయం భక్తులతో నిండి ఉంటుంది

ఎల్లప్పుడు ఈ ఆలయం భక్తులతో నిండి ఉంటుంది

ఎల్లప్పుడు ఈ ఆలయం భక్తులతో నిండి ఉంటుంది. ఈ ఆలయం భక్తులు తమ కోర్కోలను విన్నవించుకుని ఆ పరమేశ్వరుడి దీవెనలు పొందుతారు. ఈసారి మీరు తంజావూరును సందర్శించినప్పుడు తప్పకుండా అయ్యరప్పర్ దేవాలయాన్ని సందర్శించండి.

ఎలా చేరుకోవాలి:

ఎలా చేరుకోవాలి:

తంజావూరుకు సమీపంలో విమానశ్రం తిరుచిలో ఉంది. ఇది సుమారు 65కిలోమీటర్ల దూరంలో ఉంది. రైలులో ప్రయాణించే వారికి తంజావూరు, తిరుచి, చెన్నై, మధురై రైల్వే జంక్ష్న్ మరియు నాగుర్గాల నుండి ఒక మంచి అనుసందానం ఉంది. తంజావూరు మరియు చుట్టు ప్రక్కల ప్రదేశాల నుండి లోకల్ బస్సు సర్వీసులు, పర్యాటక ట్యాక్సీలు వినియోగదారులకి అందుబాటులో ఉన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X