Search
  • Follow NativePlanet
Share
» »అంబోలి జలపాతాలు..ఎన్నో వింతలు..వసంత..ఆగమనంతో పచ్చదనం పురివిప్పుతుంది...

అంబోలి జలపాతాలు..ఎన్నో వింతలు..వసంత..ఆగమనంతో పచ్చదనం పురివిప్పుతుంది...

మ‌న‌సుకు ప్ర‌శాంత‌త కూర్చే చ‌ల్ల‌చ‌ల్ల‌ని ప్ర‌దేశాలు మ‌న దేశంలో ఎన్నో ఉన్నాయి. అటువంటిదే మహారాష్ట్ర లోని స‌హ్యాద్రి ప‌ర్వ‌త శ్రేణుల‌లో, కొంకణ్ తీర ప్రాంతంలో సింధుదూర్గ్ జిల్లాలో అంబోలి హిల్ స్టేషన్. ఈ హిల్ స్టేషన్ సముద్రమట్టానికి 700 మీటర్ల ఎత్తున ఉండి, సహజ అందాలతో యాత్రికులను ఆకర్షిస్తోంది. ఎటు చూసినా జలపాతాలతో, ఎత్తైన కొండలతో, చల్లటి గాలులతో ఆహ్లాదం కలిగించే ప్రాంతం అంబోలి. వేసవి విడిదిగానే కాదు, వర్షాకాలంలో సందర్శించడానికి అనువైన గమ్యంగా కూడా ఇది ప్రసిద్ధి చెందింది.

వర్షపాతం ఎక్కువ కాబట్టి ఎప్పుడూ తడిగా కనిపించే అంబోలిలోని పల్లె వాతావరణం మనసుకు ప్రశాంతత కలిగిస్తుంది. సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఉన్న ఈ ప్రదేశం నుంచి సూర్యోదయాలూ, సూర్యాస్తమయాలూ వీక్షించడం ఒక మరపురాని అనుభూతి. ముఖ్యంగా వ‌సంత‌రుతువులో ప‌రిస‌రాల‌న్నీ ప‌చ్చ‌ద‌నం ప‌రుచుకుని ప‌ర‌వ‌శింప‌చేస్తాయి.

మహారాష్ట్రలోని జలపాతాల సవ్వడులు

మహారాష్ట్రలోని జలపాతాల సవ్వడులు

ఈ సీజన్‌లో మహారాష్ట్రలోని జలపాతాల సవ్వడులు సందర్శకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. ఎత్తయిన పర్వత శిఖరాలు, పచ్చదనం, ప్రశాంతత, ఆహ్లాదకరమైన వాతావరణం పర్యాటకుల మనసును మైమరపింప చేస్తాయి. ఇక్కడ ముందుగా చెప్పుకోదగ్గది...అంబోలీ జలపాతం. మహారాష్ట్రలోని ప్రముఖ నగరం గోవా, బెల్గాం నుంచి అంబోలి 88 కి.మీ., కర్ణాటకలోని హుబ్లీ నుంచి 160 కి.మీ. దూరంలో ఉంటుంది.

 సహ్యాద్రి పర్వతాలపై ఉన్న ఈ ప్రదేశం ప్రపంచంలో కెల్లా ఏకైక ఎకో హాట్‌ స్పాట్‌

సహ్యాద్రి పర్వతాలపై ఉన్న ఈ ప్రదేశం ప్రపంచంలో కెల్లా ఏకైక ఎకో హాట్‌ స్పాట్‌

మహారాష్ట్రలోని ఈ హిల్‌స్టేషన్‌ 690 మీటర్ల ఎత్తులో ఉంది. సహ్యాద్రి పర్వతాలపై ఉన్న ఈ ప్రదేశం ప్రపంచంలో కెల్లా ఏకైక ఎకో హాట్‌ స్పాట్‌గా గుర్తింపు పొందింది. ఇక్కడ వృక్ష సంపద జీవావరణం చాలా బాగుంటుంది. సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఉంటుంది అంబోలి.

మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌ జిల్లా

మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌ జిల్లా

మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌ జిల్లాలో ఉంటుందీ ప్రాంతం. అంబోలి అంటే ప్రత్యేకమనే అర్థం ఉంది. పేరుకు తగ్గట్టే.. ఇక్కడ ఎన్నో వింతలు దాగున్నాయి. వానాకాలం భారీ వర్షాలతో కొండలపై ఉన్న వాగులు, సెలయేళ్లు నిండుకుండలు అవుతాయి. నిండు వేసవిలోనూ పిల్లకాల్వల్లో నీటి జాడ కనిపిస్తుంది. జలపాతాలు నెమ్మదించినా.. వసంత ఆగమనంతో పచ్చదనం పురివిప్పుతుంది.

