Search
  • Follow NativePlanet
Share
» »అమ్మవారి రొమ్ము పడిన పుణ్యక్షేత్రం ఎక్కడ ఉందో తెలుసా?

అమ్మవారి రొమ్ము పడిన పుణ్యక్షేత్రం ఎక్కడ ఉందో తెలుసా?

అంబాజీ గుజరాత్‌లోని ప్రముఖ శక్తిపీఠం. ఈ క్షేత్రం ప్రత్యేకతలు, చరిత్ర, ఇక్కడికి ఎలా చేరుకోవాలో తెలుసుకోండి

సతీదేవి రొమ్ము భాగం పడిన ప్రదేశమే గుజరాత్‌లోని అంబాజీ. ఇక్కడ అమ్మవారికి ఎటువంటి విగ్రహం ఉండదు. కేవలం ఒక యంత్రం మాత్రమే ఉంటుంది. ఆ యంత్రాన్నే అమ్మవారిగా భావించి పూజలు నిర్వహిస్తారు. మౌంట్ అబూ వద్ద దిల్వారా ఆలయాన్ని నిర్మించడానికి ముందు విమల్షా ఇక్కడ అమ్మవారిని పూజించాడని చరిత్ర చెబుతుంది. సరస్వతి నది హిమాలయాల్లోని శివాలిక్ కొండల్లో ఉద్భవించి అటు పై కురుక్షేత్రం వద్ద అదృశ్యమవుతుంది. అదేవిధంగా తిరిగి అంబాజి వద్ద పుట్టి కచ్ ఎడారి వద్ద కనిపించకుండా పోతుంది. చివరిగా సౌరాష్ట్రలోని గిర్ అటవీ ప్రాంతంలో జన్మించి సోమనాథ్ వద్ద సముద్రంలో కలిసిపోతుంది. ఈ వివరాలన్నీ మహాభారతంతో పాటు పద్మపురాణం, సరస్వతి పురాణం, స్కంద పురాణంలో వివరించబడ్డాయి. ఇన్ని విశిష్టలతో కూడిన ఆ అంబాజీ పుణ్యక్షేత్రం వివరాలు మీ కోసం...

అంబాజీ, గుజారత్

అంబాజీ, గుజారత్

P.C: You Tube

ఉత్తర గుజరాత్లోని ఆరావళి హిల్స్ యొక్క నైరుతి దిశలో, మౌంట్ అబూ సమీపంలోని అరసూర్ వద్ద అంబికా శక్తి పీఠం ఉంది. సరస్వతి నది ఇక్కడకు వచ్చి కచ్ యొక్క ఎడారిలో అదృశ్యమవుతుంది. ఇక్కడ కోతేశ్వర్ మహాదేవ మందిరం ఉంది. గుజరాత్‌లో మూడు ప్రధాన శక్తి పీఠాలు ఉన్నాయి.

అంబాజీ, గుజారత్

అంబాజీ, గుజారత్

P.C: You Tube

అవే అరసూర్ వద్ద అంబాజీ, చంనాల్ వద్ద బాలా, చాపనే సమీపంలోని పావగడ్ వద్ద కాళి క్షేత్రాలు. గుజరాత్ లోని ఇతర ముఖ్యమైన ‘శక్తి' పుణ్యక్షేత్రాలు కచ్ లోని ఆసుపురా, మౌంట్ అబూలోని అర్బుదాదేవి, సుందరి, హల్వాడ్, హర్సిద్ధి వద్ద కోల్గిరి లేదా కోయల మరియు నర్మదా న అనసూయ వద్ద ఉన్నాయి.

అంబాజీ, గుజారత్

అంబాజీ, గుజారత్

P.C: You Tube

దక్షయాగం సమయంలో సతీదేవి అవమానం పొంది యాగ గుండంలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అటు పై శివుడు రుద్రతాండవం చేయడంతో సతీదేవి శరీరభాగాలు భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో పడిన విషయం తెలిసిందే.

అంబాజీ, గుజారత్

అంబాజీ, గుజారత్

P.C: You Tube

అలా సతీదేవి రొమ్ము భాగం పడిన ప్రదేశమే గుజరాత్‌లోని అంబాజీ. ఇక్కడ అమ్మవారికి ఎటువంటి విగ్రహం ఉండదు. కేవలం ఒక యంత్రం మాత్రమే ఉంటుంది. ఆ యంత్రాన్నే అమ్మవారిగా భావించి పూజలు నిర్వహిస్తారు. మౌంట్ అబూ వద్ద దిల్వారా ఆలయాన్ని నిర్మించడానికి ముందు విమల్షా ఇక్కడ అమ్మవారిని పూజించాడని చరిత్ర చెబుతుంది.

అంబాజీ, గుజారత్

అంబాజీ, గుజారత్

P.C: You Tube

ఇందుకు సంబంధించిన వివరాలతో పాటు ఈ ఆలయ చరిత్రకు సంబంధించిన వివరాలన్నీ 16వ శతాబ్దంనాటి ఇక్కడి శాసనాల్లో మనకు కనిపిస్తాయి. సరస్వతి నది హిమాలయాల్లోని శివాలిక్ కొండల్లో ఉద్భవించి అటు పై కురుక్షేత్రం వద్ద అదృశ్యమవుతుంది.

అంబాజీ, గుజారత్

అంబాజీ, గుజారత్

P.C: You Tube

అదేవిధంగా తిరిగి అంబాజి వద్ద పుట్టి కచ్ ఎడారి వద్ద కనిపించకుండా పోతుంది. చివరిగా సౌరాష్ట్రలోని గిర్ అటవీ ప్రాంతంలో జన్మించి సోమనాథ్ వద్ద సముద్రంలో కలిసిపోతుంది. ఈ వివరాలన్నీ మహాభారతంతో పాటు పద్మపురాణం, సరస్వతి పురాణం, స్కంద పురాణంలో వివరించబడ్డాయి.

అంబాజీ, గుజారత్

అంబాజీ, గుజారత్

P.C: You Tube

రుక్మిణిదేవి తనకు శ్రీ క`ష్ణుడు భర్తగా రావాలని ఇక్కడి అంబికా మాతను పూజించారని పురాణాలు చెబుతున్నాయి. అంటే ఈ క్షేత్రం పురాణ ప్రాధాన్యత కలిగినదని స్పష్టమవుతుంది. దీపావళితో పాటు నవరాత్రి రోజుల్లో ఇక్కడికి ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X