Search
  • Follow NativePlanet
Share
» »తెలంగాణ - కరీంనగర్ లో గల ప్రముఖ కోటలు మరియు దేవాలయాలు

తెలంగాణ - కరీంనగర్ లో గల ప్రముఖ కోటలు మరియు దేవాలయాలు

By Venkata Karunasri Nalluru

"వేదాలు" భారతీయ సంస్కృతికి పట్టుకొమ్మలు. హిందూ మతం యొక్క సంప్రదాయం మరియు సంస్కృతికి నిక్షేపాలు ఈ వేదాలు. తెలంగాణ లో కరీంనగర్ పురాతన కాలం నుంచి వేద అభ్యాసనకు కేంద్రంగా ఉంది. గోదావరి నది ఈ స్థలంకు అదనపు ఆకర్షణ. ఇక్కడకు సుదూరాల నుండి అనేకమంది భక్తులు ఇక్కడి పురాతన దేవాలయాలు సందర్శించుటకు వస్తారు. ఇది వేదాలను నేర్పించే పురాతన కేంద్రం. ఇక్కడ ప్రసిద్ధ కోటలు మరియు దేవాలయాలు చూడవచ్చును.

వేములవాడ:

కరీంనగర్ లో గల కోటలు దేవాలయాలు

రాజ రాజేశ్వరీ దేవి ఆలయం

కరీంనగర్ నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేములవాడకు సుదూర ప్రాంతాల నుండి భక్తులు వస్తారు. రాజ రాజేశ్వరీ దేవి ఆలయం ప్రసిద్ధి చెందింది. చాళుక్య రాజులు 750 ఎ.డి. మరియు 973 ఎ.డి మధ్య నిర్మించబడిన శ్రీ రామ, లక్ష్మణ, లక్ష్మీ దేవి, గణపతి, లార్డ్ పద్మనాభ స్వామి మరియు లార్డ్ భీమేశ్వర వంటి పలు ఆలయాలు వున్నాయి.

అద్దాల మంటపంలో గల అద్దాల గ్యాలరీ చూచుటకు చాలా మనోహరంగా ఉంటుంది. ఆలయ చెరువులోని నీరు చాలా స్వచ్చంగా, రోగనివారణగా ఉపయోగపడుతుంది. ఆసక్తికరంగా, ఆలయ ప్రాంగణం లోపల ఒక ముస్లిం మత దర్గా ఉంది. అక్కడ అందరు భక్తులు మత సంబంధం లేకుండా ప్రార్థనలు జరుపుతారు.

కాళేశ్వరం:

కరీంనగర్ లో గల కోటలు దేవాలయాలు

PC : Tallamma

కాళేశ్వరం దేవాలయం

ఈ సుందరమైన ప్రదేశం గోదావరి సంగమం వద్ద ఉంది. ఇది ప్రాణహిత ఉపనది. కరీంనగర్ నుండి 130 కి.మీ దూరంలో ఉన్న ప్రదేశం. ఈ ప్రదేశం చుట్టూ దట్టమైన అడవులు ఉన్నాయి. ముక్తేశ్వరస్వామి గుడికి అసాధారణ ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ రెండు శివలింగాలు ఒకే వేదికపైకి కనిపిస్తాయి.

ధర్మపురి సైన్ బోర్డ్:

కరీంనగర్ లో గల కోటలు దేవాలయాలు

ధర్మపురి, 15 వ శతాబ్దం నాటి దేవాలయ పట్టణం. ఇది గోదావరి నది ఒడ్డున ఉన్నది. కరీంనగర్ నుండి 78 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ ప్రాంతంలో గోదావరి నది ప్రకృతిసిద్ధమైన వరం. పురాతన కాలంలో, ఇక్కడ భాషలు, సాహిత్యం, నృత్యం మరియు సంగీత నేర్చుకొనేందుకు కేంద్రంగా ఉంది. పురాతన కాలంలో ఇక్కడ భాషలు, సాహిత్యం, నృత్యం మరియు సంగీత నేర్చుకోవటం కోసం ఒక కేంద్రంగా ఉండేది. పట్టణంలో అనేక ప్రముఖ దేవాలయాలు వున్నాయి. ముఖ్యంగా 13 వ శతాబ్దపు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం మరియు శ్రీ రామలింగేశ్వర స్వామి స్వామి ఆలయం వీటిలో ముఖ్యమైనది. శివుడు మరియు విష్ణువు ఆలయాలు ప్రక్క ప్రక్కన ఉన్నాయి.

నాగునూర్ కోట:

కరీంనగర్ లో గల కోటలు దేవాలయాలు

PC: Telengana Tourism Official Website

నాగునూర్ కోట

కరీంనగర్ నుండి 8 కి.మీ దూరంలో వున్న నాగునూర్ కోట యొక్క ప్రాకారాలు కాకతీయుల కాలంలో శబ్దాలు చేయు వ్యక్తులతో చాలా సందడిగా వుంటుంది. ఇక్కడ కళ్యాణ మరియు కాకతీయ దేవాలయాల శిధిలాలు గుట్టలుగా ఉన్నాయి. ఇక్కడ శివాలయంలో గల స్తంభముల మీద చెక్కబడిన బొమ్మలు, శిల్పాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఆలయ దూలాలను ఎంతో చక్కగా అలంకరిస్తారు.

కొండగట్టు:

కరీంనగర్ లో గల కోటలు దేవాలయాలు

కొండగట్టు

PC: Manasa.mani

మహోన్నత కొండల నడుమ, అడుగు లోయలలో గల లార్డ్ ఆంజనేయ స్వామి యొక్క ఆలయం. ఇది ఒక ఉత్కంఠభరితమైన ప్రదేశము. కరీంనగర్ నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. కరీంనగర్ జిల్లాలో గల అత్యంత ముఖ్యమైన ఆలయాలలో ఇది ఒకటి.

ఎల్గండల్ కోట:

కరీంనగర్ లో గల కోటలు దేవాలయాలు

PC: Naveen Gujje

ఎల్గండల్ కోట కరీంనగర్ నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. మనైర్ నది ఒడ్డున తాటి వనాలు పెంచుతున్నారు. ఇది కాకతీయ రాజుల హయాంలో నిర్మించిన "హిల్ ఫోర్ట్". క్రీ.శ.1754లో జఫర్-ఉద్-దౌల నిర్మించిన కోటలో ఒక మసీదును చూడవచ్చు. అనేక ముస్లిం మత సెయింట్స్ సమాధులు ఇక్కడ ఉన్నాయి.

ఇది వేదాలు నేర్చుకొనుటకు పురాతనమైన కేంద్రం. ఇక్కడ గల దేవాలయాలు మరియు స్మారకాల గూర్చి తెలుసుకొనవచ్చును. ఈ ట్రిప్ మీకు ఒక మరిచిపోలేని అనుభూతి అవుతుంది!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X