» »ఆదిమ మానవులు పుట్టింది ఎక్కడో తెలుసా?

ఆదిమ మానవులు పుట్టింది ఎక్కడో తెలుసా?

Written By: Venkatakarunasri

భీంబెట్కా భారతదేశంలో ప్రాధాన్యత సంతరించుకున్న గుహలు.

ఇవి మధ్యప్రదేశ్ లోని భోపాల్ కు కేవలం 50కి.మీలలో అమర్ కంఠన్ నదీ తీరాన కొండల మధ్యలో రథపాణి అభయారణ్యంలో వున్నాయి.

ఒకప్పుడు ఆదిమానవులకు ఆ తరువాత క్రూరమృగాలకు నివాసమైన ఈ ప్రదేశం నిశ్శబ్దంగా.ప్రశాంతంగా వుంటుంది.

భీంబెట్కా అన్న పేరు మహాభారతంలోని భీముడి పేరు మీద వచ్చింది. జూదంలో రాజ్యం పోగొట్టుకున్న పాండవులు కొంతకాలం ఈ గుహలలో తలదాచుకున్నట్లు పురాణ కథనం.

పాండవులు నివశించారన్నమాట అటుంచితే అసలు మనిషి మొట్టమొదట జీవించింది ఇక్కడే అట.

15,000 ఏళ్ల క్రిందటే ఆదిమానవుడు ఇక్కడ నిశిస్తున్నట్టు ఆధారాలు కూడా లభ్యమయ్యాయి మన పురావస్తు శాఖవారికి..

1. ఎలా కనుగొన్నారు ?

1. ఎలా కనుగొన్నారు ?

భీమ్ బెట్కా గుహలు కనుగొనే తీరు ఆసక్తికరంగా ఉంటుంది. ప్రముఖ పురాతత్వ శాస్త్రవేత్త వీ.ఎస్. వకాన్కర్ రైలులో భోపాల్ కు వెళుతుండగా తాను ఐరోపా ఖండంలో చూసిన గుహలను పోలిన వాటిని ఇక్కడ చూసాడు. ఆతర్వాత 1957 లో తన బృందంతో కలిసి గుహలను కనుగొన్నాడు.

PC: youtube

2. భీమ్ బెట్కా గుహల విశేషాలు

2. భీమ్ బెట్కా గుహల విశేషాలు

భీమ్ బెట్కా గుహలు ప్రాచీన శిలాయుగం కాలం నాటివి. ఈ గుహలు భారతదేశంలో ఆది మానవుడు నివసించాడు అనటానికి ఆధారం.

PC: youtube

3. భీమ్ బెట్కా గుహల విశేషాలు

3. భీమ్ బెట్కా గుహల విశేషాలు

ఈ గుహలలో లక్ష సంవత్సరాల క్రితం హోమో ఎరక్టస్ ఆదిమానవులు నివసించారు.

PC: youtube

4. భీమ్ బెట్కా గుహల విశేషాలు

4. భీమ్ బెట్కా గుహల విశేషాలు

భీమ్ బెట్కా లో మొత్తం 750 గుహలు కనుగొన్నారు అందులో 243 భీమ్ బెట్కా చెందినవిగా మరియు 178 లకర్ జువార్ వర్గానికి చెందినవిగా గుర్తించారు.

PC: youtube

5. భీమ్ బెట్కా గుహల విశేషాలు

5. భీమ్ బెట్కా గుహల విశేషాలు

ప్రస్తుతం ఈ గుహలలో సందర్శకుల కోసం 12 మాత్రమే తెరచి ఉంచారట.

PC: youtube

6. పెయింటింగ్స్

6. పెయింటింగ్స్

ఆదిమానవులు వేసిన పెయింటింగ్స్ గుహలలో ప్రధాన ఆకర్షణలు. గుహలలో సుమారు 453 పెయింటింగ్స్ కలవు.

PC: youtube

7. పెయింటింగ్స్

7. పెయింటింగ్స్

ఇవి 30,000 ఏళ్ల క్రితం నాటివిగా చెబుతారు. ఈ గుహలు పూర్వం నాట్యం యొక్క ఉనికిని కూడా కనబర్చాయి.

PC: youtube

8. పెయింటింగ్స్

8. పెయింటింగ్స్

ఒకానొక రాతిగుహలో చేతిలో త్రిశూలం కలిగి నాట్యం చేస్తున్న భంగిమలోని చిత్రం ఇక్కడి పెయింటింగ్స్ లో కెల్లా సెంటర్ ఆఫ్ అట్ట్రాక్షన్స్.

PC: youtube

9. పెయింటింగ్స్

9. పెయింటింగ్స్

భీమ్ బెట్కా గుహలను యునెస్కో 2003 లో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది.

PC: youtube

10. పెయింటింగ్స్

10. పెయింటింగ్స్

భీమ్ బెట్కా గుహలో ఉన్న ఏక శిలపై ఉపయోగించిన రంగుల యొక్క ముడిసరుకు బార్కేదా వనరుగా వ్యవహరించారు పురాతత్వ శాస్త్రవేత్తలు.

PC: youtube

11. పెయింటింగ్స్

11. పెయింటింగ్స్

పెయింటింగ్స్కొన్ని వాతావరణ పరిస్థితుల కారణంగా గుహలలో అరుదైన చిత్రాల కోతకు గురైతున్నాయి.

PC: youtube

12. పెయింటింగ్స్

12. పెయింటింగ్స్

వీటిని సంరక్షించడం కోసం పురావస్తుశాఖ రసాయనాలను మరియు మైనాన్ని ఉపయోగిస్తున్నది.

PC: youtube

13. సందర్శన సమయం

13. సందర్శన సమయం

ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు భీమ్ బెట్కా గుహలను పర్యాటకులు/ యాత్రికులు సందర్శించవచ్చు.

PC: youtube

14. భీమ్ బెట్కా గుహలకు ఎలా చేరుకోవాలి ?

14. భీమ్ బెట్కా గుహలకు ఎలా చేరుకోవాలి ?

భీమ్ బెట్కా గుహలు భోపాల్ కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి కనుక ముందు భోపాల్ చేరుకొని అక్కడి నుంచి లోకల్ ట్రాస్పోర్ట్ ద్వారా భీమ్ బెట్కా చేరుకోవచ్చు.

PC:Tanujdeshmukh

15. వాయు మార్గం ద్వారా

15. వాయు మార్గం ద్వారా

భీమ్ బెట్కా గుహలకు సమీపాన 45 కిలోమీటర్ల దూరంలో రాజ భోజ్ ఎయిర్ పోర్ట్ కలదు. దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి ఇక్కడికి విమానాలు వస్తుంటాయి.
టాక్సీ లేదా క్యాబ్ అద్దెకు తీసుకొని భీమ్ బెట్కా సులభంగా చేరుకోవచ్చు.

PC:Raveesh Vyas

16. రైలు మార్గం ద్వారా

16. రైలు మార్గం ద్వారా

భోపాల్ రైల్వే స్టేషన్ భీమ్ బెట్కా కు 37 కి. మీ ల దూరంలో కలదు. ఈ రైల్వే స్టేషన్ దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి, పట్టణాల నుండి చక్కగా కనెక్ట్ చేయబడింది.

PC: Bernard Gagnon

17. రోడ్డు మార్గం ద్వారా

17. రోడ్డు మార్గం ద్వారా

భీమ్ బెట్కా కు చుట్టుపక్కల ప్రాంతాల నుండి, భోపాల్, ఇండోర్ నుంచి ప్రభుత్వ బస్సులు అందుబాటులో ఉంటాయి.

PC:Surohit

Please Wait while comments are loading...