 అగాధంగా ఉండే కొండల్లో ఎన్నో అద్భుతాలు

అగాధంగా ఉండే కొండల్లో ఎన్నో అద్భుతాలు

చెట్లన్నీ గొడుగుపట్టి ఎండకన్నెరగకుండా చూస్తాయి. అగాధంగా ఉండే కొండల్లో ఎన్నో అద్భుతాలు దాగున్నాయి. అంబోలికి 10 కిలోమీట‌ర్ల దూరంలో నంగర్టస్ జలపాతాలు ఉన్నాయి. వర్షాకాలంలో నంగర్టస్ జలపాతాల వద్ద వాతావరణం పర్యాటకులను ఎంతో అలరిస్తుంది. లోయపై నిర్మించిన బ్రిడ్జిపై నిల‌బ‌డితే జలపాతం ఇంకా ద‌గ్గ‌ర‌గా క‌నిపిస్తుంది. అంబోలికి 30 కిలోమీట‌ర్ల దూరంలో, కొంకణ తీరంలో దట్టమైన అడవులతో, సుందరమైన సరస్సులతో అల‌రారుతోంది సావంత్ వాడి ప‌ట్ట‌ణం. ఎత్తైన పర్వత శ్రేణులతో ఇక్క‌డి ప‌రిస‌రాలు పర్యాటకుల మ‌న‌సులు దోచుకుంటాయి.

సావంత్ వాడికి చేరువలో మోతి తలావ్

సావంత్ వాడికి చేరువలో మోతి తలావ్

సావంత్ వాడికి చేరువలో మోతి తలావ్ ఉంది. రాతి ప్రదేశాల మధ్య చుట్టూ కొండలతో మామిడి, తాటి చెట్ల మధ్యలో రాయల్ ప్యాలెస్ ముందు భాగంలో ఈ చెరువు నిర్మించారు.బోట్ విహారం, నీటి క్రీడలు, జోగింగ్ ట్రాక్ మ‌రింత ఆనందాన్నిస్తాయి.

 సాహసయాత్రికులు ట్రెక్కింగ్‌

సాహసయాత్రికులు ట్రెక్కింగ్‌

అంబోలి పరిసర ప్రాంతాల్లో 108 ఆలయాలు ఉన్నాయని చెబుతారు. పదుల సంఖ్యలో గుళ్లు సందర్శనకు అనువుగా ఉన్నాయి. భక్తులు ఆలయాల బాట పడితే! సాహసయాత్రికులు ట్రెక్కింగ్‌లో బిజీగా ఉంటారు. ప్రకృతి ప్రేమికులు పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ ప్రశాంతతను పొందుతారు.

నానగరతా జలపాతం, కేప్తాశ్‌ పాయింట్‌, అంబోలీ జలపాతం, శిర్గావ్క పాయింట్‌

నానగరతా జలపాతం, కేప్తాశ్‌ పాయింట్‌, అంబోలీ జలపాతం, శిర్గావ్క పాయింట్‌

ఇక్కడికి పర్యాటకులు ఈ సీజన్‌లోనే విహారానికి వస్తారు. నానగరతా జలపాతం, కేప్తాశ్‌ పాయింట్‌, అంబోలీ జలపాతం, శిర్గావ్క పాయింట్‌, మాధవ్‌గడ్‌ ఫోర్ట్‌, హిరణ్యకేశి ఆలయం (శివపార్వతుల గుడి)
నాగర్తా, మారుతీ దేవాలయం , సన్‌సెట్‌ పాయింట్‌ , మహాదేవ్‌గఢ్‌ , నారాయణగఢ్‌ ,షిర్‌గావ్‌కర్‌ పాయింట్‌ మొదలైనవి దర్శనీయ ప్రదేశాలు.

ముంబయి నుంచి 491 కిలోమీటర్ల దూరంలో

ముంబయి నుంచి 491 కిలోమీటర్ల దూరంలో

ముంబయి నుంచి 491 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పర్యాటక ప్రదేశాన్ని చేరడానికి రైలు, బస్సు సౌకర్యాలు ఉన్నాయి. మహారాష్ట్రలోని ప్రముఖ నగరం బెల్గాం నుంచి అంబోలి 88 కి.మీ., కర్ణాటకలోని హుబ్లీ నుంచి 160 కి.మీ. దూరంలో ఉంటుంది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్టణం నుంచి హుబ్లీ వరకు రైల్లో వెళ్లాలి. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బెల్గాం మీదుగా అంబోలి చేరుకోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X