Search
  • Follow NativePlanet
Share
» »అంబాజీ - అతి పురాతన తీర్థయాత్ర !

అంబాజీ - అతి పురాతన తీర్థయాత్ర !

By Mohammad

కళ్ళకు గంతలు గట్టుకొని ఎప్పుడైనా ఆలయాన్ని చూసారా ? అవునండీ అక్కడ విగ్రహాన్ని కన్నులతో చూడరాదు అందుకే ఈ గంతలు. ఈ దేవాలయంలో విగ్రహం ఉండదు. యంత్రాన్ని మాత్రమే ప్రధాన దైవంగా భావించి కొలుస్తారు. ఇంతటి విచిత్రమైన ఆలయం ఎక్కడ ఉంది అనేగా మీ డౌట్ ? అయితే, గుజరాత్ పోదాం పదండి !

గుజరాత్ - రాజస్థాన్ సరిహద్దు ప్రాంతంలో బనస్కాంత జిల్లాలోని దంతా తాలూకా సమీపంలో గబ్బర్ కొండలపై ప్రసిద్ధి గాంచిన అమ్మవారి ఆలయం (అంబాజీ ఆలయం) కలదు. ఇది దేశంలోని 51 శక్తీ పీఠాలలో ఒకటి. ప్రపంచం నలుమూలల నుండి ఈ దేవాలయాన్ని దర్శించుకోవటానికి భక్తులు, యాత్రికులు వస్తుంటారు.

ambaji temple1

చిత్ర కృప : KartikMistry

అంబాజీ సందర్శనీయ స్థలాలు

గబ్బర్ కొండలు

గబ్బర్ కొండలు అంబాజీ గ్రామానికి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో కలవు. కొండ పైన అంబాజీ మాత దేవాలయం కలదు. ఇక్కడ సతీ దేవి గుండె భాగం పడిందని పురాణాల్లో పేర్కొన్నారు. అమ్మవారిని ఇక్కడ కన్నులతో చూడరాదు. కళ్ళకు గంతలు కట్టుకొని చూడాలి.

ambaji temple2

చిత్ర కృప : Kaushik Patel

అంబాజీ దేవాలయంలో మాత విగ్రహం ఉండదు. ఇక్కడ గల 'శ్రీ విస యంత్రాన్ని' ప్రధాన దైవంగా భావించి కొలుస్తారు. కొండపైకి చేరుకోవటానికి 1000 మెట్లు ఎక్కవలసి ఉంటుంది. కొండ ఏటవాలుగా ఉండి ఎక్కడానికి కాస్త ఇబ్బంది కలిగిస్తుంది. కొండ పైన సూర్యోదయ, సూర్యాస్తమ దృశ్యాలను తిలకించడం ఒక మధురానుభూతి.

కామాక్షి మందిరం

అంబాజీ నుండి ఒక కిలోమీటర్ దూరంలో కామాక్షి మందిరం ఉంది. ఆలయ ప్రాంగణంలో మహోన్నత శక్తి సంప్రదాయం గురించి, ఆదిత్య శక్తి మాత వివిధ అవతారాలను గురించి సందర్శకులకు, భక్తులకు పూర్తి సమాచారం అందించడానికి 51 శక్తి పీఠాలు, విశ్వ శక్తి కేంద్రాన్ని పునర్నిర్మించి స్థాపించారు.

ambaji temple3

చిత్ర కృప : telugu native planet

కోటేశ్వర ఆలయం

కోటేశ్వర ఆలయం సరస్వతి నది కి దగ్గరగా ఉండటం వలన ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇది అంబాజీ నుండి 8 కిలోమీటర్ల దూరంలో కలదు. వాల్మీకి ఆశ్రమం, శక్తీ ఆశ్రమం ఇక్కడి ప్రధాన ఆకర్షణలు.

మన్ సరోవర్

అంబాజీ ఆలయానికి వెనకాల ఉన్న పెద్ద సరస్సు మన్ సరోవర్. ఈ సరస్సుకు నాలుగు వైపులా మెట్లు, రెండువైపులా దేవాలయాలు ఉన్నాయి. దీనిని శ్రీ తపిశంకర్ అనే భక్తుడు నిర్మించాడు. భక్తులు ఇందులో స్నానమాచరించి ఆలయాన్ని దర్శిస్తారు.

ambaji temple4

చిత్ర కృప : forests.gujarat.gov

అంబాజీ ఇతర ఆకర్షణలు

అంబాజీలో చూడవలసిన మరొక ప్రధాన ఆకర్షణ బలరాం వన్య ప్రాణుల అభయారణ్యం. ఈ అభయారణ్యంలో అనేక పక్షలు, జంతువులు, ఔషధ గుణాలు కలిగిన మొక్కలు భారీ స్థాయిలో ఉన్నాయి.

అంబాజీ లో చూడవలసిన మరో ఆకర్షణ మాంగళ్య వనం. ఇది అంబాజీ ఆలయానికి కొలిమీటరు దూరంలో కలదు. ఈ తోటలో జ్యోతిష్య మొక్కలు ఉంటాయి. భక్తులు వారి వారి జాతక రాశుల ప్రకారం మొక్కలను ఇంటికి తీసుకొని వెళతారు. వాటిని నాటితే ఇంట శుభం జరుగుతుందని భక్తుల విశ్వాసం.

ambaji temple 5

చిత్ర కృప : telugu native planet

అంబాజీ ఎలా చేరుకోవాలి ?

  • విమాన మార్గం : అంబాజీ కి 180 km ల దూరంలో అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ కలదు. క్యాబ్ లేదా టాక్సీ లలో ప్రయాణించి అంబాజీ చేరుకోవచ్చు.
  • రైలు మార్గం : అంబాజీ కి 20 km దూరంలో అంబాజీ రోడ్డు స్టేషన్ కలదు. ఇక్కడికి రాష్ట్రంలోని ప్రధాన నగరాల నుండి రైళ్లు వస్తుంటాయి.
  • బస్సు/ రోడ్డు మార్గం : అహ్మదాబాద్, మౌంట్ అబూ, ఢిల్లీ, పాలంపూర్, హిమ్మత్ నగర్ వంటి అంగరాల నుండి అంబాజీ కి బస్సులు కలవు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X