Search
  • Follow NativePlanet
Share
» »అమర్ పుర్: ‘సెవన్ సిస్టర్స్’గా పిలువబడే త్రిపుర అందాలు ఒక్కసారైనా చూడాల్సిందే..

అమర్ పుర్: ‘సెవన్ సిస్టర్స్’గా పిలువబడే త్రిపుర అందాలు ఒక్కసారైనా చూడాల్సిందే..

భారత దేశంలో అందమైన రాష్ట్రాలలో త్రిపుర ఒకటి. ఆకుపచ్చని లోయలు, కొండలతో త్రిపుర భారతదేశంలో ఒక ప్రధాన పర్యాటక ప్రదేశంగా రూపొందింది. దేశంలోని మూడవ అతి చిన్న రాష్ట్రమైన త్రిపుర ఈశాన్య భారతదేశం, బంగ్లాదేశ్ మధ్య ఒక చిన్న రాష్ట్రం. త్రిపుర 'సెవన్ సిస్టర్స్ 'గా ప్రసిద్ది చెందినది. ఈశాన్య భారతదేశంలో ఏడు రాష్ట్రాలో ఒకటైనందున దీన్ని సెవన్ సిస్టర్స్ అని పిలువబడుతోంది. కొండలు, లోయలు, మైదానాలతో ఆహ్లాదకరంగా ఉంటుంది. త్రిపుర ఇరుకైన లోయలతో ఐదు కొండల ప్రాంతంగా విభజింపబడినది.

త్రిపురలోను, చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలు కాలుష్యం లేని గాలి, వాతావరణం, ఆశక్తికర పర్యాటక ప్రదేశాలు, ఎవరైనా సందర్శించడానికి త్రిపుర ఒక ఆహ్లాదకరమైన ప్రదేశం. త్రిపురలో సతత హరితారణ్యాల విస్తృతంగా వ్యాపించి ఉన్నాయి. జలవనరులు కూడా ఎక్కువగా ఉన్నాయి. త్రిపురలో గోమతి జిల్లాల్లో అమర్పుర్ బెంగాలి సెంట్రిక్ టౌన్ . ఈ చిన్న పట్టనానికి బస్సు ద్వారా చేసుకోవచ్చు,. త్రిపుర రాజధానికి అగర్తలా నుండి చేరుకోవచ్చు. ఇది మంచి ప్రసిద్ది చెందిని పిక్నిక్ స్పాట్ . అమర్పూర్ లో చూడదగిన ప్రదేశాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..

దేవతముర:

దేవతముర:

స్థానికులు దెబ్దాముర లేదా చంబిమురగా పిలుస్తారు, ఈ పర్వతమున గోమతి నదీ తీరంలో ఉంది. ఇక్కడ రాళ్ళతో చెక్కిన శిల్పాలు,దేవుళ్ళు శిల్పాలు అద్భుతంగా ఆకట్టుకుంటాయి. దగ్గర నుండి చేస్తూ అక్కడ శివుడు, దుర్గా, మహిశాశుర, కార్తీక మరియు విష్ణు విగ్రహాలను పర్యాటకులు కనువుందు చేస్తాయి. వీటిని పీక్ ఆఫ్ గాడ్స్ గా పిలుస్తారు. ఈ శిల్పాలు 16వ శతాబ్ద కాలంలో చెక్కినట్లు స్థల పురాణం. ఈ ప్రదేశం చూడాలంటే కేవలం బోట్ లో మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుంది.

దంబూర్ లేక్:

దంబూర్ లేక్:

41 చదరపు కిలోమీటర్లు ఉన్న ఈ సరస్సు లో 48 ద్వీపాలు కలిసి ఉన్నాయి. పూర్తిగా నీటితో నిండుగా జల కళ పర్యాటకులకు ఆహ్లాదం కలిగిస్తాయి. ఈ దంబూర్ లేక్ లో రైమా మరియు సర్మా నదులు ఈ సరస్సులో కలిసి ప్రవహిస్తాయి. దీన్ని గోమతి నదిలో కలిస్తుంది. అయిదే దీన్ని తీర్థముఖ అని పిలుస్తారు. గోమతి నదీ నీటిలో హైడిల్ డ్యామ్ కంట్రోల్ చేస్తుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం మకరసంక్రాంతి మేళా ఘనంగా నిర్వహిస్తారు. ఈ సరస్సు చుట్టు పచ్చటి ప్రక్రుతితో చెట్టు, వివిధ రకాల పక్షుల వలసరావడం చూడవచ్చు. ఇది అద్భుతమైన పిక్నిక్ స్పాట్ గా స్థానికులు ఎక్కువగా సందర్శిస్తుంటా. టూరిస్ట్ ల కొరకు జలక్రీడలను నిర్వహిస్తుంటారు. శివుడి యొక్క ఆయుదాల్లో ఒకటి దమ్రు ఎలా ఉంటుందో, ఆ ఆకారంలో ఈ సరస్సు ఉండటం విశేషం.

అమర్ సాగర్ మరియు ఫాతిక్ సాగర్ లేక్ :

అమర్ సాగర్ మరియు ఫాతిక్ సాగర్ లేక్ :

ఈ ఆర్టిఫిషియల్ లేక్ 16వ శతాబద్దంలో నిర్మించారు. దీన్ని త్రిపురి రాజకుంటుంబంలోని రాజు అమర మానిక్య దేవ్ బర్మన్ దీన్ని నిర్మించారు. ఈ సరస్సు సుమారు 20 హెక్టార్లు విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ ఉన్న దేవాలయం మంగళ చండీ దేవికి అంకితం చేయబడినది. ఈ సరస్సు పర్యాటకులను అద్భుతంగా ఆకర్షిస్తుంది. పిక్నిట్ స్పాట్ గా , ప్రశాంత వాతావరణంలో సేద తీరాలని కోరుకునే వారికి చక్కటి ప్రదేశం. సరస్సు చుట్టూ కూర్చుని తినడానికి విశ్రాంతి తీసుకోవడానికి అనువైన ప్రదేశాలున్నాయి.

PC: Soman

మంగళ చంఢి దేవాలయం

మంగళ చంఢి దేవాలయం

అమర్ సాగర్ సరస్సుకు దక్షిణ భాగంలో ఈ దేవాలయం ఉంది, ఈ దేవాలయం మంగళ చంఢి దేవికి అంకితం చేయబడినది. ఈ దేవాలయంను 15 శతాబ్దంలో రాజు అమర దేవ్ బర్మన్ నిర్మించినట్లు స్థలపురాణం తెలుపుతుంది. ఈ దేవాలయంలో శిల్పసౌందర్యం ఇటు హిందు మరియు బుద్దిజంకు దగ్గరగా అద్భుతంగా నిర్మించారు. ఇక్కడ ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో వసంత పంచమిని ఘనంగా నిర్వహిస్తారు. ఈ సంప్రదాయ ఉత్సవాల్లో పాల్గొనడానికి స్థానికులతో పాటు చుట్టు పక్కల ప్రదేశాల నుండి భక్తులు తరలివస్తారు.

PC:Anil duvvuri

జంపు హిల్స్ :

జంపు హిల్స్ :

జంపు హిల్స్ సముద్ర మట్టానికి 1000 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది మిజోరాం వరకు విస్తరించి ఉంది. ఈ హిమ గిరిల్లో సుమారు 10 గ్రామాలున్నాయి. మిజోరాంలో మిజో కమ్యూనిటీ జనసంఖ్య అధికగా ఉండే ఈ ప్రదేశంలో వ్యవసాయం, హార్టికల్చర్ ప్రధాన వ్రుత్తి. మిజో ప్రజలు ఇక్కడ దాదాపు 15 శతాబ్ద కాలం నుండి స్థిరపడినట్లు స్థానికులు చెబుతారు. ఇక్కడ ఆరెంజ్ మరియు టూరిజం ఫెస్టివల్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. ముఖ్యంగా ఈ ప్రదేశంలో ఆరెంజ్ పండ్లు సాగు అద్భుంతంగా ఉంటుంది. అంతే కాదు ఇక్కడ సూర్యాస్తమయాలు చూడటానికి రెండు కళ్ళ సరిపోవు.

PC: Soman

ఎలా చేరుకోవాలి?

ఎలా చేరుకోవాలి?

విమాన మార్గం: అమరపురకు 65కిలోమీటర్ల దూరంలో అగర్తలా ఎయిర్ పోర్ట్ ఉంది. ఎయిర్ పోర్ట్ చేరిన తర్వాత అక్కడ నుండి అమరపురకు క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళవచ్చు.విమానాశ్రయం నుండి రెండు గంటల సమయంలో అమరపుర చేరుకోవచ్చు.
రైలు మార్గం: అమరపురకు దగ్గరలో అగర్తలాలో ప్రధాన రైల్వేస్టేషన్ ఉంది. అక్కడ నుండి క్యాబ్ ద్వారా అమరపుర చేరుకోవచ్చు.

రోడ్ మార్గం: అమరపుర పట్టనానికి దగ్గరలోని ప్రదాన నగరాల నుండి అన్ని రోడ్ మార్గాలను అనుసందానించబడినది. కాబట్టి రోడ్డు మార్గం ద్వారా కారు లేదా బస్సులలో ప్రయాణించి సులభంగా చేరుకోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X